3 ఏళ్లకు లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్

ఆన్‌లైన్‌లో బైక్ ఇన్సూరెన్స్ కోట్ పొందండి.

Third-party premium has changed from 1st June. Renew now

లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి వివరణాత్మక గైడ్

మీరు ఒకవేళ టూ-వీలర్‎ని కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మోటార్ వాహన చట్టం –1988 ప్రకారం మీ వాహనం థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్‎ను కచ్చితంగా కలిగి ఉండాలి.

కానీ ఇక్కడే సమస్య వచ్చింది!

భారతదేశంలో, రోడ్డుపై ఉన్న మొత్తం టూ-వీలర్లలో దాదాపు 75% మందికి సరైన ఇన్సూరెన్స్ కవరేజీ లేదు. షాక్ అయ్యారు కదా? చాలా మంది వాహనదారులు తమ వాహనాన్ని షోరూం నుండి బయటకు తీసేటప్పుడు వారి బైక్‌కు ఇన్సూరెన్స్ చేయడం యొక్క ప్రాముఖ్యతను పట్టించుకోనందున, ఈ లెక్కలు ఆశ్చర్యం కలిగించవు.

అయితే, రెన్యువల్ కాని పాలసీల నేపథ్యంలో చాలా ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మల్టీ-ఇయర్  లేదా లాంగ్ టర్మ్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకువచ్చాయి. మొదట్లో ఈ మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ పాలసీలు 3 సంవత్సరాలకు ఉండగా, ఇవి ఇప్పుడు 5 సంవత్సరాల వరకు పొడిగించబడ్డాయి.

3 సంవత్సరాల బైక్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయాలని ఎందుకు సలహా ఇవ్వబడుతోంది, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కింద వివరంగా చెప్పడం జరిగింది.

3 సంవత్సరాలకు టూ-వీలర్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏమిటి?

3 సంవత్సరాలకు టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్న వాహన యజమానులు ప్రతి సంవత్సరం తమ పాలసీని రెన్యువల్ చేయాల్సిన పని ఉండదు.

ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ (IRDAI) థర్డ్ పార్టీ లయబిలిటీలను కవర్ చేసేలా మల్టి-ఇయర్ ఇన్సూరెన్స్ పాలసీలను పొడిగించింది. వీటిలో టూ-వీలర్లకు సొంత-డ్యామేజీ‎ని కూడా కవర్ చేస్తుంది.

ఇవి వేటిని సూచిస్తాయి?

కవర్ రకం అర్థం
థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ ఈ ఇన్సూరెన్స్ పాలసీ మీ టూ-వీలర్ వల్ల థర్డ్ పార్టీ వ్యక్తికి కలిగే శారీరక గాయం/ మరణం, థర్డ్ పార్టీ వాహనానికి కలిగే ఏవైనా నష్టాలను కవర్ చేస్తుంది.
ఓన్ డ్యామేజ్ కవర్ మీ సొంత వాహనానికి సంభవించే లయబిలిటీలను ఇది కవర్ చేస్తుంది. ఇందులో సహజంగా కలిగినా లేదంటే మానవ ప్రేరితం వల్ల కలిగినా కూడా కవర్ అవుతాయి.

మీరు 3 సంవత్సరాల థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ + 1 సంవత్సరం ఓన్ డ్యామేజ్ కవర్‌తో సహా బండిల్ పాలసీగా టూ–వీలర్స్ కోసం 3 సంవత్సరాల ఇన్సూరెన్స్ పాలసీని కూడా పొందవచ్చు.

కాంప్రహెన్సివ్ త్రీ-ఇయర్ ఇన్సూరెన్స్ 1 సెప్టెంబర్, 2018 తర్వాత కొన్ని టూ–వీలర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

 

కాంప్రహెన్సివ్ టూవీలర్ ఇన్సూరెన్స్ (Comprehensive Two Wheeler Insurance) గురించి మరింత తెలుసుకోండి

3 సంవత్సరాల టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీకి మీ ప్రీమియం ఎంత ఉంటుంది?

3-సంవత్సరాల టూ వీలర్ ఇన్సూరెన్స్ కవర్‌ల ప్రీమియం వార్షిక థర్డ్ పార్టీ ప్రీమియం పేమెంట్​కు మూడు రెట్లుగా లెక్కించబడుతుంది. మీరు ఈ పేమెంట్​ను ఒకే విడతలో చెల్లించాలి. ఇక్కడ మీరు ఏం గుర్తుంచుకోవాలంటే:

  • ఈ ప్రీమియం అమౌంట్​ను మొత్తం 3 సంవత్సరాల పాలసీ వ్యవధిలో మార్చడం లేదా సవరించడం సాధ్యం కాదు.
  • మీరు స్టాండలోన్ 3-ఇయర్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్​ను కలిగి ఉన్నట్లయితే, పాలసీ వ్యవధిలో (వాహనం మొత్తం నష్టపోయిన సందర్భంలో మినహా) అది రద్దు చేయబడదు. వాహనం మొత్తం నష్టపోయిన సందర్భంలో, గడువు ముగియని సంవత్సరాలకు చెల్లించిన ప్రీమియం తిరిగి చెల్లించబడుతుంది.

ఈ ప్రీమియం చెల్లింపు విధానం ముఖ్యంగా పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు విధించే వార్షిక ప్రీమియం రేటు పెంపుల నుండి వారిని కాపాడుతుంది.

మరోవైపు, ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకేసారి 3 సంవత్సరాల పాటు ప్రీమియంను వసూలు చేయడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా వారు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు.

ఇది కాకుండా, వాహన యజమానులకు 3 సంవత్సరాల పాటు టూ-వీలర్ ఇన్సూరెన్స్ ప్రయోజనకరంగా ఉండటానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి.

ఒకసారి చూడండి!

లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించడం

వ్యవధి ప్రీమియం అమౌంట్​ (OD+TP) జీఎస్టీ మినహాయించబడింది
3 సంవత్సరాలు ₹2,497
2 సంవత్సరాలు ₹1,680
1 సంవత్సరం ₹854

మీ వాహనానికి ప్రీమియంను లెక్కించడానికి టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ని ఒకసారి చెక్ చేయండి.

3 సంవత్సరాలకు లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్​ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

3 సంవత్సరాల టూ-వీలర్ ఇన్సూరెన్స్ సాధారణ ఇన్సూరెన్స్ కలిగించే ప్రయోజనాలను కలిగిస్తుంది. మీరు ఎంచుకోవడానికి సులభంగా ఉండేందుకు మేము వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని కింద పేర్కొంటున్నాం:

1. నాన్-రెన్యువల్ ఇబ్బందులను నివారించండి

రెన్యువల్ చేయడానికి, ల్యాప్స్ అవడానికి మధ్య చాలాసార్లు మీ ఇన్సూరెన్స్ పాలసీ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉదాహరణకు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదం జరగడం వల్ల కలిగే భారీ నష్టాల వంటివి.

3 సంవత్సరాల పాలసీతో మీరు కనీసం పాలసీ వ్యవధి వరకు ఇలాంటి రిస్కుల నుంచి తప్పించుకోవచ్చు.

2. సౌలభ్యం

చాలా సందర్భాలలో టూ వీలర్ యజమానులు వారి ఒక సంవత్సరం పాలసీల గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ చేయడం గురించి మరిచిపోతారు. 3-సంవత్సరాల ప్లాన్‌లతో, మీరు ఎటువంటి పరిణామాలు లేకుండా 3 సంవత్సరాల పాటు మీ పాలసీని రెన్యువల్ చేయడం మర్చిపోవచ్చు.

అందుకే ఈ ప్లాన్లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. అవి మీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని ప్రతీ ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరాన్ని అరికడతాయి.

3. దీర్ఘకాలంలో తక్కువ ఖరీదు

3 సంవత్సరాల ఇన్సూరెన్స్ పాలసీతో, మీరు ఒకేసారి 3 సంవత్సరాల ప్రీమియం చెల్లించాలి.  కానీ ఈ ఏకమొత్తం ఖర్చుకు బదులుగా, మీరు దీర్ఘకాలంలో మీ ప్రీమియం చెల్లింపులపై చాలా ఎక్కువ ఆదా చేస్తారు.

ఎందుకంటే, ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు తమ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం రేట్లను ఏటా సవరించి, పెంపును అమలు చేస్తాయి. ద్రవ్యోల్బణం కారణంగా, ఈ ప్రీమియం రేట్లు 10-15% వరకు పెరగవచ్చు.

అదే, మీరు 3-సంవత్సరాల పాలసీని కలిగి ఉన్నట్లయితే, పాలసీ గడువు ముగిసే వరకు అధిక ప్రీమియంలు చెల్లించకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఈ విధంగా మీ పాలసీ దీర్ఘకాలంలో చాలా చౌకగా మారుతుంది

4. ఎక్కువ ఐడీవీ (IDV) అందుబాటులో ఉంటుంది

ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ లేదా ఐడీవీ అనేది మీ వాహనానికి కలిగే నష్టానికిగాను మీ ఇన్సూరెన్స్​ కంపెనీ చెల్లించే ఖచ్చితమైన మొత్తం.

అందించబడే ఐడీవీ = తయారీదారుడి యొక్క నమోదిత ధర – వాహనం యొక్క తరుగుదల. మీరు మీ టూ వీలర్ యొక్క తరుగుదలని పరిగణనలోకి తీసుకుని మీ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసినప్పుడు విలువ సవరించబడుతుంది.

ఇప్పుడు, మీరు 3-సంవత్సరాల ఇన్సూరెన్స్ పాలసీని పొందినప్పుడు, ఆ మూడేళ్ల కాలానికి మీ ఐడీవీ మారదు. ఇది మీ వాహనం యొక్క మొత్తం నష్టానికి వ్యతిరేకంగా అధిక హామీ మొత్తాన్ని పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.

5. అధిక నో క్లెయిమ్ బోనస్

నో క్లెయిమ్ బోనస్ అనేది మీరు మునుపటి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకుంటే మీ ఇన్సూరెన్స్ పాలసీకి చెల్లించాల్సిన ప్రీమియంపై మీరు పొందగలిగే డిస్కౌంట్.

మూడు సంవత్సరాల టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలతో, మీరు ఒక సంవత్సరపు పాలసీల కంటే ఎక్కువ నో క్లెయిమ్ బోనస్‌ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఉదాహరణకు, మీరు 3-సంవత్సరాల పాలసీని పొందుతున్నప్పుడు మీ మునుపటి పాలసీ నుండి 20% నో క్లెయిమ్​ బోనస్​ కలిగి ఉంటే, ఈ 20% నో క్లెయిమ్​ బోనస్​ మీరు మొత్తం 3 సంవత్సరాలకు చెల్లించే ప్రీమియంపై వర్తిస్తుంది.

ఇంకా, ఈ విషయంలో పాలసీదారుల ప్రోత్సాహకాలను పెంచడానికి ఒక్క సంవత్సరపు పాలసీలతో పోలిస్తే కొంతమంది ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు తమ దీర్ఘకాలిక పాలసీల ముగింపులో అధిక నో క్లెయిమ్​ బోనస్​ను కూడా అందిస్తారు.

6. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు

ఎక్కువ మంది టూ వీలర్ యజమానులను లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసకోమని ప్రోత్సహించే ప్రయత్నంలో, ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను  అందిస్తాయి. ఈ డిస్కౌంట్లు వాహన యజమానులకు ఇన్సూరెన్స్ సంరక్షణను పొందడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

7. ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం బ్రేక్-ఇన్ పాలసీ

కొన్నిసార్లు మీ ఇన్సూరెన్స్ రెన్యువల్స్​ మధ్య అంతరం వల్ల మీ పాలసీని పునరుద్ధరించడానికి అంగీకరించే ముందు ఇన్సూరెన్స్​ ప్రొవైడర్లు మీ టూ వీలర్‎ని తనిఖీ చేయవలసి రావచ్చు. దీన్ని బ్రేక్-ఇన్ పాలసీగా పిలుస్తారు. ఇది తదనంతరం అధిక ప్రీమియం చెల్లించేందుకు దారి తీయవచ్చు.

మీరు 3-సంవత్సరాల లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని పొందినప్పుడు, మీరు మీ పాలసీతో బ్రేక్-ఇన్‌లను నివారించవచ్చు. మీ ప్రీమియంకు అదనపు జోడింపు లేకుండా కొనసాగించవచ్చు. 

అటువంటి ఎన్నో ప్రయోజనాలతో, ఈ మల్టీ-ఇయర్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు మీ టూ వీలర్‎తో ముడిపడి ఉన్న ఊహించని ఆర్థిక నష్టాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చాలా మంచి ఎంపిక అవుతాయి.

భారతదేశంలోని చాలా ప్రముఖ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ల అమలుకు సంబంధించి ఐఆర్​డీఏఐ (IRDAI) నిర్ణయాన్ని స్వాగతించారు. కాబట్టి మీరు ఎంచుకోవడానికి అనేక ఆప్షన్లను పొందవచ్చు.

కాబట్టి ఆగిపోవడం మానేయండి! ఈరోజే 3 సంవత్సరాల పాలసీతో మీ టూ వీలర్ వాహనానికి ఇన్సూరెన్స్ చేయించుకోండి!

3 సంవత్సరాల టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు దీర్ఘకాలిక ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చా?

అవును, ఐఆర్​డీఏఐ (IRDAI) ఈ పాలసీలను 5 సంవత్సరాల వరకు అందించడానికి ఇన్సూరెన్స్​ ప్రొవైడర్లను అనుమతించింది.

కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కోసం మూడేళ్ల ఇన్సూరెన్స్ కవర్‌ని పొందవచ్చా?

అవును, ఇది సెప్టెంబర్ 1, 2018 తర్వాత కొనుగోలు చేసిన కొత్త టూ వీలర్ వాహనాలకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కోసం అందుబాటులో ఉంది.

సొంత డ్యామేజ్ కవర్ కోసం మూడు సంవత్సరాల ప్లాన్‌ను విడిగా పొందవచ్చా?

లేదు, సొంత డ్యామేజ్ కవర్‌ల కోసం ఇది విడిగా అందుబాటులో లేదు.