6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
అది మ్యాండేటరీ* కాబట్టి సాధారణం గా, కారు యజమానులు కారు ఇన్సూరెన్స్ ను తీసుకుంటారు, మరియు రెన్యూవల్ సమయం వచ్చినప్పుడు కూడా పూర్తిగా వివరాలలోకి వెళ్ళరు.
కానీ, మీ పాలసీ డాక్యుమెంట్‌ని తనిఖీ చేయకుంటే, దాని కవరేజీకి సంబంధించిన ముఖ్య ఫీచర్లు మరియు ప్రయోజనాలను ఏవైనా మీరు కోల్పోతున్నారా అనే విషయం మీకు ఎప్పటికీ తెలియదు.
మీరు మీ కారును మీ గర్వకారణం గా భావిస్తున్నారని మరియు ఆనందంగా ప్రేమిస్తున్నారని మేము అనుకుంటున్నాము మరియు మీరు దానిని ఎంచుకునే ముందు నెలల తరబడి పొదుపు చేయడం తో పాటు చర్చలు, పరిశోధనలు వంటివాటిని చేసారు. మరి, మీ కారును రక్షించే విషయంలో మీరు అదే పరిశోధన చేయడాన్ని ఎందుకు దాటవేస్తారు? కారు ఇన్సూరెన్స్ అనేది మీ కారును ఊహించని ప్రమాదం మరియు నష్టాల తుఫాను నుండి రక్షించే గొడుగు లాంటిది.
అయితే చింతించకండి! మీ కారు ఇన్సూరెన్స్ పాలసీలో మీరు మిస్ అయిన (లేదా తెలియని) అన్ని విషయాలపై మీకు మార్గనిర్దేశం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము, తద్వారా మీరు అది అందించే ప్రయోజనాలను పెంచుకోవచ్చు. మీ కారు ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీకు బహుశా తెలియని కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
*కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం భారతదేశంలో చట్టం ప్రకారం అవసరం.
మీ కారు పాడైపోయినప్పుడు లేదా ప్రమాదాల వల్ల నష్టపోయినప్పుడు మాత్రమే కారు ఇన్సూరెన్స్ అని చాలా మంది అనుకుంటారు. కానీ కారు ఇన్సూరెన్స్ దాని కంటే చాలా ఎక్కువ విషయాలకు వర్తిస్తుంది!
థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీ మీరు ఏదైనా థర్డ్-పార్టీకి లేదా వారి ఆస్తికి కలిగించే నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది, ఒక కాంప్రహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ మీ స్వంత కారును దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు మరియు మరిన్నింటి వల్ల కలిగే డ్యామేజిలు మరియు నష్టాల నుండి కూడా కవర్ చేస్తుంది.
మీ కారు ముఖ్యంగా హైవేలు లేదా మారుమూల ప్రాంతాలలో, ప్రమాదానికి గురయినప్పుడు లేదా పాడైపోయినప్పుడు, మెకానిక్‌లు కొన్నిసార్లు దానిని గ్యారేజీకి తీసుకువెళ్ళడానికి అధిక మొత్తంలో వసూలు చేస్తారు.
అయితే, ఒక కాంప్రహెన్సివ్ పాలసీ తో, చాలా మంది కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు సాధారణంగా కొంత మొత్తం వరకు లేదా దూరం వరకు ఉచిత టోయింగ్ సహాయాన్ని అందిస్తారని మీకు తెలుసా?
అందువల్ల, తదుపరిసారి మీ కారు పాడైపోయినప్పుడు, మీ కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ని సంప్రదించండి మరియు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోండి.
డాక్యుమెంట్స్ తో ముడిపడినది ఏదైనా సుదీర్ఘంగా ఉండటమే కాకుండా సమయం తీసుకునే ప్రక్రియ అని మీరు అనుకోవచ్చు. కానీ మీ కారు ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ చేసే విషయానికి వస్తే, ఈ రోజుల్లో చాలా మంది ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మీకు సరళమైన మరియు తక్షణ ఆన్లైన్ రెన్యూవల్ ను అందిస్తున్నారు, ఇందులో సున్నా లేదా కనీస డాక్యుమెంట్ల అవసరం ఉంటుంది మరియు సంక్లిష్టమైన ఫారమ్‌లను పూరించాల్సిన అవసరం ఉండదు. కేవలం కొన్ని క్లిక్‌లలో మీ పని మొత్తం పూర్తి చేయవచ్చు! 😊
మీరు కాంప్రహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉంటే, మీరు నగదు రహిత కారు ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ అవాంతరాలు లేని ప్రక్రియ ప్రమాదం కారణంగా ఏదైనా డ్యామేజీ జరిగిన తర్వాత మీ స్వంత జేబులో నుండి ఏమీ చెల్లించకుండా మీ కారుని ఏదైనా అధీకృత గ్యారేజీలో రిపేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది - దీనిని నెట్వర్క్ గ్యారేజ్ అని కూడా పిలుస్తారు. బదులుగా, ఈ మరమ్మతులకు సంబంధించిన బిల్లులు నేరుగా మీ ఇన్సూరెన్స్ సంస్థకు పంపబడతాయి మరియు వారు దానిని గ్యారేజీ కి చెల్లిస్తారు.
ఒకవేళ మీ కారు ఆక్సిడెంట్ లో పాడైపోయినా లేక కోల్పోయినా, చాలా కార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆ కారును మాత్రమే కవర్ చేస్తాయి మరియు మీరు దానికి చేసిన ఏవైనా యాక్సెసరీలు మరియు మాడిఫికేషన్లు (ఉదాహరణకు CNG ఫ్యూయల్ కిట్‌ని అమర్చడం) కవర్ చెయ్యవు.
అయితే, ఈ కొత్త యాక్సెసరీల గురించి మీ ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయడం ద్వారా మీరు వీటిని కవర్ చేసుకోవచ్చు. ఇది మీ ప్రీమియంను పెంచవచ్చు, కానీ మీరు సరికొత్త ఉపకరణాలను కొనుగోలు చేయడం కంటే తక్కువగా ఖర్చు అవుతుంది అని రుజువు చేస్తుంది! 😄
నో క్లయిమ్ బోనస్ (లేదా NCB) అనేది ఇన్సూరెన్స్ కంపెనీలు మునుపటి సంవత్సరంలో ఎటువంటి క్లయిమ్ లు చేయని వారికి అందించే ఒక విధమైన తగ్గింపు.
కాబట్టి, మీరు పాలసీ సంవత్సరంలో సురక్షితంగా డ్రైవింగ్ చేస్తుంటే, రెన్యూవల్ సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ మీ ప్రీమియంపై తగ్గింపుతో మీకు రివార్డ్ ఇస్తుంది.
ఈ నో క్లయిమ్ బోనస్ తగ్గింపు 20%-50% వరకు ఉంటుంది మరియు ప్రతి క్లయిమ్-రహిత సంవత్సరానికి పెరుగుతుంది. ఈ తగ్గింపు మీ ప్రీమియంలో ఎంత వ్యత్యాసాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని దృష్టి లో పెట్టుకొని, సురక్షితంగా డ్రైవ్ చేయాలని గుర్తుంచుకోండి.
మీరు కొన్ని చిన్న క్లయిమ్ లు చేసినా కూడా మీ NCB చెల్లుబాటు అయ్యేలా చూసుకోవడానికి మీరు కొన్ని ఇన్సూరెన్స్ సంస్థల నుండి నో-క్లయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్‌ను యాడ్-ఆన్‌గా కొనుగోలు చేయవచ్చు.
మీరు మీ కారును అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తూ మరియు మీరు మీ ప్రస్తుత వాహనంతో నో క్లయిమ్ బోనస్ (NCB)ని పొంది ఉంటే, మీరు ఆ NCBని కోల్పోవలసిన అవసరం లేదు.
మీరు దీన్ని మీ కొత్త కారుకు బదిలీ చేయవచ్చు. మీరు మీ కారు ఇన్సూరెన్స్ పాలసీని బదిలీ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా, మీరు మీ కొత్త పాలసీ కింద మీ ప్రస్తుత NCBని కార్ ఇన్సూరెన్స్ పాలసీకి కొనసాగించవచ్చు.
అరుగుదల కారణంగా, మీ వాహనం మరియు దాని విడిభాగాల వాస్తవ విలువ కాలక్రమేణా తరుగుతూ ఉంటుంది. నిజానికి, షోరూమ్ నుండి బ్రాండ్-న్యూ కారు బయటకు తీసుకువచ్చిన క్షణమే, దాని విలువలో 5% తగ్గినట్లు పరిగణించబడుతుంది! 😲
జీరో డిడిప్రిషియేషన్ యాడ్-ఆన్‌తో, మరమ్మత్తులు లేదా భర్తీ కోసం క్లెయిమ్ సెటిల్మెంట్ మొత్తాన్ని గణించేటప్పుడు, మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ వాహనం మరియు దాని విడిభాగాల విలువను ఈ డిప్రిషియేషన్ ని పరిగణించదని మీరు తెలుసుకోవచ్చు.
ప్రమాదం వల్ల సంభవించినట్లయితే తప్ప, మీ ఇంజన్‌ను మరమ్మత్తు చేయడం లేదా ఏదైనా కారణం చేత మీ ఇంజన్ని మార్చడం చాలా ఖరీదైన విషయం కావచ్చు మరియు అవి స్టాండర్డ్ పాలసీ కింద కవర్ చేయబడవు.
అయితే, మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్‌ను పొందినట్లయితే, ఆయిల్ లీకేజీ లేదా నీరు ప్రవేశించడం కారణంగా మీ కారు ఇంజిన్ ఆగిపోయినప్పటికీ మీరు రక్షించబడతారు.
మీ కారు కీలను పోగొట్టుకోవడం నిజంగా ఒత్తిడితో కూడిన అనుభవం. కానీ మీరు బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్‌ను పొందినట్లయితే, మీరు మీ వాహనాన్ని లాగడంలో సహాయాన్ని మాత్రమే కాకుండా, మీ స్పేర్ సెట్ కీలను తిరిగి పొందటంలో కూడా సహాయం లభిస్తుంది.
లేదా, ఒకవేళ,మీరు అనుకోకుండా మీ కారు లోపల కీ ను ఉంచి లాక్ చేసి ఉంటే, మీరు కారుని అన్‌లాక్ చేయడంలో మరియు వాటిని బయటకు తీయడంలో కూడా సహాయం పొందవచ్చు!
కాబట్టి, మీరు కారు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం మ్యాండేటరీ అయినా (కనీసం, థర్డ్-పార్టీ లయబిలిటీ-ఓన్లీ ప్లాన్), మీ పాలసీ యొక్క అన్ని ప్రయోజనాలను మీరు ఎప్పటికీ తనిఖీ చేయకూడదు అని దీని అర్థం కాదు.
మీ పాలసీ ఏమి ఆఫర్ చేస్తుందో మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు అందుబాటులో ఉన్న అనేక ఆప్షన్స్ ను సరిపోల్చవచ్చు మరియు మీ అన్ని అవసరాలకు సరిపోయే సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ద్వారా మీరు మీ కారు బీమా పాలసీని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు.
దయచేసి మరొకసారి ప్రయత్నించండి!