రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
1899లో స్థాపించబడిన రెనాల్ట్ గ్రూప్ ఒక ఫ్రెంచ్ బహుళజాతి ఆటోమొబైల్ తయారీ సంస్థ. ఇది ముఖ్యంగా ఇటీవలి కాలంలో కార్లు మరియు వ్యాన్లను తయారు చేస్తుంది. అయితే, కంపెనీ ట్రక్కులు, ట్యాంకులు, ట్రాక్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లు మరియు ఆటోరైల్ వాహనాలను ఉత్పత్తి చేసేది. 2016 నాటికి, ఇది ఉత్పత్తి పరిమాణంలో ప్రపంచంలో తొమ్మిదవ-అతిపెద్ద ఆటోమేకర్‌గా అవతరించింది.
అలాగే, రెనాల్ట్ కార్లు ర్యాలీ, ఫార్ములా 1 మరియు ఫార్ములా E వంటి మోటార్‌స్పోర్ట్ ఈవెంట్లలో చురుకుగా పాల్గొన్నాయి. డిసెంబర్ 2019 అంతటా ప్రపంచవ్యాప్తంగా 2,73,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడంలో కంపెనీ ప్రసిద్ధి చెందింది.
ఈ బహుళజాతి సంస్థ యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ గా రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్ 2005లో స్థాపించబడింది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతీయ కొనుగోలుదారుల కోసం నాలుగు రెనాల్ట్ కార్ మోడళ్లను కలిగి ఉంది. చెన్నైలో తయారీ సౌకర్యంతో, సంవత్సరానికి 4,80,000 యూనిట్ల రెనాల్ట్ కార్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది.
2020 నాటికి, ఈ ఫ్రెంచ్ ఆటోమేకర్ యొక్క భారతీయ అనుబంధ సంస్థ భారతదేశం అంతటా 89,000 యూనిట్ల కంటే ఎక్కువ రెనాల్ట్ కార్లను విక్రయించింది. అందువల్ల, ఈ బ్రాండ్ నుండి కార్ల మోడల్లకు భారతీయ వాహనదారులలో డిమాండ్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది.
మీరు రెనాల్ట్ కార్లలో ఒకదానిని కలిగి ఉన్నట్లయితే, మీరు రెనాల్ట్ కారు ఇన్సూరెన్స్ ను పొందడం లేదా రెన్యూవల్ చెయ్యడం గురించి ఆలోచించాలి. మీ కారు ప్రమాదం లేదా ఇతర దురదృష్టకర పరిస్థితి నుండి నష్టాన్ని పొందినప్పుడు కారు ఇన్సూరెన్స్ పాలసీ సులభతరం చేస్తుంది. రెనాల్ట్ కార్లకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా, మీరు మీ జేబులో నుండి విపరీతమైన మరమ్మతు ఖర్చులను భరించాల్సి ఉంటుంది.
అదనంగా, మోటారు వాహనాల చట్టం, 1988 భారీ జరిమానాలను నివారించడానికి కనీసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉండడాన్ని తప్పనిసరి చేస్తుంది. కాబట్టి, రెనాల్ట్ కోసం కారు ఇన్సూరెన్స్ ను పొందడం ద్వారా, మీరు ఆర్థిక మరియు చట్టపరమైన బాధ్యతలను తగ్గించుకోవచ్చు.
మీ అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు ఆన్లైన్లో థర్డ్-పార్టీ మరియు సమగ్రమైన రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ రెండింటినీ అందిస్తున్నాయి. మునుపటి పాలసీ థర్డ్-పార్టీ నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది, అయితే; రెండవది థర్డ్-పార్టీ తో పాటు స్వంత కారు నష్టాలను కూడా కవర్ చేస్తుంది. అంతేకాకుండా, ఇన్సూరెన్స్ సంస్థలు మీ ఇన్సూరెన్స్ ప్లాన్‌పై అనేక ఇతర సేవా ప్రయోజనాలను అందిస్తాయి. మీరు గరిష్ట ప్రయోజనాలతో వచ్చే ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునే ముందు పోల్చి చూసుకోవచ్చు.
సులభంగా నిర్ణయం తీసుకోవడానికి, దాని సరసమైన రెనాల్ట్ కారు ఇన్సూరెన్స్ ధర, యాడ్-ఆన్ ప్రయోజనాలు, అవాంతరాలు లేని క్లయిమ్ ప్రక్రియ మరియు ఇతర ప్రయోజనాల కారణంగా మీరు డిజిట్ ఇన్సూరెన్స్ ను పరిగణించవచ్చు
మీ కారు ఇన్సూరెన్స్ పాలసీలో ఏది కవర్ చేయబడదని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం, తద్వారా మీరు క్లయిమ్ చేసినప్పుడు ఎలాంటి ఆశ్చర్యాలు ఉండవు. అటువంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి:
మేము మా కస్టమర్లను VIPల వలె చూస్తాము, ఎలాగో తెలుసుకోండి...
ప్రమాదం కారణంగా స్వంత కారుకు నష్టం/నష్టాలు |
×
|
✔
|
అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు స్వంత కారుకు నష్టం/నష్టాలు |
×
|
✔
|
ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు స్వంత కారుకు నష్టం/నష్టాలు |
×
|
✔
|
థర్డ్-పార్టీ వాహనానికి నష్టం |
✔
|
✔
|
థర్డ్-పార్టీ ఆస్తికి నష్టం |
✔
|
✔
|
వ్యక్తిగత ప్రమాద కవర్ |
✔
|
✔
|
థర్డ్-పార్టీ వ్యక్తి యొక్క గాయాలు/మరణం |
✔
|
✔
|
మీ కారు దొంగతనం |
×
|
✔
|
డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్ |
×
|
✔
|
మీ IDV ని అనుకూలీకరించండి |
×
|
✔
|
అనుకూలీకరించిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి
మీరు మా కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూవల్ చేసిన తర్వాత, మేము 3-దశల, సంపూర్ణమైన డిజిటల్ క్లయిమ్ ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
1800-258-5956కు కాల్ చేయండి. ఫారమ్‌లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క నష్టాలను షూట్ చేయండి.
మీరు మా గ్యారేజీల నెట్వర్క్ ద్వారా రీయింబర్స్మెంట్ లేదా క్యాష్‌లెస్ ల మధ్య ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.
మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా చేయడం సబబే!
డిజిట్ క్లయిమ్ రిపోర్ట్ కార్డ్‌ని చదవండి
కారు కొనాలని ఆలోచిస్తున్నారా? తక్కువ రిపేర్ ఖర్చుతో వచ్చే నమ్మకమైన కారు కోసం చూస్తున్నారా? అవును అయితే, రెనాల్ట్ మీ కోసం మీరు ఎంచుకోదగ్గ బ్రాండ్. ఈ ఆటోమొబైల్ తయారీదారు స్థిరంగా అధిక-నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందిస్తోంది. ఈ బ్రాండ్ నిజానికి ఫ్రాన్స్‌కు చెందినది, మరియు రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది రెనాల్ట్ S.A ఫ్రాన్స్ యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ.
రెనాల్ట్ 2005 సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది మరియు అప్పటి నుండి వారు కొన్ని అత్యుత్తమ కార్ల మోడళ్లను విడుదల చేశారు. వీటిలో, రెనాల్ట్ డస్టర్ భారతీయ మార్కెట్లో తన బలమైన ఉనికిని చాటుకుంది. రెనాల్ట్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ కు కాంపాక్ట్ ఎస్యూవీ డస్టర్, మినీ-వాన్లు ట్రైబర్ మరియు లాడ్జీ, సబ్‌కాంపాక్ట్ కారు క్విడ్ మరియు ఎస్యూవీ క్యాప్చర్‌తో సహా అన్ని విభాగాల కార్లను అందించింది. రెనాల్ట్ కారు ప్రారంభ ధర రూ. 2.83 లక్షలు మరియు టాప్ లైన్-అప్‌లో అత్యంత ఖరీదైన కారు ధర రూ.12.99 లక్షలు.
2012 సంవత్సరంలో, ఈ బ్రాండ్ 23 అవార్డులను కైవసం చేసుకొని అత్యధిక సంఖ్యలో అవార్డులను పొందిన అగ్ర పోటీదారులలో ఒకటిగా నిలిచింది. 2018 సంవత్సరంలో, రెనాల్ట్ క్యాప్చర్ NDTV కార్ మరియు బైక్ అవార్డ్స్‌లో “NDTV వ్యూయర్స్ ఛాయిస్ కార్ ఆఫ్ ది ఇయర్ 2018”ని గెలుచుకుంది.
కార్లు ఎంత బలంగా తయారైనప్పటికీ, కొన్ని దురదృష్టకర సంఘటనలు మీ కారుకు హాని కలిగించవచ్చు. అటువంటి ప్రమాదాల సమయంలో కారు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు మీకు అండగా నిలుస్తాయి. అంతే కాకుండా, కారు ఇన్సూరెన్స్ తప్పనిసరి అవసరం. ఎవరైనా కారు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా విధించబడుతుంది.
రెనాల్ట్ కార్లను కొనుగోలు చేయడానికి కారణాలు ఇక్కడ ఉన్నాయి:
● సరసమైనది: రెనాల్ట్ కార్లు సరసమైనవి. అవి రూ.2.83 లక్షల ధర పరిధిలోకి వస్తాయి మరియు టాప్ మోడల్‌కు రూ.12.99 లక్షల వరకు మాత్రమే ఉంటాయి. ఈ బడ్జెట్లో, మీరు బోల్డ్ మరియు శక్తివంతమైన కార్లను పొందుతారు. రెనాల్ట్ కార్లు అత్యంత స్టైలిష్ ఎస్యూవీ గా వర్గీకరించబడ్డాయి.
● అన్ని విభాగాల కోసం మోడల్‌లు: సబ్‌కాంపాక్ట్ కారుగా రెనాల్ట్ క్విడ్ నుండి ఎస్యూవీ రెనాల్ట్ క్యాప్చర్ వరకు, మీరు ఎంచుకోవడానికి మంచి ఎంపికలను పొందుతారు. ప్రతి మోడల్ బడ్జెట్ పరిధిలోకి వస్తుంది.
● ఇంధన-సమర్థవంతమైన కార్లు: కారును కొనుగోలు చేసే ముందు, పరిగణించవలసిన ఒక ముఖ్యమైన ప్రమాణం ఇంధన సామర్థ్యం. రెనాల్ట్ కార్లు డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్లకు మంచి మైలేజ్ గణాంకాలను అందజేస్తున్నాయి.
● స్వరూపం: రెనాల్ట్ కార్లు దృఢంగా, బోల్డ్‌గా కనిపిస్తాయి మరియు బాక్స్ లాంటి రూపాన్ని కలిగి ఉంటాయి. వారి అతి చిన్న కారులో కూడా ఎస్యూవీ యొక్క డీఎన్ఏ ఉంటుంది. ఇది మీ ప్రిఫరెన్స్ ను నిర్వచించడంలో కూడా మీకు సహాయపడుతుంది.
● కంఫర్ట్ ఫీచర్లు: ఈ బ్రాండ్‌లోని అన్ని కార్లు విశాలమైనవి. హైయ్యర్ మోడళ్లలో వెనుక ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, 8-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, సర్దుబాటు చేయగల స్టీరింగ్ వీల్స్ మరియు మరిన్ని ఉన్నాయి.
● విశ్వసనీయమైనవి మరియు తక్కువ నిర్వహణ: రెనాల్ట్ కార్లు వాటి పనితీరులో చాలా నమ్మదగినవి. ఈ బ్రాండ్‌కు తక్కువ మరమ్మతు ఖర్చులు ఉన్నందున దాని నుండి కారును కొనుగోలు చేయడం మీ ఉత్తమ నిర్ణయాలలో ఒకటి.
రెనాల్ట్ వారు తమ కార్లకు అధిక ధరను నిర్ణయించనందున మాస్ కోసం ఒక తయారు చెయ్యబడిన ఒక బ్రాండ్ గా నిలుస్తుంది. మరమ్మతు ఖర్చు కూడా తక్కువగా ఉన్నప్పటికీ, కారు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ రెనాల్ట్ కారు కోసం ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు పొందాలో ఇక్కడ ఇవ్వబడింది :
● చట్టపరమైన అవసరాలను తీరుస్తుంది: భారత ప్రభుత్వం కార్ ఇన్సూరెన్స్‌ని తప్పనిసరి చేసింది. మోటారు వాహన చట్టం ప్రకారం, ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా కారు నడపడం ఎవరికీ అనుమతించబడదు. ఎవరైనా అలా పట్టుబడితే మొదటి అపరాధానికి రూ.2000/- మరియు తదుపరి నేరానికి రూ.4000/- జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అంతే కాదు, 3 నెలల జైలు శిక్ష విధించవచ్చు మరియు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు.
● స్వంత నష్ట ఖర్చులను నిర్వహించడంలో సహాయపడుతుంది: ప్రమాదం, అగ్ని, దొంగతనం మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా కలిగే నష్టం ఏదైనా కొన్నిసార్లు మీరు భరించే సామర్థ్యాన్ని మించి ఉండవచ్చు. కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ పరిస్థితుల్లో ఏదైనా కారణంగా నష్టం సంభవించినప్పుడు మరమ్మతుల ఖర్చును తిరిగి పొందడంలో మీకు సహాయపడుతుంది.
● చట్టపరమైన బాధ్యతలను పరిష్కరించడంలో సహాయపడుతుంది: థర్డ్-పార్టీ నష్టానికి మీరు బాధ్యత వహిస్తే, చట్టపరమైన బాధ్యతలను చెల్లించడంలో కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు సహాయం చేస్తుంది. మీరు థర్డ్-పార్టీ ని ఢీకొట్టడం, శారీరక గాయం లేదా ఆస్తి నష్టానికి దారితీసినట్లయితే, వారి క్లయిమ్ మొత్తాలు కొన్నిసార్లు భారీగా ఉండవచ్చు. అలాంటి ఖర్చులు థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీ కింద కవర్ చేయబడతాయి.
● ప్రాథమిక కవరేజీని విస్తృతం చేయండి: ప్రమాదాలు, దొంగతనం, అగ్నిప్రమాదం మరియు ప్రకృతి వైపరీత్యాలు కాకుండా ఇతర కారకాల వల్ల ఉత్పన్నమయ్యే నష్టాలు కార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు. దీని కోసం, మీరు యాడ్-ఆన్ కవర్లను కొనుగోలు చేయాలి. ఇవి అదనపు ఖర్చుతో వస్తాయి. జీరో డిప్రిసియేషన్, రిటర్న్-టు-ఇన్వాయిస్ కవర్ మరియు ఇతర వంటి యాడ్-ఆన్ కవర్లు ప్రాథమిక కవరేజ్ పరిధిని విస్తృతం చేయడంలో సహాయపడతాయి.
రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే కొన్ని అంశాలు:
● వయస్సు: కారు ఐడీవీ కాలక్రమేణా తగ్గుతుంది మరియు ప్రీమియంను లెక్కించేటప్పుడు డిప్రిషియేషన్ విలువ కూడా వర్తించబడుతుంది. కాబట్టి కారు పాతదయ్యే కొద్దీ ప్రీమియం తగ్గవచ్చు.
● భౌగోళిక స్థానం: పట్టణ నగరాల్లో కారు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో కార్లు ఉండటం కారణంగా ప్రమాదాల సంభావ్యత ఎక్కువగా ఉంటుంది.
● ఇన్సూరెన్స్ పాలసీ రకం: సమగ్ర ప్యాకేజీ పాలసీ కోసం, స్వంత నష్టం మరియు థర్డ్-పార్టీ బాధ్యత కారణంగా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కానీ స్టాండలోన్ థర్డ్-పార్టీ పాలసీలో, ప్రీమియం తక్కువగా ఉంటుంది.
● కారు యొక్క ఐడీవీ: మీ కారు యొక్క ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (ఐడీవీ) నేరుగా ప్రీమియంపై ప్రభావం చూపుతుంది. అధిక ఐడీవీ కోసం, ప్రీమియం ఎక్కువగా ఉంటుంది మరియు దీనికి తక్కువ ఐడీవీ కోసం తక్కువగా ఉంటుంది.
● సీఎన్జీ కిట్ ఇన్స్టాల్ చేయబడితే: మీ రెనాల్ట్ కారు అదనపు సీఎన్జీ కిట్‌తో ఇన్స్టాల్ చేయబడితే, కారు ఇన్సూరెన్స్ ప్రీమియంకు అదనపు మొత్తం జోడించబడుతుంది.
● యాడ్-ఆన్ కవర్లు: ప్రతి యాడ్-ఆన్ కవర్ అదనపు ప్రీమియం చెల్లింపుతో వస్తుంది. మీరు యాడ్-ఆన్ కవర్లను ఎంచుకున్నప్పుడు, ప్రీమియం పెరుగుతుంది.
● నో క్లయిమ్ బోనస్(NCB): మీరు ఒక పూర్తి సంవత్సరానికి ఒక్క క్లయిమ్ కూడా లేకుండా ఉంటే, తదుపరి రెన్యూవల్ కోసం మీరు NCBని పొందుతారు.
● ఇంజిన్ కెపాసిటీ: ఇన్సూరెన్స్ ప్రీమియంలోని థర్డ్-పార్టీ భాగం కారు ఇంజిన్ క్యూబిక్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. క్యూబిక్ సామర్థ్యం ఎక్కువగా ఉంటే, ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
● వాలంటరీ డిడక్టబుల్: మీరు క్లయిమ్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ పూర్తిగా చెల్లించకుండా అందులో కొంత భాగం మీరు భరించడాన్ని వాలంటరీ డిడక్టబుల్ అంటారు. అధిక వాలంటరీ డిడక్టబుల్ అంటే తక్కువ ప్రీమియం.
ఇటీవల, థర్డ్-పార్టీ ప్రీమియం మొత్తాన్ని భారత ప్రభుత్వం పెంచింది.
● అవాంతరాలు లేని సేవలు: డిజిట్ ఇన్సూరెన్స్ తన కస్టమర్లకు అన్నింటినీ సౌకర్యవంతంగా చేసింది. మీరు ఆన్లైన్లోనే సౌకర్యవంతంగా పాలసీని కొనుగోలు చేయవచ్చు మరియు క్లయిమ్ పత్రాలను అప్లోడ్ చేయవచ్చు. పాలసీని కొనుగోలు చేయడం నుండి క్లయిమ్ ఫైల్ చేయడం వరకు అనుభవం అవాంతరాలు లేకుండా ఉంటుంది.:
● ఇన్సూరెన్స్ పాలసీ ఎంపిక: డిజిట్ రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. ఒకటి మీకు స్వంత నష్టం మరియు థర్డ్ పార్టీ బాధ్యత కోసం చెల్లించే కాంప్రహెన్సివ్ ప్యాకేజీ విధానం. రెండోవది థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీ. ఇది థర్డ్-పార్టీ శారీరక గాయం లేదా ఆస్తి నష్టం కోసం మీరు కలిగించే నష్టాలకు చెల్లిస్తుంది.
● మీరు పాలసీని కొనుగోలు చేసే ముందు ప్రీమియంను లెక్కించండి: వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా కారు వివరాలను నమోదు చేసి మరియు అవసరమైన కొన్ని ఫీల్డ్‌లను పూరించండి మరియు మీ అవసరానికి అనుగుణంగా కవర్‌ను ఎంచుకోండి, అంతే! మీ ఇన్సూరెన్స్ ప్రీమియం ధర స్క్రీన్‌పై చూపబడుతుంది.
● అనుకూలీకరించదగిన ఐడీవీ: డిజిట్ ఇన్సూరెన్స్ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువను అనుకూలీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది మొత్తం నష్టం క్లయిమ్ సందర్భంలో కారు ఇన్సూరెన్స్ కంపెనీ మీకు చెల్లించే గరిష్ట మొత్తం. ఐడీవీ ని బట్టి ప్రీమియం మారుతుంది.
● అధిక క్లయిమ్ సెటిల్మెంట్ రేషియో: డిజిట్ ఇన్సూరెన్స్ అన్ని క్లయిమ్‌లను అత్యంత సీరియస్‌గా తీసుకుంటుంది. క్లయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంది.
● యాడ్-ఆన్ కవర్ల శ్రేణిని అందిస్తుంది: వయస్సు మరియు అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, మీరు యాడ్-ఆన్ కవర్ల నుండి ఎంచుకోవచ్చు. మీరు దొంగతనంలో మీ కారును పోగొట్టుకున్నప్పుడు లేదా ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్నట్లయితే, ఖర్చులను తిరిగి పొందడంలో మీకు సహాయపడే రిటర్న్-టు-ఇన్వాయిస్ కవర్‌ను మీరు కొనుగోలు చేయవచ్చు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణీకులను రక్షించడానికి మీరు ప్యాసింజర్ కవర్‌ను కూడా పరిగణించవచ్చు. టైర్ ప్రొటెక్ట్ కవర్, జీరో డిప్రెసియేషన్ కవర్, బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్షన్ మరియు కన్సూమబుల్ కవర్ వంటి మరికొన్ని యాడ్-ఆన్ల నుండి మీరు ఎంచుకోవచ్చు.
● పోటీపడే ప్రీమియం రేట్లు: డిజిట్ ఇన్సూరెన్స్ అందించే ప్రీమియం రేట్లు చాలా పోటా పోటీగా ఉంటాయి. వారు ప్రీమియంలో ఎలాంటి రహస్య ఖర్చులను జోడించరు. మీరు ఎంచుకున్న కవర్ కోసం మాత్రమే మీరు చెల్లించాలి.
● సులభం మరియు అనుకూలమైనది: ఆన్లైన్ కొనుగోలు మరియు క్లయిమ్ ప్రక్రియతో పాటు, మీ కారు డోర్‌స్టెప్ నుండి తీసుకొని వెళ్లి మరియు రిపేర్ తర్వాత డ్రాప్ చేయబడుతుంది.
Car Insurance for other Jeep models