థాయిలాండ్ అనేది ఎంతో అందమైన ప్రదేశం. థాయి అనే పేరు వినగానే అందమైన బీచ్ లు, షాపింగ్, ఎంతో అందంగా ఉండే అరణ్యాలు, నోరూరించే థాయ్ ఫుడ్ గురించి మీకు ఆలోచనలు వచ్చే ఉంటాయి. అవును మీరు సరిగ్గానే ఆలోచించారు. మీరు ఇక్కడ ఉండేందుకు ఈ ప్రదేశం అన్ని రకాల సౌకర్యాలను కలిగి ఉంటుంది. అయితే నిజం చెప్పాలంటే - మనం సరిగ్గా ప్రణాళిక వేస్తే ఏ ట్రిప్ అయినా కూడా అద్భుతమైన అనుభవం ఇస్తుంది. దానికి మీరు వేయాల్సిన మొదటి అడుగు వెళ్లాలనుకునే ప్రదేశానికి వీసా పొందడం!
అవును. థాయిలాండ్ లో అడుగుపెట్టేందుకు భారతీయులకు వీసా కావాలి. మీరు ఎందుకోసం అక్కడికి వెళ్తున్నారనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. మీరు టూరిజం కోసం వెళ్తూ అక్కడ రెండు వారాల కంటే తక్కువగా సమయం ఉంటే.. మీకు ఆన్ అరైవల్ వీసా లభిస్తుంది.
అయితే మీరు రెండు వారాల కంటే ఎక్కువ అక్కడ ఉండేందుకు వెళ్తున్నా లేదా వ్యాపారం పని మీద కానీ కుటుంబ సభ్యులు స్నేహితులను కలిసేందుకు కానీ వెళ్తున్నా మీరు థాయిలాండ్ వీసా కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.
అవును. భారతీయులు పౌరుల కోసం థాయిలాండ్ లో వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉంది. కానీ వారు ఈ కింది అర్హతలను కలిగిఉంటే మాత్రమే అది ఇస్తారు:
కేవలం టూరిజం పర్పస్ మీద సందర్శించే వారికి మాత్రమే.
పాస్ పోర్ట్ పక్కాగా ఖచ్చితంగా ఉండాలి. కనీసం అది 30 రోజుల వ్యాలిడిటీతో ఉండాలి.
వెరిఫైడ్ హోటల్ లేదా అపార్ట్మెంట్ లేక మీకు థాయిలాండ్ లో చెల్లుబాటు అయ్యే చిరునామా అయినా ఉండాలి.
థాయిలాండ్ లోకి ప్రవేశించిన 15 రోజుల్లోపు తిరిగి రిటర్న్ అవుతామని చెప్పేందుకు వారి వద్ద రిటర్న్ టికెట్ ఉండాలి. ఓపెన్ టికెట్స్ అర్హత పొందవు.
మీరు థాయిలాండ్ లోకి ప్రవేశించినప్పుడు మీ ఫ్లైట్ టికెట్స్ చూపించమని మిమ్మల్ని అడుగుతారు. మీరు 15 రోజుల్లోపు థాయ్ లాండ్ నుంచి వస్తారని రుజువు చేసే రిటర్న్ ఫ్లైట్ టికెట్ కనుక మీ వద్ద లేకపోతే మీరు ప్రవేశానికి అనుమతించబడరు.
మీరు థాయిలాండ్ లో ఉండేందుకు ప్రతి వ్యక్తికి 10,000 THB మరియు కుటుంబానికి 20,000 THB ఉన్నాయని నిరూపించడం అవసరం.
ప్రవేశించిన తర్వాత 2,000 THB (రూ. 4,460) రుసుము చెల్లించాలి. ఇది ఎటువంటి నోటీసు లేకుండా మారే అవకాశం ఉంది. ఇది నగదు రూపంలో మరియు థాయ్ కరెన్సీ రూపంలో మాత్రమే చెల్లించాలి.
ఆన్ లైన్ అప్లికేషన్ - మీరు వీఎఫ్ఎస్ గ్లోబల్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించి థాయిలాండ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ వీసా అప్లికేషన్ ఫారానికి దరఖాస్తుదారుడి ప్రాథమిక వివరాలు మరియు పాస్ పోర్ట్ వివరాలు అవసరం. దరఖాస్తుదారులు ఆన్ లైన్ వీసా దరఖాస్తును ప్రారంభించేందుకు వీఎఫ్ఎస్ గ్లోబల్ అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శిస్తే సరిపోతుంది. - http://www.vfs-thailand.co.in/. అప్లికేషన్ సమర్పించే వారి లొకేషన్ ఆధారంగా వారికి దగ్గర్లో ఉన్న ఏదైనా థాయిలాండ్ వీసా అప్లికేషన్ సెంటర్ ను సందర్శించాలి. వాటి లిస్టు కింద ఇవ్వబడింది:
ద రాయల్ థాయ్ ఎంబసీ - న్యూ ఢిల్లీ
ద రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ - చెన్నై
ద రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ - కోల్కతా
ద రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ - ముంబైై
ఆఫ్ లైన్ అప్లికేషన్ – మీకు దగ్గర్లోని వీఎఫ్ఎస్ గ్లోబల్ థాయిలాండ్ వీసా అప్లికేషన్ సెంటర్ ను సంప్రదించడం ద్వారా ఆఫ్ లైన్ (కాగితం మీద) అప్లికేషన్ ను ఎంచుకునేందుకు రాయల్ థాయ్ ఎంబసీ మిమ్మల్ని అనుమతిస్తుంది. అవసరం అయిన పత్రాలతో పాటు సమర్పించాల్సిన అప్లికేషన్ ఫారం వీఎఫ్ఎస్ గ్లోబల్ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. భారతదేశంలోని వీఎఫ్ఎస్ గ్లోబల్ థాయిలాండ్ వీసా అప్లికేషన్ సెంటర్ల చిరునామా మరియు ఫోన్ నెంబర్స్ కింద ఇవ్వబడ్డాయి:
పాస్ పోర్ట్ రిట్రీవల్ (మంజూరు చేసే) సమయాలు: ఉదయం 8 నుంచి 10 - మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు (సోమవారం - శుక్రవారం).
మీరు కనుక థాయిలాండ్ టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే కింద పేర్కొన్న పత్రాలు తీసుకెళ్లడం మర్చిపోవద్దు:
పాస్ పోర్ట్ లేదా ట్రావెల్ డాక్యుమెంట్ వ్యాలిడిటీ 6 నెలలకు తగ్గకుండా
థాయిలాండ్ వీసా అప్లికేషన్ ఫారం సక్రమంగా నింపండి
దరఖాస్తుదారు రీసెంట్ ఫొటోగ్రాప్ 45mm X 35mm సైజ్
రౌండ్ ట్రిప్ ఎయిర్ టికెట్ లేదా e-టికెట్ (పూర్తిగా చెల్లించబడినది)
వసతి కోసం హోటల్ బుకింగ్ రుజువు లేదా లోకల్ అడ్రస్ ప్రూఫ్.
ఇన్విటేషన్ లెటర్ (బంధువులు లేదా స్నేహితులను చూసేందుకు వెళ్తుంటే సంబంధం గురించి తెలిపే ధృవీకరణ)
ఆర్థిక మార్గాల రుజువు (ఒక వ్యక్తికి 10,000 బాత్స్ / కుటుంబానికి 20,000 బాత్స్)
థాయిలాండ్ వీసా కోసం ప్రాసెసింగ్ సమయం సుమారు 7 రోజులు.
మీరు ఇప్పుడు ఈ-వీసా ఆన్ అరైవల్ ను కూడా పొందొచ్చు. ఇది 14 ఫిబ్రవరి 2019 నుంచి అమల్లోకి వచ్చిన ఈ-వీసా సేవ. దేశంలో టూరిజం కు ఊతమిచ్చేందుకు థాయ్ ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. కొంచెం అదనపు రుసుముతో మీరు ఈ సేవను పొందొచ్చు. ఈ సేవను పొందేందుకు మీరు VFS ద్వారా అప్లికేషన్ సమర్పించాలి. అవసరం అయిన పత్రాలు సమర్పించాలి. VOA మీకు 72 గంటల్లో మెయిల్ చేయబడుతుంది.
ఫీజు |
వీసా కేటగిరీ |
వీసా వ్యాలిడిటీ మరియు స్టే |
రూ. 4,600 |
వీసా ఆన్ అరైవల్ |
15 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది |
రూ. 1,900 |
ట్రాన్సిట్ వీసా |
వీసా చెల్లుబాటు 3 నెలలు ఉంటుంది | 30 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఇస్తారు |
రూ. 2,500 |
టూరిస్ట్ వీసా (సింగిల్ ఎంట్రీ) |
వీసా చెల్లుబాటు 3 నెలలు | 60 రోజులకు మించకుండా అనుమతి ఉంటుంది. |
రూ. 12,000 |
టూరిస్ట్ వీసా (మల్టీపుల్ ఎంట్రీ) |
వీసా 6 నెలల వ్యాలిడిటీతో వస్తుంది | 60 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది. (ప్రతి సారి). |
రూ. 5,000 |
నాన్ ఇమ్మిగ్రంట్ వీసా (సింగిల్ ఎంట్రీ) |
వీసా 3 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది | 90 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది. |
రూ. 12,000 |
నాన్ ఇమ్మిగ్రంట్ వీసా (మల్టీపుల్ ఎంట్రీ) |
వీసా 6 నెలలు లేదా 1 సంవత్సరానికి చెల్లుబాటు అవుతుంది | 90 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది (ప్రతి సారి) |
రూ. 24,000 |
మూడు సంవత్సరాల నాన్ ఇమ్మిగ్రంట్ వీసా ' B' (మల్టీపుల్ ఎంట్రీ) |
3 సంవత్సరాల కాలానికి వీసా చెల్లుబాటవుతుంది | 90 రోజులకు మించకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది (ప్రతి సారి) |
థాయ్ ట్రావెల్ చేయడం కోసం వీసా ఎలా పొందాలనే విషయంలో మీకు పూర్తి అవగాహన వచ్చింది కదూ. ఇక మేము అత్యంత ముఖ్యమైన ‘ట్రావెల్ ఇన్సూరెన్స్ ’ గురించి చెబుతాం. మీలో చాలా మంది ఈ అంశాన్ని మీ ట్రావెల్ చెక్ లిస్ట్ (జాబితా) లో ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించరు. కానీ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా కావాలి. మమ్మల్ని నమ్మండి. బ్యాంకాక్ అనేది ప్రపంచంలోని మొదటి పది స్కామ్ అయ్యే సిటీస్ లో ఒకటి. అందుకే ఎప్పుడైనా ఏదైనా సంభవించొచ్చు!
ఊహించని పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించునేందుకు థాయిలాండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండాలి:
భారీగా ఉండే విదేశీ వైద్య బిల్లులు
మీ సామగ్రికి రక్షణ
ఎమర్జెన్సీ మెడికల్ పరిస్థితుల్లో భద్రత
ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మేము మీకు అందించే కింది ప్రయోజనాలు చూడండి:
మీరు ఎలా ట్రావెల్ చేస్తున్నారో తెలుసుకునే కవర్ - మా కవరేజ్ లో స్కూబా డైబింగ్, బంగీ జంపింగ్ & స్కై డైవింగ్ వంటివి కూడా ఉన్నాయి (వ్యవధి ఒక్కరోజు మాత్రమే ఉంటే)
స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ క్లయిమ్ ప్రక్రియ - స్మార్ట్ ఫోన్ సహాయంతో జరిగే క్లయిమ్ ప్రాసెస్ లో ప్రతీదీ స్మార్ట్ గా ఉంటుంది. ఎటువంటి పేపర్ వర్క్ లేదు. మీరు గాబరాగా పరుగెత్తాల్సిన అవసరం లేదు. మీరు క్లయిమ్ చేయాలని అనుకుంటే కేవలం పత్రాలు అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
మరింత తెలుసుకోండి:
మీరు ఫారిన్ కంట్రీలలో అడుగు పెడుతున్నపుడు ఇది మీకు అదనపు రక్షణను అందిస్తుంది. నిజమే కదూ? ఎంతో ప్రిపేర్ అయి ట్రావెల్ చేసే ప్రయాణికుడు కూడా ఇటువంటి సంఘటనలను ఊహించలేడు. సరైన ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా ప్రయాణం చేసి రిస్క్ తీసుకోకండి - ఇది అంత మంచిది కాదు. హ్యాపీ ట్రావెలింగ్!