Third-party premium has changed from 1st June. Renew now
ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన మోటారు ఇన్సూరెన్స్. విద్యుత్‌తో నడిచే టూ వీలర్లకు ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వలన సంభవించే అవకాశమున్న డ్యామేజీలు, నష్టాల నుంచి కవర్ చేస్తుంది.
ఎలక్ట్రిక్ బైక్స్‌ను e-బైక్స్ అని కూడా పిలుస్తారు లేదా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అంటారు. ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. అందుకోసమే ఇవి రోజురోజుకూ ప్రసిద్ధి చెందుతున్నాయి. రెగ్యులర్ బైక్స్‌తో పోల్చుకుంటే రోడ్డు మీద వెళ్లేటపుడు కూడా వీటి నుంచి ఎక్కువ శబ్దం రాదు.
సాధారణంగా వాహనాలకు ఇంధనంగా పెట్రోల్ అవసరం. కానీ వీటికి మాత్రం విద్యుత్‌తో చార్జ్ చేస్తే సరిపోతుంది. (మీ స్మార్ట్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టిన విధంగానే).
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కాన్సెప్ట్ ఇప్పటికీ కొత్తదిగానే అనిపిస్తుంటుంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు బైక్ ఇన్సూరెన్స్ పాలసీ పొందడం అనేది మాత్రం సాధారణంగా పెట్రోల్‌తో నడిచే వాహనాలతో పోల్చుకుంటే వేరుగా ఉండదు.
మీరు ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?
మీరు ఎంతగానో ఇష్టపడే ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఎటువంటి సమయంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్ ఇండస్ట్రీ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఇది ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వచ్చింది కాబట్టి షరతులు, నిబంధనలు ఇంకా సెట్ చేయలేదు. ఏదేమైనప్పటికీ e-బైక్స్ చాలా ఖర్చుతో కూడుకున్నవి.
ఈ బైక్స్‌లో ఉన్న పరికరాలు, ఇందులో ఉండే టెక్నాలజీ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇందులోని మెకానికల్ భాగాలు ఎప్పుడైనా కానీ మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అందుకోసమే ఇతర రకాల వాహనాల వలె ఈ వాహనానికి కూడా బీమా కలిగి ఉండటం చాలా అవసరం. అంతే కాకుండా మీరు ఎటువంటి చింత లేకుండా బండి నడిపేందుకు ఇది ఉపయోగపడుతుంది.
మోటారు వాహనాల చట్టం ప్రకారం కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కలిగి ఉండటం తప్పనిసరి.
డిజిట్ అందించే ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కిలోవాట్ కెపాసిటీ, తయారీదారు, మోడల్, వయసు వంటి అనేక ఆంశాల మీద ఆధారపడి ఉంటాయి.
కిలో వాట్ కెపాసిటీతో టూ వీలర్స్ | సంవత్సరం పాలసీ కొరకు ప్రీమియం రేట్ | దీర్ఘకాలిక పాలసీ కోసం ప్రీమియం* రేటు |
3 KW కంటే తక్కువ | ₹457 | ₹2,466 |
3 KW కంటే ఎక్కువ కానీ 7 KW కంటే తక్కువ | ₹609 | ₹3,273 |
7 KW కంటే ఎక్కువ కానీ 16 KW కంటే తక్కువ | ₹1,161 | ₹6,260 |
16 KW పెద్దవి | ₹2,383 | ₹12,849 |
* దీర్ఘకాలిక పాలసీ అంటే కొత్త ప్రైవేటు టూ వీలర్ల కోసం 5 సంవత్సరాల పాలసీ (మూలం- ఐఆర్డీఏఐ (IRDAI)
ఏం కవర్ కావంటే?
బీమాలో కవర్ అయ్యే విషయాలను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కవర్ కాని విషయాలను గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు ఏదైనా సందర్భంలో క్లెయిమ్ చేస్తున్నపుడు మీరు ఆశ్చర్యపోకుండా ఉండేందుకు కవర్ కాని విషయాలను కూడా తెలుసుకోవాలి.
థర్డ్ పార్టీ లయబులిటీ బైక్ పాలసీ తీసుకున్న పాలసీదారుడి సొంత వాహనానికి అయిన డ్యామేజీలు కవర్ చేయబడవు.
మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదం చేసినా లేదా సరైన లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదం చేసినా ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ కవర్ కాదు.
మీరు లెర్నర్ లైసెన్స్‌ను కలిగి ఉండి పిలియన్ (వెనకాల) సీటు మీద సరైన లైసెన్స్ హోల్డర్ లేకుండా వాహనం నడిపినప్పుడు ప్రమాదం అయితే బీమా కవర్ కాదు.
ప్రమాదం వలన నేరుగా జరిగిన డ్యామేజ్ కానట్లయితే (ఉదా. ప్రమాదం తర్వాత డ్యామేజ్ అయిన టూ వీలర్‌ను మీరు తప్పుగా వాడి, దాని ఇంజిన్ డ్యామేజ్ అయినపుడు అటువంటి సందర్భాలు పర్యవసాన నష్టాల కిందికి వస్తాయి. అటువంటివి కవర్ కావు)
కావాలనే నిర్లక్ష్యం చేసినపుడు (ఉదాహరణకు: వరదల్లో వాహనాన్ని నడపడం వలన జరిగిన డ్యామేజ్. తయారీదారుని డ్రైవింగ్ మ్యాన్యువల్ ప్రకారం ఇలా చేయడం సరి కాదు. ఇటువంటి నష్టాలు కవర్ చేయబడవు)
కొన్ని ప్రత్యేక సందర్భాలు యాడ్–ఆన్స్ వల్లే కవర్ అవుతాయి. ఒకవేళ మీరు ఆ ప్రత్యేక యాడ్–ఆన్స్ కొనుగోలు చేయకపోతే ఆ భాగాలకు జరిగిన నష్టాలు కవర్ చేయబడవు.
డిజిట్ ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్నే ఎందుకు ఎంచుకోవాలి?
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు కనుక డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినా లేదా రెన్యూవల్ చేసినా కానీ నిశ్చింతగా ఉండండి. 3 సులభమైన స్టెప్స్‌లో మీ క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతుంది.
స్టెప్1
1800-258-5956 నంబర్‌పై కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు.
స్టెప్2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ వాహనం డ్యామేజ్ అయిన భాగాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌తో ఫొటో తీయండి. దీనికి సంబంధించి దశలవారీ ప్రక్రియన మేము మీకు తెలియజేస్తాం.
స్టెప్3
ఏ పద్ధతిలో మీకు రిపేర్ కావాలో ఎంచుకోండి. రీయింబర్స్మెంట్ లేదా నగదు రహిత ప్రక్రియ. ఒకవేళ మీరు నగదు రహిత విధానాన్ని ఎంచుకుంటే మా నెట్వర్క్ గ్యారేజీని సందర్శిస్తే సరిపోతుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌కు బీమా తప్పనిసరా?
మొదట్లో ప్రవేశపెట్టబడిన e-బైక్స్‌కు ఎటువంటి రిజిస్ట్రేషన్, బీమా అవసరం ఉండేది కాదు. 250 వాట్ల కంటే తక్కువ సామర్థ్యంతో ఇవి ఉండేవి. వీటి స్పీడ్ కూడా గంటకు 25 కిలోమీటర్లకు మించకపోయేది. కానీ ఇప్పుడు వస్తున్న బైక్స్ అనేక ఫీచర్లతో వస్తున్నాయి. అందుకోసమే వీటిని కూడా మోటారు వాహనాల చట్టం కిందకు తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు.
అంటే ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్న వినియోగదారులు కూడా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. బీమా తీసుకోవాలి. హెల్మెట్ ధరించాలి. ఇంకా మోటారు వాహనాల చట్టంలోని అన్ని నిబంధనలు వీరికి కూడా వర్తిస్తాయి.
ఎటువంటి రకానికి చెందిన బైక్ ఇన్సూరెన్స్ అత్యుత్తమం?
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సాధారణంగా ఏ వాహనానికి అయినా అత్యుత్తమ ఎంపిక. ఇందులో అదనపు సంరక్షణ ఉంటుంది. ఇంకా ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్స్ చాలా ఖరీదుతో కూడుకున్నవి. కావున సమగ్ర సంరక్షణ కోసం మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని మేము సిఫారసు చేస్తాం.
మీ ఎలక్ట్రిక్ బైక్‌కు ఉన్న కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ కవరేజి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అదనంగా సొంత డ్యామేజీలు, డిజిట్లో ఉన్న ఏదైనా యాడ్–ఆన్స్ ఎంచుకోవాలన్నా కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది.