Third-party premium has changed from 1st June. Renew now
కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్ అనేది ఒక విధమైన కమర్షియల్ వెహికిల్ ఇన్సరెన్స్ వంటిదే. ఈ పాలసీ వ్యాపార అవసరాల కోసం వాడే వ్యాన్ల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ముఖ్యంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణికులను, వస్తువులను చేరవేసే స్కూల్ వ్యాన్లు, ప్రైవేటు వ్యాన్ల వంటి వాటికోసం.
మీరు థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ తీసుకుంటే అది కేవలం మిమ్మల్ని థర్డ్ పార్టీ నష్టాల నుంచి మాత్రమే కాపాడుతుంది. అలాగే, చట్ట ప్రకారం కనీసం థర్డ్ పార్టీ పాలసీ అయినా ఉండటం తప్పనిసరి. అయితే, కాంప్రహెన్సివ్ వ్యాన్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని అన్ని రకాల డ్యామేజీల నుంచి కాపాడుతుంది.
కమర్షియల్ వ్యాన్లలో వివిధ రకాలు:
- స్కూల్ వ్యాన్: స్కూల్ పిల్లలను తీసుకెళ్లడానికి ఉపయోగించే వ్యాన్లు ఇవి. డిజిట్ అందించే వ్యాన్ ఇన్సూరెన్స్‌లో ఇవి కవర్ అవుతాయి.
- పబ్లిక్ వ్యాన్: ప్రజా రవాణా కోసం వాడే వ్యాన్లు కూడా ఈ వ్యాన్ ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయి.
- ప్రైవేట్ వ్యాన్: ప్యాసింజర్ల రవాణా, వ్యాపార పనులకు ఉపయోగించే వ్యాన్లు కూడా దీనిలో భాగంగా ఇన్సూర్ చేయబడతాయి.
- ఇతర రకాల కమర్షియల్ వ్యాన్స్: వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఇతర రకాల వ్యాన్లు కూడా ఈ ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయి.
కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనాలి?
- చట్ట ప్రకారం అవసరం: మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతీ వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి. కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా సరే కలిగి ఉండాలి. ఏ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా బండి నడిపితే అధిక జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు.
- అనుకోని నష్టాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు: థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కేవలం మిమ్మల్ని లయబిలిటీస్ నుంచి మాత్రమే కాపాడుతుంది. కానీ మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే అది చాలా రకాల నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
- వ్యాన్ యజమాని–డ్రైవర్ కవర్ అవుతుంది: అనుకోని ప్రమాదాలు సంభవించినపుడు థర్డ్ పార్టీ వ్యాన్ ఇన్సూరెన్స్ అయినా లేదా కాంప్రహెన్సివ్ వ్యాన్ ఇన్సూరెన్స్ అయినా కానీ వ్యాన్ డ్రైవర్ లేదా యజమానిని కూడా కవర్ చేస్తుంది.
- ప్రయాణికుల భద్రత కోసం: కాంప్రహెన్సివ్ వ్యాన్ ఇన్సూరెన్స్‌ను ఉపయోగించి మీ వ్యానులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కూడా మీరు కవర్ (ఇన్సూర్) చేసేందుకు వీలుంటుంది.
డిజిట్ కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్నే ఎందుకు ఎంచుకోవాలి?
కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
ఏమేం కవర్ కావంటే?
కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్‌లో ఏఏ విషయాలు కవర్ అవుతాయో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కవర్ కాని విషయాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఎందుకంటే మీరు క్లెయిమ్స్ చేసే సమయంలో ఎటువంటి ఆశ్చర్యానికి గురి కాకుండా ఉండేందుకు కవర్ కాని విషయాలను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.
మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటే ఓన్ డ్యామేజీలు కవర్ కావు.
మీరు మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైనా లేదా సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. అటువంటి సందర్భంలో మీ కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్ పని చేయదని గుర్తుంచుకోండి.
స్వీయ నిర్లక్ష్యం వలన మీ కమర్షియల్ వాహనానికి ఏదైనా డ్యామేజ్ జరిగినపుడు ఇన్సూరెన్స్ కవర్ కాదు.
ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల వలన నేరుగా కాకుండా ఆ తర్వాత మీ వాహనానికి ఏదైనా డ్యామేజ్ జరిగినపుడు.
డిజిట్ కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్ ముఖ్యమైన ఫీచర్లు
ముఖ్యమైన ఫీచర్లు | డిజిట్ ప్రయోజనం |
---|---|
క్లెయిమ్ ప్రాసెస్ | పేపర్‌లెస్ క్లెయిమ్ |
కస్టమర్ సపోర్ట్ | 24x7 |
అడిషనల్ కవరేజ్ | పీఏ (PA) కవర్, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు |
థర్డ్ పార్టీ డ్యామేజీలు | పర్సనల్ డ్యామేజీలకు అపరిమిత లయబిలిటీ, ఆస్తి, వాహన డ్యామేజీలైతే రూ. 7.5 లక్షల వరకు కవర్ చేయబడతాయి. |
కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ రకాలు11
మీ కమర్షియల్ వ్యాన్ రకాన్ని బట్టి మా వద్ద రెండు ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
లయబిలిటీ ఓన్లీ | స్టాండర్డ్ ప్యాకేజ్ |
మీ కమర్షియల్ వ్యాన్ వలన ఏదైనా థర్డ్ పార్టీ వ్యక్తికి గానీ, ఆస్తికి గానీ డ్యామేజ్ జరిగితే |
|
మీ కమర్షియల్ వ్యాన్ వలన థర్డ్ పార్టీ వాహనం డ్యామేజ్ అయితే |
|
ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల వలన సొంత కమర్షియల్ వ్యాన్ డ్యామేజ్ అయితే |
|
వ్యాన్ డ్రైవర్ లేదా యజమానికి గాయాలు/ మరణం సంభవిస్తేIf the owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
|
Get Quote | Get Quote |
ఎలా క్లెయిమ్ చేయాలి?
1800-258-5956 నెంబర్‌కు కాల్ చేయండి. లేదా hello@godigit.com కు మెయిల్ చేస్తే సరిపోతుంది.
మీరు కాల్ చేసేటపుడు మీ పాలసీ నెంబర్, ప్రమాదం జరిగిన ప్రాంతం, సమయం, తేదీ, ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి ఫోన్ నెంబర్ తదితర వివరాలను దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన క్లెయిమ్ ప్రక్రియ చాలా తొందరగా పూర్తవుతుంది.
భారతదేశంలో కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన తరచూ అడిగే ప్రశ్నలు
ఒకే పాలసీలో నా వ్యాన్‌తో సహా అన్ని కమర్షియల్ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించవచ్చా?
అలా చేసేందుకు కుదరదు. ప్రతీ వాహనానికి ఒక సొంత పాలసీ ఉన్నట్లే కమర్షియల్ వాహనాలకు కూడా ఉంటాయి. ఒక వాహనం పాలసీ మరో వాహనానికి వర్తించదు. మీరు మీ అన్ని వాహనాలకు తక్కువ ధరలో ఇన్సూరెన్స్ చేయించాలని చూస్తుంటే మీరు మమ్మల్ని వాట్సాప్‌లో సంప్రదించండి.
డిజిట్ వ్యాన్ ఇన్సూరెన్స్ కింద ఎటువంటి రకాల వ్యాన్లు కవర్ అవుతాయి?
వాణిజ్య అవసరాలకు వాడే అన్ని రకాల వ్యాన్లు ఈ పాలసీ కింద కవర్ అవుతాయి. (ఉదా. స్కూల్ వ్యాన్లు, ప్రైవేట్ టూర్లకు వెళ్లే వ్యాన్లు మొదలగునవి) మారుతి ఈకో, మారుతి సుజుకి ఓమిని వంటి వ్యాన్లు, మినీ బస్సుల వంటివి కవర్ అవుతాయి.
వ్యాన్ ఇన్సూరెన్స్‌లో ప్రయాణికులు కూడా కవర్ అవుతారా?
కవర్ అవుతారు. మీరు కాంప్రహెన్సివ్ కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మీరు ప్యాసింజర్ కవర్ యాడ్–ఆన్‌ను ఎంచుకుంటే ప్రయాణికులు కూడా కవర్ అవుతారు.
ఆన్లైన్లో వ్యాన్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయి?
మనం టెక్నాలజీకి ధన్యవాదాలు తెలపాలి. మీరు ప్రస్తుతం వ్యాన్ ఇన్సూరెన్స్‌ను ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధానం వలన మీకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి పేపర్ వర్క్ అవసరం ఉండదు. ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎవర్నీ కలవాల్సిన అవసరం లేకుండా పాలసీని పొందొచ్చు. పాలసీ కూడా తక్కువ ధరలో లభిస్తుంది.
కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్‌లో ఒక వ్యాన్‌కు ఇన్సూరెన్స్ చేయించేందుకు ఎంత ఖర్చవుతుంది?
ఈ విషయం మీ వ్యాన్ రకం, దాని వయస్సు, ఆ వ్యాన్‌ను నడిపే నగరం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా ఈ విషయాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యాన్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తెలుసుకునేందుకు మీ వివరాలను ఇక్కడ నమోదు చేయండి.