హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీ
No Capping
on Room Rent
24/7
Customer Support
Zero
Co-payment
No Capping
on Room Rent
24/7
Customer Support
Zero
Co-payment
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీ అంటే ఏమిటి?
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీ అనగా ప్రస్తుతం ఒక కంపెనీ వద్ద ఉన్న మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మరో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి బదిలీ చేసుకోవడం. ఈ పోర్టబులిటీని మన ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు. ఇది అచ్చంగా మొబైల్ నంబర్ పోర్టబులిటీలాగానే పని చేస్తుంది.
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబులిటీలో మన వెయిటింగ్ పీరియడ్ అనేది కోల్పోకుండా అలాగే ఉంటుంది. అలాగే నో క్లెయిమ్ బోనస్ అనేది పాత కంపెనీ నుంచి కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి బదిలీ అవుతుంది. బయట కంపెనీలో ఉన్న బెటర్ ప్లాన్స్ కు మన పాలసీని మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేగాక, మీరు కొత్తగా వెయిటింగ్ పీరియడ్ ను ప్రారంభించడం, అప్పటివరకు ఉన్న క్యుములేటివ్ బోనస్ ను కోల్పోవడం వంటివేమీ ఉండవు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను డిజిట్ కే ఎందుకు పోర్ట్ చేసుకోవాలి?
నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని డిజిట్ కు పోర్ట్ చేసుకునేందుకు ఏం చేయాల్సి ఉంటుంది?
- Step 1: డిజిట్ హెల్త్ కు పోర్ట్ అవుతాం అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- Step 2: మీ పేరు, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- Step 3: ఇక అంతే మిగతాది మాకు వదిలేయండి. 48 గంటల్లో మా హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి వివరాలు నమోదు చేసుకుంటారు. మీరు మీ పాలసీని పోర్ట్ చేసుకునేందుకు హెల్ప్ చేస్తారు.
నా హెల్త్ ఇన్సూరెన్స్‌ను డిజిట్ కు పోర్ట్ చేసుకునేందుకు ఏ డాక్యుమెంట్స్ కావాలి?
- మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క షెడ్యూల్ అవసరమవుతుంది. దీనిని మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడర్ అందజేస్తారు.
- మీ ఐడెంటిటీ ప్రూఫ్.
- మిగతా వివరాలైన మెడికల్ డీటెయిల్స్, క్లెయిమ్ హిస్టరీని మీకు కాల్ చేసి కలెక్ట్ చేసుకుంటారు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం పోర్ట్ చేయొచ్చు?
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసుకునేందుకు మీకు ఉన్న హక్కులు
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ చేసుకునేందుకు IRDA విధించిన నియమాలు – మీకోసం సరళంగా
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎప్పుడు పోర్ట్ చేసుకోవాలంటే?
ప్రస్తుతం ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు సంతోషంగా లేనపుడు
మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ తీరుతో మీరు సంతోషంగా ఉండకపోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ అందించే సర్వీసులు, మీరు చెల్లించే ప్రీమియం చార్జీలు మీకు అంతగా నచ్చకపోవచ్చు. అటువంటి సమయంలో మీకు నచ్చిన పాలసీకి మీరు పోర్ట్ కావచ్చు.
మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయాలని భావించినపుడు, పాలసీ రెన్యూవల్ టైమ్‌కు 45 రోజుల ముందుగానే మీరు మీకు నచ్చే ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవాలి. అనంతరం మీ హెల్త్ పాలసీ పోర్టింగ్ రిక్వెస్ట్ ప్లేస్ చేయాలి.
ప్రస్తుతం ఉన్న వాటి కంటే మంచి ప్లాన్స్ బయట లభించినపుడు
మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బాగానే ఉన్నపటికీ, బయట మీకు ఎక్కువ బెనిఫిట్లు లభించినపుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేసుకోవడం ఉత్తమం.
ఉదాహరణకు: మీరు మీ తల్లిదండ్రుల కోసం AYUSH బెనిఫిట్, మెటర్నిటీ కవర్ కోసం చూస్తున్నపుడు మీ ప్రస్తుత పాలసీ వాటిని కవర్ చేయకుంటే బయట లభించే పాలసీలకు మీరు పోర్ట్ కావచ్చు.
ఇటువంటి సందర్భంలో మీరు కనీసం మూడు ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలనైనా చెక్ చేయాలి. అనంతరం మీ పాలసీని పోర్ట్ చేసుకోవాలి.
మీ ప్రస్తుత పాలసీ గడువు ముగిసేందుకు 45 రోజుల ముందు మీరు పోర్టబులిటీ ప్రక్రియను ప్రారంభించడండి. ఇలా చేయడం వలన గడువు ముగియక ముందే మీ పాలసీ పోర్టింగ్ పూర్తవుతుంది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను డిజిటల్లోకి మార్చుకుందామని భావించినపుడు...
మీకు అనేక సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే ఆ కంపెనీ మీకు డిజిటల్ సౌకర్యం కల్పించకపోవచ్చు. పాలసీ ప్రక్రియ కాంటాక్ట్ లెస్‌గా ఉండకపోవచ్చు. పాలసీ రెన్యూవల్ చేయాలన్నా మరేం చేయాలన్నా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇటువంటి సందర్భంలో మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వలన మీరు భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలనూ ఎదుర్కోరు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేసే ముందు ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి
1. ప్రస్తుత పాలసీ గడువు ముగిసే తేదీ గురించి తెలుసుకోండి
ప్రతి విషయానికి సమయం అనేది చాలా ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయాలని మనం చూసినపుడు సమయం చాలా కీలకమవుతుంది. మనం పాలసీని పోర్ట్ చేసుకోవాలనుకున్నపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో ముఖ్యమైనది మన పాలసీ రెన్యూవల్ తేదీ ఎప్పుడనే విషయం.
మీ పాలసీ గడువు ముగియడానికి కనీసం 45 రోజుల ముందు మీరు పోర్టింగ్ రిక్వెస్ట్‌ను ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాలసీ గడువు ముగిసిపోతే మీరు పోర్ట్ చేసుకోలేరు.
2. కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడర్ తో నిజాయతీగా ఉండండి. పోర్ట్ రిక్వెస్ట్ రిజెక్ట్ కాకుండా చూసుకోండి.
మీ కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడర్ తో నిజాయతీగా ఉండండి. మీ పోర్ట్ రిక్వెస్ట్ రిజెక్ట్ కాకుండా చూసుకోండి. వారితో కేవలం నిజాలు మాత్రమే చెప్పండి. క్లెయిమ్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ, తదితర విషయాల్లో నిజాలను చెప్పాలి. లేకపోతే మీ పోర్ట్ రిక్వెస్ట్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
3. ఒకే ప్లాన్ అయినా బెనిఫిట్స్ వేరుగా ఉండవచ్చు..
మీరు ఒకేరకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎంచుకున్నప్పటికీ కొత్త కంపెనీలో బెనిఫిట్స్ వేరేలా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన బెనిఫిట్స్ అందిస్తుంది.
ఉదాహరణకు రూమ్ రెంట్ చార్జీల విషయమే తీసుకుంటే ఒక్కో ఇన్సూరెన్స్ పాలసీలో రూమ్ రెంట్ చార్జీలు ఒక్కో రకంగా ఉంటాయి (ఒక్కోసారి రూమ్ రెంట్ పరిమితి ఉండకపోవచ్చు no room rent capping). కాబట్టి మీరు పాలసీని పోర్ట్ చేసేటపుడు ప్రతి విషయం గురించి, బెనిఫిట్స్ గురించి వివరంగా చదవాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టింగ్ వల్ల లాభాలు, ప్రతికూలతలు ఏంటి?
లాభాలు |
ప్రతికూలతలు |
మీ బెనిఫిట్లను అలాగే ఆనందించండి. మీరు మీ పాలసీని పోర్ట్ చేయడం వలన ఎటువంటి బెనిఫిట్లను కోల్పోరు. పోర్టింగ్ చేయడం వలన మీ వెయిటింగ్ పీరియడ్ ప్రభావితం కాదు. |
రెన్యూవల్ సమయంలోనే పోర్ట్ చేసుకునేందుకు వీలుంటుంది. పోర్టింగ్ ఆప్షన్ చాలా బాగున్నప్పటికీ కేవలం రెన్యూవల్ సమయంలోనే మనం పోర్ట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయాలని భావిస్తే రెన్యూవల్ సమయానికి ముందుగానే మీరు పోర్ట్ కావాలనుకుంటున్న కంపెనీ గురించి ఎంక్వైరీ చేయండి. ఇలా చేయడం వలన మీకు ఎక్కువ సమయం ఉంటుంది. |
మీ నో క్లెయిమ్ బోనస్ (NCB) అలాగే ఉంటుంది. – పాలసీదారులెవరూ తమ నో క్లెయిమ్ బోనస్ ను వదులుకునేందుకు ఇష్టపడరు. పోర్టింగ్ వలన కలిగే ప్రయోజనాల్లో ఇదొకటి. మీ నో క్లెయిమ్ బోనస్ అనేది కొత్త పాలసీకి జోడించబడుతుంది. |
మీ ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని మార్పులు మాత్రమే ఉంటాయి. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని బెటర్ ప్లాన్ కు పోర్ట్ చేసినప్పటికీ ఎక్కువగా మార్పులు చేయలేరు. ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు, నిబంధనలు కొత్త కంపెనీ ప్రకారం మారుతాయి. |
ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకోవడం వలన మీ వెయిటింగ్ పీరియడ్ ఏ మాత్రం ప్రభావితం కాదు. మీరు పోర్ట్ చేసిన తర్వాత కూడా బెనిఫిట్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. మీరు పాత ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంత సమయం ఉన్నారనే విషయం మీద వెయిటింగ్ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. |
మీరు మీ పాలసీని పోర్ట్ చేసినపుడు అధిక కవరేజీ కావాలంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి రావొచ్చు. ఇది మీ మునుపటి ఇన్సూరెన్స్ కంపెనీ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి ప్రీమియం ధరలు ఉంటాయి. |