Third-party premium has changed from 1st June. Renew now
సీఎన్జీ (CNG) వాహనాలకు కార్ ఇన్సూరెన్స్
మీకు ఇప్పటికే సీఎన్జీ వాహనం ఉంటే లేదా పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా సీఎన్జీకి మారాలని అనుకుంటున్నట్లయితే.. మీకు ఇప్పటికే ఉన్న కార్ ఇన్సూరెన్స్ సరిపోదు. అందుకోసం మీరు ప్రత్యేకంగా సీఎన్జీ కార్ ఇన్సూరెన్స్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటో ఇక్కడ చదవండి.
సీఎన్జీ వాహనాలు ప్రత్యేక స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయి. మీ వాహన ఇన్సూరెన్స్‌ను సీఎన్జీకి మార్చినపుడు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇది మీ వాహన పనితీరును, ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని, పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
సీఎన్జీ వాహనం వల్ల లాభాలేంటి?
సీఎన్జీ వాహనాల గురించి ఇటీవల బాగా వినబడుతోంది. బడ్జెట్లో ఉంటూ, అన్ని విధాలా బాగుండే వాహనం కావాలంటే ఇవి మనకు చాలా మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి.
సీఎన్జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) అనేది మీకు రెగ్యులర్ ఇంధనం లాగానే మైలేజీని అందిస్తుంది. కానీ సీఎన్జీ ధర మామూలు ఇంధనం ధరలో మూడో వంతు మాత్రమే ఉంటుంది. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇది గొప్ప ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
అదనంగా దీని నుంచి చాలా తక్కువ స్థాయిలో కర్బన ఉద్గారాలు బయటకి వస్తాయి. తద్వారా ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.
కారులో సీఎన్జీ కిట్ ఇన్స్టాల్ చేయడం ఎలా?
మీ వాహనానికి సీఎన్జీ కిట్‌ను అమర్చేందుకు రెండు విధానాలు ఉన్నాయి.
బయటినుంచి ఇన్స్టాల్ చేసే సీఎన్జీ కిట్
మీ పాత పెట్రోల్ కారును సీఎన్జీ కారుగా మార్చడం సాధ్యమవుతుందని మీకు తెలుసా? మీ కారులో ఒక కొత్త సీఎన్జీ కిట్‌ను ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. మంచి నాణ్యత ఉన్న సీఎన్జీ కిట్‌కు దాదాపు రూ. 50,000 వరకు ఖర్చవుతుంది. సాధారణంగా ఈ కిట్‌ను కారు ట్రంక్‌లో అమరుస్తారు.
ఇది చాలా తొందరగా పాడవుతుంది. కావున మీరు మీ ఇన్సూరెన్స్ సంస్థతో కిట్‌కు విడిగా ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉంటుంది.
అంతర్గతంగా అమర్చే సీఎన్జీ కిట్
కొన్ని వాహనాల్లో సీఎన్జీ కిట్ అనేది మీ కారుతో పాటే వస్తుంది. సీఎన్జీ కిట్‌ను తయారీదారులే అమర్చి పంపుతారు. అంటే మీరు ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటపుడు సీఎన్జీ ఆప్షన్ ఉన్న ఇన్సూరెన్స్‌ను మాత్రమే ఎంచుకుంటే సరిపోతుంది.
మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను సీఎన్జీ కిట్ ఎలా ప్రభావితం చేస్తుంది?
కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ఆ కారులో వాడే ఇంధనం రకం, దాని ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) తదితరాలు. మీరు కనుక మీ కారు ఇన్సూరెన్స్‌కు సీఎన్జీ కిట్‌ను జత చేస్తే మీ ప్రీమియం విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
సీఎన్జీ కార్లలో ప్రీమియం విలువ సాధారణంగా రూ. 60 పెరుగుతుంది. కేవలం థర్డ్ పార్టీ పాలసీల్లో మాత్రమే కొన్ని రకాల అదనపు పన్నులు కూడా ఉంటాయి. అదే మీరు కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకుంటే.. సీఎన్జీ కిట్ కారుతో వచ్చిందా? లేదా తర్వాత అమర్చారా? అనే ఆంశాన్ని చూస్తారు.
బయటినుంచి ఇన్స్టాల్ చేసిన సీఎన్జీ కిట్లకు
మీరు మీ కారులో కొత్త సీఎన్జీ కిట్‌ను అమర్చుకున్నపుడు, ఆ విషయాన్ని తప్పనిసరిగా మీ ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయాలి.
సీఎన్జీ వాహనాలకు నిర్వహణా వ్యయం ఎక్కువగానే ఉంటుంది. అంతేగాక ఇన్స్టలేషన్ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. (మంచి సీఎన్జీ కిట్‌కు దాదాపు రూ. 50,000 వరకు ఖర్చవుతుంది). అంటే మీ కిట్ విలువ మీద మీ ప్రీమియం 4-5 శాతం పెరుగుతుంది.
సీఎన్జీ కిట్లతో వచ్చే వాహనాలకు
ముందుగా సీఎన్జీ అమర్చిన వాహనానికి వేరే ఇతర వాహనం మాదిరిగానే ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. అంతేగాక ఆర్సీ (RC) బూత్‌ను సీఎన్జీ సీల్‌తో మార్చుకుని కూడా సీఎన్జీ ఇన్సూరెన్స్‌ను చేయించుకోవచ్చు.
పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే వాహనానికి మీరు కట్టే ప్రీమియం కంటే సీఎన్జీ వాహనానికి కట్టే ప్రీమియం కాస్త ఎక్కువగానే ఉంటుంది.
సీఎన్జీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్
వాహన సామర్థ్యం (సీసీ) | థర్డ్ పార్టీ ప్రీమియం (జీఎస్టీ లేకుండా) |
---|---|
1000 సీసీని మించకపోతే | ₹2,094 |
1000 సీసీ కంటే ఎక్కువ 1500 సీసీ కంటే తక్కువ | ₹3,416 |
మీ సీఎన్జీ వాహనానికి డిజిట్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
సీఎన్జీ వాహనాల గురించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు
మీ వాహనంలో సీఎన్జీ కిట్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం లేదా సీఎన్జీ అమర్చిన కారును కొనుక్కోవడం వలన పెరుగుతున్న ఇంధన ధరల నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు.
మీ కారును సీఎన్జీకి మార్చే ముందు, కొత్త సీఎన్జీ కార్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.
ఇంధన లభ్యత
మీరు సీఎన్జీకి మారాలని నిర్ణయించుకున్నపుడు మీ ప్రాంతంలో సీఎన్జీ ఇంధన లభ్యతను గురించి తెలుసుకోవాలి. అలాగే సీఎన్జీ ఇంధనాన్ని నింపుకోవడానికి మీరు ఎంత దూరం ప్రయాణించాల్సి ఉంటుందనేది కూడా అంచనా వేసుకోండి. మీరు కేవలం ఇంధనం నింపుకోవడం కోసమే ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి రాకుండా చూసుకునేందుకు ప్రయత్నించండి.
ధర వర్సెస్ పనితీరు
సీఎన్జీ వాహనాలు మంచి పనితీరును కలిగి ఉంటాయి. అయితే పెట్రోల్ ఇంజన్‌తో పోల్చినపుడు దీని పనితీరు బోసిపోతుంది.
సీఎన్జీ ఇంధనంతో వాహనాన్ని నడపడం వలన మీకు ఇంధనం ఎక్కువ కాలం, దూరం పాటు వస్తుంది. కానీ అదే సమయంలో మీ కారు కూడా పాడవుతుంది.
మీ పెట్రోల్ ఇంజన్‌తో పోల్చినపుడు థ్రోటిల్ రెస్పాన్స్ కొంచెం తగ్గుతుంది. మీ పెట్రోల్ వాహనంతో వచ్చిన అనుభూతిని మీరు సీఎన్జీతో నడిచే వాహనంతో పొందలేరు. అంతేగాక మీరు తరుచూ మీ కారును సర్వీసింగ్‌కు ఇవ్వాల్సి వస్తుంది.
ఇలా జరగడానికి ఒక కారణం కూడా ఉంది. ఇంధనం అనేది సిలిండర్ వాల్వుకు ల్యూబ్రికెంట్గా పని చేస్తుంది. కాబట్టి ఇంజన్ త్వరగా పాడుకాదు. కానీ సీఎన్జీలో మాత్రం ఇలా జరగదు. అందుకే ఇంజన్ త్వరగా తుప్పు పడుతుంది.
ఎక్స్టర్నల్ లేదా అంతర్గత సీఎన్జీ కిట్లు
మీ వాహనానికి సీఎన్జీ కిట్‌ను అమర్చేందుకు రెండు రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి. 1) మీ పాత వాహనానికి సీఎన్జీ కిట్‌ను అమర్చడం 2) సీఎన్జీ అమర్చి ఉన్న కొత్త వాహనాన్ని తీసుకోవడం. ఈ రెండింటిలో ఏది మంచి ఎంపిక అని చాలా మంది చూస్తారు. మీరు మీ పాత వాహనానినికి సీఎన్జీ కిట్‌ను అమర్చుకోవడం కంటే సీఎన్జీ అమర్చిన కొత్త వాహనాన్ని తీసుకోవడమే మంచిది. ఫ్యాక్టరీలో సీఎన్జీ కిట్ అమర్చిన వాహనానికి వారంటీ కూడా వస్తుంది.
నిర్వహణా వ్యయం
పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలతో పోల్చినపుడు సీఎన్జీ వాహనానికి మెయింటెనెన్స్ చాలా అవసరం. మీ కారు లీకేజీ, వైర్ లాసింగ్ నుంచి కాపాడుతూ ఉండాలి. తరుచూ తనిఖీ చేస్తూ ఉండాలి.
మరి, మీరు సీఎన్జీ వాహనాన్ని ఎందుకు ఎంచుకోవాలి?
మామూలు పెట్రోల్, డీజిల్ కారుతో పోలిస్తే సీఎన్జీ అమర్చిన కారుకు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కానీ అది ఎంతో విలువైనది.
ముందుగా అందరూ తెలుసుకోవాల్సింది సీఎన్జీ ఇంధనం పెట్రోల్, డీజిల్ కన్నా చాలా తక్కువ ధరకు వస్తుంది. అంతేగాక ఇది పర్యావరణానికి ఎలాంటి నష్టమూ చేయదు. మీ కారు నుంచి కర్బన ఉద్గారాలు చాలా తక్కువగా వెలువడుతాయి. ఇవి మీ కారు జీవితకాలాన్ని పెంచడంలో సహాయపడతాయి.
అటు పర్యావరణానికైనా, ఇటు మీ బడ్జెట్‌కైనా సీఎన్జీ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కావున మీ కారులో వెంటనే సీఎన్జీ కిట్‌ను అమర్చండి. తక్కువ ఖర్చుతో ప్రయాణించండి.