ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్

ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్స్​ (ప్రయాణికులను రవాణౄ చేసే వాహనాలు)కు కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్

Third-party premium has changed from 1st June. Renew now

ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేయడానికి ఉపయోగించే ఏదైనా కమర్షియల్ వాహనాన్ని సంరక్షించుకునేందుకు రూపొందించబడింది.

కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఏదైనా ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం లేదా అగ్నిప్రమాదాలతో పాటు ఇతర ఊహించని సంఘటనలు సంభవించినప్పుడు కలిగే డ్యామేజీలు, నష్టాల నుంచి వాహనాన్ని కాపాడుతుంది.

కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలలో అత్యంత సాధారణ రకాలు బస్ ఇన్సూరెన్స్, వ్యాన్ ఇన్సూరెన్స్, ట్యాక్సీ/క్యాబ్ ఇన్సూరెన్స్, ఆటో రిక్షా ఇన్సూరెన్స్.

కవర్ చేయబడే ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్స్ రకాలు:

  • బస్సులు: పాఠశాల బస్సులు, ప్రైవేట్ టూర్ బస్సులు, ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేయడానికి ఉపయోగించే ఇతర బస్సులు ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలోకి వస్తాయి.
  • ఆటో రిక్షాలు: వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే అన్ని ఆటో రిక్షాలు; ప్రజలను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేసేవాటికి ఈ పాలసీ వర్తిస్తుంది.
  • టాక్సీలు, క్యాబ్‌లు, కమర్షియల్ కార్లు: క్యాబ్‌లు, మీ రోజు వారీ ఉబెర్, ఓలా వంటి కమర్షియల్ కార్లు, కమర్షియల్, ప్రజా రవాణా కోసం ఉపయోగించే ఇతర ప్రైవేట్ కార్లు ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడతాయి.
  • వ్యాన్లు: వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే స్కూల్ వ్యాన్లు, ప్రైవేట్ టూర్ మినీ బస్సుల వంటి వ్యాన్లు కూడా ఈ పాలసీ పరిధిలోకి వస్తాయి.

నేను ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్‎ని ఎందుకు కొనుగోలు చేయాలి?

  • ఊహించని నష్టాల నుంచి రక్షణ: అది ప్రకృతి వైపరీత్యం, ప్రమాదం, ఢీకొనడం లేదా అగ్నిప్రమాదం వల్ల అయినా; అనుకోకుండా కలిగే నష్టాల వేళ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ అండగా ఉంటుంది. దీని వల్ల మీ వ్యాపారానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది.
  • చట్టానికి లోబడి ఉండటానికి: మోటర్ వాహనాల చట్టం  ప్రకారం, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వాహనాలు కనీసం బేసిక్ థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‎ని అయినా కలిగి ఉండాలి. వ్యక్తి లేదా ఆస్తి లేదంటే వాహనం వంటి థర్డ్ పార్టీకి కలిగే నష్టాల నుంచి మిమ్మల్ని రక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
  • యజమాని-డ్రైవర్​ను కవర్ చేస్తుంది: ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ కేవలం మీ వాహనాన్ని మాత్రమే కవర్ చేయడమే కాదు, ఇది యజమాని-డ్రైవర్​ను కూడా కవర్ చేస్తుంది.
  • ప్రయాణికుల సంరక్షణ: ప్యాసింజర్ వెహికల్ ఇన్సూరెన్స్‎ని కొనుగోలు చేేసేటప్పుడు ప్రయాణికులను కూడా కవర్ చేసే ఆప్షన్​ను ఎంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ గురించి మాత్రమే మీరు ఆలోచించిన వారిగా కాకుండా మీ వాహనంలోని ప్రయాణికుల గురించి ఆలోచించే వారిగా ఉంటారు.

డిజిట్​ అందించే ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్​ను ఎందుకు ఎంచుకోవాలి?

ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

కవర్​ కానివి ఏవి?

మీ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ కావో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైనా క్లెయిమ్ చేసేటపుడు ఇది కవర్ కాదా అని ఆశ్చర్యానికి గురికాకుండా ఉండాలంటే ఈ విషయాలను తెలుసుకోవాలి.

థర్డ్ పార్టీ పాలసీదారుడికి ఓన్ (సొంత) డ్యామేజీలు జరిగితే

మీరు కేవలం థర్డ్ పార్టీ వెహికిల్ ఇన్సూరెన్స్​ను మాత్రమే కొనుగోలు చేసినప్పుడు వాహనం నడిపే వ్యక్తికి జరిగిన డ్యామేజీలు, నష్టాలు కవర్ కావు.

మద్యం సేవించి వాహనం నడిపినా, లేదా సరైన లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా..

మీరు ఒక ప్రమాదాన్ని గురించి క్లెయిమ్ చేసినప్పుడు ఆ ప్రమాదం జరిగిన సమయంలో వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్/ యజమాని సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్నట్లు తేలినా, లేక మద్యం సేవించి వాహనం నడిపినా ఇన్సూరెన్స్ వర్తించదు.

స్వీయ నిర్లక్ష్యం

స్వీయ నిర్లక్ష్యం వలన జరిగే డ్యామేజీలు, నష్టాలు భర్తీ కావు. ఉదాహరణకు, మీ నగరంలో వరదలు వచ్చాయని అనుకుందాం. మీరు మీ వాహనాన్ని ఆ వరదల్లోకి తీసుకుని పోతే జరిగే నష్టం భర్తీ కాదు.

పర్యావసాన నష్టాలు

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, ప్రకృతి విపత్తు జరిగినప్పడో కాకుండా వాటి తదనంతర పరిస్థితుల్లో వాహనం డ్యామేజ్ అయితే ఆ నష్టం భర్తీ చేయబడదు.

డిజిట్ అందించే ప్యాసింజర్ క్యారీయింగ్​ వెహికిల్ ఇన్సూరెన్స్​ యొక్క ముఖ్యమైన ఫీచర్లు

ముఖ్యమైన ఫీచర్లు డిజిట్ ప్రయోజనం
క్లెయిమ్ ప్రక్రియ పేపర్​లెస్ క్లెయిమ్స్
కస్టమర్ సపోర్ట్ 24x7 సపోర్ట్
అదనపు కవరేజ్ పీఏ కవర్, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, కంపల్సరీ డిడక్టబుల్స్ మొదలగునవి
థర్డ్ పార్టీకి జరిగే డ్యామేజీలు వ్యక్తిగత డ్యామేజీల​కు అపరిమిత లయబిలిటీ. ప్రాపర్టీ/వాహనం డ్యామేజ్ అయితే రూ. 7.5 లక్షల వరకు కవర్

ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్లాన్​ల రకాలు11

మీ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ రకాన్ని బట్టి మా వద్ద రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, బస్, రిక్షా, వ్యాన్ మొదలగునవి.

లయబిలిటీ ఓన్లీ స్టాండర్డ్​ ప్యాకేజ్

ఎవరైనా థర్డ్​ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి మీ ప్యాసింజర్​ క్యారీయింగ్​ వెహికిల్​ వలన కలిగిన డ్యామేజీలు

×

మీ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ వలన థర్డ్ పార్టీ వెహికిల్​కు డ్యామేజ్ జరిగినపుడు

×

దొంగతనాలు, యాక్సిడెంట్లు, ప్రకృతి విపత్తుల వలన మీ వాహనంలోని ప్యాసింజర్లకు నష్టం జరిగినపుడు

×

ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఓనర్ లేదా డ్రైవర్​కు గాయాలయినా లేదా మరణించినా..

యజమానికి అంతకు ముందే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లేకపోతే..

×
Get Quote Get Quote

ఎలా క్లెయిమ్ చేయాలి?

1800-258-5956 నెంబర్​కు కాల్ చేయండి లేదా hello@godigit.com కు మెయిల్ చేయండి.

కాల్ చేసే ముందు మీ పాలసీ నెంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ, సమయం, పాలసీదారుడి రిజిస్టర్డ్​ మొబైల్ నెంబర్ మొదలయిన వివరాలను దగ్గర ఉంచుకోండి. ఇవి ఉంటే క్లెయిమ్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది.

డిజిట్ క్లెయిమ్స్ ఎంత త్వరగా సెటిల్ చేయబడతాయి? మనలో ఎవరైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీని మార్చాలని చూసినప్పుడు తలెత్తే మొదటి ప్రశ్న. మీకు ఆ సందేహం రావడం మంచిదే. డిజిట్​ క్లెయిముల రిపోర్ట్​ కార్డును చదవండి

భారతదేశంలో ఆన్‌లైన్‌లో ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

థర్డ్-పార్టీ, కాంప్రహెన్సివ్ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ పాలసీకి మధ్య తేడా ఏమిటి?

థర్డ్ పార్టీ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్​ కేవలం థర్డ్-పార్టీ వ్యక్తికి, ఆస్తికి లేదా వాహనానికి కలిగే డ్యామేజీలు, నష్టాల నుంచి మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది.

మరోవైపు, కాంప్రహెన్సివ్ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ పాలసీ అనేది మీ సొంత వాహనం, యజమాని-డ్రైవర్‌కు కలిగే డ్యామేజీలు, నష్టాలను కూడా కవర్ చేస్తుంది.

ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఐడీవీ (IDV) అంటే ఏమిటి?

ఐడీవీ అనేది ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వ్యాల్యూని సూచిస్తుంది; ఇది మీ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ యొక్క మార్కెట్ విలువ. ఇది మీ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించడానికి, క్లెయిమ్ సమయంలో చెల్లింపుల కోసం ఉపయోగపడుతుంది.

ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్యాసింజర్లను కూడా కవర్ చేస్తుందా? లేదంటే కేవలం వాహనాన్ని మాత్రమేనా?

అవును, ఒకవేళ మీరు కాంప్రహెన్సివ్ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ పాలసీని కొనుగోలు చేసినట్లయితే, మీరు ప్యాసింజర్ కవర్​ను  ఎంచుకోవడం ద్వారా మీ ప్యాసింజర్లను కూడా కవర్ చేయవచ్చు.

ఆన్‎లైన్‎లో ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‎లైన్‎లో కొనుగోలు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి; ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది (మీరు ఏజెంట్ వద్దకు వెళ్లనవసరం లేదు), ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేదు. పాలసీని కొనుగోలు చేయడం, క్లెయిమ్ చేయడం రెండూ సులభం, తక్కువ సమయం తీసుకుంటాయి!