यूलिप(ULIP) कॅल्क्युलेटर
Monthly Investment
I want to invest for (Years)
I will stay invested for (Years)
Expected return rate (P.A)
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్) కాలిక్యులేటర్
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదా యులిప్ అనేది పెట్టుబడి మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ల కలయిక. కాబట్టి, చెల్లించిన ప్రీమియంలో కొంత భాగం లైఫ్ కవర్‌కు వెళుతుంది, మిగిలిన మొత్తం ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టబడుతుంది.
అంతేకాకుండా, ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లో పెట్టుబడి పెట్టే ముందు, తప్పనిసరిగా ఖర్చు మరియు రాబడిని సరిపోల్చాలి. ఈ పోలికను మరియు మొత్తం పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడానికి, యులిప్ కాలిక్యులేటర్ మీకు సహాయం చేసే సాధనంగా ఉంటుంది.
ఆన్లైన్లో యులిప్ కాలిక్యులేటర్‌కు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడానికి చదవండి.
ఆన్లైన్ యులిప్ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?
ఆన్లైన్ ఉచిత యులిప్ కాలిక్యులేటర్ అనేది పెట్టుబడిదారులు తమ ఆశించిన రాబడిని తెలుసుకోవడానికి వారికి సహాయం చేసే ఒక సరళ సాధనం. ఈ గణన కోసం, ఇది ప్రీమియం, వయస్సు, వ్యవధి మరియు రాబడి రేటు వంటి కీలకమైన డేటా పాయింట్లను మూల్యాంకనం చేస్తుంది.
యులిప్‌లు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి కాబట్టి, ఈ సాధనం పెట్టుబడిదారులకు సంభావ్య రాబడిని అంచనా వేయడంలో మాత్రమే సహాయపడుతుంది.
అంతే కాకుండా, నిధులను కేటాయించే ముందు, ఎంచుకున్న యులిప్ ప్లాన్ మీ అవసరాలకు సరిపోతుందని నిర్ధారించుకోవడం అత్యవసరం, ఈ విషయంలో యులిప్ రిటర్న్ కాలిక్యులేటర్ మీకు సహాయకారిగా ఉంటుంది.
[మూలం]
యులిప్ రిటర్న్‌లను ఎలా లెక్కించాలి?
యులిప్ రిటర్న్‌లను లెక్కించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఫార్ములా లతో పాటుగా ఈ రెండూ క్రింద ఉదహరించబడ్డాయి:
1. అబ్సల్యూట్ రిటర్న్స్
యులిప్ పెట్టుబడి యొక్క అబ్సల్యూట్ రిటర్న్స్ అనేది ఒక వ్యవధిలో దాని ఆస్తుల విలువలో పెరుగుదలను సూచిస్తుంది. ఇది తరుగుదల ను సూచిస్తూ నెగటివ్ గా ఉండవచ్చు, లేదా పాసిటివ్ గా ఉండవచ్చు, ఇది ఆస్తి విలువలో పెరుగుదల ను సూచిస్తుంది.
మీరు స్కీమ్ యొక్క అబ్సల్యూట్ రిటర్న్స్ ని లెక్కించాలి అనుకుంటే , మీకు కావాల్సిన విలువలు దాని ప్రారంభ NAV మరియు ప్రస్తుత NAV మాత్రమే.
దాని గణన కోసం ఫార్ములా క్రింద ఇవ్వబడింది:
[(ప్రస్తుత NAV – ప్రారంభ NAV)/ప్రారంభ NAV] × 100
దిగువ ఇవ్వబడిన పట్టిక మీ కోసం పై సూత్రం యొక్క పనిని సరళం చేస్తుంది. ఈ ఉదాహరణలో, ప్రారంభ NAV ₹250, ప్రస్తుత యులిప్ NAV ₹350గా పరిగణించండి. కాబట్టి, అబ్సల్యూట్ రిటర్న్స్ సంవత్సరంలో 40% ఉంటుంది.
పారామీటర్ |
విలువ |
ప్రారంభ NAV |
₹250 |
ప్రస్తుత యులిప్ NAV |
₹350 |
అబ్సల్యూట్ రిటర్న్స్ |
40% |
2. కాంపౌండ్డ్ వార్షిక వృద్ధి రేటు (CAGR)
కాంపౌండ్డ్ వార్షిక వృద్ధి రేటు అనేది నిర్దిష్ట కాల వ్యవధిలో పెట్టుబడి యొక్క వార్షిక వృద్ధికి సూచిక. యులిప్ కోసం CAGRని లెక్కించడానికి ఒక గణిత సూత్రం ఉంది, ఇది పథకం యొక్క ముగింపు విలువ, ప్రారంభ విలువ మరియు పెట్టుబడి సంవత్సరాల సంఖ్యను ఉపయోగిస్తుంది.
ఈ ఫార్ములా క్రింది విధంగా ఉంది:
{[(NAV యొక్క ప్రస్తుత విలువ/NAV యొక్క ప్రారంభ విలువ) ^ (1/సంవత్సరాల సంఖ్య)] – 1} x 100
దిగువ పేర్కొన్న పట్టిక ను గమనించడం ద్వారా మీరు పై సూత్రం యొక్క పనిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఉదాహరణలో, ప్రారంభ యులిప్ NAVని ₹25గా పరిగణించండి మరియు ఐదు సంవత్సరాల తర్వాత ప్రస్తుత యులిప్ NAV ₹35. అందువల్ల, ఈ సందర్భంలో CAGR 6.96% ఉంటుంది.
పారామీటర్ |
విలువ |
ప్రారంభ NAV |
₹25 |
సంవత్సరాల సంఖ్య |
5 |
ప్రస్తుత NAV |
₹35 |
CAGR |
6.96% |
మీరు యులిప్ రిటర్న్ కాలిక్యులేటర్‌ను ఎందుకు ఉపయోగించాలి?
యులిప్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యొక్క సంపద ఉత్పత్తితో పాటు ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క రక్షణ మరియు భద్రతను మిళితం చేస్తుంది. వాస్తవానికి, యులిప్ యొక్క ఈ ద్వంద్వత్వం రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని పెట్టుబడిదారులలో దీనిని ప్రముఖ పెట్టుబడి సాధనంగా చేస్తుంది. అయినా కూడా, దాని వైవిధ్య శ్రేణిని బట్టి, కాబోయే పెట్టుబడిదారులు తమకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోవడం సవాలుగా ఉంటుంది.
ఈ సమయంలో యులిప్ ప్లాన్ రిటర్న్ కాలిక్యులేటర్ మీకు సాయం చేస్తుంది. ఇది ప్రీమియం మొత్తాన్ని మరియు సంభావ్య రాబడిని గణించడానికి వినియోగదారుడికి సాయం చేస్తుంది. ఫలితంగా, ఈ సాధనం పెట్టుబడిదారులకు ఒక ప్లాన్ గురించి సరైన ఆలోచన పొందేందుకు మరియు సమాచారం తో కూడిన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా, యులిప్ ప్లాన్ కాలిక్యులేటర్ వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలు మరియు పెట్టుబడి వ్యవధి ఆధారంగా పెట్టుబడి పెట్టేందుకు సహాయం చేస్తుంది.
యులిప్ రిటర్న్ కాలిక్యులేటర్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు
ఆన్లైన్ యులిప్ మెచ్యూరిటీ అమౌంట్ కాలిక్యులేటర్ క్రింద హైలైట్ చేయబడిన వాటితో సహా అనేక ఫీచర్లతో వస్తుంది:
- యూజర్ ఫ్రెండ్లీ - యులిప్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ అనేది ఉపయోగించడానికి సులభమైన డిజిటల్ సాధనం. పెట్టుబడిదారుడు ఈ కాలిక్యులేటర్లో కొన్ని కీలక వివరాలను ఇన్పుట్ చేయాలి. సమాచారం నమోదు చేసిన వెంటనే, ఈ సాధనం యులిప్ రిటర్న్‌ల స్నాప్‌షాట్‌ను అందిస్తుంది.
- ఫ్లెక్సిబిలిటీ - యులిప్ వడ్డీ రేటు కాలిక్యులేటర్ వ్యక్తులు యులిప్ లో కేటాయించాల్సిన మొత్తాన్ని నిర్ధారించడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా, పెట్టుబడిదారులు వారి అవసరాలకు అనుగుణంగా వేరియబుల్‌ను మార్చవచ్చు, అది అవుట్‌పుట్‌ను మారుస్తుంది.
పారదర్శకత - పెట్టుబడిపై రాబడి అనేది మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి మారుతుంది., ఒక నిర్దిష్ట కాలానికి ఫండ్ రాబడిని నిర్ణయించడంలో సహాయపడటం ద్వారా యులిప్ కాలిక్యులేటర్ పారదర్శకతను అందిస్తుంది.
ప్రణాళిక - యులిప్ ఫండ్ రిటర్న్ కాలిక్యులేటర్‌తో, మార్కెట్లోని వివిధ యులిప్ ఉత్పత్తుల అంచనా రాబడులను పోల్చి విశ్లేషించవచ్చు. అదనంగా, యులిప్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి ప్లాన్ల యొక్క తులనాత్మక వ్యయ-ప్రయోజన విశ్లేషణతో కలిపి రాబడిని అంచనా వేయడం, మెరుగైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
ఒక బహుముఖ ఉత్పత్తి అయిన యులిప్ ఒకరి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ ను అందిస్తుంది. ఈ సాధనం లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్న వ్యక్తులు యులిప్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి, తద్వారా సమాచారంతో కూడిన పెట్టుబడి నిర్ణయం తీసుకోవచ్చు.