ఆన్లైన్లో ప్యాషన్ ప్రో బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు/రెన్యువల్ చేయండి
హీరో ప్యాషన్ ప్రో ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి
మీరు డిజిట్ యొక్క హీరో ప్యాషన్ ప్రో ఇన్సూరెన్స్‌ను ఎందుకు తీసుకోవాలి?
హీరో ప్యాషన్ ప్రో కోసం అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు
థర్డ్ పార్టీ
కాంప్రహెన్సివ్
ప్రమాదం వలన సొంత ద్విచక్ర వాహనానికి డ్యామేజ్ కానీ, నష్టం కానీ జరిగితే.. |
×
|
✔
|
అగ్ని ప్రమాదాల వలన సొంత ద్విచక్ర వాహనానికి డ్యామేజ్ కానీ, నష్టం కానీ జరిగితే.. |
×
|
✔
|
ప్రకృతి విపత్తుల వలన సొంత ద్విచక్ర వాహనానికి డ్యామేజ్ కానీ, నష్టం కానీ జరిగితే.. |
×
|
✔
|
థర్డ్ పార్టీ వాహనానికి డ్యామేజ్ అయితే |
✔
|
✔
|
థర్డ్ పార్టీ ఆస్తి డ్యామేజ్ అయితే |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్ పార్టీ వ్యక్తి మరణించినా/ గాయాలపాలైనా.. |
✔
|
✔
|
మీ స్కూటర్ లేదా బైక్ దొంగిలించబడితే |
×
|
✔
|
మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోగలగడం |
×
|
✔
|
నచ్చిన యాడ్–ఆన్స్‌తో అదనపు రక్షణ |
×
|
✔
|
థర్డ్ పార్టీ, కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ మధ్య తేడాలను గురించి మరింత తెలుసుకోండి.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు కనుక డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినా కానీ రెన్యువల్ చేసినా కానీ చింత లేకుండా ఉండండి. సులభమైన 3 స్టెప్స్‌లో మీ క్లెయిమ్ ప్రాసెస్ పూర్తవుతుంది.
స్టెప్ 1
1800-258-5956 నంబర్ మీద కాల్ చేయండి. ఎటువంటి ఫామ్స్ నింపాల్సిన పని లేదు.
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ వాహనం డ్యామేజ్ అయిన భాగాన్ని మీ స్మార్ట్ ఫోన్‌తో ఫొటో తీయండి. మేము దశలవారీగా ఏం చేయాలో మీకు తెలియజేస్తాం.
స్టెప్ 3
ఏ పద్ధతిలో మీకు రిపేర్ కావాలో ఎంచుకోండి. రీయింబర్స్మెంట్ లేదా నగదు రహిత ప్రక్రియ. ఒకవేళ మీరు నగదురహిత విధానాన్ని ఎంచుకుంటే మా నెట్వర్క్ గ్యారేజీని సందర్శిస్తే సరిపోతుంది.
డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత తొందరగా సెటిల్ చేయబడతాయి?
బీమా కంపెనీని మార్చాలని చూసినపుడు ఎవరికైనా సరే మనసులో మొదట మెదిలే ప్రశ్న ఇదే. అలా ప్రశ్నించుకోవడం మంచిదే.
డిజిట్ క్లెయిమ్ రిపోర్ట్ కార్డ్ చదవండి.హీరో ప్యాషన్ ప్రో: ఒక పవర్ఫుల్ బైక్
ప్యాషన్ ప్రో అనేది కమ్యూటర్ బైక్. అయినప్పటికీ ఇందులో ఫీచర్లకు ఎటువంటి లోటు లేదు. ప్రస్తుత రోజుల్లో ఆధునిక టూ వీలర్ నుంచి మీరు ఏమైతే కోరుకుంటారో అన్ని రకాల ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
- ప్యాషన్ ప్రో బేస్ మోడల్ 97.2cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 8.05 Nm ఇంప్రెసివ్ టార్క్‌ను ఇది అందిస్తుంది. ఈ బండికి అమర్చబడిన సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ 8000 rpm వద్ద 8.36 PS పవర్ జెనరేట్ చేస్తుంది.
- ఏదేమైనప్పటికీ ఈ బండి యొక్క బలం దాని మైలేజ్. 12.5 లీటర్ల కెపాసిటీ గల ట్యాంకు ఈ బండికి ఉంటుంది. ఈ బండి లీటరు పెట్రోల్‌కు 84 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
- ఈ బైక్ 87 కిలోమీటర్ల పికప్‌తో వస్తుంది. మీరు తొందరలో ఉన్నపుడు ఇది ఉపయోగపడుతుంది.
ఇటువంటి సూపర్ పవర్స్ ఉన్న బైక్‌కు రోడ్డు మీద జరిగే అనుకోని ప్రమాదాల నుంచి రక్షణ కల్పించడం కోసం బీమా తీసుకోవడం తప్పనిసరి.
ఫీచర్ రిచ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడమే అందుకు ఉత్తమ మార్గం. బీమా అటువంటి ప్రమాదాల నుంచి ఆర్థిక భరోసాను అందజేస్తుంది.
మీరు అత్యుత్తమ ప్యాషన్ ప్రో బైక్ ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నపుడు డిజిట్ అందిస్తున్న అద్భుతమైన ఇన్సూరెన్స్ ప్లాన్లను గురించి ఆలోచించొచ్చు.
డిజిట్ అందించే హీరో ప్యాషన్ ప్రో బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎంచుకోవాలి?
మార్కెట్లో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నందున ఏ కంపెనీ ఇన్సూరెన్స్ ఎంచుకోవాలనే విషయంలో బైక్ యజమాని గందరగోళానికి గురవుతాడు. కింది కారణాలను బట్టి..డిజిట్ అనేక ఎంపికలను అందజేస్తుంది.
పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చే ఎన్సీబీ (NCB) ఆఫర్లు – ఎవరైతే కస్టమర్లు క్లెయిమ్ చేయని సంవత్సరాలను (సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉంటారో) కలిగి ఉంటారో వారు నో క్లెయిమ్ బోనస్ ద్వారా వారి ఇన్సూరెన్స్ కవర్ నుంచి ఆకర్షణీయమైన ఆఫర్లను పొందొచ్చు. చాలా సందర్భాల్లో ఎన్సీబీ (NCB) వలన మీ బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ సమయంలో పాలసీ ధర తగ్గుతుంది. ఆ డబ్బుతో మీరు మీకు అత్యంత ఇష్టమైన బైక్‌కు యాడ్–ఆన్లు కొనుగోలు చేయవచ్చు. ఇవి మీ బండికి మరింత అదనపు రక్షణను అందజేస్తాయి.
ప్రయోజనకరమైన ఎన్నో యాడ్–ఆన్స్ – యాడ్–ఆన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజిట్ హీరో ప్యాషన్ ప్రో ఇన్సూరెన్స్‌లో మీకు ప్రయోజనకరమైన యాడ్–ఆన్స్ లభిస్తాయి. ఇవి బేసిక్ పాలసీలతో మీకు లభించవు. యాడ్ ఆన్ల ప్రొటెక్షన్‌ను ఎంచుకోవాలా? వద్దా? అనేది మీ ఇష్టం. డిజిట్ అందిస్తున్న యాడ్–ఆన్స్ కింద ఉన్నాయి.
- జీరో డిప్రిషియేషన్ కవర్
- ఇంజిన్, గేర్ ప్రొటెక్షన్
- రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
- బ్రేక్ డౌన్ అసిస్టెన్స్
- కంజూమబుల్ కవర్
మీరు ఇక్కడ ఉన్న ప్రతీ రైడర్ (యాడ్–ఆన్)ను తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్యాషన్ ప్రో బండిని ఎటువంటి ప్రాంతాల్లో నడుపుతున్నారో అక్కడ మీకు ఏమేం అవసరం పడతాయో అవి ఎంచుకుంటే సరిపోతుంది.
ఎంచుకునేందుకు వేరియబుల్ ఇన్సూరెన్స్ ఆప్షన్లు – డిజిట్ మీకు అనేక రకాల ప్యాషన్ ప్రో ఇన్సూరెన్స్‌లను అందజేస్తుంది. వీటిల్లో ఈ కేటగిరీలు ఉంటాయి.
- థర్డ్ పార్టీ లయబులిటీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ – ఇందులో పాలసీదారు తన సొంత వాహనానికి అయిన డ్యామేజెస్ గురించి క్లెయిమ్ చేయలేడు. ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తులు లేదా ఆస్తులకు నష్టం వాటిల్లినపుడు ఈ పాలసీ ద్వారా క్లెయిమ్ చేసేందుకు వీలుంటుంది.
- కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ – ఈ పాలసీ థర్డ్ పార్టీ లయబులిటీ కవర్‌తో పాటు సెల్ఫ్ డ్యామేజ్ కవర్ కూడా కలిగి ఉంటుంది. యాక్సిడెంట్లో మీ ప్యాషన్ ప్రో బైక్‌కు ఏవైనా డ్యామేజెస్ అయినా కానీ మీరు క్లెయిమ్ చేయొచ్చు. అంతే కాకుండా దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, తుఫానులు, భూకంపాలు, సహజ మరియు మానవ నిర్మిత విపత్తులు సంభవించినపుడు కూడా మీరు క్లెయిమ్ చేయొచ్చు.
అవసరమైతే మీరు ఓన్ డ్యామేజ్ కవర్‌ను కూడా ఎంచుకోవచ్చు. థర్డ్ పార్టీ లయబులిటీ ద్వారా కాంప్రహెన్సివ్ పాలసీ ప్రయోజనాలను ఆస్వాదించండి. ఈ ప్రయోజనం మీకు అందాలంటే మీ ప్యాషన్ ప్రో బండి 2018 సెప్టెంబర్ కంటే పాతది అయి ఉండకూడదు. ఓన్ డ్యామేజ్ కవర్ మీకు వర్తించేందుకు మీరు థర్డ్ పార్టీ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.
మీకు కావాల్సిన ప్యాషన్ ప్రో ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోండి. ఎక్కువగా యాక్సిడెంట్లు సంభవించే ప్రదేశంలో మీరు ఉన్నట్లయితే కాంప్రహెన్సివ్ కవర్ తీసుకోవడమే ఉత్తమం.
అందుబాటులో 24 గంటల కస్టమర్ సర్వీస్ – డిజిట్ ఇన్సూరెన్స్‌కు మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే.. కంపెనీ అందించే 24 గంటల కస్టమర్ సర్వీస్. కస్టమర్లు ఎటువంటి సమయంలో ఫోన్ చేసినా కానీ ఆన్సర్ చేసేందుకు మా వద్ద టీం ఉంది. మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్యనైనా మా నిపుణులు పరిష్కరిస్తారు. సులభంగా క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సాయం చేస్తారు. యాక్సిడెంట్లు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. కావున డిజిట్ కస్టమర్ సర్వీస్ రెడీగా ఉంటుంది. మీరు ఏ సమయంలో ఫోన్ చేసినా ఆన్సర్ లభిస్తుంది.
సులభమైన ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ – ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫైల్ చేసే సమయంలో ఉండే గజిబిజి నుంచి డిజిట్ పాలసీదారులను రక్షించింది. మా స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ సెల్ఫ్ ఇన్స్పెక్షన్ ఫీచర్ ద్వారా క్లెయిమ్స్ చేయడం చాలా సులభమయిపోయింది. క్లెయిమ్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే పూర్తి చేయబడుతుంది. పేపర్ వర్క్ ఫినిష్ చేయాల్సిన అవసరాన్ని డిజిట్ తొలగించింది.
ఉచితంగా పెంచుకునే, తగ్గించుకునే ఐడీవీ (IDV) – ఇన్సూరెన్స్ కంపెనీ మీకు అందజేసిన ఐడీవీ (IDV)తో అసంతృప్తిగా ఉంటే.. డిజిట్ ఇన్సూరెన్స్ ద్వారా మీకు కావాల్సిన విధంగా ఐడీవీ (IDV)ని మార్చుకునే ఆప్షన్ పొందండి. పెద్ద మొత్తంలో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ–IDV)ని కలిగి ఉండడం వలన ఎప్పుడైనా అనుకోని సందర్భంలో బైక్ టోటల్ లాస్ అయితే మీకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందుతుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఆర్థిక నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. కానీ ఐడీవీ (IDV)ని పెంచడం వలన మీ ప్రీమియంలు కూడా పెరుగుతాయి. కానీ మీ వాహనాన్ని రక్షించుసుకునేందుకు ఇది తెలివైన అడుగే.
పాలసీ కొనుగోలు చేసినా లేదా రెన్యువల్ చేసినా సులభంగా పని పూర్తవుతుంది – డిజిట్ ద్వారా ప్యాషన్ ప్రో ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం చాలా సులువు. మా ఆన్లైన్ పోర్టల్‌లో కొత్త మరియు రెన్యువల్ కస్టమర్లు ప్రయోజనాలను పొందొచ్చు. వారికి సరైన ఇన్సూరెన్స్‌ను అందిస్తాయి. మా వెబ్‌సైట్‌ను విజిట్ చేసి మీకు నచ్చిన ప్లాన్ ను ఎంచుకోండి. బైక్ వివరాలు, ప్రీమియం వివరాల వంటివి నింపితే సరిపోతుంది.
మీరు పాలసీని రెన్యువల్ చేయాలని భావించినా కూడా మా పోర్టల్‌లో ఇదే విధానం ఉంటుంది.
క్యాష్‌లెస్ రిపేర్ల కోసం డిజిట్ నెట్వర్క్ గ్యారేజీలను సందర్శించండి – డిజిట్ ఇన్సూరెన్స్‌కు ఇండియా వ్యాప్తంగా 4400+ కంటే ఎక్కువ నెట్వర్క్ గ్యారేజీలు ఉన్నాయి. మీరు డిజిట్ పాలసీ హోల్డర్ అయి బైక్ రిపేర్ కోసం చూస్తున్నట్లయితే ఈ సెంటర్లలోకి వెళ్లి ఎటువంటి ఖర్చు లేకుండా మీరు బైక్ రిపేర్ చేయించుకోవచ్చు. మీరు జేబు నుంచి ఒక్క రూపాయి కూడా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకోసమంటే డిజిట్ డైరెక్టుగా ఈ ఖర్చులను గ్యారేజీకే చెల్లిస్తుంది కావున మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇటువంటి అనేక రకాల ఫీచర్లతో డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు మార్కెట్లో లభించే అన్ని పాలసీల కంటే చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
భారతదేశంలోని పాపులర్ హీరో ప్యాషన్ బైక్ మోడల్స్
డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మోడల్‌ను బట్టి ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తుంది. మీరు కలిగి ఉన్న హీరో మోడల్‌తో సంబంధం లేకుండా మీరు మానుంచి ఇన్సూరెన్స్ ప్లాన్లను పొందే అవకాశం ఉంటుంది. డిజిట్ ఇన్సూరెన్స్ కవర్ చేసే కొన్ని పాపులర్ ప్యాషన్ ప్రో మోడల్స్ కింద ఉన్నాయి.
- ప్యాషన్ ప్రో i3S –ప్యాషన్ ప్రో లైనప్‌లో ఇది బేస్ మోడల్. ఇది లాంచ్ అయిన తర్వాత అనేక అప్డేట్లు వచ్చాయి. ఇందులో ఉండే కంఫర్ట్ మరియు ఇది అందించే మైలేజ్ అత్యుత్తమంగా ఉంటుంది. ప్యాషన్ ప్రో i3S అనేది కమ్యూటర్లకు కావాల్సిన డిజైరబుల్ టూ వీలర్ వెహికిల్. కానీ ఈ బండి కేవలం 100cc ఇంజిన్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది అందరికి నచ్చకపోవచ్చు.
- ప్యాషన్ ప్రో 110 –అదనపు ప్రయోజనాల కోసం చూసే వారికి ప్యాషన్ ప్రో110 బైక్ బెస్ట్ ఆప్షన్. ఇది అప్డేట్ చేయబడిన 113.2cc ఇంజిన్‌తో వస్తుంది. బేస్ మోడల్లో ఎటువంటి స్మూత్ రైడ్ అనుభవం మీకు అందుతుందో ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది. ఒక లీటర్ పెట్రోల్‌తో ఈ బండి దాదాపు 75 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని హీరో తెలియజేసింది. ట్యూబ్‌లెస్ టైర్లు, మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ వంటి అనేక అదనపు ఫీచర్లు ఇందులో ఉంటాయి.
- ప్యాషన్ Xప్రో – పై రెండు మోడల్స్ కంటే ఇది కాస్త ఖరీదైనది. ప్యాషన్ Xప్రో అనేది కొత్త మోడల్ బైక్. దీనిలో స్టైల్‌కు స్టైల్, సామర్థ్యానికి సామర్థ్యం ఉంటుంది. ఇందులో 110cc ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. ఇదొక్కటి తప్ప బైక్ కీ ఫీచర్లు అలాగే ఉంటాయి. ఇది లీటరుకు 75కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
మీ మోడల్ ఏంటనేదానితో సంబంధం లేకుండా.. ప్యాషన్ ప్రో ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజిట్ అందించే ఆప్షన్స్ మీకు బెస్ట్ ప్రొటెక్షన్ అందిస్తాయి. ఎటువంటి సందర్భంలోనైనా మీకు ఆర్థిక భరోసాను కలిగిస్తుంది.
హీరో ప్యాషన్ ప్రో వేరియంట్లు, ఎక్స్–షోరూం ధరలు
వేరియంట్లు |
ఎక్స్–షోరూం ధర (నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది) |
ప్యాషన్ ప్రో i3S AW డ్రమ్, 84 Kmpl, 97.2 cc |
₹ 54,475 |
ప్యాషన్ ప్రో i3S SW DRUM, 84 Kmpl, 97.2 cc |
₹ 54,925 |
ప్యాషన్ ప్రో i3S AW DISC, 84 Kmpl, 97.2 cc |
₹ 56,425 |