Third-party premium has changed from 1st June. Renew now
టాటా టియాగో కార్ ఇన్సూరెన్స్ ధర & ఆన్‌లైన్‌లో తక్షణమే రెన్యూవల్ చేసుకోండి
టాటా యొక్క హ్యాచ్‌బ్యాక్ కార్లు దశాబ్దాలుగా భారతీయ వినియోగదారులకు శాశ్వతంగా ఇష్టమైనవి, మరియు దాని టియాగో మోడల్ ఖచ్చితంగా ఆ అభిమానాన్ని పెంచింది. 2016లో ప్రారంభించబడి, 2020లో ఆవిష్కరించబడిన దాని BS-VI కంప్లైంట్ వేరియంట్‌తో, 5 మంది కూర్చునే సామర్థ్యంతో వచ్చిన టాటా టియాగో, పట్టణ భారతీయులకు తగిన మోడల్‌గా నిలిచింది.
2018లో అత్యధికంగా అమ్ముడైన మొదటి పది వాహనాల్లో టియాగో స్థానం సంపాదించడంతో, భారతదేశంలో టాటా టియాగో ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోలులో కూడా అద్దం పట్టే పెరుగుదల ఉంది.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం భారతదేశంలో చట్టబద్ధంగా రోడ్లపై నడపడానికి థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి అని మీకు తెలిసి ఉండవచ్చు. మీరు చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీ లేకుండా మీ టియాగోను నడుపుతున్నట్లు గుర్తించినట్లయితే, మీకు రూ.2000 జరిమానా విధించబడుతుంది లేదా పునరావృతం చేసిన నేరానికి రూ.4000 ట్రాఫిక్ జరిమానా.
చట్టబద్ధంగా తప్పనిసరి అనే కాకుండా, థర్డ్-పార్టీ టాటా టియాగో భీమా రెన్యూవల్ లేదా కొనుగోలు మరొక వ్యక్తి, వాహనం లేదా వారి ఆస్తితో మీ టియాగో ప్రమాదవశాత్తూ ఢీకొనడం వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక లయబిలిటీలను కవర్ చేస్తుంది. మరోవైపు, మీ టియాగోకు ప్రమాదవశాత్తు జరిగిన నష్టాలకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
అయితే, కేవలం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తే సరిపోతుందా?
సరే, మీరు మీ ప్రియమైన కారుకు సరైన రక్షణను పొందడానికి కారు ఇన్సూరెన్స్ పాలసీ కింద అందించే ప్రయోజనాలను కూడా తప్పక చూడాలి. ఈ విషయంలో, డిజిట్ యొక్క కారు ఇన్సూరెన్స్ పాలసీ ఉత్తమ ఎంపిక కావచ్చు!
టాటా టియాగో ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధర
రిజిస్ట్రేషన్ తేదీ | ప్రీమియం (కాంప్రహెన్సివ్ పాలసీ కోసం) |
---|---|
జూలై-2018 | 5,306 |
జూలై-2017 | 5,008 |
జూలై-2016 | 4,710 |
**డిస్ క్లైమర్ - టాటా టియాగో మోడల్ HTP పెట్రోల్ 1199 కోసం ప్రీమియం లెక్కింపు జరపబడింది. GST మినహాయించబడింది.
నగరం - బెంగళూరు, పాలసీ గడువు తేదీ - 31 జూలై, NCB - 50%, యాడ్-ఆన్‌లు లేవు. ప్రీమియం లెక్కింపు జూలై-2020లో జరపబడింది. దయచేసి పైన మీ వాహన వివరాలను నమోదు చేయడం ద్వారా తుది ప్రీమియంను తనిఖీ చేయండి.
టాటా టియాగో కార్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడింది
మీరు డిజిట్స్ టాటా టియాగో కార్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?
టాటా టియాగో కోసం కార్ ఇన్సూరెన్స్ ప్లాన్స్
థర్డ్-పార్టీ | కాంప్రహెన్సివ్ |
ప్రమాదం కారణంగా స్వంత కారుకు డ్యామేజ్/నష్టాలు |
|
అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు స్వంత కారుకు డ్యామేజ్/నష్టాలు |
|
ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు స్వంత కారుకు డ్యామేజ్/నష్టాలు |
|
థర్డ్-పార్టీ వాహనానికి డ్యామేజ్ |
|
థర్డ్-పార్టీ ఆస్తికి డ్యామేజ్ |
|
వ్యక్తిగత ప్రమాద కవర్ |
|
థర్డ్-పార్టీ వ్యక్తి యొక్క గాయాలు/మరణం |
|
మీ కారు దొంగతనం |
|
డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్ |
|
మీ IDV ని అనుకూలీకరించండి |
|
అనుకూలీకరించిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ బీమా మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి
క్లయిమ్ ను ఎలా ఫైల్ చేయాలి?
మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూవల్ చేసిన తర్వాత, మేము 3-దశల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్ ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
దశ 1
1800-258-5956కు కాల్ చేయండి. ఫారమ్‌లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు
దశ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క నష్టాలను షూట్ చేయండి.
దశ 3
మీరు మా గ్యారేజీల నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్ లలో ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.
డిజిట్స్ టాటా టియాగో కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు ఎంచుకోవాలి?
కారు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం లేదా చట్టబద్ధత కోసం దాన్ని రెన్యూవల్ చెయ్యడం కంటే మీ నిర్ణయానికి మరిన్ని విషయాలు ఉండాలి.
మీ టాటా టియాగో కోసం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తున్న ఇన్సూరెన్స్ సంస్థ యొక్క విశ్వసనీయతను మీరు పరిగణించాలనుకోవచ్చు.
మీరు థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీ లేదా టాటా టియాగో బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకుంటున్నా, మీరు దాని నుండి ప్రయోజనాలను పెంచుకోవచ్చని నిర్ధారించుకోవడానికి అలా చేయడం చాలా ముఖ్యమైనది.
డిజిట్ వంటి ప్రసిద్ధ ఇన్సూరెన్స్ కంపెనీతో, మీరు మీ కొనుగోలులో లేదా మీ టియాగో కోసం ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్ధరించడంలో ప్రయోజనకరమైన స్థానం లో ఉన్నారని మీరు నిశ్చయించుకోవచ్చు.
ఇక్కడ డిజిట్ యొక్క టాటా టియాగో ఇన్సూరెన్స్ పాలసీ యొక్క కొన్ని లక్షణాలు దాని పోటీదారులతో పోలికలో ప్రత్యేకంగా నిలిచేలా చేస్తాయి:
- అవుట్-అండ్-అవుట్ డిజిటల్ ప్రాసెస్ - ఈ డిజిటల్ యుగంలో, క్లయిమ్ లను చెయ్యడం అనేదాన్ని క్లిష్టమైన ప్రక్రియల ద్వారా అడ్డుకోకూడదు. అందుకే, డిజిట్‌తో, మీరు మీ క్లయిమ్ లను చెయ్యడానికి మరియు దానిని సులభంగా పరిష్కరించుకోవడానికి పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన మరియు ఆన్‌లైన్ ప్రక్రియను ఉపయోగించుకోవచ్చు. మీరు మీ టియాగోతో ప్రమాదంలో చిక్కుకున్నారని అనుకుందాం మరియు కారు గణనీయమైన నష్టాన్ని చూసింది అనుకోండి. మీరు డిజిట్‌తో కాంప్రహెన్సివ్ టియాగో ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌తో ఆ డ్యామేజ్ యొక్క చిత్రాన్ని క్లిక్ చేసి, మీ క్లయిమ్ ను చెయ్యడానికి తనిఖీ కోసం మాకు పంపవచ్చు. పూర్తయిన తర్వాత, మేము నష్టాన్ని అంచనా వేస్తాము మరియు తర్వాత క్లయిమ్ ను పరిష్కరిస్తాము. కనీస అవాంతరాలతో అన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతాయి.
- టైలర్డ్ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ - మీరు డిజిట్‌తో మీ టియాగో కోసం మీ పాలసీ యొక్క IDVని అనుకూలీకరించడానికి ఎంచుకోవచ్చు. సాధారణంగా, మేము IDVని గణించడానికి విక్రేత జాబితా చేసిన ధర నుండి వర్తించే తరుగుదలని తీసివేస్తాము - దొంగతనం లేదా మీ టియాగో కు కోలుకోలేని డ్యామేజ్ జరిగినప్పుడు మీ పాలసీకి వ్యతిరేకంగా మీరు స్వీకరించే మొత్తం. మీరు దాని కంటే ఎక్కువ IDVని పొందాలనుకుంటే, టాటా టియాగో ఇన్సూరెన్స్ ధరను స్వల్పంగా సర్దుబాటు చేయడం ద్వారా మీరు అలా చేయవచ్చు.
- స్విఫ్ట్ క్లయిమ్ సెటిల్‌మెంట్ - ప్రమాదానికి గురికావడం లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల మీ టియాగో దెబ్బతినడం వంటి అనూహ్య సంఘటనలను భరించడం ఎంత భయంకరంగా ఉంటుందో మేము అర్థం చేసుకున్నాము. అందువల్ల, మీ క్లయిమ్ ను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయడం ద్వారా మీ సమస్యను తక్షణమే తగ్గించేందుకు మేము కృషి చేస్తాము.
- నెట్‌వర్క్ గ్యారేజీల విస్తృత శ్రేణి - ప్రమాదం జరిగినప్పుడు మరమ్మతులు చేయాలంటే నగదు తక్కువగా ఉందా? నగదు రహిత మరమ్మతులను పొందేందుకు మీరు మీ దెబ్బతిన్న టియాగోను మా 1400+ కంటే ఎక్కువ నెట్‌వర్క్ గ్యారేజీల్లో దేనికైనా తీసుకురావచ్చు. మా విస్తృతమైన నెట్‌వర్క్ గ్యారేజీల శ్రేణి దేశమంతటా విస్తరించి ఉంది, కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మీరు ఎల్లప్పుడూ స్నేహపూర్వక గ్యారేజీని పక్కనే కలిగి ఉంటారు.
- యాడ్-ఆన్‌ల శ్రేణి - డిజిట్‌తో, మీరు అనేక యాడ్-ఆన్‌లతో మీ ఇన్సూరెన్స్ పాలసీని బలంగా చేయవచ్చు. ఈ యాడ్-ఆన్‌లతో, మీరు మీ టియాగో కోసం పాలసీని అనుకూలీకరించవచ్చు మరియు కనిష్ట అదనపు ఖర్చుతో టాటా టియాగో ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆర్థిక కవరేజ్ పొందవచ్చు. మేము 7 యాడ్-ఆన్‌లను అందిస్తాము, వాటిలో కొన్ని రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్, ప్యాసింజర్ కవర్, జీరో డిప్రిషియేషన్ కవర్, ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్షన్ కవర్ మొదలైనవి. మీకు ఉదాహరణగా చెప్పడానికి, మీరు మీ పాలసీ లో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ని చేర్చవచ్చు ఒకవేళ మీ టియాగో రోడ్డు మధ్యలో మెకానికల్ బ్రేక్‌డౌన్‌కు గురైతే, ఇది సహాయం పొందే విధానం.
- అరౌండ్ ద క్లాక్ సహాయం - జాతీయ సెలవు దినాల్లో కూడా మీకు 24/7 సహాయం చేయడానికి మా కస్టమర్ సపోర్ట్ టీమ్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఇది వారపు రోజు లేదా ఆదివారం అయినా, మీరు సమస్యలో ఉన్నట్లు అనిపిస్తే మా మద్దతు బృందాన్ని సంప్రదించండి మరియు మేము మీకు ప్రాధాన్యతపై సహాయం చేస్తాము.
- మీ డోర్ వద్ద సర్వీస్ - డిజిట్ యొక్క టాటా టియాగో ఇన్సూరెన్స్ పాలసీతో, మీరు మా నెట్‌వర్క్ గ్యారేజీల నుండి సహాయాన్ని పొందినట్లయితే, మీరు మీ టియాగో కోసం డోర్‌స్టెప్ సేవను పొందవచ్చు. మమ్మల్ని సంప్రదించండి మరియు మీరున్నచోటు నుండే కారుని తీసుకు వెళ్లేందుకు మేము ఏర్పాటు చేస్తాము మరియు మరమ్మతులు పూర్తయిన తర్వాత దానిని వెనక్కి వదులుతాము.
కాబట్టి, మీరు టాటా టియాగో కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ లేదా డిజిట్ నుండి కొనుగోలు చేయాలనుకోవడానికి గల అనేక కారణాలలో ఇవి కొన్ని.
అయితే, పాలసీని కొనుగోలు చేసే ముందు, మీరు గరిష్ట ప్రయోజనాలను పొందటం కోసం కవర్ చేయబడిన వాటిని కవర్ చేయబడని వాటి గురించి తెలుసుకుంటున్నారని నిర్ధారించుకోండి.
టాటా టియాగో కార్ ఇన్సూరెన్స్‌ను కొనడం/రెన్యూవల్ చెయ్యడం ఎందుకు ముఖ్యం?
టియాగో అనేది మీ స్టైల్ స్టేట్‌మెంట్ మరియు దానిని చెక్కుచెదరకుండా ఉంచడానికి, మీకు కారు ఇన్సూరెన్స్ అవసరం. ఇది మీ టియాగోను ఎదురయ్యే ఏదైనా ఊహించని ప్రమాదం నుండి కాపాడుతుంది.
- ఆర్థిక లయబిలిటీల నుండి రక్షించండి: దొంగతనం, ప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యం మీ ఆర్థిక స్థితిపై పెద్ద కుదుపును కలిగిస్తుంది. ఊహించని థర్డ్ పార్టీ నష్టాల కింద ఇన్సూరెన్స్ మీకు ఆర్థిక ఉపశమనం ఇస్తుంది. భీమా సంస్థ ఇక్కడ మిమ్మల్ని రక్షించగలదు మరియు పెద్ద డ్యామేజ్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
- చట్టబద్ధంగా ఉండటం: కార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం మ్యాండేటరీ; చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం చట్టవిరుద్ధం. పాలసీ లేనట్లయితే, మీకు రూ. 2,000 జరిమానా విధించబడవచ్చు మరియు మీ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు. మిమ్మల్ని కూడా 3 నెలలు జైలుకు పంపవచ్చు.
- థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్: థర్డ్-పార్టీ లయబిలిటీస్ కోసం కవర్ చేసే కనీసం థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం మ్యాండేటరీ. అనుకోని పరిస్థితులలో, ప్రమాదం జరిగినప్పుడు థర్డ్ పార్టీ కి లేదా ప్రయాణీకులకు జరిగిన డ్యామేజ్ లు భారీగా ఉండవచ్చు మరియు మీరు చెల్లించాల్సింది మీ పరిధి కంటే చాలా ఎక్కువగా ఉండొచ్చు. మీరు మీ టియాగోకు ఇన్సూరెన్స్ కలిగి ఉంటే, మీరు ఒత్తిడి లేకుండా ఉండవచ్చు.
- పొడిగించిన కవరేజీతో కూడిన కాంప్రహెన్సివ్ కవర్: కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం మంచి విషయం, ఎందుకంటే ఇది మిమ్మల్ని థర్డ్-పార్టీ లయబిలిటీల నుండి రక్షించడమే కాకుండా, ఊహించని పరిస్థితుల్లో మీ స్వంత టియాగోకు మరియు మీకు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం మొదలైన వాటి నుండి కలిగే డ్యామేజ్ లు మరియు నష్టాలను కూడా కవర్ చేస్తుంది. బంపర్ టు బంపర్, బ్రేక్డౌన్ అసిస్టెన్స్, ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్, టైర్ ప్రొటెక్షన్ కవర్ వంటి యాడ్-ఆన్‌లతో తీసుకున్నప్పుడు మీరు మీ కారుకు విస్తృతమైన రక్షణ ను జోడించవచ్చు.
టాటా టియాగో కార్ గురించి మరింత సమాచారం
కార్ ఆఫ్ ది ఇయర్, హ్యాచ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్, మేక్ ఇన్ ఇండియా అవార్డు, వాల్యూ ఆఫ్ మనీ అవార్డు, మీరు ఏ అవార్డు పేరు చెప్పినా, ఆ అవార్డు టియాగో జేబులో ఉంది. టాటా టియాగో శక్తివంతమైన, స్టైలిష్ మరియు సమకాలీన కారు, మీరు ప్రీమియం సౌలభ్యం మరియు పనితీరును కోరుకుంటే మీకు కావలసింది ఇది.
టియాగో స్మార్ట్‌గా కనిపించే హ్యాచ్‌బ్యాక్ ఆవశ్యకతను పూరించింది, అది సరసమైనది మరియు శక్తివంతమైన లక్షణాలతో లోడ్ చేయబడిన విశాలమైన, ప్రీమియం-కనిపించే ఇంటీరియర్‌ను కలిగి ఉంది. 4.4 లక్షల నుండి ప్రారంభమయ్యే సరసమైన శ్రేణి ధరలో, టియాగో ఖచ్చితంగా డబ్బుకు విలువైనది.
మొత్తం మీద, మీరు చాలా ఫీచర్లను కలిగి ఉండి, విశాలంగా ఉన్న, అందంగా ఉండే హ్యాచ్‌బ్యాక్ కోసం వెతుకుతున్నట్లయితే, మీకు కావాల్సింది టియాగో.
మీరు టాటా టియాగోను ఎందుకు కొనుగోలు చేయాలి?
- తాజా ఫీచర్‌లు: ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 15-అంగుళాల అల్లోయ్ వీల్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, నిగనిగలాడే బ్లాక్ రూఫ్ మరియు స్పాయిలర్, బాడీ హగ్గింగ్ సీటు బోల్స్టర్స్ వంటి మంచి ఫీచర్లతో సెగ్మెంట్‌లోని అత్యంత ఫీచర్-రిచ్ కార్లలో టాటా టియాగో ఒకటి.
- వేరియంట్‌లు: టియాగో ఎనిమిది వేరియంట్‌లలో వస్తుంది: XE, XM, XM, XT, XT (O), XZ మరియు XZ+ మరియు రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది: 1.2-లీటర్ (85PS/114Nm) పెట్రోల్ ఇంజన్ మరియు 1.05-లీటర్ (70PS/140Nm) డీజిల్ మోటార్. ఇది మాత్రమే కాదు, మీరు ఎంచుకోవడానికి 8 రంగు ఎంపికలు ఉన్నాయి. బెర్రీ ఎరుపు, కాన్యన్ ఆరెంజ్, ఓషన్ బ్లూ, ఎక్స్‌ప్రెసో బ్రౌన్, ప్లాటినం సిల్వర్, టైటానియం గ్రే నుండి ముత్యాల తెలుపు వరకు; టాటా మీకు ఎంచుకోవడానికి అందమైన రంగుల శ్రేణిని అందిస్తుంది.
- స్పైస్ ఆఫ్ రేసింగ్: టియాగో JTP అనేది టాటా టియాగోలో అందుబాటులో ఉన్న వేరియంట్‌లలో కొత్త మరియు అప్గ్రేడ్ చేసిన అదనం. JTP అనేది మీలో ఉన్న రేసర్ కోసం, ఇది స్టైలిష్‌గా బోల్డ్‌గా ఉంటుంది మరియు మీరు వేగంగా ఉండడానికి మరియు మీ వైపు తల తిప్పడానికి అవసరమైన అన్ని ఫీచర్‌లతో పవర్-ప్యాక్ చేయబడింది. రేసర్ కోసం, ఈ కారు ఒక సంపూర్ణ షో స్టాపర్.
ఇంజిన్‌పై విశ్వసనీయతతో స్పోర్టీగా కనిపించే హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను ఈ కారు ఆకట్టుకుంటుంది. మరియు ఇది బడ్జెట్ అనుకూలమైనది కాబట్టి, ఇది చాలా మంది యువ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది.
టాటా టియాగో - వేరియంట్లు మరియు ఎక్స్-షోరూమ్ ధర
వేరియంట్స్ | ఎక్స్-షోరూమ్ ధర (నగరం ప్రకారం మారవచ్చు) |
---|---|
XE1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmpl | ₹ 4.39 లక్షలు |
XM1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmpl | ₹ 4.74 లక్షలు |
XZ1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmpl | ₹ 5.14 లక్షలు |
XE డీజిల్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl | ₹ 5.24 లక్షలు |
XZ Opt1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmpl | ₹ 5.34 లక్షలు |
XZA1199 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 23.84 kmpl | ₹ 5.59 లక్షలు |
XM డీజిల్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl | ₹ 5.59 లక్షలు |
XZ Plus1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmpl | ₹ 5.69 లక్షలు |
XZ Plus Dual Tone1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmpl | ₹ 5.76 లక్షలు |
XZ డీజిల్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl | ₹ 5.99 లక్షలు |
XZA Plus1199 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 23.84 kmpl | ₹ 6.14 లక్షలు |
XZ Opt Diesel1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl | ₹ 6.19 లక్షలు |
XZA Plus Dual Tone1199 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 23.84 kmpl | ₹ 6.21 లక్షలు |
XZ Plus డీజిల్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl | ₹ 6.54 లక్షలు |
XZ ప్లస్ DualTone డీజిల్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl | ₹ 6.61 లక్షలు |
భారతదేశంలో టాటా టియాగో కార్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
నేను నా టియాగోలో ప్రయాణీకుడితో ప్రయాణిస్తుంటే, ప్రమాదం కారణంగా వారు గాయపడినట్లయితే? ఆ రకమైన ఆర్థిక లయబిలిటీ కోసం నేను కవరేజీని పొందుతున్నానా?
ప్రామాణిక ఇన్సూరెన్స్ పాలసీలో, ప్రయాణీకుల గాయాలు కవర్ చేయబడవు. అయితే, మీరు మీ టాటా టియాగో ఇన్సూరెన్స్ పాలసీతో ప్యాసింజర్ కవర్‌ను చేర్చాలని ఎంచుకుంటే, మీరు దాని కోసం సహాయాన్ని పొందవచ్చు.
టియాగో ఇన్సూరెన్స్ పాలసీకి కంపల్సరీ డిడక్టబుల్ అమౌంట్ ఎంత?
IRDAI ప్రకారం, 1500 కంటే తక్కువ క్యూబిక్ కెపాసిటీ ఉన్న కార్లు తప్పనిసరిగా రూ.1000 మరియు 1500 సీసీ కంటే రూ.2000 మినహాయించబడతాయి. టియాగో ఇంజన్ సిసి 1500 కంటే తక్కువ ఉన్నందున, రూ.1000 మినహాయించదగిన మొత్తం.
డిజిట్ యొక్క టియాగో కార్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా నా కారు ఇంజిన్‌కు జరిగిన డ్యామేజ్ కవర్ చేయబడిందా?
సాధారణంగా, ఇది కవర్ చేయబడదు. అయితే, ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్షన్ కవర్ యాడ్-ఆన్‌కి వెళ్లడం ద్వారా మీ టియాగో ఇంజన్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టపోయినట్లయితే మీరు ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.
నేను నా టాటా టియాగో ఇన్సూరెన్స్ పాలసీలో వ్యక్తిగత ప్రమాద కవర్‌ను చేర్చలేదా?
ఐఆర్‌డీఏఐ ఆదేశాల ప్రకారం, కారు ఇన్సూరెన్స్ పాలసీతో వ్యక్తిగత ప్రమాద కవర్‌ను కలిగి ఉండటం మ్యాండేటరీ.
నేను నా టియాగో కార్ ఇన్సూరెన్స్ పాలసీపై ప్రీమియంను ఎలా తగ్గించగలను?
టాటా టియాగో ఇన్సూరెన్స్ ధరను తగ్గించడానికి ఉన్న ఒక మార్గం వాలంటరీ డిడక్టబుల్ మొత్తాన్ని ఎంచుకోవడం. ఆ అమౌంట్ ఎక్కువైతే, మీ ప్రీమియం తక్కువగా ఉంటుంది.
అయితే, ఈ సందర్భంలో, మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీకి వ్యతిరేకంగా క్లయిమ్ చేయవలసి వస్తే, మీ పాలసీ మిగిలిన అమౌంట్ కవర్ చేయడానికి ముందు మీరు దిడక్టబుల్ అమౌంట్ లో గణనీయమైన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.