Third-party premium has changed from 1st June. Renew now
ఆన్లైన్లో యమహా బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు /రెన్యువల్
యమహా బైక్‌ను కొనుగోలు చేసే ముందు ప్రతీ ఒక్క విషయాన్ని తెలుసుకోండి. అందుబాటులో ఉన్న మోడల్స్, అవి ఎలా పాపులర్ అయ్యాయి, యమహా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మీ ప్రయోజనాలను ఎలా పెంపొందించుకోవచ్చో పూర్తిగా తెలుసుకోండి.
నాణ్యమైన ద్విచక్ర వాహనాలకు మన భారతదేశంలో డిమాండ్ చాలా అధికంగా ఉంది. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో 2011వ సంవత్సరంతో పోల్చుకుంటే 2019వ సంవత్సరం నాటికి వాహన కొనుగోళ్లు దాదాపు రెట్టింపు అయ్యాయి. 2011లో భారతీయులు 1.17 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయగా.. 2019కి వచ్చేసరికి ఆ సంఖ్య 2.1 కోట్ల యూనిట్లను చేరుకోవడం గమనార్హం. (1)
ఈ విధంగా యమహా బైక్‌లు అటు ప్రీమియం బైక్‌లను, ఇటు మిడ్ రేంజ్, లోయర్ రేంజ్ బైక్‌లను అందజేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మీ అవసరాలకు తగిన స్కూటర్‌ను యమహా అందజేస్తున్న విస్తృత శ్రేణిలో కనుక్కోవచ్చు.
బైక్ ధర ఎక్కువ అయినా కానీ, తక్కువ అయినా కానీ మంచి యమహా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం చాలా అవసరం. దేశంలో రోజురోజుకూ ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మంచి బైక్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ ఆర్థిక నష్టాలను కవర్ చేస్తుంది. అంతేగాక మీ లయబులిటీని కూడా అందజేస్తుంది. ఎటువంటి సందర్భంలోనైనా మీ యమహా బైక్ పాడయితే ఇది కవర్ చేస్తుంది.
అనుకోకుండా ద్విచక్ర వాహనానికి జరిగే ఆర్థిక నష్టాలు, డ్యామేజీల గురించి మాత్రమే కాకుండా మోటార్ వాహనాల చట్టం–1988 ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి ద్విచక్ర వాహనానికి బీమా ఉండటం తప్పనిసరి.
టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు మీ బైక్ కంపెనీ యమహా మోటార్స్ గురించి లోతుగా తెలుసుకునేందుకు కొంత సమయాన్ని కేటాయించండి.
యమహా బైక్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
ఏమేం కవర్ కావంటే
కవర్ అయ్యే విషయాలను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కవర్ కాని విషయాలను గురించి పూర్తిగా తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు ఎప్పుడైనా క్లెయిమ్ చేసే సమయంలో ఇది కవర్ కాదు అంటే ఆశ్చర్యపోకుండా ఉంటారు. కింద పేర్కొన్న పరిస్థితుల్లో బీమా కవర్ కాదని గుర్తించాలి. అలాంటి పరిస్థితులు కొన్ని:
ఒకవేళ మీరు థర్డ్ పార్టీ లేదా లయబులిటీ ఓన్లీ బైక్ పాలసీని తీసుకుంటే సొంత వాహనానికి అయిన డ్యామేజీలు కవర్ కావు.
మీరు మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదం చేసినా లేదా సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా మీ బీమా కవర్ కాదు.
ఒకవేళ మీకు లెర్నర్ లైసెన్స్ ఉండి, సరైన లైసెన్స్ ఉన్న వ్యక్తి మీ వెంట లేకుండా మీరు వాహనం నడిపిన సందర్భంలో బీమా వర్తించదు.
ప్రమాదం వలన నేరుగా సంభవించని డ్యామేజీలు. (ఉదా. ప్రమాదం జరిగిన తర్వాత డ్యామేజ్ అయిన టూ వీలర్ ఇంజిన్‌ను నడిపించేందుకు ప్రయత్నించినపుడు ఇంజిన్ మరింతగా డ్యామేజ్ అయిన సందర్భంలో బీమా వర్తించదు)
స్వీయ నిర్లక్ష్యం వలన సంభవించే అన్ని నష్టాలు. (ఉదా. వరదల్లో మీరు టూ వీలర్‌ను నడిపినపుడు డ్యామేజ్ అయితే అది కవర్ కాదు. డ్రైవింగ్ మ్యాన్యువల్ ప్రకారం వరదల్లో బండి నడపవద్దని క్లియర్‌గా ఉంటుంది.)
కొన్ని నష్టాలను కేవలం యాడ్–ఆన్స్ మాత్రమే కవర్ చేస్తాయి. మీరు అందుకు సంబంధించిన యాడ్–ఆన్లను కొనుగోలు చేయకపోతే.. అటువంటి నష్టాలు కవర్ కావు.
డిజిట్ అందించే యమహా బైక్ ఇన్సూరెన్స్నే ఎందుకు కొనుగోలు చేయాలి?
మీ అవసరాలకు తగిన యమహా ఇన్సూరెన్స్ ప్లాన్లు
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
ప్రమాదం వలన సొంత ద్విచక్ర వాహనానికి డ్యామేజ్ కానీ, నష్టం కానీ జరిగితే.. |
|
అగ్ని ప్రమాదాల వలన సొంత ద్విచక్రవాహనానికి డ్యామేజ్ కానీ, నష్టం కానీ జరిగితే.. |
|
ప్రకృతి విపత్తుల వలన సొంత ద్విచక్రవాహనానికి డ్యామేజ్ కానీ, నష్టం కానీ జరిగితే.. |
|
థర్డ్ పార్టీ వాహనానికి డ్యామేజ్ అయితే |
|
థర్డ్ పార్టీ ఆస్తికి డ్యామేజ్ అయితే |
|
వ్యక్తిగత ప్రమాద బీమా |
|
థర్డ్ పార్టీ వ్యక్తి మరణించినా/ గాయాలపాలయినా.. |
|
మీ స్కూటర్ లేదా బైక్ దొంగిలించబడితే |
|
మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోండి. |
|
నచ్చిన యాడ్–ఆన్స్‌తో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
థర్డ్ పార్టీ, కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ మధ్య తేడాలను గురించి మరింత తెలుసుకోండి.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు కనుక డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినా, రెన్యువల్ చేసినా నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 సులభమైన స్టెప్పులో మీ క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతుంది.
స్టెప్ 1
1800-258-5956 నంబర్‌కు కాల్ చేయండి. ఎటువంటి ఫామ్స్ నింపాల్సిన పని లేదు.
స్టెప్ 2
మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ వాహనం డ్యామేజ్ అయిన భాగాన్ని మీ స్మార్ట్ ఫోన్‌తో ఫొటో తీయండి. దశల వారీగా ఏం చేయాలో మేము మీకు తెలియజేస్తాం.
స్టెప్ 3
ఏ పద్ధతిలో మీకు రిపేర్ కావాలో ఎంచుకోండి. రీయింబర్స్మెంట్ లేదా నగదు రహిత ప్రక్రియ. ఒకవేళ మీరు నగదు రహిత ప్రక్రియను ఎంచుకుంటే మా నెట్వర్క్ గ్యారేజీని సందర్శిస్తే సరిపోతుంది.
యమహా మోటార్ కంపెనీ: మీరు ఈ తయారీదారుడి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు
యమహా అనేది 1955లో స్థాపించబడింది. ఇది జపాన్‌కు చెందిన టూ వీలర్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం జపాన్‌లోని షిజుయోకాలో ఉంది. భారతదేశంలో యమహా 1985లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం మన దేశంలో యమహాకు హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి.
యమహా కంపెనీ విజయవంతం కావడానికి ప్రధాన కారణం అది తన కస్టమర్లను చూసుకునే విధానం. నేడు భారతదేశంలో యమహా కంపెనీకి 500 మంది కంటే ఎక్కువ మంది డీలర్లు ఉన్నారు. యమహా స్పోర్ట్స్ బైక్స్, సూపర్ బైక్స్, స్ట్రీట్ బైక్స్, స్కూటర్లను తయారు చేస్తుంది.
భారతదేశంలో అందుబాటులో ఉన్న యమహా యొక్క ప్రముఖ మోడళ్లు ఇక్కడ ఉన్నాయి.
యమహా YZF R15 V3 (Yamaha YZF R15 V3)
యమహా MT 15 (Yamaha MT 15)
యమహా FZ S V3 (Yamaha FZ S V3)
యమహా ఫసీనో (Yamaha Fascino)
యమహా FZ25 (Yamaha FZ25)
యమహాలో ప్రీమియం బైకులతో పాటుగా సరసమైన ధరలకు కూడా బైక్స్ లభిస్తాయి. బైక్ ధరతో సంబంధం లేకుండా మంచి యమహా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవడం చాలా ముఖ్యం.
రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో మీ సొంత వాహనం లేదా థర్డ్ పార్టీ వాహనానికి ఏవైనా డ్యామేజీలు జరిగితే చట్టం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బైక్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది.
యమహా బైకులు భారతదేశంలో ఎందుకు అంత పాపులర్?
ప్రధానంగా చూసుకుంటే ఈ కింది కారణాల వలన యమహా బైకులు భారతదేశంలో చాలా ఫేమస్ అయ్యాయి.
విస్తృత శ్రేణి ఉత్పత్తులు – ఇతర ద్విచక్ర వాహన కంపెనీలతో పోల్చుకుంటే యమహా అకేషనల్, రెగ్యులర్ రైడర్ల కోసం వాహనాలను తయారు చేస్తుంది. కంపెనీ ఎన్నో రకాల వెరైటీ వాహనాలను అందజేస్తోంది. ధరలు కూడా సాధారణంగానే ఉంటాయి. మీకు ఆసక్తి ఉన్న, మీ బడ్జెట్‌కు సరిపోయే బైక్‌ను మీరు కొనుగోలు చేయొచ్చు.
పర్ఫామెన్స్ ఇచ్చే బైకులు – యమహా యొక్క ప్రతీ బైక్ అద్భుతమైన పర్ఫామెన్స్తో వస్తుంది. ఇంజిన్ క్యూబిక్ కెపాసిటీ, హ్యాండ్లింగ్, సస్పెన్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటీ చాలా నాణ్యతతో తయారు చేయబడతాయి. ఇవి మీకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందజేస్తాయి.
మంచి కస్టమర్ సర్వీస్ – యమహా అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కంపెనీ. ఇదో గ్లోబల్ బ్రాండ్. కంపెనీ మెరుగైన కస్టమర్ సర్వీసును అందజేస్తోంది. బైక్ గురించి ఏదైనా చిన్న సందేహం నుంచి యమహా బైకుల గురించి మరింత తెలుసుకోవడం వరకు యమహా కస్టమర్ కేర్ మీకు సాయం చేస్తుంది. ఈ విధానం మిమ్మల్నియమహా ఫ్యామిలీలో చేరేందుకు ప్రేరేపిస్తుంది.
భారతీయులకు యమహా బైక్స్ ఎంత ప్రీతిపాత్రమో మీకు తెలుసు. కావున అటువంటి బైక్స్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మీబైక్ (అందులో మీరు పెట్టిన పెట్టుబడి) మీరు బండికి ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినపుడు మాత్రమే ఇది సేఫ్‌గా ఉంటుంది.
యమహా బైక్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు మీరు తప్పకుండా కొనుగోలు చేయాలి?
డ్రైవర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బైకులు నడిపినా కూడా అనుకోని సందర్భాల్లో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఒక సర్వే ప్రకారం 2016వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల ద్వారా సంభవించిన మరణాల్లో దాదాపు 25 శాతం మంది బైక్ లేదా స్కూటర్ నడిపేవారే ఉండటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. (2)
బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యమో ఇక్కడ ఉంది:
చట్టప్రకారం తప్పనిసరి – మేము ఇది వరకే చెప్పినట్లు మోటార్ వాహనాల చట్టం–1988 ప్రకారం భారతీయ రోడ్ల మీద వాహనాలతో తిరిగేందుకు బీమా తప్పనిసరి. కనీసం మీకు థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ అయినా ఉండాలి. లేకపోతే మీరు భారత రోడ్ల మీద తిరగలేరు. కావున బైక్ యజమానులకు ఈ విషయంలో మరో అవకాశం లేదు. ఒకవేళ కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా లేకుండా యమహా బైక్ వేసుకుని రోడ్ల మీద తిరిగి ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే.. మొదటి సారి రూ. 2,000 రెండో సారి రూ. 4,000 జరిమానా వేస్తారు.
న్యాయపరమైన లయబులిటీల నుంచి కాపాడుతుంది – ఒకవేళ మీ బైక్ ప్రమాదం బారిన పడితే.. మీ వాహనం వలన ఆస్తి లేదా వ్యక్తికి గాయాలైతే థర్డ్ పార్టీ యమహా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ వారికి ఆర్థిక కవరేజీని అందిస్తుంది. మీకు కనుక ఇన్సూరెన్స్ లేకపోతే మీరు చట్టపరంగా థర్డ్ పార్టీకి జవాబుదారీగా ఉండాలి. వారికి అయిన ఆర్థిక నష్టాలను భరించాలి.
థెఫ్ట్ కవర్ – కేవలం ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే కాకుండా మీ యమహా బండి దొంగతనానికి గురైనా కానీ బీమా సంస్థలు మీకు పెద్ద మొత్తాన్నే అందజేస్తారు. ఈ డబ్బుతో మీరు బైక్ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఆర్థికంగా ఎటువంటి నష్టం కలగకుండా ఈ ప్లాన్ కాపాడుతుంది.
సొంత డ్యామేజ్ రిపేర్ల కోసం రీయింబర్స్మెంట్ – ప్రమాదం జరిగినప్పుడు కేవలం థర్డ్ పార్టీ వ్యక్తులు, వాహనాలకు మాత్రమే నష్టం జరగదు. మీ సొంత బైక్ కూడా డ్యామేజ్ అవుతుంది. మీరు కనుక థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీ తీసుకుంటే సొంత బైక్ రిపేర్ కోసం అయిన ఖర్చులను క్లెయిమ్ చేయలేరు. కానీ కాంప్రహెన్సివ్ యమహా ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీరు మీ సొంత చికిత్సకు అయిన ఖర్చులు, సొంత వాహనానికి జరిగిన డ్యామేజీల నుంచి కూడా ఆర్థికంగా రక్షించబడతారు.
మరణం/శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే ఏకమొత్త చెల్లింపు – బైక్ ప్రమాదంలో పాలసీదారుడు చనిపోయినా లేదా శాశ్వత వైకల్యానికి గురైనా కానీ బీమా కంపెనీలు వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ప్రమాద బీమా కింద పెద్ద మొత్తంలో నగదును అందజేస్తాయి. దీని వలన వారు జీవనం కొనసాగించడం వీలు పడుతుంది.
మీరు మీ యమహా ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?
మీ బైక్‌కు ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. మీకు ఆర్థిక వనరులు అధికంగా ఉంటే మీరు బెస్ట్ కవరేజీని ఎంచుకోవచ్చు. ఒకవేళ మీకు ఆర్థిక వనరులు అంతగా లేకపోతే ప్రీమియం భారాన్ని తగ్గించుకునేందుకు కింది చిట్కాలను పాటించండి.
NCB మీకోసం పనిచేసేలా చూసుకోండి - నో క్లెయిమ్ బోనస్ (NCB) అనేది మీ ప్రీమియాన్ని తగ్గించుకునేందుకు అత్యుత్తమ మార్గం. మీ ప్రీమియంపై ఎన్సీబీ (NCB) బోనస్ ఆస్వాదించేందుకు మీ బీమా కంపెనీ మీకు నో క్లెయిమ్ బోనస్ వర్తింపజేస్తుందా? లేదా అనేది తెలుసుకోండి. ఎన్సీబీ ప్రయోజనాలను ఆనందించేందుకు మీ యమహా బైకులను రోడ్ల మీద చాలా జాగ్రత్తగా నడపండి. ఎన్సీబీ ప్రయోజనాలను ఆస్వాదించండి.
స్వచ్చంద మినహాయింపులను ఎంచుకోండి – బీమా కంపెనీ తప్పనిసరి మినహాయింపులను సెట్ చేసింది. ఇందులో మీకు చెప్పాల్సింది ఏమీ లేదు. మీరు కనుక మీ పాలసీ యొక్క ప్రీమియాన్ని తగ్గించుకోవాలని చూస్తే మీరు స్వచ్చంద మినహాయింపుల ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. మీరు స్వచ్చంద మినహాయింపులను ఎంచుకున్నపుడు బీమా కంపెనీ మీ ప్రీమియంను గణనీయంగా తగ్గిస్తుంది.
నేరుగా బీమా కంపెనీలతో సంభాషించండి – మీరు పాలసీని తీసుకోవాలని భావించినపుడు ఎటువంటి మధ్యవర్తిని లేదా బ్రోకర్‌ను సంప్రదించకండి. మీరు ఇలా చేయడం వలన పాలసీ ఖర్చు పెరిగిపోతుంది. నేరుగా బీమా కంపెనీనే సంప్రదించండి. అక్కడ మీకు తక్కువ ఖర్చుకు పాలసీలు అందుతాయి. అంతేకాకుండా ప్రొడక్టులను గురించిన మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకునేందుకు వీలుంటుంది.
అవసరమయిన యాడ్–ఆన్లను మాత్రమే కొనుగోలు చేయండి – కాంప్రహెన్సివ్ యమహా బైక్ ఇన్సూరెన్స్ మీకు సమగ్ర సంరక్షణను అందజేస్తుంది. ఇది చాలా సందర్భాల్లో మీకు ఆర్థిక భరోసాను అందజేస్తుంది. అంతేకాకుండా మీ ప్లాన్‌కు రైడర్స్ (యాడ్–ఆన్స్) జత చేయడం వలన మీ భద్రత మరింత పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మీ ఖరీదైన బైక్‌కు ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటపుడు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. బీమా కంపెనీ గౌరవంతో పాటుగా అది అందించే సేవలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. తక్కువ ఖర్చుతో కూడుకున్న పాలసీని ఎంచుకోవడం అంత మంచిది కాదు. ఏవైనా ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఇది మీకు తక్కువ ఆర్థిక భద్రతను అందజేస్తుంది.
డిజిట్ యమహా టూ వీలర్ ఇన్సూరెన్స్ ఎంచుకునేందుకు గల కారణాలు?
భారతదేశంలో టూ వీలర్ పాలసీలను అందించేందుకు అనేక బీమా కంపెనీలు ఉన్నాయి. మీ యమహా బైక్ కోసం డిజిట్ పాలసీని ఎందుకు ఎంచుకోవాలో కింద కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ పాలసీ ద్వారా మీరు ఆర్థికంగా సంరక్షించబడతారు. –
వివిధ రకాల టూ వీలర్ పాలసీల లభ్యత – టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీల్లో డిజిట్ అనేక ఎంపికలను అందజేస్తుంది. వాటిలో కొన్ని –
a) థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ పాలసీ – మీ టూ వీలర్ వల్ల ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తులకు ఏవైనా గాయాలు అయినా లేదా థర్డ్ పార్టీ ప్రాపర్టీకి ఏదైనా నష్టం జరిగినా కానీ కవర్ చేస్తుంది.
b) కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ – ఇదో సమగ్ర సంరక్షణా ప్లాన్. ప్రమాదంలో సంభవించే సొంత డ్యామేజ్, థర్డ్ పార్టీ డ్యామేజీలకు ఇది కవరేజీని అందజేస్తుంది. అంతేకాకుండా యమహా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, సహజ, మానవ నిర్మిత విపత్తుల నుంచి మిమ్మల్ని ఆర్థికంగా రక్షిస్తుంది.
అంతేకాకుండా మీరు డిజిట్ అందించే యమహా టూ వీలర్ బైకర్స్ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ కూడా పొందొచ్చు. కానీ 2018 సెప్టెంబర్ తర్వాత వాహనాలు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ పాలసీ థర్డ్ పార్టీ లయబులిటీలతో పాటుగా సొంత డ్యామేజీలకు కూడా సంరక్షణ కల్పిస్తుంది.
1,000 కంటే ఎక్కువ నెట్వర్క్ గ్యారేజీలు – ఎక్కువ సంఖ్యలో నెట్వర్క్ గ్యారేజీలు ఉండటం వలన మీకు చాలా చోట్ల నగదు రహిత మరమ్మతులు అందుబాటులో ఉంటాయి. మీరున్న ప్రాంతం (లొకేషన్) గురించి ఎటువంటి చింత లేకుండా ఉండొచ్చు. డిజిట్‌కు దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ నెట్వర్క్ గ్యారేజీలు ఉన్నాయి. కావున మీ బండి ఎక్కడ ఆగిపోయినా కూడా మీరు సులభంగా డిజిట్ నెట్వర్క్ గ్యారేజీని కనుక్కోవచ్చు.
కాగితాల అవసరం లేకుండానే మీ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు, రెన్యువల్ – ఎటువంటి అవాంతరాలు లేకుండా సులభంగా ఆన్లైన్లో యమహా ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేందుకు డిజిట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. పాలసీ గురించి తెలుసుకునేందుకు మా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఎంచుకోండి. అక్కడ ఉన్న ప్లాన్లను ఒకదానితో ఒకటి పోల్చి చూసి మీకు సరిగ్గా నప్పే పాలసీని ఎంచుకోండి. పాలసీ కవరేజ్ కోసం ఆన్లైన్లోనే ప్రీమియంలను చెల్లించండి. రెన్యువల్ విధానం కూడా చాలా సులభంగా ఉంటుంది. మీ పాలసీ వివరాలను ఆన్లైన్లో నింపి.. వార్షిక ప్రీమియం చెల్లించి ఎటువంటి అంతరాయాలు లేని పాలసీ కవరేజీని పొందండి.
రకరకాల యాడ్+ఆన్స్‌తో మీ యమహా టూ వీలర్‌కు అత్యుత్తమ సంరక్షణ – కంపెనీ అందజేసే ఇన్సూరెన్స్ పాలసీ సరిపోదని మీకు అనిపిస్తే అదనపు ప్రొటెక్షన్ కోసం మీరు యాడ్–ఆన్స్‌ను ఎంచుకోవచ్చు. డిజిట్ ఎన్నో ఉపయోగకరమైన యాడ్–ఆన్స్‌ను అందిస్తుంది. ఇవి ఇన్సూరెన్స్ కవరేజీని మెరుగుపరుస్తాయి. అందుబాటులో ఉన్న యాడ్ ఆన్స్
a) జీరో డిప్రిషియేషన్ కవర్ (Zero depreciation cover)
b) రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్ (Return to invoice cover)
c) కంజూమబుల్ కవర్ (Consumable cover)
d) ఇంజిన్, గేర్ ప్రొటెక్షన్ కవర్ (Engine and gear protection cover)
e) బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ (Breakdown assistance)
టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన యాడ్ఆన్స్ను ఎంచుకోండి.
అద్భుతమైన కస్టమర్ సర్వీస్ – మీరు యమహా ద్విచక్ర వాహనం కోసం బీమా ఎంచుకునేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీ సర్వీసులను మీరు తనిఖీ చేయాలి. డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ సర్వీస్ భారతదేశంలోని మిగతా ఇన్సూరెన్స్ కంపెనీల కంటే చాలా బెస్ట్‌గా ఉంటుంది. మీకు 24x7 కస్టమర్ సర్వీస్ లభిస్తుంది. కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి పాలసీ వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రిప్రసెంటేటివ్ను సంప్రదించి క్లెయిమ్స్ గురించి మీకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోండి.
నో క్లెయిమ్ (NCB) ప్రయోజనాలను పొందండి – రోడ్ల మీద మీరు జాగ్రత్తగా రైడింగ్ చేసినందుకు డిజిట్ మీకు ఈ ప్రయోజనాన్ని అందజేస్తుంది. క్లెయిమ్ చేయని సంవత్సరాలకు మీరు నో క్లెయిమ్ బోనస్‌ను పొందండి. క్లెయిమ్ చేయని సంవత్సరాలకు గాను ఇది మీకు లభిస్తుంది. ఈ నో క్లెయిమ్ బోనస్ వలన ఇన్సూరెన్స్ ప్రీమియం మీద మీకు డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా 50 శాతం వరకు డిస్కౌంట్ ప్రయోజనాలను పొందండి.
అద్భతమైన క్లెయిమ్ ప్రక్రియ, హై సెటిల్మెంట్ రేషియో – డిజిట్ మీకు స్ట్రీమ్ లైన్డ్ ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్‌ను అందజేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ సెల్ఫ్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ ద్వారా మీరు అవాంతరాలు లేని సర్వీసును పొందొచ్చు. అంతే కాకుండా చాలా ఫాస్ట్‌గా క్లెయిమ్స్‌ను సెటిల్ చేసుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఒక సంవత్సరంలో రిసీవ్ చేసుకున్న మరియు సెటిల్ చేసిన క్లెయిమ్స్ మధ్య నిష్పత్తిని తెలియజేస్తుంది. ఎక్కువ శాతం నిష్పత్తి ఉన్నవి క్లెయిమ్స్‌ను చాలా ఎక్కువగా చేసినట్లు గుర్తించబడతాయి. అదే సమయంలో తక్కువ రేషియో ఉన్నవి కష్టతరమైన క్లెయిమ్ సెటిల్మెంట్ పద్ధతిని కలిగి ఉన్నట్లు అర్థం. డిజిట్ హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ద్వారా మీరు మీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు.
భారతదేశంలో యమహా బైక్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
నా సెకండ్ హ్యాండ్ యమహా బైక్ కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేయొచ్చా?
అవును. భారతీయ రోడ్ల మీద తిరిగే వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి. మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నా బీమా తీసుకోవాలి. బైక్ కొన్న తర్వాత ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి?
నా యమహా బైక్ ఇన్సూరెన్స్ గడువు ముగిసిన తర్వాత ఎంతకాలంలో దానిని పునరుద్ధరించాలి?
మీ ఇన్సూరెన్స్ ప్లాన్ ముగిసే నెల రోజుల ముందు మీరు తప్పనిసరిగా రెన్యూవల్ చేయాలి. ఒకవేళ మీరు రెన్యూవల్ చేయడం మర్చిపోతే.. మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు కొన్ని రోజుల గ్రేస్ పీరియడ్ (అదనపు సమయం) అందజేస్తుంది. మీరు ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేయకపోతే ఎన్సీబీ వంటి ఎన్నో ప్రయోజనాలను కోల్పోతారు.
యమహా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా నేను ఎలా ప్రయోజనం పొందగలను?
యమహా థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీలు పాలసీ దారులకు నేరుగా ఎటువంటి సాయం చేయవు. మీ వాహనం వలన థర్డ్ పార్టీ వ్యక్తులు ఏదైనా డ్యామేజ్ అయితే వారికి కలిగిన నష్టాలను చెల్లిస్తారు. ఈ ప్లాన్ ద్వారా మీకు చట్టపరమైన ఆర్థిక బాధ్యత తీరుతుంది.