Third-party premium has changed from 1st June. Renew now
కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ వివరణ
మీరు మీ బైక్‌ను ప్రేమిస్తారని మాకు తెలుసు. బహుశా చాలాసార్లు ఆలోచించి, దాని గురించి తెలుసుకొని, ప్లాన్ చేసుకొని, బడ్జెట్ పెట్టుకొని, ఎంక్వైరీ చేసి, చాలామంది సూచనలు విన్న తరువాత మాత్రమే బైక్‌ను కొనుగోలు చేసి ఉంటారు. మొత్తానికి ఇప్పుడు మీ దగ్గర మీ కలల బైక్ ఉంది; మరి మీ బైక్, మీ జేబు రెండింటినీ మీరు సంరక్షించాలని అనుకోవడం లేదా?
మీ బైక్‌కు ఇన్సూరెన్స్ చేయించుకోండి. థ్రిల్లింగ్ రోడ్ ట్రిప్పులను ఎంజాయ్ చేయండి. సరైన బైక్ ఇన్సూరెన్స్ తో పాటు మిమ్మల్ని అత్యుత్తమంగా సంరక్షించే అవసరమైన యాడ్–ఆన్ల గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతి అంశంపై మేం మిమ్మల్ని గైడ్ చేస్తాం.
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు అన్ని రకాల ఊహించని సంఘటనలకు విస్తృతమైన కవరేజీని అందిస్తుంది. తద్వారా మీరు పూర్తిగా చిరాకు లేని డ్రైవ్‌ను ఆస్వాదిస్తారు. ఇది మీ స్వంత డ్యామేజీ కవర్, ఇన్సూరెన్స్‌ల కాంబినేషన్.
ఇన్సూరెన్స్ పాలసీని ఎంపిక చేసేటప్పుడు IDV ప్రాధాన్యత
IDV అనేది ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ, ఇది మీకు ఇన్సూరర్ నుంచి వచ్చే మ్యాగ్జిమమ్ అమౌంట్. మీ బైక్ దొంగిలించబడినా లేదా రిపేర్ చేయలేనంతగా పాడైపోయినా, మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఇచ్చే మ్యాగ్జిమమ్ అమౌంట్. తక్కువ ప్రీమియంలు ఆకర్షిస్తాయని మాకు తెలుసు, అయితే అది మీకు మ్యాగ్జిమమ్ ఆర్థిక ప్రయోజనాన్ని ఇవ్వదు.
ప్రీమియం మాత్రమే కాకుండా మీకు ఆఫర్ చేయబడుతున్న IDVని ఎల్లప్పుడూ చెక్ చేసుకోండి. మీరు అధిక IDVని ఎంచుకోవాలని మేం సూచిస్తున్నాం. ఎందుకో మీకు తెలుసా? మీ బైక్ మొత్తం కోల్పోయినట్లయితే, అధిక IDV ఎక్కువ రీఎంబర్స్‌మెంట్‌లకు అవకాశమిస్తుంది.
మీకు నచ్చినట్లుగా మీ IDVని కస్టమైజ్ చేసుకోవడానికి మేము వీలు కల్పిస్తాం. ఎందుకంటే మీరు ఎలాంటి రాజీ లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని మేం కోరుకుంటాం.
చెక్ (Check): థర్డ్ పార్టీ ప్రీమియం అమౌంట్ లెక్కించడానికి లేదా బైక్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లతో కూడిన కాంప్రహెన్సివ్ పాలసీని లెక్కించడానికి బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ (Bike Insurance Premium Calculator)
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ల మధ్య తేడాలు
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ | థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ |
---|---|
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్ పార్టీ బాధ్యత, స్వంత డ్యామేజీ కవర్ల కాంబినేషన్. | కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్ పార్టీ బాధ్యత, స్వంత డ్యామేజీ కవర్ల కాంబినేషన్. |
మీ బైక్ దొంగతనం జరిగినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు, డ్యామేజీ అయితే కవర్ అవుతుంది. ఇది మీ బైక్‌కు, మరో వ్యక్తి, వాహనం లేదా ఆస్తికి కలిగే అన్ని రకాల నష్టాలకు ఆర్థికపరంగా మద్దతుగా ఉంటుంది. | థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ డ్యామేజీ/పోగొట్టుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని కవర్ చేస్తుంది. |
ఈ పాలసీపై మీరు యాడ్-ఆన్‌లను కూడా ఎంపిక చేసుకోవచ్చు. | ఈ పాలసీ కేవలం పర్సనల్ యాక్సిడెంట్ కవర్ని మాత్రమే అందిస్తుంది. |
యాడ్-ఆన్‌లతో పాటు మీ బైక్‌కు పూర్తి కవరేజీ అవసరం అయితే సిఫారసు చేయతగినది. | మీరు అరుదుగా బైక్ రైడ్ చేస్తే లేదంటే మీ బైక్ చాలా పాతది అయితే ఈ పాలసీ సిఫారసు చేయతగినది. |
ఈ పాలసీ విస్తృతమైన కవరేజీని అందిస్తుంది. | ఈ పాలసీ పరిమితమైన కవరేజీని అందిస్తుంది. |
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కన్నా ఎక్కువ. | థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. |
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
Digit అందించే కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎంచుకోవాలి?
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్‌లో కవర్ అయ్యే యాడ్-ఆన్స్
కాలంతో పాటు మీ బైక్ వంటి ఆస్తుల విలువ తగ్గుతుంది. అందుకే మీరు క్లెయిమ్ చేసినప్పుడల్లా డిప్రిషియేషన్ ఛార్జ్ చేయబడుతుంది. అయితే ఈ యాడ్–ఆన్ ద్వారా అంటే జీరో డిప్రిషియేషన్ కవర్ (Zero Depreciation Cover) ద్వారా మీరు మీ బైక్ డిప్రిషియేషన్ నుంచి తప్పించుకోవచ్చు. క్లెయిమ్‌లు, రిపేర్ల సమయంలో పూర్తి ఖర్చులను (డిప్రిషియేషన్ ఛార్జ్ లేకుండా) పొందవచ్చు.
ఒకవేళ మీరు మీ బైక్ దొంగిలించబడిన లేదా రిపేర్ చేయలేనంతగా డ్యామేజీ అయ్యే పరిస్థితిలో ఉన్నట్లయితే, ఈ యాడ్-ఆన్ ఉపయోగపడుతుంది. ఇన్వాయిస్ కవర్ యాడ్-ఆన్ ద్వారా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులతో సహా మీకు సేమ్ లేదా అదేవిధమైన బైక్ పొందడానికి అయ్యే ఖర్చులను మేం కవర్ చేస్తాం.
ఒకవేళ యాక్సిడెంట్ ఇంజన్‌కు నష్టం కలిగించినట్లయితే, అది స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీ కింద కవర్ చేయబడుతుంది. కానీ అది కాన్సీక్వెన్షియల్ డ్యామేజ్ అయితే కవర్ కాదు. ఇక్కడ ఈ యాడ్-ఆన్ రిపేర్ ఛార్జీలను కవర్ చేస్తూ మీకు సాయం చేస్తుంది.
ఏదైనా బ్రేక్ డౌన్ అయినట్లయితే, మీకోసం, మీ టూ–వీలర్ కోసం మేం ఎల్లప్పుడూ ఉన్నామనే భరోసాను రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్–ఆన్ (roadside assistance add-on) ఇస్తుంది. ఇందులో బెస్ట్ విషయం ఏంటి? మా సహాయం అడగడం కూడా క్లెయిమ్‌గా పరిగణించబడదు
ఈ యాడ్-ఆన్‌లో స్క్రూలు, ఇంజన్ ఆయిల్స్, నట్లు, బోల్ట్‌లు, గ్రీజ్ వంటి భాగాలను రీప్లేస్ చేయడానికి అయ్యే ఖర్చు స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీలో కవర్ చేయబడుతుంది.
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్‌లో కవర్ కానివి ఏంటి?
కవర్ చేయబడని అంశాలనేవి ఒక్కో ఇన్సూరెన్స్ కంపెనీకి భిన్నంగా ఉంటాయి. అయితే, కొన్నింటిని లిస్ట్ చేస్తూ మీ బైక్‌కు కలిగే డ్యామేజీ మీ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడని కొన్ని పరిస్థితులను మేం మీకు ఇస్తాము:
థర్డ్–పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కన్నా కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని మేం సూచిస్తున్నాం. ఇన్సూరెన్స్ చేసిన వాహనం, దాని యజమాని, ప్రభావిత థర్డ్ పార్టీకి కలిగే అన్ని నష్టాల ఖర్చులను కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. కానీ, థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కేవలం రక్షణను మాత్రమే అందిస్తుంది.
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీకి గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
జీరో-డిప్రిషియేషన్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌తో పోల్చితే కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ ఎలా భిన్నమైనది?
అవి రెండు పూర్తిగా భిన్నమైన విషయాలు! కాంప్రహెన్సివ్ టూవీలర్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే జీరో డిప్రిషియేషన్ అనే యాడ్–ఆన్‌ను మీరు కాంప్రహెన్సివ్ టూవీలర్ బైక్ ఇన్సూరెన్స్‌కు యాడ్ చేసుకోవచ్చు.
జీరో డిప్రిషియేషన్ బైక్ ఇన్సూరెన్స్ (Zero Depreciation Bike Insurance) గురించి మరింత తెలుసుకోండి.
పాత బైక్‌కు కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం మంచి ఆలోచనేనా?
ఇది మీ బైక్ ఎంత పాతది, మీరు దానిని ఎంత తరచుగా ఉపయోగిస్తారు, దాన్ని ఎంత కాలం ఉపయోగించాలని ఆలోచిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ బైక్ ఇంకా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, మీరు దానిని రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్నట్లయితే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే పెద్దగా ఖర్చు కాదు. తద్వారా ఏదైనా దురదృష్టకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు దానిపై ఖర్చు చేయాల్సిన అవసరం రాదు.
కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు తీసుకోవాలి?
కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి అనువైన సమయం మీరు మీ బైక్‌ని కొన్నప్పుడే. అయితే, ఇది ఎప్పుడూ ఆలస్యం కాదు! ఒకవేళ మీకు ప్రస్తుతం థర్డ్ పార్టీ పాలసీ మాత్రమే ఉన్నట్లయితే, మీరు స్వంత డ్యామేజీ కవర్‌తో దీన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు లేదా ఒకవేళ మీ పాలసీ త్వరలో రెన్యువల్ చేయాల్సి వస్తే - ఈసారి కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో రెన్యువల్ చేసుకోండి.