మోటార్
హెల్త్
మోటార్
హెల్త్
More Products
మోటార్
హెల్త్
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
Exclusive
Wellness Benefits
24*7 Claims
Support
Tax Savings
u/s 80D
Try agian later
I agree to the Terms & Conditions
{{abs.isPartnerAvailable ? 'We require some time to check & resolve the issue. If customers policy is expiring soon, please proceed with other insurers to issue the policy.' : 'We require some time to check & resolve the issue.'}}
We wouldn't want to lose a customer but in case your policy is expiring soon, please consider exploring other insurers.
Analysing your health details
Please wait a moment....
Terms and conditions
Terms and conditions
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కొనాలని చూస్తుంటే కనుక "ఒక నిమిషం ఆగు, నేను క్లెయిమ్ చేయకుంటే ఏమవుతుంది" అని మీరు అనుకుంటున్నారా?
మీ ప్రీమియం చెల్లింపులు వృథా అవుతాయని భయపడవచ్చు. అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు, అంటే ఎలాంటి క్లెయిమ్‌లు చేయనందుకు కూడా మీరు రివార్డు పొందొచ్చని మీకు మేము చెప్తే?
అవును, బోనస్ గురించి మేము మాట్లాడుతున్నాం. బీమా పరిభాషలోె చెప్పాలంటే దీన్ని ‘క్యుములేటివ్ బోనస్’ అని పిలుస్తారు.
హెల్త్ ఇన్సూరెన్స్‌లో క్యుములేటివ్ బోనస్ అనేది ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే మీరు రివార్డ్‌గా పొందే ఆర్థిక ప్రయోజనం. ఇది కారు ఇన్సూరెన్స్‌లోని నో క్లెయిమ్ బోనస్‌కు చాలా దగ్గరగా ఉంటుంది.
అయితే, మీరు పొందే ప్రయోజనం ఒక్కో ఆరోగ్య బీమా సంస్థకు ఒక్కోలా ఉండవచ్చు. కొన్ని బీమా సంస్థలు మీ పాలసీ సంవత్సరానికి మీ ప్రీమియంలో తగ్గించి రివార్డు ఇస్తాయి. మరికొన్ని మాత్రం మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచకుండానే మీ హెల్త్ ఇన్సూరెన్స్‌కు అదనపు బీమాను అందిస్తాయి. సాధారణంగా, చాలా బీమా సంస్థలు ప్రతీ క్లెయిమ్ చేసుకోని సంవత్సరానికి బీమా మొత్తంలో 5% నుంచి 50% పెరుగుదలను అందిస్తాయి.
డిజిట్లో, ప్రతీ క్లెయిమ్ రహిత సంవత్సరానికి (గరిష్టంగా 100% ప్రయోజనంతో) 50% వరకు మీ బీమా మొత్తంలో పెరుగుదల యొక్క ప్రయోజనాన్ని మేము మీకు అందిస్తాం.
మీరు రూ. 10 లక్షల బీమాకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుడు అని అనుకుందాం. మీరు మీ మొదటి సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయనట్లయితే, మీరు నేరుగా 50% పెరుగుదలను పొందొచ్చు. దీంతో మీ బీమా మొత్తం రూ. 15 లక్షలు అవుతుంది.
క్రమంగా, మీరు మీ రెండో సంవత్సరానికి ఎలాంటి క్లెయిమ్‌లు లేకుండా కొనసాగితే, మీరు మొదట్లో ప్రారంభించిన బీమా మొత్తానికి 100% వరకు పెరుగుతుంది. అంటే 20 లక్షలు అవుతుంది.
గమనిక : డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ (కంఫర్ట్ ఆప్షన్)కు సంబంధించి క్యుములేటివ్ బోనస్‌లో ఇన్సూరెన్స్ మొత్తంలో పెరుగుదల ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ప్రతి బీమా సంస్థ బీమా చేసిన మొత్తం లేదా రాయితీ ప్రీమియంలో వివిధ రేట్ల మేర పెరుగుదలను అందిస్తుంటాయి.
ముఖ్యమైనది : కరోనా వైరస్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ప్రయోజనాలు & కవర్ అయిన వాటి గురించి మరింత తెలుసుకోండి.
క్లెయిమ్ చేయని సంవత్సరాలు |
క్యుములేటివ్ బోనస్ (డబుల్ వాలెట్ ప్లాన్) | క్యుములేటివ్ బోనస్ (ఇన్ఫినిటీ వాలెట్ అండ్ వరల్డ్‌వైడ్ ట్రీట్మెంట్ ప్లాన్) |
1 సంవత్సరం తర్వాత | 10% | 50% |
రెండేళ్ల తర్వాత | 20% | 100% |
మూడేళ్ల తర్వాత | 30% | N/A |
నాలుగేళ్ల తర్వాత | 40% | N/A |
ఐదేళ్ల తర్వాత | 50% | N/A |
ఆరేళ్ల తర్వాత |
60% | N/A |
7 సంవత్సరాల తర్వాత | 70% | N/A |
8 సంవత్సరాల తర్వాత | 80% | N/A |
9 సంవత్సరాల తర్వాత | 90% | N/A |
10 సంవత్సరాల తర్వాత | 100% | N/A |
ఇది మీ బీమా సంస్థపై ఆధారపడి ఉంటుంది. అయినా, సంవత్సరంలో మీ క్లెయిమ్ చాలా తక్కువగా ఉంటే, కొన్ని బీమా సంస్థలు క్యుములేటివ్ బోనస్ అందిస్తాయి. సాధారణంగా మీరు ఒక సంవత్సరంలోపు క్లెయిమ్ చేస్తే, మీ అసలు బీమా మొత్తం రెన్యువల్ అవుతుంది. ప్రస్తుత పాలసీ నియమాలు మరింత సరళంగా ఉంటాయి. మీరు తక్కువ క్లెయిమ్ చేస్తే, మీ రివార్డు తక్కువగా తగ్గుతుంది.
ఉదాహరణకు, మీరు రూ. 10 లక్షలకు బీమా చేసుకున్నారని అనుకోండి. మీరు రూ. 10,000 క్లెయిమ్ చేస్తే బీమా చేసిన మొత్తంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మీ క్యుములేటివ్ బోనస్‌లో అంతే శాతం తగ్గుతుంది.
మీ క్యుములేటివ్ బోనస్‌ను బదిలీ చేయడం సాధ్యమే అయినా.. కొత్త సంస్థ అందించే బోనస్ రకం (ప్రీమియం-ఆధారిత లేదా సమ్ ఆధారిత)పై ఆధారపడి ఉంటుంది. ఆ కంపెనీ సొంత నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.
ఉదాహరణకు, మీరు 45 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే మొత్తం బోనస్‌ను బదిలీ చేయొచ్చు. 45 ఏళ్లు పైబడిన వారైతే బోనస్‌లో 50% మాత్రమే బదిలీ అవుతుంది. మీ బీమా మొత్తాన్ని పోర్ట్ చేస్తున్నప్పుడు, కొత్త సంస్థలో బీమా మొత్తాన్ని ఎంచుకోవడం కోసం మీ క్యుములేటివ్ బోనస్ పరిగణించబడుతుంది.
చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కంపెనీలు వారి నో-క్లెయిమ్ లేదా క్యుములేటివ్ బోనస్ నిబంధన కింద నిర్దిష్ట పరిమితిని కలిగి ఉంటాయి. ప్రీమియంపై మీ గరిష్ట తగ్గింపు లేదా బీమా మొత్తం పెరుగుదల ఈ ఫిక్స్డ్ శాతంపై ఆధారపడి ఉంటుంది.
డిజిట్లో, మీరు వరుసగా రెండేళ్లు ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే మేము బీమా మొత్తంలో 100% పెరుగుదల అందిస్తాం. మొదటి క్లెయిమ్ రహిత సంవత్సరానికి 50% పెరుగుదలను అందిస్తాం.
P.S: క్యుములేటివ్ బోనస్ గడువు ముగియకుండా ఉండటానికి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యువల్ చేసుకోవాలనే విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఇచ్చే బహుమతి ఇది.
మేము బీమాను చాలా సరళతరం చేస్తున్నాం. ఎంతలా అంటే ఐదేళ్ల పిల్లలు కూడా దాన్ని అర్థం చేసుకోగలరు.
మాయకు రోజూ చాక్లెట్లు తినడం చాలా ఇష్టం. ఆమె ఒక వారం పాటు చాక్లెట్లు తినకుండా ఉంటే ఆమెకు ట్రిఫుల్ కేక్, ప్రతీ ఆదివారం ఆమెకు ఇష్టమైన చాకో-బార్ ఇస్తామని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఆమె తల్లిదండ్రుల ఆఫర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో క్యుములేటివ్ బోనస్ వంటిది.
హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఒకేలా ఉంటాయి. మీ ప్రీమియంపై తగ్గింపు పొందొచ్చు లేదా ప్రతీ క్లెయిమ్-రహిత సంవత్సరానికి బీమా మొత్తంలో పెరుగుదలను ఆస్వాదించవచ్చు. అయితే కొన్నిసార్లు క్యుములేటివ్ బోనస్ అనేది బీమా మొత్తంలో మాత్రమే పెరుగుదల ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఒకేలా ఉంటాయి. మీ ప్రీమియంపై తగ్గింపు పొందొచ్చు లేదా ప్రతీ క్లెయిమ్-రహిత సంవత్సరానికి బీమా మొత్తంలో పెరుగుదలను ఆస్వాదించవచ్చు. అయితే కొన్నిసార్లు క్యుములేటివ్ బోనస్ అనేది బీమా మొత్తంలో మాత్రమే పెరుగుదల ఉంటుంది.
డిజిట్లో, మేము మీ మొదటి క్లెయిమ్-రహిత సంవత్సరానికి బీమా మొత్తంలో 50%, వరుసగా రెండో క్లెయిమ్-రహిత సంవత్సరానికి 100% పెరుగుదలను అందిస్తాం.
డిజిట్లో, మేము మీ మొదటి క్లెయిమ్-రహిత సంవత్సరానికి బీమా మొత్తంలో 50%, వరుసగా రెండో క్లెయిమ్-రహిత సంవత్సరానికి 100% పెరుగుదలను అందిస్తాం.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసేలోపు మీరు అలాగే ఉన్నంత కాలం, మీ క్యుములేటివ్ బోనస్ ప్రభావితం కాకుండా కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు పోర్ట్ చేయొచ్చు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసేలోపు మీరు అలాగే ఉన్నంత కాలం, మీ క్యుములేటివ్ బోనస్ ప్రభావితం కాకుండా కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు పోర్ట్ చేయొచ్చు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేస్తేనే మీ క్యుములేటివ్ బోనస్ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని రెన్యువల్ చేయడం మర్చిపోతే మీ క్యుములేటివ్ బోనస్ చెల్లదు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేస్తేనే మీ క్యుములేటివ్ బోనస్ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని రెన్యువల్ చేయడం మర్చిపోతే మీ క్యుములేటివ్ బోనస్ చెల్లదు.
చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వారి నో-క్లెయిమ్ లేదా క్యుములేటివ్ బోనస్ నిబంధన కింద నిర్దిష్ట పరిమితి పెడతాయి. ప్రీమియంపై మీ గరిష్ట తగ్గింపు లేదా బీమా మొత్తంలో పెరుగుదల ఈ ఫిక్స్డ్ శాతంపై ఆధారపడి ఉంటుంది. డిజిట్లో క్లెయిమ్ చేయకుండా ఉండే మొదటి సంవత్సరానికి మేము సమ్ ఇన్సూర్డ్‌లో 50 శాతం పెరుగుదలను అందజేస్తాం. అంతే కాకుండా మీరు వరుసగా రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉంటే మేము మీకు 100శాతం పెంచిన సమ్ ఇన్సూర్డ్‌ను అందజేస్తాం. (మా ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్ మరియు వరల్డ్ వైడ్ ట్రీట్మెంట్ ప్లాన్ వాడే యూజర్ల కోసం).
చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వారి నో-క్లెయిమ్ లేదా క్యుములేటివ్ బోనస్ నిబంధన కింద నిర్దిష్ట పరిమితి పెడతాయి. ప్రీమియంపై మీ గరిష్ట తగ్గింపు లేదా బీమా మొత్తంలో పెరుగుదల ఈ ఫిక్స్డ్ శాతంపై ఆధారపడి ఉంటుంది.
డిజిట్లో క్లెయిమ్ చేయకుండా ఉండే మొదటి సంవత్సరానికి మేము సమ్ ఇన్సూర్డ్‌లో 50 శాతం పెరుగుదలను అందజేస్తాం. అంతే కాకుండా మీరు వరుసగా రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉంటే మేము మీకు 100శాతం పెంచిన సమ్ ఇన్సూర్డ్‌ను అందజేస్తాం. (మా ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్ మరియు వరల్డ్ వైడ్ ట్రీట్మెంట్ ప్లాన్ వాడే యూజర్ల కోసం).
చాలా బీమా సంస్థలు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటే ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. డిజిట్లో కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నంత వరకు, సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయనంత వరకు మీరు క్యుములేటివ్ బోనస్ నుంచి ప్రయోజనం పొందొచ్చు. మీ క్లెయిమ్ రికార్డ్ తప్ప అడుగులు లేదా మరేదైనా అంశాలతో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం మా వద్ద ఉండదు.
చాలా బీమా సంస్థలు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటే ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. డిజిట్లో కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నంత వరకు, సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయనంత వరకు మీరు క్యుములేటివ్ బోనస్ నుంచి ప్రయోజనం పొందొచ్చు. మీ క్లెయిమ్ రికార్డ్ తప్ప అడుగులు లేదా మరేదైనా అంశాలతో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం మా వద్ద ఉండదు.
Please try one more time!
నిరాకరణ #1: *కస్టమర్ బీమా పొందే సమయంలో ఎంపికలను ఎంచుకోవచ్చు. దీని ప్రకారం ప్రీమియం మొత్తం మారవచ్చు. పాలసీ జారీకి ముందు బీమా చేసినవారు ముందుగా ఉన్న ఏదైనా పరిస్థితిని లేదా ప్రస్తుతం కొనసాగుతున్న చికిత్సను ప్రతిపాదన రూపంలో బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
నిరాకరణ #2: ఈ సమాచారం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే జోడించబడింది మరియు ఇంటర్నెట్లోని వివిధ మూలాల నుండి సేకరించబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు సమాచారాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 25-10-2024
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.