రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్

రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తక్షణమే తనిఖీ చేయండి.

Third-party premium has changed from 1st June. Renew now

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్‌ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం/ రెన్యువల్ చేయడం

మీ మొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? దాని ఇంజన్​ 60–70 ఏళ్ల క్రితం ప్రదర్శించిన సత్తానే ఇప్పుడు కూడా చాటుతుందా అని ఆశ్చర్యపోతున్నారా?

ఇన్సూరెన్స్ పాలసీలతో మరింత మెరుగ్గా సంరక్షించగలిగితే ప్రతీ రాయల్ ఎన్​ఫీల్డ్ ఒక తుపాకీ లాగా తయారవుతుందా, అటువంటి పాలసీల ద్వారా అందించే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు చర్చిద్దాం, తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలంగా కొనసాగుతున్న మోటార్‌సైకిల్  బ్రాండ్‌‌. దీన్ని అసాధరణ విషయంగా ఆ సంస్థ భావిస్తోంది. 1901 లో దీని ఉత్పత్తిని ప్రారంభించారు, ఈ మోడల్ బుల్లెట్ ప్రపంచంలోనే ఎక్కువ కాలం వినియోగంలో ఉన్న మోటార్‌సైకిల్ డిజైన్‌గా నిలిచింది.

4 స్ట్రోక్ ఇంజిన్‌ కలిగి, దృఢ  నిర్మాణంతో దీని డిజైన్‌ పాపులారిటీ సాధించింది. ఈ మోడల్ 1931లో ప్రారంభమైంది. మొదట్లో బుల్లెట్ 350 cc మరియు 500ccలో విడుదల చేయబడినప్పటికీ, తర్వాత 1933లో 250cc వేరియంట్‌ను విడుదల చేశారు. దృఢమైన బ్యాక్ ఫినిషింగ్ దానిని హార్డ్‌టైల్‌గా మార్చింది. తద్వారా రైడర్‌కు స్ప్రింగ్ సీటు అవసరం ఉంది. బ్రిటీష్ ఆర్మీ వారి విధుల్లో 350 cc వేరియంట్‌ను ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో గ్రేట్ సక్సెస్‌ను సాధించింది.

ఓ ప్రముఖ సామెత ప్రకారం - విత్​ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ (గొప్ప శక్తితో గొప్ప బాధ్యత కూడా వస్తుంది అని అర్థం) అందుకే మీ బైక్ వివిధ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి రక్షించబడేలా చూసుకోవడానికి, మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం.

అంతేకాకుండా, మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం కూడా తప్పనిసరి. మీరు కనీసం థర్డ్ పార్టీ లయబిలిటీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేకుండా బండి నడుపుతూ పట్టుబడితే, మొదటిసారి రూ.2000, మరోసారి కూడా పట్టుబడితే రూ.4000 వరకు మీరు జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ చేయబడతాయి

మీరు డిజిట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఇన్స్‌రెన్స్ ప్లాన్‌ల రకాలు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదంలో సొంత టూ-వీలర్ వాహనానికి కలిగే డ్యామేజులు/నష్టాలు

×

సొంత టూ–వీలర్​కు అగ్నిప్రమాదాల వల్ల కలిగే డ్యామేజులు/నష్టాలు

×

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సొంత టూవీలర్​కు కలిగే డ్యామేజీలు/నష్టాలు

×

థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజులు

×

థర్డ్ పార్టీ ఆస్తికి కలిగే డ్యామేజులు

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ వ్యక్తికి కలిగే గాయాలు/మరణం

×

స్కూటర్ లేదా బైక్ దొంగతనం అయితే

×

మీ ఐడీవీ (IDV) కస్టమైజ్ చేయడం

×

కస్టమైజ్ యాడ్-ఆన్​లతో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్​ల మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.

ఎలా క్లెయిమ్ చేయాలి?

మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‎ని కొనుగోలు చేసినా లేదా రెన్యువల్ చేసిన తరువాత, మాకు 3-దశల, పూర్తిగా డిజిటల్ క్లెయిముల ప్రక్రియ ఉన్నందున మీరు చింత లేకుండా ఉండవచ్చు.

స్టెప్ 1

1800-258-5956కి కాల్ చేయండి. ఎలాంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదు

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై స్వీయతనిఖీ కోసం ఒక లింకును పొందండి. దశలవారీగా వివరించినట్లు మీ స్మార్ట్​ఫోన్ నుంచి మీ వాహనం యొక్క డ్యామేజీలను ఫొటోలు చేయండి.

స్టెప్ 3

మీరు కావాలనుకున్న రిపేర్ విధానాన్ని ఎంచుకోండి, అంటే మా గ్యారేజీల నెట్​వర్క్ ద్వారా రీఎంబర్స్​మెంట్ లేదా నగదు రహిత విధానం.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‎లు ఎంత త్వరగా సెటిల్ చేయబడతాయి? మీ బీమా కంపెనీని మార్చేటప్పుడు మీ మదిలో మెదలాల్సిన మొదటి ప్రశ్న ఇది. మంచిదే, మీరు ఇలా ఆలోచించడం సరైనదే! డిజిట్ యొక్క క్లెయిముల రిపోర్ట్ కార్డును చదవండి

రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్: వారసత్వానికి పరిచయం

భారతదేశంలో స్వాతంత్య్రం అనంతరం కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్, బుల్లెట్ వాహనాలు చిహ్నాలుగా కొనసాగాయి. భారతీయ బైకర్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌కు ఆదరణ లభించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు:

  • 21వ శతాబ్దపు ఇంజిన్‌తో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ల ప్రస్తుత బ్యాచ్ వాటి ఇంజన్ సామర్థ్యాన్ని బట్టి 30, 40 kmpl మధ్య మైలేజీని అందిస్తుంది.
  • భారతీయ మోటార్‌సైకిల్‌ను అమితంగా ఇష్టపడేవారిలో ఈ మోడల్‌కు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇది 1960 చివరి నుండి, అదే శతాబ్దం నుండి దశాబ్దాల వరకు స్టాండలోన్ క్రూజింగ్ ఐకాన్‌గా మారింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ అనేది ఒక స్వతంత్ర మోటార్‌సైకిల్. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలు, రక్షణ దళాలను ఒక తాటిపై నడిపించింది; దాని ప్రఖ్యాత వాహన పరాక్రమం, ఐకానిక్ విలువ అలాంటిది.
  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు డిమాండ్ తగ్గడంతో కంపెనీ ఈ ఐకాన్‌ను రెన్యువల్ చేయాల్సి వచ్చింది. ఈ ఆధునిక బుల్లెట్ దాని పాత మోడల్స్ మాదిరిగానే దాని మెయిన్‌ ఫ్రేమ్‌తో అదే డిజైన్‌ను కలిగి ఉంది. బరువు తగ్గించి, ట్విన్-స్పార్క్, అనుబంధ సాంకేతికతను పరిచయం చేయడం వల్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ తాజా రూపంలో కనిపిస్తోంది. 

సాంకేతికత పరంగా చాలాసార్లు అప్​గ్రేడ్ అయిన కారణంగా బుల్లెట్ ఖరీదైన యంత్రంగా మారింది. అయితే దీనిపై పెట్టిన ప్రతీ రూపాయి ఖచ్చితంగా విలువైనదిగా చెప్పుకోవాలి. అందుకే బుల్లెట్ బండికి కలిగే ఏదైనా డ్యామేజ్ లేదంటే ప్రమాదం జరగడం వల్ల రిపేర్ లేదంటే రీప్లేస్ చేయాల్సి వస్తే జేబుకు చిల్లు పడుతుంది.

కాబట్టి ఈ అందమైన బైకును కలిగిన యజమానులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బుల్లెట్ ఇన్సూరెన్స్ ధరను తనిఖీ చేసి, దరఖాస్తు చేయాలి

బీమా పాలసీ గురించి వినగానే మిగతా అన్నింటి గురించి వదిలేసి, యజమానుల మనసులో మొదట వచ్చేది ఆర్థిక సంరక్షణకు సంబంధించిన విషయమే. డిజిట్ నుంచి వారి రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్ పాలసీతో వారు పొందగలిగే కొన్ని విలువైన ప్రయోజనాల వల్ల వారి మనసుల్లో ఆశలు నింపగలదు.

రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్ కోసం డిజిట్‎నే ఎందుకు ఎంచుకోవాలి?

ఈ యంత్రాల వారసత్వాన్ని అర్థం చేసుకొని, ప్రతీ యజమాని తమ రైడ్‎ను సాధ్యమైనంత వరకు కాపాడుకోవాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. డిజిట్ ఈ కోరికను అర్థం చేసుకుంటుంది, ఈ టూవీలర్ల పట్ల ప్రేమను కూడా గౌరవిస్తుంది. ఫలితంగా డిజిట్ నుంచి బుల్లెట్ ఇన్సూరెన్స్ కింద పేర్కొన్న ప్రయోజనాలను కలిగి ఉంది:

భారతదేశ వ్యాప్తంగా అనేక నెట్​వర్క్ గ్యారేజీలు

దేశవ్యాప్తంగా ప్రయాణాలు, యాత్రలకు ఇప్పటికీ ఉపయోగించబడుతున్న ఒక మోటార్ సైకిల్ మోడల్‎గా రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ నిలుస్తుంది. సుదూర ప్రయాణాల కోసం గో-టూ మెషీన్ కావడం వల్ల, ప్రమాదాలు జరిగినట్లయితే మెకానికల్ బ్యాకప్ అనేది ఒక ముఖ్యమైన అవసరం. మీ బైక్‎కు ప్రమాదవశాత్తు ఏదైనా డ్యామేజీ జరిగినట్లయితే, డిజిట్ భారతదేశంలోని 1,000కు పైగా ఉన్న గ్యారేజీల్లో నగదు రహిత మరమ్మతుల సదుపాయాన్ని అందిస్తుంది.

రాయల్ ఎన్‎ఫీల్డ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీల రకాలు

డిజిట్ ద్వారా అందించబడే పలు బీమా పాలసీలు ఉండగా వాటిని కింద వివరించాము. మీ రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు:

  • థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ - మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం ప్రతీ మోటార్ సైకిల్‎కు థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ ఉండటం తప్పనిసరి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే, ఈ పాలసీలు ప్రమాదంలో బాధింపబడిన థర్డ్ పార్టీకి కలిగే నష్టాలను కవర్ చేస్తాయి. ఇందులో ఒక వ్యక్తికి గాయం కావడం, ఆస్తి లేదా వాహనానికి నష్టం వాటిల్లడం మొదలైనవి ఉంటాయి. మీ రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్‎కు జరిగిన నష్టానికి ఈ పాలసీ ఎలాంటి నష్టపరిహారాన్ని అందించదని మీరు గమనించాలి.
  • కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ - ఈ పాలసీలు థర్డ్ పార్టీకి అదేవిధంగా బైక్ రెండింటికీ కలిగే నష్టాలను కవర్ చేస్తాయనే విషయాన్ని పేరును బట్టే అర్థమైపోవాలి. ఒకవేళ మీరు ఈ పాలసీని ఉపయోగించుకున్నట్లయితే, దేశంలో తప్పనిసరిగా ఉండే సాధారణ థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్​తో పాటుగా మీ రాయల్ ఎన్​ఫీల్డ్ బుల్లెట్​కు ప్రమాదవశాత్తు జరిగిన ఏదైనా డ్యామేజీకి మీరు నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అగ్నిప్రమాదాలు, దొంగతనం, ప్రకృతి, మానవ కారక విపత్తులు మొదలైన వాటి వల్ల కలిగే నష్టాల వంటి సందర్భాలను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.

ఇంకా, 2018 సెప్టెంబర్ తర్వాత బుల్లెట్‌ బండిని కొనుగోలు చేసిన వారు కూడా ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సురెన్స్‌ని పొందవచ్చు. ఈ బుల్లెట్ ఇన్సురెన్స్ పాలసీలు థర్డ్-పార్టీ లయబిలిటీ ప్రయోజనాలలో లేని కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాలను అందిస్తాయి.

ఆన్‌లైన్ కొనుగోలు, రెన్యువల్

ఆన్‌లైన్ కొనుగోలు, రెన్యువల్ యొక్క ప్రయోజనాలలో సౌలభ్యం, సులభమైన, పోల్చే అవకాశాలు ప్రధానమైనవి. డిజిట్ అందించే విభిన్న పాలసీలను సరిపోల్చడం, సరైనదాన్ని ఎంచుకోవడం ఆన్‌లైన్‌లో చాలా సులభం. అదనంగా మీరు మీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కోసం ఆన్‌లైన్‌లో కొన్ని నిమిషాల్లో ఇన్సూరెన్స్​ను కూడా కొనుగోలు చేయవచ్చు.

స్పష్టమైన డిజిటల్ క్లెయిమ్ సెటిల్మెంట్ విధానం

ఇతర ఇన్సూరెన్స్ క్లెయిముల మాదిరి సుదీర్ఘ ప్రక్రియలా కాకుండా, డిజిట్ వేగంగా క్లెయిమ్ ఫైల్  చేయడంతో పాటు సులభంగా సెటిల్మెంట్ చేస్తుంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఆన్‌లైన్‌లో కూడా మీ క్లెయిమ్ కోసం ఫైల్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో స్వీయ తనిఖీ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. దీంతో మీ సమయం ఆదా అవుతుంది. అలాగే డిజిట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో క్లెయిమ్ తిరస్కరణ రేటు తక్కువగా ఉంటుంది

నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనం

మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీని క్లెయిమ్ చేయకుంటే, దాని రెన్యువల్‌ పాలసీ ప్రీమియంపై తగ్గింపును పొందే అవకాశాన్ని అందించే సంస్థలలో డిజిట్ ఒకటి. నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనం కింద, మీరు మీ రెన్యువల్‌ ప్రీమియంపై 50% వరకు ఎన్​సీబీ (NCB) తగ్గింపు  ప్రయోజనాలను పొందవచ్చు. మీరు మీ బీమా సంస్థను డిజిట్‌కి మారుస్తున్నట్లయితే, మీరు ఆన్‌లైన్‌లో బుల్లెట్ ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

సమర్థవంతమైన 24x7 కస్టమర్ సర్వీస్

డిజిట్ ప్రీమియం కస్టమర్ సర్వీస్‌ను అందిస్తుంది. ఇది క్లెయిమ్‌లను ఫైల్ చేయడానికి 24X7 అందుబాటులో ఉంటుంది. ఇంకా కస్టమర్ కేర్ సర్వీస్ జాతీయ సెలవు దినాలలో కూడా అందుబాటులో ఉంటుంది. మీరు మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు లేదా మీ బుల్లెట్ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయడంలో సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు.

ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూని కస్టమైజ్ చేయవచ్చు

ఐడీవీ (IDV) అనేది మీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ యొక్క మొత్తం నష్టం లేదా దొంగతనం జరిగినప్పుడు పనికి వచ్చే ఖచ్చితమైన కొంత మొత్తం. మీ టూ వీలర్ వాహనం యొక్క తరుగుదలని మీ మోటార్‌సైకిల్ అమ్మకపు ధర నుండి తీసివేయడం ద్వారా ఇది లెక్కించబడుతుంది. మీరు డిజిట్ అందించే ఇన్సూరెన్స్ పాలసీలను పొందుతున్నట్లయితే ఈ మొత్తాన్ని కస్టమైజ్ చేయవచ్చు. అధిక ఐడీవీ (IDV)ని ఎంచుకోవడం మంచిది, ఎందుకంటే ఇది ప్రమాదంలో సంభవించే అన్ని ఖర్చులను సమర్థవంతంగా కవర్ చేస్తుంది.

అనేక యాడ్-ఆన్ కవర్లు

బుల్లెట్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌లో ఇది అందించబడనప్పటికీ, మీరు కాంప్రహెన్సివ్ కవర్‌ను కొనుగోలు చేస్తే, మీరు అనేక యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు. ఈ యాడ్-ఆన్‌లు కింద ఇవ్వబడ్డాయి. వాటిని పొందడం వలన మీ బుల్లెట్ బండి ఏదైనా ప్రమాదం నుండి ఆర్థికంగా రక్షించబడుతుందని నిర్ధారించుకోవచ్చు:

  • రిటర్న్ టు ఇన్​వాయిస్ ఇన్సూరెన్స్ కవర్
  • జీరో డిప్రిషియేషన్ కవర్
  • బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్
  • ఇంజిన్ మరియు గేర్ ప్రొటెక్షన్ పాలసీ
  • కంజూమబుల్​ కవర్

మీరు వివిధ రకాల కవర్‌లను తనిఖీ చేసి, మీ బుల్లెట్ ఇన్సూరెన్స్ పాలసీకి సరైనదాన్ని ఎంచుకోవాలి. 

బైక్ ప్రియుల అభిరుచిని పూర్తిగా అభినందిస్తూ, డిజిట్ మీ బైక్‌లను పూర్తిగా రక్షించే ఇన్సూరెన్స్ పాలసీలను సగర్వంగా అందిస్తుంది.

రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ - వేరియెంట్లు & ఎక్స్-షోరూం ధర

వేరియెంట్లు ఎక్స్-షోరూం ధర (నగరాన్ని బట్టి మారవచ్చు)
బుల్లెట్ 350 ABS, 40 Kmpl, 346 cc ₹ 121,381
బుల్లెట్ 350 ES ABS, 40 Kmpl, 346 cc ₹ 135,613
బుల్లెట్ 500 ABS, 30 Kmpl, 499 cc ₹ 175,180

భారతదేశంలో రాయల్ ఎన్‎ఫీల్డ్ బుల్లెట్ ఇన్సూరెన్స్‎కు సంబంధించి తరుచూ అడిగే ప్రశ్నలు

ఒకవేళ నేను ఆన్​లైన్‎లో బీమా కొనుగోలు చేస్తే నా మోటర్ బైక్ ఎలా తనిఖీ చేయబడుతుంది?

పాత బీమా ముగియక ముందే కొత్త దానికి దరఖాస్తు చేసుకుంటే, ఎలాంటి తనిఖీ ఉండదు.

బైక్ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ వివరాలు కావాలి?

బైక్ ఇన్సూరెన్స్ కోసం అవసరమైన కొన్ని వివరాలు దిగువ పేర్కొనబడ్డాయి:

  • బైక్ రిజిస్ట్రేషన్, ఛాసిస్ నెంబరు, తయారీ తేదీ.
  • కొనుగోలు చేసిన స్థలం, తేదీ.
  • గత పాలసీ వివరాలు (ఒకవేళ మీరు రెన్యువల్ చేస్తున్నట్లయితే)
  • ఎన్​సీబీ (NCB) వివరాలు (ఒకవేళ మీకు గతం నుంచి ఏదైనా ఎన్​సీబీ (NCB) ఉన్నట్లయితే)
  • పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్​తో సహా మీ వ్యక్తిగత వివరాలు.

నేను నా థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్‎ని కాంప్రహెన్సివ్ కవర్‎కు అప్‎గ్రేడ్ చేయవచ్చా?

చేయవచ్చు, మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసినప్పుడు మీ థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్‎ని మీరు అప్​గ్రేడ్ చేసుకోవచ్చు.