Third-party premium has changed from 1st June. Renew now
జీరో డిప్రిషియేషన్ టూ వీలర్ ఇన్సూరెన్స్
మనమందరం ఇష్టపడే విషయాలను రక్షించాలని అనుకుంటున్నాము. ఇది మానవ సహజం. ముఖ్యంగా ఇది మీ టూ వీలర్ అయితే, మరీ ముఖ్యంగా మీరు కొనుగోలు చేసిన ఒకటి మాత్రమే అయితే మరీనూ! మనకు ఇష్టమైనవి ఎప్పటికీ కొత్త వాటిలా ఎప్పటికీ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి.
వాస్తవానికి, ఇంద్రజాలం ఉనికిలో లేదు. కానీ, కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ లో జీరో డిప్రిషియేషన్ కవర్ ఉంది. ఇది దాదాపు ఇంద్రజాలం లాంటిదే. మీ బైక్‌ను కొత్తదిగా ఉంచడం కొరకు, మీరు దానిని పొందినప్పుడు ఎంత కొత్తగా ఉందో అంతే కొత్తగా ఉంటుంది. ఇది మీ బైక్ యొక్క సొంత యాంటీ ఏజింగ్ క్రీమ్‌గా భావించండి. అర్థం కాలేదా? ఆగండి, మేము వివరిస్తాము.
జీరో డిప్రిషియేషన్ బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
జీరో డిప్రిసియేషన్ అంటే ఏమిటో వివరించడానికి ముందు, డిప్రిషియేషన్ (తరుగుదల) అంటే ఏమిటో ముందు మనం తెలుసుకుందాం. డిప్రిషియేషన్ అనేది మీ బైక్ వయస్సు పెరిగే కొద్దీ దాని విలువ తగ్గడం. కాబట్టి, మీ బైక్ కొత్తదిగా ఉన్నప్పుడు లక్ష రూపాయల విలువ ఉండి ఇప్పుడు రూ. 50,000 విలువ ఉంటే, రూ. 50,000 అనేది బైక్‌పై మీరు అనుభవించిన డిప్రిషియేషన్ అవుతుంది.
డిప్రిషియేషన్ అనేది మీ బైక్ వయస్సు పెరిగే కొద్దీ దాని విలువ తగ్గడం. కాబట్టి, మీ బైక్ కొత్తదిగా ఉన్నప్పుడు లక్ష రూపాయల విలువ ఉండి ఇప్పుడు రూ. 50,000 విలువ ఉంటే, రూ. 50,000 అనేది బైక్‌పై మీరు అనుభవించిన డిప్రిషియేషన్ అవుతుంది.
కానీ మీ బైక్‌కు జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే, డిప్రిషియేషన్ కోసం మినహాయించబడిన (సున్నా) భర్తీ చేయాల్సిన విడిభాగాల యొక్క దాదాపు మొత్తం ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీనే చెల్లిస్తుంది. సరళమైన మాటల్లో చెప్పాలంటే, జీరో డిప్రిషియేషన్ కవర్ కలిగి ఉండటం అంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ దృష్టిలో, మీ బైక్ కొత్తదిగా ఉన్నట్లు.
చెక్: విభిన్న యాడ్–ఆన్‌లతో ప్రీమియం లెక్కించడం కొరకు బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించండి.
టూ వీలర్ వాహనాల్లో డిప్రిషియేషన్
వాహనం వయసు | డిప్రిషియేషన్ % |
---|---|
6 నెలలకు మించనివి | 5% |
6 నెలలు మించిన, కానీ 1 సంవత్సరం మించనివి | 15% |
1 సంవత్సరం మించినవి, కానీ 2 సంవత్సరాలను మించనివి | 20% |
2 సంవత్సరాలు మించినవి, కానీ 3 సంవత్సరాలు మించనివి | 30% |
3 సంవత్సరాలు మించినవి, కానీ 4 సంవత్సరాలు మించనివి | 40% |
4 సంవత్సరాలు మించినవి, కానీ 5 సంవత్సరాలు మించనివి | 50% |
పోల్చండి: జీరో డిప్రిషియేషన్ కవర్ కలిగిన & లేని బైక్ ఇన్సూరెన్స్
జీరో డిప్రిషియేషన్ కవర్‌తో కూడిన బైక్ ఇన్సూరెన్స్ | జీరో డిప్రిషియేషన్ కవర్ లేని బైక్ ఇన్సూరెన్స్ | |
జీరో డిప్రిషియేషన్తో కూడిన బైక్ ఇన్సూరెన్స్ | క్లెయిమ్ చెల్లింపు చేసే సమయంలో తరుగుదలన పరిగణనలోకి తీసుకోరు కాబట్టి అమౌంట్ ఎక్కువగా ఉంటుంది | దీనిలో మీ టూ–వీలర్‌తో పాటు దాని భాగాల తరుగుదలను కూడా లెక్కిస్తారు కాబట్టి అమౌంట్ తక్కువగా ఉంటుంది. |
భాగాలపై తరుగుదల | కవర్ అవుతాయి | కవర్ కావు |
టూ–వీలర్ వయసు | ఈ యాడ్–ఆన్‌తో, డిప్రిషియేషన్ లెక్కించబడనందున మీ టూ–వీలర్ యొక్క వయస్సు ఎలాంటి ప్రభావాన్ని చూపదు. | డిప్రిషియేషన్ అనేది మీ టూ–వీలర్ ఎంత పాతది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. |
టూ వీలర్ భాగాలపై డిప్రిషియేషన్ వర్తించే రేటు
బైక్ భాగాలు | వర్తించే డిప్రిషియేషన్ |
---|---|
నైలాన్/రబ్బర్/టైర్లు, ట్యూబ్‌లు/ప్లాస్టిక్ భాగాలు/బ్యాటరీలు | 50% |
ఫైబర్/గ్లాస్ మెటీరియల్ | 30% |
గ్లాస్‌తో తయారయ్యే అన్ని ఇతర భాగాలు | Nil |
జీరో డిప్రిషియేషన్ బైక్ ఇన్సూరెన్స్ గురించి మరింత సమాచారం
ఏమేం ఉంటాయి?
- అరుగుదల ఉండే బైక్ భాగాలు అంటే నైలాన్, రబ్బర్, ఫైబర్ గ్లాస్, ప్లాస్టిక్ భాగాలకు పరిహారం.
- మీ బైక్ ఇన్సూరెన్స్ చెల్లుబాటు అయ్యేంత వరకు మీ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు అన్నింటికి మీ జీరో-డిప్రిషియేషన్ కవర్ వర్తిస్తుంది.
- ప్రస్తుతం మీకు జీరో డిప్రిషియేషన్ కవర్ లేనట్లయితే, రెన్యువల్ సమయంలో కూడా మీరు దానిని చేర్చవచ్చు.
వేటికి మినహాయింపు ఉంటుంది?
- 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బైకులకు ఈ కవర్ వర్తించదు
- మీ బైక్ యొక్క మెకానికల్ లోపాలు, అరుగుదల వల్ల ఏర్పడే మీ బైక్ లేదా దాని భాగాల డ్యామేజీలను ఇది కవర్ చేయదు
- ఇది మీ బైక్ టైర్, బై-ఫ్యూయల్ కిట్, గ్యాస్ కిట్లను కవర్ చేయదు
జీరో డిప్రిషియేషన్ బైక్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
- బైక్ ఇన్సూరెన్స్ క్లెయిముల సమయంలో మీ పొదుపును పెంచుకోండి. ఎందుకంటే మీరు మీ జేబు నుంచి ఎక్కువ ఖర్చు చేయరు.
- మీ క్లెయిమ్ మొత్తాన్ని (తప్పనిసరి మినహాయింపుల తరువాత) అందుకోవడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు, ఎందుకంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇకపై మీ క్లెయిమ్ మొత్తం నుంచి మీ డిప్రిషియేషన్‌ను తీసివేయదు.
- మీ కొత్త బైక్, దాని విడి భాగాలకు రక్షణ పొరగా పనిచేస్తుంది.
జీరో డిప్రిషియేషన్ బైక్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు
జీరో డిప్రిషియేషన్ కవర్ ప్రీమియంను ప్రభావితం చేసే కారకాలు ఏవి?
మీ వాహనం యొక్క వయస్సు, తయారీ, మోడల్, మీ ప్రాంతంతో సహా అనేక కారకాలు మీ జీరో డిప్రిషియేషన్ కవర్ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి.
కొత్త బైక్ యజమానికి జీరో-డిప్రిషియేషన్ యాడ్-ఆన్ ఉపయోగకరమా?
అవును, మీ బైక్ కొత్తది లేదా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే జీరో-డిప్రిషియేషన్ కవర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త బైక్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
పాత బైక్ యజమానికి బైక్ ఇన్సూరెన్స్ విషయంలో జీరో-డిప్రిషియేషన్ కవర్ ఉపయోగకరంగా ఉంటుందా?
ఇది మీ బైక్ ఎంత పాతదనే దానిపై ఆధారపడి ఉంటుంది! మీ బైక్ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు లేదా దాని దగ్గరగా ఉన్నట్లయితే జీరో డిప్రిషియేషన్ కవర్ని ఎంచుకోవాలని మేం సిఫారసు చేయము. పాత బైక్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
జీరో-డిప్రిషియేషన్ బైక్ ఇన్సూరెన్స్ కవర్ ఉపయోగించుకోవడానికి షరతులు ఏమిటి?
ఒకే ఒక షరతు ఏంటంటే, మీరు కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో మాత్రమే దీనిని ఎంచుకోవచ్చు. అది కూడా మీ బైక్ 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే మాత్రమే.
నేను మూడేళ్ల క్రితం నాటి సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేస్తున్నాను. నేను జీరో-డిప్రిషియేషన్ కవర్‌ను ఎంచుకోవాలా?
మేము సాధారణంగా కొత్త బైకుల కోసం జీరో-డిప్రిషియేషన్ కవర్‌ను సిఫార్సు చేస్తాము. అయితే, మీ సెకండ్ హ్యాండ్ బైక్ 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నందున, విడి భాగాలు ఖరీదైనవైతే మీరు జీరో డిప్రిషియేషన్ కవర్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ కాకపోతే మీరు జీరో-డిప్రిషియేషన్ కవర్ని ఎంచుకోకపోవడం మంచిది. సెకండ్ హ్యాండ్ బైక్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌తో నేను జీరో-డిప్రిషియేషన్ కవర్ కొనుగోలు చేయవచ్చా?
లేదు, మీరు థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌తో జీరో–డిప్రిషియేషన్ కవర్‌ను కొనుగోలు చేయలేరు. కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్‌లో మాత్రమే జీరో-డిప్రిషియేషన్ యాడ్–ఆన్ కవర్ వర్తిస్తుంది.