Third-party premium has changed from 1st June. Renew now
వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు లేదా రెన్యూవల్ చేయండి
జర్మన్ ఆటో మేకర్ వోక్స్ వ్యాగన్ 2007లో టిగువాన్ ను ఆవిష్కరించింది. టిగువాన్ అనేది ఒక కాంపాక్ట్ క్రాస్ ఓవర్ SUV. ఇది వోక్స్ వ్యాగన్ కంపెనీ అందించిన రెండో క్రాస్ ఓవర్ SUV మోడల్. 2020 వరకు ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. వోక్స్ వ్యాగన్ కార్లలో ఈ కారు బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలిచింది.
ఇండియన్ మార్కెట్ లో 2021 డిసెంబర్ నెలలో టిగువాన్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ రిలీజ్ అయింది. ఈ న్యూ వెర్షన్ లో కొత్తగా రూపొందించిన బంపర్స్, అల్లాయ్స్, స్టీరింగ్ వీల్స్ ఉన్నాయి. దీని పాత డీజిల్ ఇంజిన్ ను ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్ తో రిప్లేస్ చేశారు. ప్రస్తుతం ఇది పెట్రోల్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ మోడల్ కు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మీరు ఈ రోజే షోరూం నుంచి కొనుగోలు చేయొచ్చు. కానీ కొత్త కారును కొనుగోలు చేసే ముందు దాని భద్రత గురించి ఆలోచించడం ఉత్తమం. ఈ ఆలోచన భవిష్యత్ లో మీకు అనేక ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. అందుకోసమే మీరు నమ్మకమైన బీమా సంస్థ నుంచి వోక్స్ వ్యాగన్ టిగువాన్ కార్ ఇన్సూరెన్స్ ను తీసుకోవాలి.
డిజిట్ కంపెనీ అందిస్తున్న ఆఫర్లను బట్టి మీరు ఇన్సూరెన్స్ కోసం డిజిట్ ను ఎంచుకోవచ్చు. డిజిట్ అందిస్తున్న టిగువాన్ ఇన్సూరెన్స్ ప్లాన్ ధర మరియు ఇతర అన్ని వివరాలు కింది కథనంలో వివరించబడ్డాయి.
వోక్స్ వ్యాగన్ టిగువాన్ కార్ ఇన్సూరెన్స్ లో ఏం కవర్ అవుతాయి
డిజిట్ అందించే వోక్స్ వ్యాగన్ టిగువాన్ కార్ ఇన్సూరెన్స్ ను మీరు ఎందుకు కొనుగోలు చేయాలి?
వోక్స్ వ్యాగన్ టిగువాన్ కు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్స్
థర్డ్ పార్టీ | కాంప్రెహెన్సివ్ |
ప్రమాదం కారణంగా సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
|
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
|
ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు సొంత కార్ కు నష్టం/డ్యామేజీలు |
|
థర్డ్-పార్టీ వాహనానికి డ్యామేజీలు |
|
థర్డ్-పార్టీ ఆస్తికి డ్యామేజీలు |
|
వ్యక్తిగత ప్రమాద కవర్ |
|
థర్డ్-పార్టీ వ్యక్తి యొక్క గాయాలు/మరణం |
|
మీ కారు దొంగతనం |
|
డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్ |
|
మీ ఐడివి (IDV)ని అనుకూలీకరించండి |
|
అనుకూలీకరించిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రెహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి
క్లయిమ్‌ను ఫైల్ చేయడం ఎలా?
మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, మేము 3-స్టెప్ ల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
స్టెప్ 1
1800-258-5956కు కాల్ చేయండి. ఫారమ్‌లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క డ్యామేజీలను షూట్ చేయండి.
స్టెప్ 3
మీరు మా గ్యారేజీల నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్‌ని ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.
వోక్స్ వ్యాగన్ టిగువాన్ కోసం డిజిట్ ఇన్సూరెన్స్ ను ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ వోక్స్ వ్యాగన్ టిగువాన్ కారు కోసం ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకునేటపుడు మీరు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. టిగువాన్ ఇన్సూరెన్స్ ధర, యాడ్ ఆన్ ఫెసిలిటీ, నో క్లెయిమ్ బోనస్, మీ కారు IDVవంటివి పరిగణించాలి. వివిధ రకాల బీమా సంస్థల నుంచి ఈ విషయాలను పోల్చి చూడడం మీకు సహాయపడుతుంది. పూర్తి సమాచారంతో నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఈ విషయంలో మీకు డిజిట్ అందిస్తున్న ప్రయోజనాలను గురించి తెలుసుకోవాలని అనుకోవచ్చు. మరింత సమాచారం కోసం కింద చదవండి.
1. విస్తృతమైన ఇన్సూరెన్స్ ప్లాన్స్
మీరు ఈ బీమా సంస్థ (డిజిట్) నుంచి వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే.. మీరు ఈ కింది ఇన్సూరెన్స్ రకాలను ఎంచుకోవచ్చు.
- థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ - మీ వోక్స్ వ్యాగన్ కారు వలన థర్డ్ పార్టీ కారుకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినపుడు సంభవించిన నష్టాలను కవర్ చేసేందుకు ఈ ఇన్సూరెన్స్ హెల్ప్ ఫుల్‌గా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మీకు ఇన్సూరెన్స్ కనుక లేకపోతే మీరు ఆర్థికంగా చాలా ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ఇది మీపై ఆర్థికంగా పెను భారాన్ని మోపుతుంది. వోక్స్ వ్యాగన్ టిగువాన్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కేవలం థర్డ్ పార్టీ నష్టాలను భర్తీ చేయడం మాత్రమే కాకుండా చట్టపరమైన సమస్యలు రాకుండా కూడా చూసుకుంటుంది.
- కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ - మీ వోక్స్ వ్యాగన్ కారుకు ఢీ కొనడం, అగ్ని ప్రమాదం, దొంగతనం, సహజ, లేదా కృతిమ ప్రకృతి విపత్తులు మొదలైన వాటి వలన కూడా నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. అటువంటి సందర్భంలో తలెత్తే ఖర్చుల నుంచి మిమ్మల్ని మీరు కవర్ చేసుకునేందుకు మీరు వోక్స్ వ్యాగన్ టిగువాన్ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ను తీసుకోవాలి. ఈ ఇన్సూరెన్స్ మీ సొంత వాహనానికి అయిన ఖర్చులనే కాకుండా థర్డ్ పార్టీ వాహనాలు, వ్యక్తులు, ఆస్తులకు జరిగిన నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది.
2. యాడ్ ఆన్ కవర్స్ శ్రేణి
మీరు వోక్స్ వ్యాగన్ టిగువాన్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ను రెన్యూవల్ చేయించుకున్నపుడు మీకు పూర్తి కవరేజ్ అందకపోవచ్చు. దానిని నివారించేందుకు మీరు కొన్ని యాడ్ ఆన్స్ ద్వారా అదనపు ప్రయోజనాలు పొందొచ్చు. ఇటువంటి సందర్భంలో ఖర్చుకు వెనుకాడకుండా ఉండాలి. డిజిట్ లో లభించే కొన్ని రకాల యాడ్ ఆన్ పాలసీలు:
- జీరో డెప్రిసియేషన్ కవర్
- ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్
- రోడ్ సైడ్ అసిస్టెన్స్
- రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్
- కన్స్యూమబుల్ కవర్
3. క్యాష్‌లెస్ క్లెయిమ్స్
వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఇన్సూరెన్స్ లో ఆన్‌లైన్ క్లెయిమ్స్ ఎంచుకోవడానికి మరియు క్యాష్‌లెస్ మోడ్ లో రిపేర్ చేయించుకునేందుకు డిజిట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ మోడ్ లో రిపేర్ చేయించుకుంటే మీరు రిపేర్ సెంటర్ లో రిపేర్ చేయించుకున్నపడు మీ జేబు నుంచి చెల్లించాల్సిన అవసరం రాదు. మీ తరఫున మీ బీమా సంస్థనే డబ్బులు చెల్లిస్తుంది. మీ భవిష్యత్ అవసరాల కోసం మీ డబ్బులను ఆదా చేయడంలో ఇది సహాయపడుతుంది.
4. సవరల్ నెట్వర్క్ గ్యారేజెస్
ఇండియా మొత్తం మీద క్యాష్‌లెస్ గ్యారేజెస్ నెట్వర్క్ ఉంది. ఇక్కడ మీరు మీ వోక్స్ వ్యాగన్ కారును ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే రిపేర్ చేయించుకోవచ్చు. మీరు మీ టిగువాన్ కారు కోసం క్యాష్‌లెస్ రిపేర్ల కోసం వెళ్లేందుకు కూడా ఈ రిపేర్ సెంటర్స్ మీకు దోహదం చేస్తాయి.
5. నచ్చిన విధంగా మార్చుకునే IDV
వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఇన్సూరెన్స్ ధర కారు యొక్క IDV లేదా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ మీద ఆధారపడి ఉంటుంది. కావున మీరు సరైన IDVని ఎంచుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో మీరు మీకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకునేందుకు డిజిట్ మీ కారు IDVని మీకు నచ్చిన విధంగా మార్చుకునేందుకు IDV కస్టమైజేషన్ ఆప్షన్ ను అందిస్తోంది. ఒక వేళ మీ కారు దొంగతనానికి గురైనా లేక కోలుకోలేని విధంగా డ్యామేజ్ అయినా మీరు గరిష్ట ప్రయోజనాలను పొందొచ్చు.
6. డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ ఫెసిలిటీ
డిజిట్ ఇన్సూరెన్స్ అందించే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను మీరు పొందినట్లయితే మీ కారు డ్యామేజ్ పార్ట్స్ కోసం మీరు పికప్ మరియు డ్రాప్ ఫెసిలిటీని కూడా ఎంచుకోవచ్చు. మీ వోక్స్ వ్యాగన్ కారుకు అయిన డ్యామేజెస్ కు ప్రొఫెషనల్ రిపేర్ సర్వీసును మీ ఇంటి వద్ద నుంచే పొందే సౌలభ్యాన్ని ఇది అందిస్తుంది.
7. నో క్లెయిమ్ బెనిఫిట్స్
మీరు మీ పాలసీ టర్మ్ లో క్లెయిమ్స్ చేయకుండా ఉంటే మీ వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో డిజిట్ మీకు నో క్లెయిమ్ బోనస్ ను అందిస్తుంది. నో క్లెయిమ్ బోనస్ అనేది పాలసీ ప్రీమియం మీద లభించే డిస్కౌంట్. ఇది క్లెయిమ్స్ చేయని సంవత్సరాల మీద ఆధారపడి ఉంటుంది. బీమా సంస్థ మీకు 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది.
8. 24x7 కస్టమర్ సపోర్ట్
మీరు మీ వోక్స్ వ్యాగన్ కారు కోసం బీమాను పొందుతున్నపుడు మీకు ప్రశ్నలు, సందేహాలు తలెత్తడం సహజం. అటువంటి సమయంలో మా కస్టమర్ కేర్ సర్వీసుకు కాల్ చేసి మీ ప్రశ్నలు, సందేహాలకు తక్షణ సమాధానం పొందండి. డిజిట్ కస్టమర్ కేర్ సర్వీస్ జాతీయ సెలవు దినాల్లో కూడా 24x7 అందుబాటులో ఉంటుంది.
మీరు మీ వోక్స్ వ్యాగన్ టిగువాన్ కారు ఇన్సూరెన్స్ కోసం డిజిట్ ను పరిగణించవచ్చు. డిజిట్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు మీ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడం మాత్రమే కాకుండా చట్టపరమైన సమస్యల నుంచి కూడా విముక్తి పొందొచ్చు.
వోక్స్ వ్యాగన్ టిగువాన్ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?
వోక్స్ వ్యాగన్ టిగువాన్ అనేది చాలా ఖరీదైన కారు. అందుకోసం మీరు దానికి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి. అనుకోని సందర్భాల్లో అయిన యాక్సిడెంట్స్ నుంచి కార్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని కాపాడుతుంది. అటువంటి సమయంలో అయిన ఖర్చులకు ఇన్సూరెన్స్ పాలసీయే చెల్లిస్తుంది.
- చట్టపర బాధ్యతలను నెరవేరుస్తుంది: మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ఇండియన్ రోడ్ల మీద నడిచే ప్రతి కారుకు కనీసం థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీ అయినా ఉండాలి. మీరు కనుక కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయకపోతే మీరు రూ. 2000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా 3 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.
- థర్డ్ పార్టీ లీగల్ లయబులిటీస్ ను కవర్ చేస్తుంది: మీరు కారును డ్రైవ్ చేస్తున్నపుడు థర్డ్ పార్టీ వ్యక్తులు లేదా వాహనాలకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అటువంటి సందర్భాల్లో అయ్యే ఖర్చులకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతే కాకుండా వారి చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా మీరే భరించాలి. థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కనుక ఉంటే ఈ ఖర్చులను, బాధ్యతలను అది చూసుకుంటుంది. మీరు నిశ్చింతగా ఉండొచ్చు.
- సొంత వెహికిల్ డ్యామేజ్ అయిన రిపేర్ ఖర్చులు చెల్లిస్తుంది: ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వల్ల కలిగే నష్టాల నుంచి వోక్స్ వ్యాగన్ టిగువాన్ కార్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని రక్షిస్తుంది. మీ సొంత కారుకు డ్యామేజ్ అయినా రిపేర్ చేయించాల్సి వచ్చినా మీరు ఖర్చు కోసం చింతించాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. రిపేర్ల కోసం అయిన ఖర్చులు మొత్తం ఇన్సూరెన్స్ పాలసీ కిందే కవర్ అవుతాయి. ఇది మీ సేవింగ్స్ ను రక్షించేందుకు సహాయం చేస్తుంది. మీ సొంత కారు డ్యామేజ్ అయినా కానీ థర్డ్ పార్టీ వెహికిల్ డ్యామేజ్ అయినా కానీ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. కావున కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఎల్లప్పుడూ ఉత్తమం.
- యాడ్ ఆన్ కవర్స్‌తో అదనపు భద్రత: కేవలం మీరు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉంటే మాత్రమే. అటువంటి సమయంలో మీరు మీ భద్రతను పొడిగించుకోవచ్చు. పైన పేర్కొన్న సందర్భాల్లో బేసిక్ కాంప్రహెన్సివ్ పాలసీ మీకు కవరేజ్ అందిస్తుంది. ఆ లాసెస్ కాకుండా వేరే సంభవిస్తే కవర్ చేసేందుకు మీరు కొంత మొత్తం అదనపు ప్రీమియం చెల్లించి యాడ్ ఆన్ కవర్స్ తీసుకోవచ్చు. మీరు జీరో డెప్రిసియేషన్ కవర్, టైర్ ప్రొటెక్ట్ కవర్, పాసింజర్ కవర్, రిటర్న్-టూ-ఇన్వాయిస్ కవర్, ఇంజన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్, బ్రేక్ డౌన్ అసిస్టెన్స్, మరియు కన్స్యూమబుల్ కవర్ వంటి మరిన్ని రకాల యాడ్ ఆన్స్ ను ఎంచుకోవచ్చు.
వోక్స్ వ్యాగన్ టిగువాన్ గురించి మరింత తెలుసుకోండి
మీకు భారీ SUVని పార్క్ చేసేందుకు స్థలం లేదని అనుకుందాం. బట్ మీరు SUVని కొనాలని అనుకుంటున్నారు. అప్పుడు వోక్స్ వ్యాగన్ టిగువాన్ గురించి ఆలోచించండి. ఇది అద్భుతమైన SUV. ఇది మీకు అన్ని రకాల థ్రిల్స్ మరియు సరదాలు అందిస్తుంది. ఈ కారు అన్ని జర్నీలకు సౌకర్యంగా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.
వోక్స్ వ్యాగన్ టిగువాన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో ఒకటి హైలైన్ మరియు రెండవది కంఫర్ట్ లైన్. ఈ SUV ధర రూ. 28.14 లక్షల నుంచి స్టార్ట్ అయి.. రూ. 31.52 లక్షల వరకు ఉంటుంది. టర్బో చార్జ్‌డ్ 4 సిలిండర్ ఇంజిన్ మరియు 1968 cc కెపాసిటీతో ఇది మీకు లభిస్తుంది. కంపెనీ మీకు రెండు వేరియంట్లలో డీజిల్ ఇంజిన్ మరియు ఆటో ట్రాన్స్‌మిషన్ ను అందిస్తుంది. ఈ కారు ఒక లీటర్ ఇంధనానికి 16.65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
మీకు బెటర్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ను అందించే అన్ని రకాల అట్రాక్టివ్ ఫీచర్స్ ను ఈ కారు కలిగి ఉంటుంది. ఈ కారులో దాదాపు ఏడుగురు ప్యాసింజర్స్ ప్రయాణించొచ్చు. మీ ఫ్యామిలీకి చక్కగా సరిపోయే కార్ ఇది. ఇది ఐదు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇండియన్ గ్రే. ఓరిక్స్ వైట్, డీప్ బ్లాక్, ట్రంగ్ స్టెన్ సిల్వర్, అట్లాంటిక్ బ్లూ కలర్స్ లో ఇది అందుబాటులో ఉంది.
వోక్స్ వ్యాగన్ కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
వోక్స్ వ్యాగన్ టిగువాన్ ను ఎందుకు కొనుగోలు చేయాలి?
- ఎక్స్‌టీరియర్(బయటి లుక్): వోక్స్ వ్యాగన్ టిగువాన్ కారు రోడ్డుపై వెళ్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. దీని మస్కులర్ హుడ్స్ మరియు క్రోమ్ ఫినిష్డ్ గ్రిల్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడంలో సహాయపడతాయి. మనం చూసినపుడు ఈ కారు ఇతర కార్ల కంటే మరింత స్మార్ట్ గా కనిపిస్తూ ఉంటుంది.
- ఇంటీరియర్ (లోపలి లుక్): ఈ కారు 6.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మీరు యాపిల్ కార్ ప్లే లేదా ఆండ్రాయిడ్ ఆటోతో కనెక్ట్ అయ్యే స్మార్ట్ ఫోన్ కంపాటిబుల్ సిస్టమ్‌ను పొందుతారు. సీట్లపై ఉన్న లెదర్ ఫినిషింగ్ మీ మనసులను దోచేస్తుంది. సీట్లు కంఫర్టబుల్‌గా ఉంటాయి. మీరు లాంగ్ జర్నీలు చేసినపుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
- సహాయక ఫీచర్స్: వోక్స్ వ్యాగన్ టిగువాన్ లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉంటుంది. అంతే కాకుండా పార్కింగ్ సెన్సార్స్, 360 డిగ్రీ కెమెరా, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలెర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, పెడెస్ట్రియన్ డిటెక్షన్, లేన్ డిపార్చర్, ఫార్వర్డ్ కొలీషన్స్ వార్నింగ్ మరియు ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి హై క్లాస్ అసిస్టెన్స్ ఫీచర్స్ ఉంటాయి.
- సేఫ్టీ ఫీచర్స్: ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సేఫ్ జర్నీ కొరకు ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రాం ఉన్నాయి. హిల్ హోల్డ్ అనే ఫీచర్ కారు కిందికి వెళ్లకుండా నిరోధిస్తుంది మరియు హిల్ డీసెంట్ కంట్రోల్ అనేది సురక్షితంగా కిందకు (కొండ మీది నుంచి) నడిపేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. పాదచారుల భద్రత కోసం ఈ కారులో యాక్టివ్ హుడ్ సెన్సార్ ఉంటుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఫ్రంట్ బంపర్ సిగ్నిల్ ఇవ్వగానే ఇది పైకి లేస్తుంది.
వోక్స్ వ్యాగన్ టిగువాన్ లోని వేరియంట్స్
వేరియంట్ పేరు | ధర (న్యూ ఢిల్లీ, సిటీని బట్టి ధర మారొచ్చు) |
---|---|
2.0 TSI ఎలెగాన్స్ | రూ. 31.99 లక్షలు |
[1]
తరచూ అడిగే ప్రశ్నలు
గడువు ముగిసిన తర్వాత నేను నా వ్యోక్స్ వ్యాగన్ టిగువాన్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేస్తే నాకు నో క్లెయిమ్ బోనస్ బెనిఫిట్స్ అందుతాయా?
మీరు మీ పాలసీని గడువు ముగిసిన తర్వాత 90 రోజుల్లోపు పునరుద్ధరించినట్లయితే మీరు ఈ ప్రయోజనం పొందొచ్చు. కానీ గడువు ముగిసిన 90 రోజుల తర్వాత రెన్యూవల్ చేస్తే ఈ ప్రయోజనం కోల్పోతారు.
నా వ్యోక్స్ వ్యాగన్ టిగువాన్ బీమా ప్రొవైడర్ ను మార్చేటపుడు నేను నో క్లెయిమ్ బోనస్ బదిలీ చేసుకోవచ్చా?
అవును. నో క్లెయిమ్ బోనస్‌లను బదిలీ చేసుకోవచ్చు. మీరు బీమా ప్రొవైడర్ ను మార్చినా కానీ ఈ ప్రయోజనం పొందొచ్చు.