ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
ప్రీమియం ప్రారంభ ధర ₹225 మాత్రమే*

ఆలస్యమైన/పోయిన బ్యాగేజ్ కవర్ చేసే ట్రావెల్ ఇన్సూరెన్స్

'ప్రతి సంవత్సరం ఎయిర్‌లైన్స్ ద్వారా 25 మిలియన్ల బ్యాగేజ్ తప్పుదారి పట్టించబడుతున్నాయి' - BBC న్యూస్, 2019

ఆలస్యమైన బ్యాగేజ్ లేదా పోయిన బ్యాగేజ్ అంటే ఏమిటి?

ప్రత్యేకంగా, ఇది మీరు ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు మీ చెక్-ఇన్ బ్యాగేజ్ స్థితికి సంబంధించినది. చేరుకున్న తర్వాత, కన్వేయర్ బెల్ట్ మీద మీ బ్యాగ్‌లు కనిపించకుంటే, అది ఆలస్యం కావచ్చు (తర్వాత రావచ్చు) లేదా శాశ్వతంగా పోగొట్టుకొని ఉండొచ్చు (అస్సలు రాకపోవచ్చు!)

చెక్-ఇన్ బ్యాగేజ్ ఆలస్యం కావడానికి కారణం ఏమిటి?

మీ చెక్-ఇన్ బ్యాగేజ్ సమయానికి రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి:

  • పూర్తిగా నిండిన ఫ్లైట్: మీరు 100% కెపాసిటీ ఉన్న ఫ్లైట్ లో ప్రయాణం చేస్తుంటే మరియు ప్రయాణీకులందరూ చాలా బ్యాగేజ్ ని తీసుకెళ్తుంటే, నిజానికి అన్ని బ్యాగ్‌లను, ముఖ్యంగా చిన్న ఎయిర్‌పోర్ట్‌లలో అన్‌లోడ్ చేయడానికి చాలా సమయం పట్టవచ్చు. అరుదైన సందర్భాల్లో, బ్యాగ్‌లు ప్రారంభ నగరం వద్ద వదిలివేయబడతాయి, తర్వాత మరొక ఫ్లైట్ లో పంపబడతాయి
  • విపరీత వాతావరణం: మీరు మీ గమ్యస్థానంలో దిగినప్పుడు, తుఫానులు, భారీ వర్షం మరియు మెరుపులు వంటి తీవ్రమైన వాతావరణం ఉన్నట్లయితే, వాతావరణం క్లియర్ అయ్యే వరకు గ్రౌండ్ సిబ్బంది అంటే బ్యాగేజ్ హ్యాండ్లర్‌లను లోపలే ఉండమని ఆదేశాలు జారీ చెయ్యవచు. ఫలితంగా, బ్యాగేజ్ హ్యాండ్లర్లు ఉండరు, అంటే మీ బ్యాగ్‌లను ఎవరూ దించరు!

చెక్-ఇన్ బ్యాగేజ్ పోవడానికి కారణం ఏమిటి?

అలా జరగడానికి కొన్ని కారణాలు:

  • మానవ తప్పిదం: మీ బ్యాగేజ్ తప్పుడు సామాను కార్ట్‌లో లోడ్ చేయబడి ఉండవచ్చు లేదా చెక్-ఇన్ చేస్తున్నప్పుడు, అటెండెంట్ తప్పు గమ్యస్థాన విమానాశ్రయ కోడ్‌లో టైప్ చేస్తారు. ఎలాగైనా, మీ సూట్‌కేస్ తప్పు విమానంలో చెయ్యడం వల్ల, పూర్తిగా భిన్నమైన గమ్యస్థానానికి వెళ్లడం జరుగుతుంది!
  • రూటింగ్ లేబుల్ డ్యామేజ్: ప్రత్యేకించి కనెక్టింగ్ ఫ్లైట్‌లలో, మీ సూట్‌కేస్‌పై ట్యాగ్ తప్పుగా ప్రింట్ చేయబడి ఉంటే లేదా మధ్యలో చిరిగిపోయినట్లయితే, మీ సూట్‌కేస్ ఎప్పటికీ మీ ఫ్లైట్‌లోకి వెళ్లదు.

ఈ కేసులను కవర్ చేసే ఇన్సూరెన్స్ ప్లాన్ ఉందా?

మీరు బ్యాగేజ్ కన్వేయర్ బెల్ట్ వద్ద వేచి ఉన్నప్పుడు భారంగా అనిపించడం మీకు తెలుసు, మీ బాగ్ కనిపించకపోతే. ఆ బట్టలన్నీ, సన్‌స్క్రీన్, మరీ ముఖ్యంగా, ఆ ట్రిప్ క్యాష్ మొత్తం - జాడ లేకుండా పోయింది. అయితే, మీరు అంతా అయిపోయింది అని దిగులు పడాల్సిన అవసరం లేదు…

అదృష్టవశాత్తు, ఈ నిర్దిష్ట సందర్భాలలో మీ చెక్-ఇన్ బ్యాగేజ్ ని కవర్ చేసే ఇన్సూరెన్స్ (డిజిట్ వారి ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి) ఉన్నాయి:

  • చెక్-ఇన్ బ్యాగేజ్ ఆలస్యం
  • చెక్-ఇన్ బ్యాగేజ్ ని కోల్పోవడం

ఇలాంటి ఇన్సూరెన్స్ వల్ల ప్రయోజనం ఏమిటి?

బ్యాడ్ ట్రిప్ 1: “నా బ్యాగేజ్ ఆలస్యమైందని నాకు ఎయిర్‌లైన్ ఇప్పుడే చెప్పింది! నేను ఏ ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందగలను?"

మీ చెక్-ఇన్ బ్యాగేజ్ నిర్దిష్ట సమయం కంటే ఎక్కువ ఆలస్యం అయితే, మీ ప్లాన్‌లో పేర్కొన్న విధంగా మీరు ప్రయోజన మొత్తాన్ని పొందుతారు. ఆలస్యమైనప్పుడు మీకు సహాయం చేయడానికి అవసరమైన వస్తువులు/బట్టలను కొనుగోలు చేయడానికి డబ్బును ఉపయోగించండి.

డిజిట్ వారి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో భాగంగా బ్యాగేజ్ ఆలస్యంపై కవరేజీని కలిగి ఉంది, అంటే బ్యాగేజ్ ఆలస్యం అయినట్లయితే మీరు $100 వరకు పొందుతారు!

 

బ్యాడ్ ట్రిప్ 2: “ఎయిర్‌లైన్స్ నా బ్యాగేజ్ పోగొట్టింది…! నేను ఏ ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందగలను?"

మీ బ్యాగేజ్ నిజంగా పోయిందని ఎయిర్‌లైన్ మీకు తెలియజేస్తే, మీ ప్లాన్‌లో పేర్కొన్న విధంగా మీరు ప్రయోజనం మొత్తాన్ని పొందుతారు. బ్యాగేజ్ లో కొంత భాగాన్ని మాత్రమే పోగొట్టుకుంటే, మీరు దామాషా ప్రకారం మొత్తం పొందుతారు.

ఉదాహరణకు, మీ 3 చెక్-ఇన్ బ్యాగ్‌లలో 2 పోయినట్లయితే, మీరు మీ ఇన్సూరెన్స్ మొత్తంలో 2/3వ వంతు పొందుతారు. డిజిట్ వారి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ పాలసీలో భాగంగా బ్యాగేజ్ నష్టానికి వ్యతిరేకంగా కవరేజీని కలిగి ఉంది - ఉదాహరణకు, ఇది జరిగితే మేము $500 వరకు చెల్లిస్తాము.

 

బ్యాడ్ ట్రిప్ 3: “నా బ్యాగ్‌లో ఒక వస్తువు కనిపించకుండా పోయిందని నేను గమనించాను. నేను దాని కోసం ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందగలనా?

దురదృష్టవశాత్తూ, పాక్షిక నష్టంగా వర్గీకరించబడినందున దానికి పరిహారం లేదు. మీ బెనిఫిట్ మొత్తం పొందేందుకు, మొత్తం బ్యాగేజ్ పోగొట్టుకుని ఉండాలి.

సరే, నా చెక్-ఇన్ బ్యాగేజ్ ఆలస్యమైతే లేదా పోయినట్లయితే నేను ఏమి చేయాలి?

  • స్టెప్ 1: భయాందోళన చెందకండి!
  • స్టెప్ 2: వెంటనే మీ ఎయిర్‌లైన్‌కు నివేదించండి - ప్రతి విమానాశ్రయంలో ఫిర్యాదుల కౌంటర్ లేదా ఎయిర్‌లైన్ కార్యాలయం ఉంటుంది. అక్కడికి వెళ్లి మీ సామాను ఇంకా రాలేదని చెప్పండి. మీరు మీ బ్యాగేజ్ కోసం వేచి ఉన్నప్పుడు అవసరమైన వస్తువులను భర్తీ చేయడానికి తగిన పరిహారం కోసం వారిని అడగాలనుకోవచ్చు.
  • స్టెప్ 3: రాతపూర్వక నివేదికను పొందండి - ఆలస్యాన్ని నిర్ధారిస్తూ మరియు వారు మీకు అందించే ఏదైనా పరిహారాన్ని ఎయిర్‌లైన్ నుండి ప్రాపర్టీ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్ (‘PIR’) పొందండి
  • స్టెప్ 4: మీ ఇన్సూరెన్స్ కంపెనీతో క్లయిమ్ ఫైల్ చేయండి

డిజిట్ తో క్లయిమ్ ఎలా దాఖలు చేయాలి?

మీ బ్యాగేజ్ ఆలస్యమైనా లేదా పోగొట్టుకున్నా, మీరు చేయాల్సిందల్లా:

  • మా టోల్‌ఫ్రీ నంబర్‌కి +91-7303470000 (ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా) మిస్డ్ కాల్‌ని పంపండి మరియు మేము మీకు 10 నిమిషాలలో తిరిగి కాల్ చేస్తాము.
  • మేము మీ మొబైల్ నంబర్‌కు లింక్‌ను పంపుతాము, ఇక్కడ మీరు నిర్దిష్ట పత్రాలు మరియు మీ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌లోడ్ చేయవచ్చు.
  • అంతే! మేము మీ ప్రయోజన మొత్తాన్ని మీ బ్యాంక్‌కి బదిలీ చేస్తాము మరియు మీరు విశ్రాంతి తీసుకోవచ్చు!

చివరగా, ట్రిప్‌ను కోల్పోవడం లేదా ఆలస్యమైన బ్యాగేజ్ ఒక ట్రిప్‌కు సాధ్యమయ్యే చెత్త ప్రారంభం అయితే, నొప్పిని తగ్గించడానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంటుంది. డిజిట్ వారి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి వాటిని కవర్ చేసే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని మీరే పొందండి.

డిజిట్ వారి ఇన్సూరెన్స్ కేవలం బ్యాగేజ్ నష్టం/ఆలస్యాన్ని మాత్రమే కాకుండా, ప్రమాదవశాత్తూ ఆసుపత్రిలో చేరడం, ఫ్లైట్ ఆలస్యం, పాస్‌ పోర్ట్ కోల్పోవడం మరియు మొదలైన ఇతర ప్రమాదాల సంబంధిత విషయాలన్నీ నిర్వహిస్తుంది!

హ్యాపీ ట్రావెలింగ్! 

మీ చెక్-ఇన్ బ్యాగేజీని ఆలస్యం లేదా నష్టం నుండి రక్షించుకోవడంలో ఆసక్తి ఉందా? డిజిట్ యొక్క ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి.