2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో 26.8 మిలియన్ల కంటే ఎక్కువ మంది వైకల్యంతో ఉన్నారు (PwDs) — మొత్తం జనాభాలో ఇది మొత్తం 2.2శాతం వరకు ఉంటుంది. అయితే ఇతర సోర్సెస్ ఎక్కువ అంచనాలను కలిగి ఉన్నాయి. మీరు శారీరక లేదా మానసిక వైకల్యాన్ని కలిగి ఉన్నప్పుడు రోజూ వారి జీవితమే చాలా కష్టంగా ఉంటుంది. ఇక అధిక వైద్య ఖర్చుల ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వైద్య ఖర్చుల నుంచి ఆర్థిక భద్రతను పొందేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉత్తమ ఎంపిక. ఇండియాలో దివ్యాంగులకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు?. అవి బాగానే ఉన్నాయని మేము మీకు హామీ ఇస్తున్నాం.
దివ్యాంగుల కొరకు వివిధ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. కానీ ఇవి పరిమిత కవరేజీని కలిగి ఉంటాయి. అలా కాకుండా కొన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ప్రణాళిక) ను అందిస్తాయి. కానీ ఇవి ఎక్కువ ఖరీదైనవిగా ఉంటాయి. వైకల్యం ఉన్న వ్యక్తికి లభించే ఇన్సూరెన్స్ ప్రయోజనాలేంటో ఓ లుక్కేద్దాం:
ఇండియాలో దివ్యాంగుల చట్టం 1955 ప్రకారం (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ, పూర్తి అవకాశం) ఒక వ్యక్తికి 40 శాతం వైకల్యం ఉన్నా కానీ అతడిని దివ్యాంగుడిగా పరిగణిస్తారు. ఒకటి కంటే ఎక్కువ రకాలయిన వైకల్యం లేదా 80 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉంటే తీవ్ర వైకల్యం ఉన్నవారిగా పరిగణించబడతారు.
ఇండియాలో వర్గీకరించబడిన మూడు మేజర్ వైకల్యాలు ఇలా వర్గీకరించబడ్డాయి:
మీరు ప్రభుత్వం అందించే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని లేదా ప్రైవేట్ పాలసీని కొనుగోలు చేయాలని ప్లాన్ (ప్రణాళిక) చేస్తున్నా కానీ దివ్యాంగుల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:
దివ్యాంగుల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఫారం పూరించేటప్పుడు మీరు మీ వైకల్యాలను మరియు ముందుగా ఉన్న ఇతర ఆరోగ్య పరిస్థితుల గురించి సరిగ్గా వివరించాలి. అలా చేయకపోవడం మీ క్లయిమ్స్ ను ప్రభావితం చేస్తుంది.
మీరు నిర్దిష్టమైన పత్రాలు లేదా మెడికల్ రిపోర్టులను సమర్పించాల్సి రావొచ్చు. మీకు ఎంత వరకు వైకల్యం ఉందనేది అర్థం చేసుకునేందుకు వైద్యుడి నుంచి ఒక నివేదిక ఉంటుంది. (రోజువారీ పనులు చేస్తున్నప్పుడు వైకల్యం ఆ వ్యక్తిని ఎంత మేర ప్రభావితం చేస్తుందనేది).
ప్రభుత్వం ఆమోదించిన వైద్యశాలలో రిజిస్టర్డ్ డాక్టర్ ద్వారా అదనపు టెస్టులు చేయించుకోమని కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలు నివేదిక ఆధారంగా ఇన్సూరెన్స్ సంస్థ మీ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ను ఆమోదించాలా లేదా అని నిర్ణయం తీసుకుంటుంది.
మీ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ను ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ అంగీకరించిన తర్వాత మీ పాలసీకి ప్రీమియంను ఆ సంస్థే నిర్ణయిస్తుందని గుర్తుంచుకోండి. ఇది మీకున్న వైకల్యం, మీ వయసు, మీ కుటుంబ ఆరోగ్య చరిత్ర, మీకు ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతుంది. అంతే కాకుండా మీ ప్రీమియంపై 18శాతం జీఎస్టీ కూడా విధించబడుతుంది.
మీరు అధిక ప్రీమియం గురించి ఆలోచిస్తూ భయపడుతున్నారు. కానీ దివ్యాంగులు వారి హెల్త్ ఇన్సూరెన్స్ మీద పన్ను ప్రయోజనాలను కూడా పొందుతారు.
ఆదాయపు పన్ను చట్టంలోని 80U పాక్షికంగా వైకల్యం ఉన్న వారు రూ. 50,000 వరకు పన్ను మినహాయింపును పొందేందుకు అనుమతిస్తుంది. తీవ్రంగా వైకల్యం ఉన్న వ్యక్తులు రూ. 1 లక్ష వరకు పన్ను ప్రయోజనాలను పొందొచ్చు.
సెక్షన్ 80DD కింద కుటుంబ సభ్యులు కూడా తమ మీద ఆధారపడిన దివ్యాంగుల ఇన్సూరెన్స్ ప్రీమియంల మీద పన్ను మినహాయింపు పొందొచ్చు.
మేము పైన పేర్కొన్న విధంగా వైకల్యాలున్న వ్యక్తుల కోసం కొన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపికలు ఉన్నాయి.
ప్రమాదం ద్వారా వైకల్యం వచ్చిన వ్యక్తులు ఎక్కువగా సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కవర్ చేయబడతారు. ఇందులో ఎటువంటి అదనపు నిబంధనలు ఉండవు. నిజానికి ప్రమాదానికి ముందే వారు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కలిగి ఉన్నట్లయితే మీకు అదనపు ఆర్థిక భద్రత ఉంటుంది. అలాగే వైకల్యం (కొన్ని రకాలు) సంభవించినప్పుడు స్థిర ప్రయోజనాలు ఉంటాయి.
పుట్టుకతోనే మానసిక వ్యాధులతో జన్మించే వ్యక్తులకు అధిక ప్రమాదం ఉంటుంది కావున వారు రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా కవర్ చేయబడరు. లేదా వారు పాక్షిక కవరేజీని మాత్రమే పొందుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందువల్ల వారు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ పథకాల వైపు వెళ్లొచ్చు.
వైకల్యాలున్న వ్యక్తుల కోసం ప్రభుత్వం రెండు రకాల ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తుంది:
పారామీటర్స్ |
నిర్మల్య హెల్త్ ఇన్సూరెన్స్ |
స్వావలంబన్ హెల్త్ ఇన్సూరెన్స్ |
వయసు పరిమితి |
ఎటువంటి పరిమితులు లేవు |
18-65 సంవత్సరాలు |
అర్హత |
నేషనల్ ట్రస్ట్ లో తప్పకుండా నమోదు చేసుకుని ఉండాలి |
ఏడాది కుటుంబ ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువగా ఉండాలి |
ఇన్సూరెన్స్ మొత్తం |
రూ. 1 లక్ష కవరేజీ |
రూ. 2 లక్షల కవరేజీ |
కవరేజీ పరిమితులు |
వీటికి ఉన్న పరిమితులు: OPD ఖర్చులు: రూ.14,500, కొనసాగుతున్న చికిత్స ఖర్చులు: రూ.10,000, ప్రత్యామ్నాయ మందులు: రూ.4,500, రవాణా ఖర్చులు: రూ.1,000 |
దివ్యాంగ వ్యక్తి జీవిత భాగస్వామి మరియు ఇద్దరు పిల్లలను కవర్ చేస్తుంది |
ప్రీమియం |
రూ. 250 (కుటుంబ ఆదాయం రూ. 15,000 కంటే తక్కువగా ఉంటే), రూ. 500 (కుటుంబ ఆదాయం రూ. 15,000 కంటే ఎక్కువగా ఉంటే) |
రూ. 3,100 (ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి నుంచి 10 శాతం మాత్రమే కలెక్ట్ చేయాలి) |
అవసరమైన పత్రాలు |
సరైన ధృవీకరణ పత్రం |
వైకల్య ధృవీకరణ పత్రం, ప్రపోజల్ ఫారమ్, ప్రీమియం చెల్లించిన రశీదు, ఆధాయ ధృవీకరణ పత్రం, గుర్తింపు పత్రం |
హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీ అర్హత ప్రమాణాలను నిర్ణయించే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అవి ఈ కింది విధంగా ఉన్నాయి:
మీరు లేదా మీ కుటుంబ సభ్యుడు వైకల్యంతో జీవిస్తున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా మీరు ఏం చేయగలరో మీకు ఇప్పుడు ఒక మంచి ఐడియా ఉంటుంది.
దివ్యాంగుల హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే అక్కడ మెరుగుపరచాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ ఇన్సూరెన్స్ లు రిస్క్ లేదని అనుకున్న దివ్యాంగులకు మాత్రమే పాలసీలను అందిస్తున్నాయి. కానీ భవిష్యత్ లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ మరియు నిబంధనల్లో మార్పులు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ తీవ్రమైన వైకల్యాలు ఉన్నవారు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడతారు.