హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీ అంటే ఏమిటి?
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీ అనగా ప్రస్తుతం ఒక కంపెనీ వద్ద ఉన్న మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మరో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి బదిలీ చేసుకోవడం. ఈ పోర్టబులిటీని మన ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు. ఇది అచ్చంగా మొబైల్ నంబర్ పోర్టబులిటీలాగానే పని చేస్తుంది.
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీలో మన వెయిటింగ్ పీరియడ్ అనేది కోల్పోకుండా అలాగే ఉంటుంది. అలాగే నో క్లెయిమ్ బోనస్ అనేది పాత కంపెనీ నుంచి కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి బదిలీ అవుతుంది. బయట కంపెనీలో ఉన్న బెటర్ ప్లాన్స్ కు మన పాలసీని మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేగాక, మీరు కొత్తగా వెయిటింగ్ పీరియడ్ ను ప్రారంభించడం, అప్పటివరకు ఉన్న క్యుములేటివ్ బోనస్ ను కోల్పోవడం వంటివేమీ ఉండవు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను డిజిట్ కే ఎందుకు పోర్ట్ చేసుకోవాలి?
నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని డిజిట్ కు పోర్ట్ చేసుకునేందుకు ఏం చేయాల్సి ఉంటుంది?
- Step 1: డిజిట్ హెల్త్ కు పోర్ట్ అవుతాం అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- Step 2: మీ పేరు, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- Step 3: ఇక అంతే మిగతాది మాకు వదిలేయండి. 48 గంటల్లో మా హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి వివరాలు నమోదు చేసుకుంటారు. మీరు మీ పాలసీని పోర్ట్ చేసుకునేందుకు హెల్ప్ చేస్తారు.
నా హెల్త్ ఇన్సూరెన్స్‌ను డిజిట్ కు పోర్ట్ చేసుకునేందుకు ఏ డాక్యుమెంట్స్ కావాలి?
- మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క షెడ్యూల్ అవసరమవుతుంది. దీనిని మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడర్ అందజేస్తారు.
- మీ ఐడెంటిటీ ప్రూఫ్.
- మిగతా వివరాలైన మెడికల్ డీటెయిల్స్, క్లెయిమ్ హిస్టరీని మీకు కాల్ చేసి కలెక్ట్ చేసుకుంటారు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం పోర్ట్ చేయొచ్చు?
ప్రస్తుతం ఉన్న అందరు ఇన్సూర్డ్ మెంబర్లను.
ప్రస్తుత ఇన్సూర్డ్ అమౌంట్ ను.
మీ క్యుములేటివ్ బోనస్.
మీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్.
మీ స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్.
మీ మెటర్నటీ బెనిఫిట్ వెయిటింగ్ పీరియడ్ (మీరు ఎంచుకున్నట్లయితే)
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసుకునేందుకు మీకు ఉన్న హక్కులు
IRDA నియమాల ప్రకారం ప్రతి పాలసీ హోల్డర్‌కు తన ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. (ఇండివిడ్యువల్ పాలసీలు, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు) జనరల్ లేదా స్పెషలైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే అవకాశం ఉంటుంది.
IRDA ఆదేశాల ప్రకారం, కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు పాలసీ హోల్డర్‌కు పాత కంపెనీ అందించిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందిస్తారు.
హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొత్త కంపెనీకి పోర్ట్ చేసినపుడు మీ వెయిటింగ్ పీరియడ్, నో క్లెయిమ్ బోనస్ కూడా బదిలీ చేయబడుతుంది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విజయవంతంగా పోర్ట్ అయితే మీకు పాత ఇన్సూరెన్స్ కంపెనీ, కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ ఇద్దరి నుంచి సందేశాలు అందుతాయి. IRDA ఆదేశాల ప్రకారం ఇది తప్పనిసరి.
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ చేసుకునేందుకు IRDA విధించిన నియమాలు – మీకోసం సరళంగా
మీరు పోర్ట్ చేయాలని భావించినపుడు కేవలం ఒకేలాంటి పాలసీని మాత్రమే పోర్ట్ చేయగలుగుతారు. దీని ప్రకారం మీరు కవరేజ్ మొత్తాన్ని మార్చుకోలేరు. మీ పాలసీ టైప్, ప్లాన్ మార్చుకునేందుకు వీలుపడదు.
ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అయి ఉంటాయి. కాబట్టి మీరు మీ పాలసీని పోర్ట్ చేసేటపుడు ఈ విషయాన్ని చూసుకోవాలి. మీరు మీ పాత కంపెనీ ప్రకారమే పోర్ట్ కావాల్సి ఉంటుంది. డిజిట్ కూడా ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ.
మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయాలని భావించినపుడు పాలసీ రెన్యూవల్ సమయంలోనే పోర్ట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మీరు మీ పాలసీ పీరియడ్‌ను కోల్పోయినట్లయితే మీ పోర్టింగ్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి.
మీరు మీ హెల్త్ పాలసీని కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి పోర్ట్ చేస్తున్నపుడు పాత కంపెనీకి సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. మీ పాలసీ రెన్యూవల్ తేదీకి మరో 45 రోజుల సమయం ఉందనగా ఈ విషయాన్ని ఆ కంపెనీకి తెలియజేయండి.
మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేస్తున్నట్లు సదరు కంపెనీకి తెలియజేసిన తర్వాత మూడు రోజులలో వారు మీ అభ్యర్థనను అంగీకరిస్తారు.
IRDA ఆదేశాల ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసేందుకు ఎటువంటి ఫీజులు ఉండవు. (మీ పాత ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, మీరు పోర్ట్ కావాలని చూస్తున్న కొత్త కంపెనీ కానీ మీ నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయవు) ఈ సర్వీసు మీకు ఉచితంగా లభిస్తుంది.
ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అనేక అంశాలను బేరీజు వేసుకొని బెనిఫిట్లను నిర్ణయిస్తుంది. మీరు మీ హెల్త్ పాలసీని పోర్ట్ చేసినపుడు మీ పాత కంపెనీ వలె కొత్త కంపెనీలో కూడా ప్రీమియం రేట్లు ఉండాలని రూల్ ఏమి ఉండదు. మీరు సేమ్ పాలసీని తీసుకున్నా కూడా ప్రీమియం రేట్లలో తేడా ఉండవచ్చు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీ ప్రాసెస్‌లో ఉన్నపుడు మీకు అదనపు గ్రేస్ పీరియడ్ అందించబడుతుంది. మీ పాత పాలసీ యాక్టివ్ లో ఉన్న దాని ప్రకారం మీ ప్రీమియం రేటు నిర్ణయించబడుతుంది.
మీరు పోర్ట్ అయినపుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ రిక్వెస్ట్‌ను కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆమోదించాల్సి ఉంటుంది.
మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసినపుడు మీ వెయిటింగ్ పీరియడ్ ప్రభావితం కాదు. మీరు ఒక వేళ కొత్త కవరేజీని ఎంచుకుని ఆ కవరేజీలో వెయిటింగ్ పీరియడ్ అనేది ముందటి ప్లాన్ కంటే వేరుగా ఉన్నపుడు మాత్రమే మీ వెయిటింగ్ పీరియడ్ మారుతుంది. ఉదాహరణకు స్పెసిఫిక్ ఇల్నెస్ లేదా ప్రీ ఎగ్జిస్టింగ్ వ్యాధులకు మీకు ఉన్న వెయిటింగ్ పీరియడ్ మారదు. చాలామటుకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఇది ఒకే రకంగా ఉంటుంది. కానీ మీరు కొత్త కంపెనీలో మెటర్నిటీ కవర్ ఎంచుకుంటే మీరు మీ వెయిటింగ్ పీరియడ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎప్పుడు పోర్ట్ చేసుకోవాలంటే?
ప్రస్తుతం ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు సంతోషంగా లేనపుడు
మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ తీరుతో మీరు సంతోషంగా ఉండకపోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ అందించే సర్వీసులు, మీరు చెల్లించే ప్రీమియం చార్జీలు మీకు అంతగా నచ్చకపోవచ్చు. అటువంటి సమయంలో మీకు నచ్చిన పాలసీకి మీరు పోర్ట్ కావచ్చు.
మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయాలని భావించినపుడు, పాలసీ రెన్యూవల్ టైమ్‌కు 45 రోజుల ముందుగానే మీరు మీకు నచ్చే ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవాలి. అనంతరం మీ హెల్త్ పాలసీ పోర్టింగ్ రిక్వెస్ట్ ప్లేస్ చేయాలి.
ప్రస్తుతం ఉన్న వాటి కంటే మంచి ప్లాన్స్ బయట లభించినపుడు
మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బాగానే ఉన్నపటికీ, బయట మీకు ఎక్కువ బెనిఫిట్లు లభించినపుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేసుకోవడం ఉత్తమం.
ఉదాహరణకు: మీరు మీ తల్లిదండ్రుల కోసం AYUSH బెనిఫిట్, మెటర్నిటీ కవర్ కోసం చూస్తున్నపుడు మీ ప్రస్తుత పాలసీ వాటిని కవర్ చేయకుంటే బయట లభించే పాలసీలకు మీరు పోర్ట్ కావచ్చు.
ఇటువంటి సందర్భంలో మీరు కనీసం మూడు ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలనైనా చెక్ చేయాలి. అనంతరం మీ పాలసీని పోర్ట్ చేసుకోవాలి.
మీ ప్రస్తుత పాలసీ గడువు ముగిసేందుకు 45 రోజుల ముందు మీరు పోర్టబులిటీ ప్రక్రియను ప్రారంభించడండి. ఇలా చేయడం వలన గడువు ముగియక ముందే మీ పాలసీ పోర్టింగ్ పూర్తవుతుంది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను డిజిటల్లోకి మార్చుకుందామని భావించినపుడు...
మీకు అనేక సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే ఆ కంపెనీ మీకు డిజిటల్ సౌకర్యం కల్పించకపోవచ్చు. పాలసీ ప్రక్రియ కాంటాక్ట్ లెస్‌గా ఉండకపోవచ్చు. పాలసీ రెన్యూవల్ చేయాలన్నా మరేం చేయాలన్నా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇటువంటి సందర్భంలో మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వలన మీరు భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలనూ ఎదుర్కోరు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేసే ముందు ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి
1. ప్రస్తుత పాలసీ గడువు ముగిసే తేదీ గురించి తెలుసుకోండి
ప్రతి విషయానికి సమయం అనేది చాలా ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయాలని మనం చూసినపుడు సమయం చాలా కీలకమవుతుంది. మనం పాలసీని పోర్ట్ చేసుకోవాలనుకున్నపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో ముఖ్యమైనది మన పాలసీ రెన్యూవల్ తేదీ ఎప్పుడనే విషయం.
మీ పాలసీ గడువు ముగియడానికి కనీసం 45 రోజుల ముందు మీరు పోర్టింగ్ రిక్వెస్ట్‌ను ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాలసీ గడువు ముగిసిపోతే మీరు పోర్ట్ చేసుకోలేరు.
2. కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడర్ తో నిజాయతీగా ఉండండి. పోర్ట్ రిక్వెస్ట్ రిజెక్ట్ కాకుండా చూసుకోండి.
మీ కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడర్ తో నిజాయతీగా ఉండండి. మీ పోర్ట్ రిక్వెస్ట్ రిజెక్ట్ కాకుండా చూసుకోండి. వారితో కేవలం నిజాలు మాత్రమే చెప్పండి. క్లెయిమ్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ, తదితర విషయాల్లో నిజాలను చెప్పాలి. లేకపోతే మీ పోర్ట్ రిక్వెస్ట్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
3. ఒకే ప్లాన్ అయినా బెనిఫిట్స్ వేరుగా ఉండవచ్చు..
మీరు ఒకేరకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎంచుకున్నప్పటికీ కొత్త కంపెనీలో బెనిఫిట్స్ వేరేలా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన బెనిఫిట్స్ అందిస్తుంది.
ఉదాహరణకు రూమ్ రెంట్ చార్జీల విషయమే తీసుకుంటే ఒక్కో ఇన్సూరెన్స్ పాలసీలో రూమ్ రెంట్ చార్జీలు ఒక్కో రకంగా ఉంటాయి (ఒక్కోసారి రూమ్ రెంట్ పరిమితి ఉండకపోవచ్చు no room rent capping). కాబట్టి మీరు పాలసీని పోర్ట్ చేసేటపుడు ప్రతి విషయం గురించి, బెనిఫిట్స్ గురించి వివరంగా చదవాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టింగ్ వల్ల లాభాలు, ప్రతికూలతలు ఏంటి?
లాభాలు | ప్రతికూలతలు |
---|---|
మీ బెనిఫిట్లను అలాగే ఆనందించండి. మీరు మీ పాలసీని పోర్ట్ చేయడం వలన ఎటువంటి బెనిఫిట్లను కోల్పోరు. పోర్టింగ్ చేయడం వలన మీ వెయిటింగ్ పీరియడ్ ప్రభావితం కాదు. | రెన్యూవల్ సమయంలోనే పోర్ట్ చేసుకునేందుకు వీలుంటుంది. పోర్టింగ్ ఆప్షన్ చాలా బాగున్నప్పటికీ కేవలం రెన్యూవల్ సమయంలోనే మనం పోర్ట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయాలని భావిస్తే రెన్యూవల్ సమయానికి ముందుగానే మీరు పోర్ట్ కావాలనుకుంటున్న కంపెనీ గురించి ఎంక్వైరీ చేయండి. ఇలా చేయడం వలన మీకు ఎక్కువ సమయం ఉంటుంది. |
మీ నో క్లెయిమ్ బోనస్ (NCB) అలాగే ఉంటుంది. – పాలసీదారులెవరూ తమ నో క్లెయిమ్ బోనస్ ను వదులుకునేందుకు ఇష్టపడరు. పోర్టింగ్ వలన కలిగే ప్రయోజనాల్లో ఇదొకటి. మీ నో క్లెయిమ్ బోనస్ అనేది కొత్త పాలసీకి జోడించబడుతుంది. | మీ ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని మార్పులు మాత్రమే ఉంటాయి. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని బెటర్ ప్లాన్ కు పోర్ట్ చేసినప్పటికీ ఎక్కువగా మార్పులు చేయలేరు. ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు, నిబంధనలు కొత్త కంపెనీ ప్రకారం మారుతాయి. |
ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకోవడం వలన మీ వెయిటింగ్ పీరియడ్ ఏ మాత్రం ప్రభావితం కాదు. మీరు పోర్ట్ చేసిన తర్వాత కూడా బెనిఫిట్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. మీరు పాత ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంత సమయం ఉన్నారనే విషయం మీద వెయిటింగ్ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. | మీరు మీ పాలసీని పోర్ట్ చేసినపుడు అధిక కవరేజీ కావాలంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి రావొచ్చు. ఇది మీ మునుపటి ఇన్సూరెన్స్ కంపెనీ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి ప్రీమియం ధరలు ఉంటాయి. |
భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీ గురించ తరచూ అడిగే ప్రశ్నలు
పాలసీ హోల్డర్ పోర్టబులిటీ కోసం ఎప్పుడు అప్లై చేయాలి?
హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌కు 60 రోజుల ముందుగానే మీరు పోర్టబులిటీకి అప్లై చేసుకోవాలి.
నేను పాలసీని పోర్ట్ చేసినపుడు నా వెయిటింగ్ పీరియడ్ ప్రభావితం అవుతుందా?
లేదు. ఆ బెనిఫిట్ అలాగే కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి బదిలీ అవుతుంది. మీ వెయిటింగ్ పీరియడ్ మారదు. ఉదాహరణకు.. మీ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ 4 సంవత్సరాలు అనుకుందాం. మీరు రెండో సంవత్సరంలో పాలసీని పోర్ట్ చేస్తే మీరు ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే వేచి ఉండాల్సి వస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసినపుడు నేను ఏమైనా నష్టపోవాల్సి వస్తుందా?
లేదు. అటువంటిదేం ఉండదు. మీరు పాలసీని ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్ చేసుకున్నపుడు ఏ విషయాల్లోనూ నష్టపోరు.
ఎప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసుకోవాలి?
మీకు ప్రస్తుతం ఉన్న పాలసీ కంటే బెటర్ ఆప్షన్స్ బయటి కంపెనీలో కనిపిస్తే మీరు మీ పాలసీని తదుపరి రెన్యువల్ సమయంలో పోర్ట్ చేసుకోవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసేటపుడు ఏ సమస్యలు ఎదురవుతాయి?
మీరు మీ పాలసీని పోర్ట్ చేసేటపుడు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య పోర్టింగ్ రిక్వెస్ట్ రిజెక్షన్. ప్రతి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తమ వద్దకు వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను రిజెక్ట్ కానీ అప్రూవ్ కానీ చేసేందుకు హక్కును కలిగి ఉంటుంది. వారు దీనిపై నిర్ణయం తీసుకునేటపుడు ప్రధానంగా తనిఖీ చేసే అంశాలు.. క్లెయిమ్ హిస్టరీ, మెడికల్ డీటెయిల్స్, పాలసీ హోల్డర్ల వయసు మొదలైనవి.
మీ పోర్టబులిటీ రిక్వెస్ట్ ను ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేయొచ్చా?
అవును. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ పోర్టబులిటీ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసే హక్కును కలిగి ఉంటుంది. చాలా సందర్భాల్లో జెన్యూన్ కస్టమర్ల పోర్టబులిటీ రిక్వెస్ట్‌లు మాత్రమే ఆమోదించబడతాయి.
నేను ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ చేసుకోవచ్చా?
లేదు. అలా చేసేందుకు వీలుపడదు. మీ ప్రస్తుత పాలసీ రెన్యూవల్ చేసే సమయం వచ్చినపుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీ పాలసీ గడువు ముగియడానికి కనీసం 45 రోజులు ముందుగా మీరు పోర్టింగ్ కోసం దరఖాస్తు చేయాలి.
నేను నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని టర్మ్ మధ్యలో పోర్ట్ చేయొచ్చా?
లేదు. అలా చేసేందుకు వీలుపడదు. మీ పాలసీ రెన్యూవల్‌కు వచ్చినపుడు మాత్రమే మీరు పోర్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీ పాలసీ గడువు ముగియడానికి కనీసం 45 రోజులు ముందుగా మీరు పోర్టింగ్ కోసం దరఖాస్తు చేయాలి.
నా హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీ రిక్వెస్ట్ రిజెక్ట్ అయినపుడు ఏం జరుగుతుంది? ఎందుకు?
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పోర్టబులిటీ రిక్వెస్ట్ రిజెక్ట్ అయితే అందుకు గల కారణాలను మీరు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోవచ్చు. వారు చెప్పిన విషయాలను ఒకసారి సరిచూసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీ రిక్వెస్ట్‌లు ఎక్కువగా రిజెక్ట్ అయ్యేందుకు ప్రధాన కారణం అసంపూర్ణమైన వివరాలు. పాలసీదారుడి మెడికల్ హిస్టరీ, క్లెయిమ్ హిస్టరీ, ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ వివరాలు సరిగ్గా సమర్పించకపోతే పాలసీ పోర్టబులిటీ రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేసే సమయంలో పాలసీ హోల్డర్ వయసు పరిగణించబడుతుందా?
అవును. వయసు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీ వయసును బట్టే పాలసీ ప్రీమియం రేట్లు నిర్ధారించబడతాయి.
పోర్టింగ్ కు బదులుగా నేను రెండు వేర్వేరు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి పాలసీలను పొందొచ్చా?
అవును. పొందొచ్చు. మీరు ఒకే విధమైన రెండు పాలసీలు తీసుకునే బదులు వేర్వేరుగా ఉన్న రెండు పాలసీలు తీసుకోవడం ఉత్తమం.
సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు పోర్ట్ చేస్తారు?
చాలామంది ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీతో విసిగిపోయినపుడు తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసుకునేందుకు చూస్తారు. అంతేకాకుండా వారికి వేరే కంపెనీలో బెటర్ ప్లాన్స్ కనిపించినా కానీ పోర్ట్ చేసుకుంటారు.
పోర్టింగ్‌కు బదులుగా నేను నా ప్రస్తుత పాలసీ ప్లాన్ మార్చుకోవచ్చా?
అవును, మీరు మార్చుకోవచ్చు.