6 తల్లులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమో తెలిపే 6 కారణాలు
1. జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు మరియు ఇతర వ్యాధులతో పోరాడేందుకు
ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో లైఫ్ స్టైల్ వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రెగ్యులర్ చెకప్స్, ప్రీవెంటివ్ కేర్, వ్యాధులను ముందుగా గుర్తించడం వంటివి వీలుపడుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం వలన తల్లులు ఆరోగ్య ప్రమాదాలను ముందే గుర్తిస్తారు. దాని వల్ల వెంటనే కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేసేందుకు వీలు పడుతుంది. ఆరోగ్య ప్రమాదాలు తగ్గుతాయి. తల్లులు ఆరోగ్యంగా ఉండేందుకు వారు జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఇది సహాయపడుతుంది.
2. మాతృత్వం కోసం ఆర్థిక సంసిద్ధత
మాతృత్వం అనేది మాటల్లో చెప్పలేని మధురానుభూతి. ఇది మీ జీవితంలోకి ఎన్నో సంతోషాలను మోసుకొస్తుంది. అంతే కాకుండా కొన్ని బాధ్యతలను కూడా అప్పజెప్పుతుంది. ఈ సమయంలో ఎన్నో ఖర్చులు ఉంటాయి. ప్రీ నేటల్ ఖర్చుల నుంచి ప్రెగ్నెన్సీ సమయంలో ప్రసవానంతర ఖర్చులు ఇలా అనేకం ఉంటాయి. ఇలా ఎదురయ్యే అన్ని ఖర్చుల కోసం సంసిద్ధంగా ఉండేందుకు మీకు తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ ఖర్చులన్నింటినీ కవర్ చేస్తుంది.
ఇది మీకు మనశ్శాంతిని అందిస్తుంది. ఖర్చుల గురించి కంగారు లేకుండా ఆమె మాతృత్వపు ఆనందాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇది అనుమతిస్తుంది.
3. నాణ్యమైన ఆరోగ్యం అందించే వారిని సంప్రదించేందుకు
హెల్త్ కేర్ ప్రొవైడర్స్ విస్తృత నెట్‌వర్క్ నుంచి ఎంచుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు అధికారం ఇస్తుంది. నిపుణుల సలహాలు, ఆసుపత్రిలో చేరడం, అత్యవసర వైద్యం అవసరం అయినా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.
ఇందులో ఆమె తన అవసరాలకు సరిపోయే అత్యుత్తమ ఆసుపత్రిని ఎంచుకోవచ్చు. ఈ అవకాశం వల్ల సరైన సమయంలో అత్యుత్తమ వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుంది.
4. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం అనేది సెల్ఫ్ కేర్ యాక్ట్
తల్లులు తరచూ తమ కుటుంబసభ్యుల ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా వారు తమ ఆరోగ్యం గురించి కూడా కేర్ తీసుకోవచ్చు. ఇది చాలా అత్యవసరం. మరియు ప్రీవెంటివ్ కేర్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకునేందుకు వారికి అనుమతి ఇస్తుంది. వారు మంచి ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
5. మీకు మీ కుటుంబానికి ఉపశమనం
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం తల్లికి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి ఉపశమనం కలిగిస్తుంది. ఆమె హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చిందని తెలుసుకోవడం వలన అనుకోని వైద్య ఖర్చుల చింతను తొలగించుకోవచ్చు. ఆ విషయం తనకు ఎంతో భద్రతనిస్తుంది.
వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు కుటుంబం అత్యవసర ఖర్చుల గురించి చింతించకుండా ఆరోగ్యం మరియు ఆనందం మీద దృష్టి పెట్టేలా ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.
6. పెరుగుతున్న ఆరోగ్య ఖర్చుల నుంచి రక్షణ
తల్లుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు గల మరొక కారణం.. విపరీతంగా పెరుగుతూ పోతున్న ఆరోగ్య ఖర్చులు. ఆ ఖర్చుల కోసం ఈ ఇన్సూరెన్స్ మీకు కవరేజ్ అందిస్తుంది. పెరుగుతున్న ఖర్చులను మేనేజ్ చేయడం ఎవరికైనా కత్తి మీద సాములా మారింది.
అటువంటి అనుకోని వైద్య ఖర్చుల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ కుటుంబాన్ని మరియు తల్లులను రక్షణ కవచంలా కాపాడుతుంది.
తల్లులకు హెల్త్ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా ఎంచుకోవాలి?
1. తల్లికి అవసరం అయిన ఆరోగ్య అవసరాలను అంచనా వేయండి
తల్లి మెడికల్ హిస్టరీ, వయసు, మరియు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకోండి. రొటీన్ చెకప్స్, మెడికేషన్స్, హాస్పిటలైజేషన్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్ వంటి అంశాలను చెక్ చేయండి. ఈ అంశాలు మీ తల్లికి సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ ను తీసుకోవడంలో మీకు సహాయం చేస్తాయి.
2. వివిధ రకాల బీమాలను పోల్చి చూడండి
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను రీసెర్చ్ చేసి వాటిని కంపేర్ చేయండి. ప్రసూతి ప్రయోజనాలు, డెలివరీ తర్వాత సంరక్షణ మొదలైన సర్వీసెస్‌తో ఉన్న హెల్త్ కేర్ ప్రొవైడర్ల కోసం చూడండి. అంతే కాకుండా వాటి ఖరీదును కూడా ఇతర పాలసీలతో పోల్చి చూడడం అవసరం. మీకు సరైన ప్లాన్ ను ఎంచుకునేందుకు వివిధ కంపెనీలు అందించే ప్లాన్‌లను సరిపోల్చడం అవసరం.
3. పాలసీ నియమనిబంధనలను జాగ్రత్తగా పరిశీలించండి
వెయిటింగ్ పీరియడ్‌లు, ప్రీ ఎక్సిస్టింగ్ కండీషన్స్ (ముందుగా ఉన్న షరతులు), క్లెయిమ్ పద్ధతులు మొదలైన వాటి గురించి జాగ్రత్తగా చదవండి. మీరు తీసుకునే పాలసీ కాంప్రహెన్సివ్ కవరేజ్‌ను అందిస్తుందని మరియు తల్లికి అవసరం అయిన ఆరోగ్య సంరక్షణ రిక్వైర్వ్‌మెంట్స్‌తో వస్తుందని నిర్ధారించుకోండి.
4. యాడ్ ఆన్స్ పరిగణలోకి తీసుకోండి
హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచే యాడ్ ఆన్స్ మరియు రైడర్స్‌ను పరిగణలోకి తీసుకోండి. ఉదాహరణకు మెటర్నిటీ రైడర్స్ అనేవి మెటర్నిటీ ఖర్చులకు సంబంధించిన కవరేజ్ పెంచుతాయి. మీకు అవసరం అయిన హెల్త్ కేర్ అవసరాల కోసం అందుబాటులో ఉన్న రైడర్స్, యాడ్ ఆన్స్ ఖర్చులను అంచనా వేయండి.
తల్లులకు హెల్త్ ఇన్సూరెన్స్ పొందడం అనేది వారికి తక్కువ ఖర్చులో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పరిగణలోకి తీసుకుని మీకు అందుబాటులో ఉన్న ఉత్తమ ప్లాన్‌ను ఎంచుకుని తల్లి యొక్క ఆరోగ్య సంరక్షణ అవసరాలను భర్తీ చేయొచ్చు. రేపు వారు ఆనందమయమైన జీవితం గడిపేందుకు ఈ రోజే ఆమె ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వండి.
పెన్షనర్లు మరియు పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ITR
IT చట్టం ప్రకారం మాజీ ఉద్యోగి (ప్రభుత్వ లేదా ప్రైవేటు)కి వచ్చే పెన్షన్ అనేది సాలరీ ఆదాయం కిందకు వస్తుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్ అనేది మాత్రం ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కిందకి వస్తుంది. పన్ను చెల్లింపుదారులకు రెండింటికీ పన్ను వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం ఆదాయపు పన్ను స్లాబ్స్
మీ ఆదాయం కనుక సాధారణ మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే మీరు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 2022-23 మరియు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సాధారణ పన్ను మినహాయింపులేంటో తనిఖీ చేయండి.
ట్యాక్స్ పేయర్ వయసు | వచ్చే ఆదాయం (పాత పన్ను విధానం – FY 2022-23 మరియు FY 2023-24) |
వచ్చే ఆదాయం (కొత్త పన్ను విధానం - FY 2022-23) |
వచ్చే ఆదాయం (కొత్త పన్ను విధానం - FY 2023-24) |
60-80 సంవత్సరాల మధ్య | రూ. 3,00,000 | రూ. 2,50,000 | రూ. 3,00,000 |
80 సంవత్సరాల కంటే ఎక్కువ | రూ. 5,00,000 | రూ. 2,50,000 | రూ. 3,00,000 |
తల్లుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు
నా తల్లి మొత్తం శ్రేయస్సు కొరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉపయోగపడుతుంది?
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ముందస్తు జాగ్రత్తను అందిస్తుంది. మీ తల్లి ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడేందుకు ఇది వీలు కల్పిస్తుంది. వైద్య పరంగా అత్యవసర సమయం వచ్చినపుడు ఇది మనశ్శాంతిని అందించడమే కాకుండా ఆర్థిక భద్రతను కూడా అందిస్తుంది.
నా యజమాని నాకు అందించిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు నేను నా తల్లిని జోడించవచ్చా?
ఇది మీ యజమాని (ఎంప్లాయర్) విధి విధానాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని యాజమాన్యాలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో తల్లిదండ్రులను కూడా చేర్చుకునేందుకు అనుమతిస్తాయి. అందుకోసమే మీరు ఒకసారి మీ HR డిపార్ట్‌మెంట్ వాళ్లతో మాట్లాడి పాలసీ ప్రయోజనాలను గురించి తెలుసుకోవడం మంచిది. అంతే కాకుండా అందుకు కావాల్సిన అర్హతలు, ఏమైనా అదనంగా ఖర్చు అవుతుందా అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు.
తల్లుల కోసం నేను హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకున్నపుడు నేను ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?
తల్లి ఆరోగ్య అవసరాలు కవరేజ్ రిక్వైర్‌మెంట్స్, ఖర్చులు, మన బీమాదారుకు ఉన్న హెల్త్ నెట్‌వర్క్, పాలసీ నియమ నిబంధనలు, అంతే కాకుండా ఏమైనా ప్రత్యేక ప్యాకేజీలు కానీ యాడ్ ఆన్స్ కానీ లభిస్తున్నాయా అని తెలుసుకోవడం అవసరం. అంతే కాకుండా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కింద మెటర్నిటీ కవరేజ్ కోసం ఏమైనా వెయిటింగ్ పీరియడ్ ఉందా?
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను బట్టి ప్రసూతి వెయిటింగ్ పీరియడ్ అనేది మారుతూ ఉండవచ్చు. కొన్ని ప్లాన్స్ నెలల నుంచి సంవత్సరం వరకు వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. మెటర్నిటీ కవరేజ్‌కు సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ గురించి అర్థం చేసుకునేందుకు పాలసీ నియమనిబంధనలు క్షుణ్ణంగా చదవాలి.