మారుతి సుజుకి ఎర్టిగా ఇన్సూరెన్స్

Drive Less, Pay Less. With Digit Car Insurance.

Third-party premium has changed from 1st June. Renew now

మారుతి సుజుకి ఎర్టిగా ఇన్సూరెన్స్ ను కొనుగోలు లేదా రెన్యూవల్ చేయండి

ఇండియాలో ఫ్యామిలీ కార్లకు ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి అనేక మంది కార్ లవర్స్ ను ప్రభావితం చేసింది. మారుతి సుజుకి ఎర్టిగా మోడల్ 26.08 km/kg మైలేజీని అందిస్తుంది. మారుతి సుజుకి కంపెనీ రోజులు గడిచే కొద్దీ ఎర్టిగా కారును మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నించింది. ఈ కారు కొత్త వెర్షన్ లు ఎక్కువ క్యాబిన్ రూమ్, సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటాయి. కావున అనేక మంది వీటిని కొనేందుకు మొగ్గుచూపుతారు.

మారుతి సుజుకి ఎర్టిగా మోడల్‌ను కంపెనీ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ తో డెవలప్ చేసింది. ఇది ఏడు సీట్ల కార్. ఇందులో అన్ని రకాల అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు కోరుకునే అన్ని సౌకర్యాలు ఈ కారులో మనకు కనిపిస్తాయి. ఈ కారులో ఫాగ్ ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, 15 అంగుళాల చక్రాలు, 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అంతే కాకుండా స్టార్ట్/స్టాప్ కు పుష్ బటన్ వంటివి ఉన్నాయి. ఇక ఇతర మోడల్స్ లో ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ కప్ హోల్డర్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

మారుతి సుజుకి ఎర్టిగా కారును సొంతం చేసుకోవడం మధ్య తరగతి కుటుంబాలకు అనువుగా ఉంటుంది. ఈ వాహనంలో అనేకమైన అనువైన ఫీచర్లు ఉన్నాయి. ఇన్ని ఫీచర్లు ఉన్నా కానీ ఇది బడ్జెట్ రేంజ్ లో ఉంటుంది. అన్నింటికంటే ఎక్కువ ఈ కారు భద్రతాపరంగా ఉత్తమమైనది. ఇందులో ఉండే ఎయిర్ బ్యాగులు, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటివి ఉంటాయి.

ఈ కారులో అనేక రకాల భద్రతా ప్రమాణాలు ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాల గురించి అంచనా వేయడం, అరికట్టడం అసాధ్యం. కావున మారుతి సుజుకి ఎర్టిగా ఇన్సూరెన్స్ ప్లాన్ ను కలిగి ఉండడం కారును నడుపుతున్న వ్యక్తులకు అనువుగా ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత థర్డ్ పార్టీ నష్టాలను కవర్ చేసేందుకు, మరియు మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఇది తప్పనిసరి.

మారుతి ఎర్టిగా కార్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడింది

మీరు డిజిట్ మారుతి ఎర్టిగా కార్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి?

మారుతి ఎర్టిగా కోసం కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదాల వలన సొంత వాహనానికి అయిన డ్యామేజెస్/లాసెస్

×

అగ్ని ప్రమాదాల వలన సొంత వాహనానికి అయిన డ్యామేజెస్/లాసెస్

×

ప్రకృతి విపత్తుల వలన సొంత వాహనానికి అయిన డ్యామేజెస్/లాసెస్

×

థర్డ్ పార్టీ వాహనానికి అయిన డ్యామేజెస్

×

థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన డ్యామేజెస్

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ వ్యక్తికి ఇంజూరీస్/డెత్ (మరణం)

×

మీ కారు దొంగతనం

×

డోర్ స్టెప్ పికప్ & డ్రాప్

×

మీ IDVని మార్చుకోండి

×

మీకు నచ్చిన యాడ్ ఆన్స్‌తో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య మరిన్ని తేడాలు తెలుసుకోండి

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు లేదా రెన్యూవల్ చేసిన తర్వాత క్లెయిమ్స్ కోసం మా వద్ద 3 స్టెప్ డిజిటల్ ప్రాసెస్ అందుబాటులో ఉంది. ఈ పద్ధతి మిమ్మల్ని టెన్షన్ ఫ్రీగా ఉంచుతుంది.

స్టెప్ 1

కేవలం 1800-258-5956 నెంబర్ కు కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు

స్టెప్ 2

సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ (స్వీయ తనిఖీ) కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపించబడుతుంది. మీ వెహికిల్ డ్యామేజెస్ ఎలా షూట్ చేయాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తాం. మీరు ఆ లింక్ ద్వారా డ్యామేజెస్ షూట్ చేస్తే సరిపోతుంది.

స్టెప్ 3

మా నెట్వర్క్ గ్యారేజెస్ ద్వారా క్యాష్ లెస్ లేదా రీయింబర్స్ మెంట్ రిపేర్ మోడ్స్ ని ఎంచుకుని మరమ్మతు చేయించుకోండి.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత తొందరగా సెటిల్ అవుతాయి? ఒక ఇన్సూరెన్స్ కంపెనీని చేంజ్ చేసి వేరే ఇన్సూరెన్స్ తీసుకునేటపుడు మీ మనసులోకి వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం బాగుంది. డిజిట్ యొక్క క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డ్ చదవండి

మీరు ఎందుకోసం మారుతి సుజుకి ఎర్టిగా కార్ ఇన్సూరెన్స్ ఎంచుకోవాలి?

మీరు కేవలం కారు కొనగానే మీ బాధ్యత తీరిపోదు. మీరు దానిని భవిష్యత్తులో సరిగ్గా చూసుకోవాలి కావున దాన్ని మెయింటేన్ చేయడం అవసరం. ఈ విషయంలో భారత ప్రభుత్వం 1988లోనే మోటారు వాహనాల చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రమాదంలో థర్డ్ పార్టీ వ్యక్తులకు జరిగిన ఏదైనా నష్టాన్ని చెల్లించేలా ఇది చూస్తుంది. దీని కోసం ప్రతి కారు యజమాని తప్పనిసరిగా కారు బీమా పాలసీని కొనుగోలు చేయాలి. కారు యజమానులు ఎవరైనా సరైన ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఈ చట్టం ప్రకారం మొదటి సారి రూ. 2000 జరిమానా, మరలా రిపీట్ చేస్తే రూ. 4,000 జరిమానా పడే అవకాశం ఉంది. మీరు ఇలాగే రిపీట్ చేస్తే జైలు శిక్ష లేదా లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది.

మీ మారుతి సుజుకి ఎర్టిగాకు ఏ కంపెనీ సరైన పాలసీని అందించగలదని మీరు ఆలోచిస్తే మీరు డిజిట్ కంపెనీని పరిగణలోకి తీసుకోవచ్చు. డిజిట్ కంపెనీ కార్ ఇన్సూరెన్స్ రంగంలో చాలా విశ్వసనీయమైనది. మారుతి సుజుకి ఎర్టిగా పాలసీ సరసమైనదే కాకుండా దీని వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు వాటిని విశ్లేషించాలి. డిజిట్ కంపెనీ దాని ఇన్సూరెన్స్ పాలసీల్లో కింది ఫీచర్లను అందిస్తుంది.

1. ఇన్సూరెన్స్ కోసం వివిధ రకాల పాలసీ ఆప్షన్స్

మారుతి సుజుకి ఎర్టిగా పాలసీతీసుకునే వారు తమ వాహనం కోసం పాలసీ తీసుకునేందుకు వారికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో కింద కూలంకుషంగా వివరించబడ్డాయి.

  • థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ : ఈ పాలసీ థర్డ్ పార్టీ కార్స్ మరియు వాహనానికి అయిన ప్రమాదంలో డ్యామేజ్ అయిన వాహనాలను రిపేర్ చేసేందుకు, ఆస్తులకు నష్టాలు చెల్లించేదుకు మాత్రమే కవర్ అవుతుంది. అంతే కాకుండా ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్సకు కూడా పాలసీ చెల్లిస్తుంది. ఈ పాలసీని కలిగి ఉన్న పాలసీదారులు ప్రమాదం జరిగిన తర్వాత థర్డ్ పార్టీ వ్యక్తులు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు.
  • కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ : ఈ పాలసీ కూడా పాత పాలసీ లాగానే ఉంటుంది. ఇది కేవలం థర్డ్ పార్టీ నష్టాలను చెల్లించడం మాత్రమే కాకుండా ప్రమాదం వల్ల సంభవించిన వ్యక్తిగత గాయాలను కూడా కవర్ చేస్తుంది. అంతే కాకుండా మీ మారుతి సుజుకి ఎర్టిగా కారును ఏదైనా నెట్వర్క్ గ్యారేజీలలో మరమ్మతు చేయించుకుంటే దానికి కూడా చెల్లిస్తుంది.

2. నో క్లెయిమ్ బోనస్

మీరు క్లెయిమ్ చేయకుండా ఉన్న ప్రతి సంవత్సరానికి డిజిట్ మారుతి సుజుకి ఎర్టిగా ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ ఫ్రీ బోనస్ ను పొందుతారు. ఈ బోనస్ డిస్కౌంట్ గా పని చేసి మీ పాలసీ ప్రీమియాన్ని తగ్గిస్తుంది. ఈ బోనస్ అనేది క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ ను బట్టి 20 నుంచి 50 శాతం మధ్యలో ఉంటుంది.

3. నచ్చిన విధంగా IDVని మార్చుకునే అవకాశం

మీరు డిజిట్ అందించే మారుతి సుజుకి ఎర్టిగా కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినపుడు మీరు మీ IDVని నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. మార్కెట్లో మీ వాహనానికి ప్రస్తుతం ఎంత విలువ ఉందనే విషయం IDV ద్వారానే తెలుస్తుంది. మీరు కాంప్రహెన్సివ్ పాలసీని ఎన్నుకున్నపుడు మీరు IDVని నచ్చిన విధంగా సెట్ చేసుకునేందుకు డిజిట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ వాహనం రిపేర్ చేయలేని విధంగా పాడయినపుడు, దొంగతనానికి గురయినపుడు మీకు వచ్చే నష్టపరిహారం IDV విలువ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ IDVని సెట్ చేస్తే ఎక్కువ ప్రీమియం, తక్కువ IDVని సెట్ చేస్తే తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

4. సులభమైన ఆన్‌లైన్ ప్రొసీజర్

మారుతి సుజుకి ఎర్టిగా కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేందుకు సరళమైన విధానం అవసరం అని డిజిట్ గ్రహించింది. పూర్తి ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది దీనికి ఎంతో సహాయపడుతుంది. పాలసీ కొనుగోలు చేయాలని అనుకున్న వారు కేవలం కంపెనీ వెబ్‌సైట్ ను సందర్శించి అక్కడున్న సూచనలను ఫాలో అయితే సరిపోతుంది. కేవలం కొత్త పాలసీలు మాత్రమే కాకుండా మారుతి సుజుకి ఎర్టిగా రెన్యూవల్ కు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తే సరిపోతుంది.

5. హై క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో

డిజిట్ లో క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో అనేది అధికంగా ఉంటుంది. దీనికి కారణం యూజర్ ఫ్రెండ్లీ ప్రాసెస్ కావొచ్చని చాలా మంది అభిప్రాయపడతారు. మీరు క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలో కింద వివరంగా ఉంది.

స్టెప్ 1: ఎటువంటి ఫామ్స్ నింపమని డిజిట్ మిమ్మల్ని అడగదు. 1800-258-5956 నెంబర్ కు మీరు కాల్ చేసి వారు చెప్పిన సూచనలను పాటిస్తే సరిపోతుంది.

స్టెప్ 2: మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు సెల్ఫ్ ఇన్స్పెక్షన్ లింక్ వస్తుంది. ఈ లింక్ ద్వారా మీకు మరియు మీ కారుకు ప్రమాదంలో అయిన అన్ని డ్యామేజెస్ అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.

స్టెప్ 3: రిపేర్ కోసం రీయింబర్స్‌మెంట్ లేదా నెట్వర్క్ గ్యారేజీలలో క్యాష్‌లెస్ రిపేర్లను ఎంచుకుంటే సరిపోతుంది.

6. ఎక్కువ సంఖ్యలో నెట్వర్క్ గ్యారేజీలు

డిజిట్ కు ఇండియా వ్యాప్తంగా అనేక నెట్వర్క్ గ్యారేజెస్ ఉన్నాయి. మారుతి సుజుకి ఎర్టిగా పాలసీదారులు దేశంలోని ఏ ప్రాంతంలో ప్రమాదానికి గురయినా కానీ వారు ఆ ప్రాంతంలోని నెట్వర్క్ గ్యారేజీలలో నగదు రహిత మరమ్మతులు చేయించుకోవచ్చు.

7. ఇంప్రెసివ్ కస్టమర్ కేర్

మారుతి సుజుకి ఎర్టిగాను కలిగి ఉండి సంక్లిష్టమైన అవసరాలు ఉన్న వ్యక్తుల సమస్యలు తీర్చేందుకు డిజిట్ ప్రయత్నిస్తుంది. మీకు ఏవైనా సందేహాలుంటే రోజులో ఎప్పుడైనా సరే మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లను సందర్శించవచ్చు. జాతీయ సెలవు దినాల్లో కూడా వారు మీ కోసం పని చేస్తారు. పాలసీదారులకు ఏదైనా అత్యవసర సందర్భం తలెత్తినపుడు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

కావున మారుతి సుజుకి ఎర్టిగా కార్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండడం వలన ప్రతి మారుతి సుజుకి ఎర్టిగా ఓనర్ కు ప్రయోజనం చేకూరుస్తుంది. కారు ఓనర్స్ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అది మాత్రమే కాకుండా థర్డ్ పార్టీ డ్యామేజెస్ కు అయ్యే ఖర్చులు మీరు జేబు నుంచి చెల్లించకుండా ఇది నివారిస్తుంది.

మీ మారుతి ఎర్టిగాకు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?

స్పేస్, పర్ఫామెన్స్ మరియు స్టైల్ లుక్ ఉన్న కారు కోసం మీరు వెతుకున్నట్లయితే ఈ నెం1 MPV (మల్టీపర్పస్ వెహికిల్) ఉత్తమ ఎంపిక కావొచ్చు. మీ కొత్త కారుకు మాత్రమే కాకుండా ఫైనాన్స్ కు కూడా కారు ఇన్సూరెన్స్ తప్పనిసరి. కార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలివే..

ఆర్థిక బాధ్యతల నుంచి కాపాడుతుంది: ​అనుకోని సందర్భాలు ఎదురైనపుడు మీ ఎర్టిగా కార్ ఇన్సూరెన్స్ మీకు తోడుగా నిలబడుతుంది. అనుకోని ఖర్చుల నుంచి మిమ్మల్ని ఆర్థికంగా రక్షిస్తుంది. కారుకు ప్రమాదం జరిగినా, దొంగతనం జరిగినా, ప్రకృతి వైపరీత్యం సంభవించినా కానీ అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ కారుకు డ్యామేజ్ అయినా కానీ మీరు జేబు నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుంది: పైన పేర్కొన్న విధంగా మీ వాహనానికి ఇన్సూరెన్స్ ను కలిగి ఉండడం తప్పనిసరి. ఇన్సూరెన్స్ లేకుండా కార్ డ్రైవ్ చేయడం చట్టవిరుద్ధం. మీరు కార్ ఇన్సూరెన్స్ ను తీసుకోవడంలో విఫలం అయితే మీరు తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ప్రస్తుతం మీరు రూ. 2,000 జరిమానా పడుతుంది. అంతే కాకుండా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. మీకు థ్రిల్స్ ఇష్టం అయినా కానీ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా.

థర్డ్ పార్టీ బాధ్యతలను కవర్ చేస్తుంది: అనుకోని సందర్భాల్లో ప్రమాదాలు జరిగినపుడు కొన్ని కార్ ఇన్సూరెన్స్ పాలసీలు కొంత వరకు మాత్రమే నష్టాలను కవర్ చేస్తాయి. కొన్ని సార్లు నష్టాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. మీ ఆర్థిక స్థోమతకు మించిన నష్టాలు సంభవిస్తాయి. అటువంటి సమయంలో ఇన్సూరెన్స్ మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. థర్డ్ పార్టీ వ్యక్తులకు చెల్లించాల్సిన అన్ని ఆర్థిక విషయాల గురించి ఇది బాధ్యత తీసుకుంటుంది.

కాంప్రహెన్సివ్ కవర్ ద్వారా అదనపు రక్షణ: ​ఈ విధమైన కవర్ ఎల్లప్పుడూ ఉత్తమమైనది. ఇది కేవలం థర్డ్ పార్టీ వ్యక్తులకు మాత్రమే కాకుండా, మీకు మీ ఎర్టిగా కారుకు ఒక గొడుగులా నిలుస్తుంది. కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే ఇది మీకు సంభవించే నష్టాలతో పాటు థర్డ్ పార్టీ బాధ్యతలను కూడా నెరవేరుస్తుంది. మీరు మార్కెట్లో లభ్యమయ్యే మల్టీపుల్ యాడ్ ఆన్స్ తో మీ అవసరాలకు తగిన విధంగా దీనిని రూపొందించుకోవచ్చు. మీ ఆర్థిక స్థోమతకు సరిపోయే విధంగా పాలసీని మార్చుకోండి. ఈ పాలసీ దాని పేరుకు తగ్గట్లుగానే కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ ను అందిస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా గురించి మరింత తెలుసుకోండి

ఫ్యాక్టరీలో అమర్చిన సీఎన్‌జీతో లభించే ఏకైక MPV (మల్టీ పర్పస్ వెహికిల్) పవర్‌ఫుల్ లుక్, బోల్డ్‌గా ఉండే ఎర్టిగా వినియోగదారుల మనసుల్ని దోచుకుంది. అంతే కాకుండా నెం.1 MPV (మల్టీ పర్పస్ వెహికిల్)గా నిలిచింది. CNG ఇంజిన్ తో పని చేసే ఎర్టిగాలో ఫ్యూయల్ ఎకానమీ, అధునాతన టెక్నాలజీ ఉన్నాయి. ఇవి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇది అన్ని వర్గాల వినియోగదారుల మనసులను గెలుచుకుంది. 2019 ఆటోకార్ అవార్డ్స్ లో మారుతి సుజుకి ఎర్టిగా ‘కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంది.

మీరు ఎందుకు మారుతి సుజుకి ఎర్టిగా కొనుగోలు చేయాలి?

నెక్ట్స్ జెనరేషన్ ఎర్టిగా మూడు ఇంజిన్ ఆప్షన్ లతో వస్తుంది: ద ఆల్ న్యూ DDis 225, K15 స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ మరియు కొత్తగా ఫిట్ చేయబడిన ఫ్యాక్టరీ ఫిట్టెడ్ S-CNG ఇంజిన్ తో ఉంటాయి. కేవలం ఇది మాత్రమే కాదు.. ఈ కారులో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, థర్డ్ రో రిక్లైనర్ సీట్స్, స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్, మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, 3డీ టెయిల్ ల్యాంప్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. ఎర్టిగా 4 వేరియంట్లలో మీకు లభిస్తుంది: L, V, Z మరియు Z+.ఈ 4 వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనేది కేవలం V మరియు Z వేరియంట్స్ లోని పెట్రోల్ ఇంజిన్ లోనే అందుబాటులో ఉంటుంది.

మీ భద్రత కోసం ఎర్టిగాలో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, బజ్జర్ తో కూడిన సీట్ బెల్ట్ రిమైండర్ ల్యాంప్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మొదలైనవి ఉంటాయి.

దీని భద్రత, డిజైన్, స్టైల్, స్పేస్, పర్ఫామెన్స్ అనేవి వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఇది ఎక్కువగా ఉండే ఇంటీరియర్ స్పేస్‌తో డిజైన్ చేయబడింది. అంతే కాకుండా ఇందులో వెల్ పర్ఫామింగ్ ఇంజిన్ ఉంటుంది.

ఎర్టిగా అనేది పట్టణాల్లో నివసించే కుటుంబాల కోసం తయారు చేయబడింది. ఎవరైతే మల్టీపర్పస్ వెహికిల్ కొనుగోలు చేద్దామని చూస్తున్నారో మారుతి సుజుకి ఎర్టిగా ద్వారా వారిని కంపెనీ సాటిస్ఫై చేసింది.

తనిఖీమారుతి కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.

వివిధ వేరియంట్ల ధరల వివరాలు

వేరియంట్స్ పేరు వేరియంట్ ధర (న్యూఢిల్లీలో నగరాన్ని బట్టి ధర మారుతూ ఉంటుంది)
LXI ₹ 7.96 లక్షలు
VXI ₹ 8.76 లక్షలు
ZXI ₹ 9.49 లక్షలు
CNG VXI ₹ 9.66 లక్షలు
VXI AT ₹ 9.96 లక్షలు
ZXI Plus ₹ 9.98 లక్షలు
ZXI AT ₹ 10.69 లక్షలు

[1]

తరచూ అడిగే ప్రశ్నలు

మారుతి సుజుకి ఎర్టిగా కార్ ఇన్సూరెన్స్ లోని కన్జూమబుల్ యాడ్ ఆన్ కవర్ కింద ఏం కవర్ అవుతాయి?

డిజిట్ అందించే కన్జూమబుల్స్ కవర్ కింద లూబ్రికెంట్స్, ఆయిల్స్, నట్స్, బోల్ట్స్, స్క్రూలు, వాషర్స్, గ్రీసు వంటివి ఉంటాయి.

డిజిట్ అందించే థర్డ్ పార్టీ ప్లాన్ నా పర్సనల్ నష్టాలకు పరిహారం అందిస్తుందా?

మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ ఎంచుకున్నట్లయితే డిజిట్ కార్ ఇన్సూరెన్స్ కింద దర్డ్ పార్టీ ప్లాన్ ప్రమాదంలో మీకు అయిన పర్సనల్ లాసెస్ కు నష్టపరిహారం చెల్లిస్తుంది.