హెల్త్ ఇన్సూరెన్స్‌లో నో రూమ్ రెంట్ క్యాపింగ్ అంటే మీరు చికిత్స తీసుకొనే సమయంలో మీకు కావలసిన ఏదైనా ఆస్పత్రి రూమ్‌ను ఎంచుకోవచ్చు. అంటే ఆ గదికి అద్దె పరిమితి ఇంతే ఉండాలన్న ఆంక్షలు లేవు.
మీరు చేసుకునే క్లెయిమ్ మీ బీమా మొత్తం కన్నా తక్కువగా ఉన్నంత వరకు చికిత్స కోసం లేదా ఐసీయూ (ICU) కోసం (అవసరమైతే) ఆస్పత్రిలోని ఏదైనా గదిని ఎంచుకోవచ్చు.
దీన్ని ఒక చిన్న సందర్భంతో అర్థం చేసుకుందాం.
ఏదైనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు ఏం జరుగుతుంది. సాధారణంగా ఆస్పత్రిలో చేరే సమయంలో అనేక రకాల ఆస్పత్రి గదులు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా చాలా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు మీ ఆస్పత్రి గది, ఐసీయూ (ICU) గదిని ఎంచుకునేందుకు దాని అద్దె ఎంత ఉండాలో ఓ పరిమితిని పెడతాయి.
ఉదాహరణకు: డబుల్ రూమ్, డీలక్స్ రూమ్, లగ్జరీ రూమ్ ఇలా ఒక్కో గదికి ఒక్కో రకమైన అద్దె ఉంటుంది.
హోటల్ గదుల్లాగే..! చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మీ పాలసీలో రూమ్ రెంట్ క్యాపింగ్ లేదా పరిమితిని విధిస్తాయి. చివరికి ఐసీయూ (ICU) గదుల విషయంలో కూడా ఇలాగే ఉంటాయి.
మరో ఉదాహరణతో సులువుగా అర్థం చేసుకుందాం పదండి. బెంగళూరు వంటి జోన్–బీ నగరంలో 4 రోజుల పాటు ఆస్పత్రిలో చేరారని అనుకోండి. మీకు రూ. 3 లక్షల బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి. మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ మీ బీమా మొత్తంలో 1 శాతం పరిమితి లేదా క్యాపింగ్ ఉంటే..
రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ | రూమ్ రెంట్ క్యాపింగ్‌తో ఉన్న ఇతర బీమాలు | |
బీమా చేసిన మొత్తం | ₹3 లక్షలు | ₹3 లక్షలు |
రూమ్ రెంట్ క్యాపింగ్ | రూమ్ రెంట్ క్యాపింగ్ లేదు | మీ బీమా మొత్తం రూ.3,00,000లో 1 శాతం |
ఆస్పత్రిలో ఉన్న రోజులు | 4 | 4 |
ప్రైవేటు వార్డు రూమ్ రెంట్ (రోజుకు) | ₹5000 | ₹5000 |
4 రోజులకు మొత్తం రూమ్ రెంట్ చార్జి | ₹20000 | ₹20000 |
బీమా సంస్థ కవర్ చేసేది | ₹20000 | ₹12000 |
మీరు చెల్లించేది | ₹0 | ₹8000 |
ఇక్కడ చూసుకున్నట్లు అయితే, మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ రూమ్ రెంట్‌పై పరిమితి విధించినందున, మీరు అదనంగా రూ. 8 వేల వరకు మీ జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది.
అయితే, మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ రూమ్ రెంట్‌పై ఎలాంటి పరిమితి విధించకపోతే, మీరు ఈ అదనపు మొత్తాన్ని చెల్లించనవసరం లేదు. తద్వారా మీ దగ్గర ఎంతో కొంత మొత్తం మిగులుతుంది.
భారతదేశంలోని ఆస్పత్రులలో అందుబాటులో ఉన్న వివిధ రూమ్‌లకు రెంట్ ఎలా ఉంటుందనే టేబుల్‌ను ఇక్కడ చూద్దాం. దీనిలో ఐసీయూ (ICU) రూమ్ రెంట్ కూడా ఉంది.
ఆస్పత్రి రూమ్ రకం | జోన్–ఏ | జోన్–బీ | జోన్–సీ |
సాధారణ వార్డు | ₹1432 | ₹1235 | ₹780 |
సెమీ ప్రైవేట్ వార్డు (2 లేదా అంతకంటే ఎక్కువమంది షేరింగ్) | ₹4071 | ₹3097 | ₹1530 |
ప్రైవేట్ వార్డ్ | ₹5206 | ₹4879 | ₹2344 |
ఐసీయూ (ICU) | ₹8884 | ₹8442 | ₹6884 |
గమనిక - ఇది రిఫరెన్స్ కోసం మాత్రమే అని గమనించండి. ఒక ఆస్పత్రికి మరో ఆస్పత్రికి, అలాగే ఒక నగరానికి మరో నగరానికి ఖర్చులు భిన్నంగా ఉండొచ్చు.