జీప్ కార్ ఇన్సూరెన్స్

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

జీప్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనండి లేదా రెన్యూవల్ చెయ్యండి

బహుళజాతి సంస్థ స్టెల్లాంటిస్ యాజమాన్యంలో, జీప్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో ఉద్భవించిన ఆటోమొబైల్ మోడల్. ప్రస్తుతం, దాని ఉత్పత్తి శ్రేణిలో స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు, క్రాస్ఓవర్ మరియు ఆఫ్-రోడ్ SUV లు ఉన్నాయి.

కంపెనీ 2016లో దాదాపు 1.4 మిలియన్ల SUVలను విక్రయించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి.

రాంగ్లర్ మరియు గ్రాండ్ చెరోకీ మోడళ్లను విడుదల చేయడం ద్వారా, జీప్ నేరుగా 2016లో భారతీయ కమ్యూటర్ మార్కెట్లోకి ప్రవేశించింది. దీనికి ముందు, జీప్ కార్లు 1960ల నుండి మహీంద్రా అండ్ మహీంద్రా లైసెన్స్‌తో ఉత్పత్తి చేయబడ్డాయి.

అలాగే, జీప్ కంపాస్ మరియు రాంగ్లర్ వంటి మోడల్‌లు భారతీయ కొనుగోలుదారులలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. డిమాండ్ కారణంగా, ఈ కంపెనీ 2021లో 11,000 యూనిట్లను విక్రయించింది.

జీప్ కార్ మోడల్‌ను కొనుగోలు చేసే ముందు, ప్రమాదం జరిగినప్పుడు దాని వల్ల కలిగే నష్టాలు మరియు డ్యామేజిల గురించి మీరు తెలుసుకోవాలి. వీటిని పరిగణనలోకి తీసుకొని, మీరు జీప్ కారు ఇన్సూరెన్స్ ను పొందాలి మరియు అటువంటి నష్టాలను రిపేర్ చేయడం వల్ల తలెత్తే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలి.

మీ జీప్ కారు కోసం సురక్షితమైన ఇన్సూరెన్స్ పాలసీ రెండు రకాలుగా అందుబాటులో ఉంది- థర్డ్-పార్టీ మరియు కాంప్రహెన్సివ్. మీరు జీప్ కార్ల కోసం ప్రాథమిక థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ను పరిగణించడం ద్వారా థర్డ్-పార్టీ ప్రమాదాల నుండి ఉత్పన్నమయ్యే బాధ్యతలను కవర్ చేయవచ్చు.

అదనంగా, మీరు ఆన్‌లైన్‌లో కాంప్రహెన్సివ్ జీప్ కారు ఇన్సూరెన్స్ ను కొనడం ద్వారా థర్డ్-పార్టీ మరియు సొంత కారు నష్టాలకు వ్యతిరేకంగా కవరేజ్ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం మీ జీప్ కారుకు కనీసం ప్రాథమిక ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ లేకుంటే, జరిగిన నష్టాన్ని పూరించేందుకు ఖర్చులను మీరు మీ జేబుల నుండి భరించాలి మరియు భారీ ట్రాఫిక్ జరిమానాలను కూడా చెల్లించాలి.

జీప్ కోసం కారు ఇన్సూరెన్స్‌ని ఎంచుకునే సమయంలో, మీరు అనేక ఇన్సూరెన్స్ సంస్థలను మరియు వారి సంబంధిత ప్లాన్‌లను పరిగణించవచ్చు. మీరు సరైన ఎంపికను చేయడానికి , మీరు ఆయా కంపెనీ పాలసీ ప్రీమియంలు మరియు ఇతర సేవా ప్రయోజనాలకు సంబంధించి ప్లాన్‌లను పోల్చడాన్ని పరిగణించాలి.

ఈ విషయంలో, మీరు డిజిట్ ఇన్సూరెన్స్ ను, దాని సహేతుకమైన జీప్ కార్ ఇన్సూరెన్స్ ధర, ఆన్‌లైన్ క్లయిమ్ విధానం, నో క్లయిమ్ ప్రయోజనాలు మరియు అంతులేని ఇతర ఫీచర్ ల కారణంగా పరిగణించవచ్చు. కాబట్టి, మీ జీప్ కార్ ఇన్సూరెన్స్ గురించి సమాచారం తీసుకునే ముందు, మీరు డిజిట్ ఆఫర్‌లను పరిగణించాలనుకోవచ్చు.

జీప్ కార్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడింది

ఏమి కవర్ చేయబడలేదు

మీ కారు ఇన్సూరెన్స్ పాలసీలో ఏవేవి కవర్ చేయబడవు అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం, తద్వారా మీరు క్లయిమ్ చేసినప్పుడు ఎలాంటి ఆశ్చర్యలకు తావు ఉండదు. అటువంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

థర్డ్-పార్టీ పాలసీ హోల్డర్‌కు స్వంత నష్టాలు

థర్డ్-పార్టీ లేదా లయబిలిటీ ఓన్లీ కార్ పాలసీ విషయంలో, సొంత వాహనానికి జరిగే నష్టాలు కవర్ చేయబడవు.

డ్రంక్ డ్రైవింగ్ లేదా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్

మీరు తాగి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినప్పుడు.

చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేయడం

మీరు లెర్నర్ లైసెన్స్ కలిగి ఉండి మరియు ముందు ప్రయాణీకుల సీటులో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్-హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు.

పర్యవసాన నష్టాలు

ప్రమాదం యొక్క ప్రత్యక్ష ఫలితం కాని ఏదైనా నష్టం (ఉదా. ప్రమాదం తర్వాత, దెబ్బతిన్న కారు తప్పుగా నడపబడినట్లయితే మరియు ఇంజిన్ దెబ్బతిన్నట్లయితే, అది కవర్ చేయబడదు)

సహాయక నిర్లక్ష్యం

ఏదైనా సహాయక నిర్లక్ష్యం (ఉదా. వరదలో కారును నడపడం వల్ల జరిగిన నష్టం, తయారీదారు డ్రైవింగ్ మాన్యువల్ ప్రకారం సిఫార్సు చేయబడదు) కవర్ చేయబడదు)

యాడ్-ఆన్‌లు కొనుగోలు చేయబడనప్పుడు

కొన్ని పరిస్థితులు యాడ్-ఆన్‌లలో మాత్రమే కవర్ చేయబడతాయి. మీరు ఆ యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయకుంటే, సంబంధిత పరిస్థితులు కవర్ చేయబడవు.

మీరు డిజిట్ జీప్ కార్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి?

జీప్ కోసం కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

థర్డ్-పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదం కారణంగా స్వంత కారుకు నష్టం/నష్టాలు

×

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు స్వంత కారుకు నష్టం/నష్టాలు

×

ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు స్వంత కారుకు నష్టం/నష్టాలు

×

థర్డ్-పార్టీ వాహనానికి నష్టం

×

థర్డ్-పార్టీ ఆస్తికి నష్టం

×

వ్యక్తిగత ప్రమాద కవర్

×

థర్డ్-పార్టీ వ్యక్తి యొక్క గాయాలు/మరణం

×

మీ కారు దొంగతనం

×

డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్

×

మీ IDV ని అనుకూలీకరించండి

×

అనుకూలీకరించిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి

క్లయిమ్ ను ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూవల్ చేసిన తర్వాత, మేము 3-దశల, సంపూర్ణమైన డిజిటల్ క్లయిమ్ ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!

స్టెప్ 1

1800-258-5956కు కాల్ చేయండి. ఫారమ్‌లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క నష్టాలను షూట్ చేయండి.

స్టెప్ 3

మీరు మా గ్యారేజీల నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్‌ ల మధ్య ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లయిమ్ లు ఎంత వేగంగా పరిష్కరించబడతాయి? మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా చేయడం సబబే! డిజిట్ క్లయిమ్ రిపోర్ట్ కార్డ్‌ని చదవండి

జీప్ గురించి మరింత తెలుసుకోండి

మీరు గొప్ప మరియు దృఢమైన కారును నడుపుతూ రోడ్లను రాజ్యం ఏలుతున్నప్పుడు అది మీకు మంచి అనుభూతిని కలిగించదా? ఖచ్చితంగా, మీరు దీని గురించి సిద్ధం అవుతారు. జీప్‌ని సొంతం చేసుకోవడం ఈ సాధనలో ఆనందం పొందడమే. వారు 1960ల నుండి మహీంద్రా మరియు మహీంద్రాతో కార్లను తయారు చేస్తున్నప్పటికీ, 2016 సంవత్సరంలో నేరుగా భారతదేశంలోకి ప్రవేశించారు. మరియు ఇది కంపెనీకి అత్యంత సంతోషకరమైన నిర్ణయంగా మారింది.

భారతదేశంలోని కొనుగోలుదారులు వేచి ఉండి బ్రాండ్‌ను హృదయపూర్వకంగా స్వాగతించారు. జీప్ మన దేశంలో కంపాస్, రాంగ్లర్, చెరోకీ మరియు కంపాస్ ట్రైల్‌హాక్ వంటి నాలుగు మోడళ్లను విడుదల చేసింది. బ్రాండ్ యొక్క చౌకైన మోడల్ (కంపాస్) రూ.14.99 లక్షలకు లభిస్తుంది. అత్యున్నత మోడల్ జీప్ గ్రాండ్ చెరోకీ గురించి చెప్పాలంటే, ఈ కారు రూ.1.14 కోట్లకు అందుబాటులో ఉంది. రెండు మోడల్స్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంధన రకాల్లో అందుబాటులో ఉన్నాయి.

కార్లు 2016 సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజాదరణ పొందాయి. మరియు విజయగాథకు జీవం పోస్తూ, జీప్ కంపాస్‌కి NDTV కార్ మరియు బైక్ ద్వారా ‘కార్ ఆఫ్ ది ఇయర్ 2017’ అవార్డు లభించింది. మరియు అదే సంవత్సరం న్యూస్ 18 టెక్ మరియు ఆటో ద్వారా ‘SUV ఆఫ్ ది ఇయర్ 2017’ని కూడా గెలుచుకుంది.

జీప్ యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు ఎక్కువ కాదు మరియు విడి భాగాలు కూడా సులభంగా అందుబాటులో ఉంటాయి. కానీ ఈ కార్లు ఖరీదైనవి కాబట్టి, మీరు కారు ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడాన్ని పరిగణించాలి. ఇన్సూరెన్స్ చేయని కారును నడపడం చట్టరీత్యా నేరం కాబట్టి మీకు కారు ఇన్సూరెన్స్ ముఖ్యం.

భారతదేశంలో జీప్ కార్లను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణాలు?

  • కాంపాక్ట్ మరియు కఠినంగా ఉన్నా, విశాలమైనది: ఏ రైడ్ కోసం దీన్ని తీసుకెళ్లండి, అది కూడా సౌకర్యవంతంగా. ఈ కార్లు చిన్న, కఠినమైన SUVలు అయినందున వీటిని ఎక్కడికైనా తీసుకువెళ్లే అధికారం జీవ్ మీకు అందిస్తుంది. అయినా కూడా , మీ జీప్ విశాలమైనది కావడం వల్ల మీరు చాలా వస్తువులను నిల్వ చేయడంలో సహాయపడుతుంది. దీని ఫ్లోర్ స్పేస్ బాగుంటుంది.
  • గర్వించదగ్గ విషయం: జీప్‌ని సొంతం చేసుకోవడం గర్వించదగ్గ విషయం.
  • శక్తివంతమైనది: జీప్ అనేది 4X4 డ్రైవ్ కలిగిన శక్తివంతమైన SUV. ఈ మోడళ్లలో టర్బోచార్జ్డ్ ఇంజన్లు ఉన్నాయి, ఇవి హైవేలపైనే కాకుండా నగరాల్లో కూడా మీకు సాఫీగా ప్రయాణించేలా చేస్తాయి. జీప్ నుండి కార్లు విన్నూత్నంగా ఉంటాయి. కంపాస్ మరియు చెరోకీ వంటి మోడల్‌లు రెండు రకాల ఇంజిన్-పెట్రోల్ మరియు డీజిల్‌తో వస్తాయి.
  • సౌకర్యవంతమైనది: మీరు క్రూయిజ్ కంట్రోల్, 7-స్పీకర్ స్టీరియో, రెండు హుక్స్, పవర్ స్టీరింగ్ మరియు ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన అనేక ఆఫ్-రోడింగ్ ఫీచర్‌లతో జీప్‌ను పొందుతారు.
  • సురక్షితమైనది: జీప్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ సపోర్ట్ సిస్టమ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ట్రాక్షన్ కంట్రోల్‌ వంటి ఫీచర్లతో లభిస్తుంది. మీరు నాలుగు చక్రాలపై పానిక్ బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ మరియు డిస్క్ బ్రేక్‌లను కూడా పొందుతారు. జీప్ రివర్స్ పార్కింగ్ అసిస్ట్, చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌ను కూడా అందిస్తుంది.
  • డ్రైవ్ మోడ్‌లు: మీరు జీప్ లో ఆటో, స్నో, ఇసుక మరియు మడ్ వంటి డ్రైవ్ మోడ్‌లను పొందుతారు, ప్రతి ఒక్కటి సంబంధిత సందర్భాలలో డ్రైవింగ్ లోడ్‌ని తగ్గించడానికి ప్రోగ్రామ్ చేయబడింది.
  • స్టైల్ మరియు లుక్స్: జీప్ మీకు రోడ్డుపై అద్భుతమైన ఉనికిని అందించడంలో సహాయపడుతుంది. మీరు 7 గ్రిల్ ఫ్రంట్, షార్ప్ వీల్ ఆర్చ్‌లు మరియు బాగా-రౌండ్-ఆఫ్ రియర్‌లను పొందుతారు.

జీప్ కార్ ఇన్సూరెన్స్ కొనడం ఎందుకు ముఖ్యం?

  • స్వంత డ్యామేజ్ రిపేర్లు: డ్యామేజ్/నష్టం కారణంగా మీ కారుకు మరమ్మతులు అవసరమైనప్పుడు కారు ఇన్సూరెన్స్ పాలసీ మీకు చెల్లిస్తుంది. అగ్నిప్రమాదం, దొంగతనం, ప్రమాదం మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరగవచ్చు. జీప్ విషయంలో ఈ ఖర్చులు భారీగా ఉండవచ్చని గుర్తుంచుకోండి.
  • థర్డ్-పార్టీ చట్టపరమైన బాధ్యత: మీరు ఎవరినైనా బాధపెట్టినట్లయితే లేదా మూడవ వ్యక్తి యొక్క ఆస్తిని పాడు చేసినట్లయితే, అటువంటి నష్టాలకు మీరు చెల్లించవలసి ఉంటుంది. మీ కార్ ఇన్సూరెన్స్ అటువంటి నష్టాలకు చెల్లిస్తుంది.
  • చట్టపరమైన సమ్మతి: మోటారు వాహనాల చట్టం ప్రకారం, కార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా కారు నడపడానికి మీకు అనుమతి లేదు. ఒకవేళ మీరు అలా చేస్తే, మీరు రూ. 2000/- జరిమానా మరియు/లేదా 3 నెలల జైలు శిక్ష విధించబడతారు.
  • బేసిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని యాడ్-ఆన్‌లతో మెరుగుపరచండి : మీరు జీప్‌ను కలిగి ఉన్నప్పుడు, మీరు దానితో ప్రేమలో పడతారు మరియు మీరు మీ కారును ఏదైనా ప్రమాదం నుండి ఖచ్చితంగా రక్షించాలనుకుంటారు, కాబట్టి మీరు కొన్ని యాడ్-ఆన్ కవర్‌లను కొనుగోలు చేయవచ్చు. ప్రాథమిక కాంప్రహెన్సివ్ పాలసీ కింద కవర్ చేయని నష్టాల కోసం మీ కారును రక్షించడంలో ఇది మీకు సహాయం చేస్తుంది.

జీప్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు

  • వాహనం వయస్సు: కొత్త వాహనం కొంటూ ఉంటే, మీరు కారు ఇన్సూరెన్స్ ప్రీమియంపై మంచి తగ్గింపు పొందవచ్చు. కానీ పాత కారు కోసం, ప్రీమియం మరమ్మతుల ఖర్చు మరియు విడిభాగాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

  • ఇంజిన్ కెపాసిటీ: కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం యొక్క థర్డ్ పార్టీ కాంపోనెంట్ కారు ఇంజిన్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ CC ఉంటే, ఎక్కువ ప్రీమియం ఉంటుంది.
  • ఇన్సూరెన్స్ పాలసీ రకం: మీరు కాంప్రహెన్సివ్ ప్యాకేజీ పాలసీని కొనుగోలు చేస్తే, ప్రీమియం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది స్వంత నష్టం మరియు థర్డ్-పార్టీ బాధ్యత రెండింటినీ కవర్ చేస్తుంది. కానీ మీరు స్టాండ్-ఎలోన్ థర్డ్ పార్టీ పాలసీని ఎంచుకుంటే, ప్రీమియం తక్కువగా ఉంటుంది మరియు థర్డ్-పార్టీ కవరేజీలో ఒక భాగం మాత్రమే ఉంటుంది.
  • ఐడీవీ : మీరు ఇన్సూరెన్స్ ను కోరుకునే కారు యొక్క డిక్లేర్డ్ విలువ నేరుగా కారు ప్రీమియంపై ప్రభావం చూపుతుంది.
  • యాడ్-ఆన్ కవర్‌లు: యాడ్-ఆన్ కవర్‌లను కొనుగోలు చేయడం వలన అవి సెపరేట్ ప్రీమియంలతో వస్తాయి కాబట్టి ప్రీమియం పెరుగుతుంది.
  • కారు వయస్సు: తగ్గుతున్న ఐడీవీ మరియు పెరుగుతున్న డిప్రిషియేషన్ వేల్యూ కాలక్రమేణా మీ ప్రీమియం మొత్తం తగ్గడానికి దారితీయవచ్చు.
  • నో క్లయిమ్ బోనస్: క్లయిమ్ లేని సంవత్సరం అంటే మీరు కారును బాగా చూసుకున్నారని అర్థం. ఇది మీ విధేయతను ప్రతిబింబిస్తుంది మరియు దావా కోసం అడగడానికి ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవు అని స్పష్టం చేస్తుంది. అందువల్ల, ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ రెన్యూవల్ పై మీకు నో క్లయిమ్ బోనస్‌ను అందిస్తుంది.
  • ప్రదేశం: మీ స్థానం లేదా మీరు నివసిస్తున్న నగరం ప్రీమియంను నియంత్రిస్తుంది. మెట్రోపాలిటన్ నగరంలో వాహనాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రీమియం మరింత ఎక్కువగా ఉంటుంది.
  • భద్రతా పరికరాలు: మీ కారులో అలారాలు ఇన్‌స్టాల్ చేయబడి సెక్యూరిటీ ఎనేబుల్ చేయబడితే, మీరు తగ్గింపును అందుకుంటారు. ఇది ప్రీమియంను తగ్గిస్తుంది.
  • స్వచ్ఛంద డిడక్టబుల్స్: మీరు క్లయిమ్ మొత్తంలో కొంత మొత్తం చెల్లించడానికి అంగీకరించినప్పుడు, దానిని స్వచ్ఛంద మినహాయింపును ఎంచుకోవడం అంటారు. అధిక స్వచ్ఛంద మినహాయింపు ప్రీమియం తగ్గిస్తుంది. అలాగే తక్కువ మినహాయింపు ప్రీమియం ను పెంచుతుంది. 

జీప్ కార్ ఇన్సూరెన్స్ కొనడానికి డిజిట్ ను ఎందుకు ఎంచుకోవాలి?

  • సింపుల్ ఇన్సూరెన్స్‌ను అందిస్తుంది: మీ హడావిడి సమయాల్లో, ఇన్సూరెన్స్ ప్రక్రియను సులభతరం చేస్తామని డిజిట్ ఇన్సూరెన్స్ హామీ ఇస్తుంది. అందుబాటులో ఉన్న మొత్తం సమాచారంతో ఇన్సూరెన్స్ ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి వారు మిమ్మల్ని అనుమతిస్తారు. ఇన్సూరెన్స్ కొనుగోలు మాత్రమే కాకుండా, క్లయిమ్ ప్రక్రియ కూడా సులభం. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి మీ వైపు నుండే డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయవచ్చు.
  • ప్రీమియం రేటు: డిజిట్ ఇన్సూరెన్స్ అందించే ప్రీమియం రేట్లు పోటాపోటీగా ఉంటాయి. ఎలాంటి హిడెన్ కాస్ట్ లు ఉండవు.
  • ఇన్సూరెన్స్ కవర్ ఎంపిక: మీరు ఎంచుకోగల రెండు రకాల పాలసీలు ఉన్నాయి. ఒకటి కాంప్రహెన్సివ్ ప్యాకేజీ పాలసీ, ఇది మీ స్వంత నష్టం మరియు మూడవ పక్ష నష్టాలను కవర్ చేస్తుంది. మరొకటి స్వతంత్ర TP పాలసీ, మీరు ఇతరులకు శారీరక గాయం లేదా ఆస్తి నష్టాన్ని కలిగించినట్లయితే కలిగే ఏదైనా బాధ్యత కోసం చెల్లించబడుతుంది.
  • యాడ్-ఆన్ కవర్‌లను ఆఫర్ చేస్తుంది: ఇన్సూరెన్స్ కంపెనీ టైర్ ప్రొటెక్ట్ కవర్, జీరో డిప్రెసియేషన్ కవర్, బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ రక్షణ మరియు వినియోగ కవర్ వంటి యాడ్-ఆన్ కవర్‌లను అందిస్తుంది. జీప్ కోసం, అవసరమైనప్పుడు సహాయం కోసం మీరు బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ కవర్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ యాడ్-ఆన్‌తో, ఆఫ్-రోడ్ చేస్తున్నప్పుడు మీ జీప్ బ్రేక్‌డౌన్‌కు గురైతే మీరు ఇబ్బందిపడరు. మీరు మీ కారు మరియు దాని భాగాలపై ఛార్జ్ చేయబడిన తరుగుదలని నివారించడానికి జీరో డిప్రిసియేషన్ కవర్‌ను కూడా కొనుగోలు చేయడం వల్ల క్లయిమ్ సమయంలో మరమ్మతులు, భర్తీ ఖర్చుల పూర్తి విలువను పొందవచ్చు.
  • ఐడీవీ ని అనుకూలీకరించడానికి ఎంపికలు: డిజిట్ ఇన్సూరెన్స్ ఐడీవీని ఎంచుకోవడానికి మరియు తదనుగుణంగా ప్రీమియం చెల్లించడానికి మీకు అనుమతిస్తుంది. మెరుగైన రక్షణ కోసం మీరు అధిక ఐడీవీని ఎంచుకోవచ్చు.
  • గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్: నగదు రహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్ మీకు అవాంతరాలు లేని మరమ్మతులను అందిస్తుంది.
  • అధిక క్లయిమ్ -సెటిల్‌మెంట్ నిష్పత్తి: చాలా ఎక్కువ క్లయిమ్ సెటిల్‌మెంట్ రేషియోతో క్లయిమ్ సేవలను అందించడంలో డిజిట్ ఇన్సూరెన్స్ చాలా వేగంగా ఉంటుంది.

తరచుగా అడుగు ప్రశ్నలు

నేను జీప్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద టైర్ డ్యామేజ్ రిపేర్ కవర్ పొందవచ్చా?

లేదు, ప్రామాణిక ఇన్సూరెన్స్ పాలసీ టైర్ నష్టాలను కవర్ చేయదు. దీనికి వ్యతిరేకంగా కవరేజీని పొందడానికి, మీరు మీ పాలసీ ప్రీమియం కంటే ఎక్కువగా అదనపు ఛార్జీలను చెల్లించడం ద్వారా యాడ్-ఆన్ కవర్‌ని పొందాలి.

నేను థర్డ్-పార్టీ జీప్ కార్ ఇన్సూరెన్స్‌ని పొందినట్లయితే, నేను యాడ్-ఆన్ సదుపాయానికి అర్హులా?

లేదు, మీ ఇన్సూరెన్స్ ప్లాన్‌పై మరియు దాని పైన యాడ్-ఆన్ కవర్‌లను చేర్చడానికి, మీరు మీ జీప్ కారు కోసం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందాలి.

నా జీప్ కారు ఇన్సూరెన్స్ ను పునరుద్ధరించిన తర్వాత నేను నో క్లయిమ్ బోనస్‌లను పొందగలనా?

మీరు మీ పాలసీని గడువు ముగిసిన 90 రోజులలోపు పునరుద్ధరించినట్లయితే, మీరు నో క్లయిమ్ బోనస్‌లను పొందుతారు. ఒకవేళ మీరు ఈ కాలపరిధిని దాటితే, మీరు ప్రయోజనాన్ని కోల్పోతారు.