Third-party premium has changed from 1st June. Renew now
ఆన్‌లైన్ లో మారుతి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు/రెన్యూవల్ చేసుకోండి
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అనేది వివిధ రకాల కార్లను తయారు చేసే ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ. సెప్టెంబర్ 2019లో ప్రారంభం అయిన నుంచి 75వేలకు పైచిలుకు యూనిట్లు అమ్ముడుపోయిన కారుగా, ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా మారుతి సుజుకి S-ప్రెస్సో నిలిచింది.
ప్రతి ఒక్కరూ మారుతి సుజుకి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ తీసుకుని ఆర్థిక నష్టాల నుంచి బయటపడొచ్చు.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం థర్డ్ పార్టీ నష్టాలను కవర్ చేసేందుకు ప్రతి కారు యజమాని థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ను తప్పకుండా కలిగి ఉండాలి. ఇది థర్డ్ పార్టీ వల్ల సంభవించే ఆర్థిక నష్టాలను కవర్ చేస్తుంది. చాలా మంది కారు ఓనర్లు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పాలసీ థర్డ్ పార్టీ డ్యామేజెస్ తో పాటు ఓన్ డ్యామేజెస్ ను కూడా కవర్ చేస్తుంది.
ఏదేమైనా మారుతి సుజుకి S-ప్రెస్సోకు ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేందుకు అయినా లేదా రెన్యూవల్ చేసేందుకు అయినా కానీ డిజిట్ వంటి నమ్మకమైన ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ను ఎంచుకోవాలి.
మారుతి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ ధర
రిజిస్ట్రేషన్ డేట్ | ప్రీమియం (కేవలం ఓన్ డ్యామేజ్ పాలసీ కొరకు మాత్రమే) |
---|---|
ఆగస్టు-2021 | 4,535 |
ఆగస్టు-2020 | 3,244 |
ఆగస్టు-2019 | 3,099 |
**నిరాకరణ – ప్రీమియం లెక్కింపు అనేది మారుతి సుజుకి S-ప్రెస్సో VXi AGS BSVI 998.0 కి చేయబడింది. GST మినహాయించబడింది.
నగరం- బెంగళూరు, వాహన రిజిస్ట్రేషన్ నెల- ఆగస్టు, NCB - 50%, ఎటువంటి యాడ్ ఆన్స్ లేవు, పాలసీ గడువు ముగిసిపోలేదు, & IDV- అందుబాటులో ఉన్న అతి తక్కువది ప్రీమియం లెక్కింపు 2021 సెప్టెంబర్‌లో జరిగింది. పైన మీ వాహన వివరాలు నమోదు చేసి ఫైనల్ ప్రీమియం చెక్ చేయండి.
మారుతి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ లో ఏం కవర్ అవుతాయి
డిజిట్ అందించే మారుతి బలెనో కార్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?
మారుతి సుజుకి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ ప్లాన్స్
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
యాక్సిడెంట్ వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
అగ్ని వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
ప్రకృతి విపత్తుల వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
థర్డ్ పార్టీ వెహికిల్ కు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
థర్డ్ పార్టీ ప్రాపర్టీ (ఆస్తి) కి జరిగే డ్యామేజెస్ |
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
|
థర్డ్ పర్సన్ ఇంజూరీ/మరణం |
|
మీ కారు దొంగతనానికి గురయితే |
|
డోర్ స్టెప్ పికప్ & డ్రాప్ |
|
మీ IDVని మార్చుకునే సదుపాయం |
|
మీకు నచ్చిన యాడ్ ఆన్స్ తో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ల మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.
క్లయిమ్‌ను ఫైల్ చేయడం ఎలా?
మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, మేము 3-స్టెప్ ల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
స్టెప్ 1
కేవలం 1800-258-5956 నెంబర్ కు కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు
స్టెప్ 2
సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ (స్వీయ తనిఖీ) కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపించబడుతుంది. మీ వెహికిల్ డ్యామేజెస్ ఎలా షూట్ చేయాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తాం. మీరు ఆ లింక్ ద్వారా డ్యామేజెస్ షూట్ చేస్తే సరిపోతుంది.
స్టెప్ 3
మా నెట్వర్క్ గ్యారేజెస్ ద్వారా క్యాష్ లెస్ లేదా రీయింబర్స్ మెంట్ రిపేర్ మోడ్స్ ని ఎంచుకుని మరమ్మతు చేయించుకోండి.
డిజిట్ అందించే మారుతి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడానికి గల కారణాలు?
S-ప్రెస్సో ఇన్సూరెన్స్ విషయంలో కేవలం ఇన్సూరెన్స్ ధర మాత్రమే కాకుండా ఇంకా అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆ అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతనే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ను ఎంచుకోవాలి. ఉదాహరణ చూసుకుంటే డిజిట్ ఇన్సూరెన్స్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది మారుతి కార్ ఓనర్స్ కు సరిగ్గా సూట్ అవుతుంది.
- ఆన్‌లైన్ క్లెయిమ్ పద్ధతి- డ్రైవర్స్ డిజిట్ ద్వారా తీసుకున్న తమ S-ప్రెస్సో ఇన్సూరెన్స్ ను స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ సెల్ఫ్ ఇన్ప్సెక్షన్ ప్రక్రియ ద్వారా పూర్తి చేయొచ్చు. క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ కోసం ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు పాటించే భౌతిక తనిఖీలను నివారించవచ్చు.
- నచ్చిన విధంగా IDV మార్చుకునే సదుపాయం – డిజిట్ ద్వారా పొందే కార్ ఇన్సూరెన్స్ కు మీరు నచ్చిన విధంగా IDVని మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. S-ప్రెస్సో కారు కోసం తీసుకున్న ఇన్సూరెన్స్ కు కూడా ఇది వర్తిస్తుంది. మీ కారు దొంగిలించబడినపుడు ఇది సహాయకరంగా ఉంటుంది.
- యాడ్ ఆన్ పాలసీలు- డిజిట్ అందించే కొన్ని రకాల యాడ్ ఆన్స్ లో బ్రేక్ డౌన్ అసిస్టెన్స్, జీరో డెప్రిసియేషన్ కవర్, రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్, ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్, కన్జూమబుల్ కవర్ మొదలయినవి ఉంటాయి.
- ఉత్తమమైన కస్టమర్ కేర్ సర్వీస్- 24 గంటల డిజిట్ కస్టమర్ కేర్ సర్వీస్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మారుతి సుజుకి S-ప్రెస్సో గురించి ఉన్న సందేహాలను వీరు నివృత్తి చేస్తారు.
- తక్షణ క్లెయిమ్ సెటిల్‌మెంట్- డిజిట్ సర్వీసుల ద్వారా క్లెయిమ్ చేసినపుడు ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. డిజిట్ లో వెంటనే క్లెయిమ్ సెటిల్ అవుతుంది.
- విస్తృతమైన నెట్వర్క్ గ్యారేజీలు – డిజిట్‌కు ఇండియా వ్యాప్తంగా 5800+ నెట్వర్క్ గ్యారేజెస్ ఉన్నాయి. కావున డ్రైవర్స్ తమ S-ప్రెస్సో కారు గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఏ నెట్వర్క్ గ్యారేజీకి వెళ్లినా రిపేర్ చేస్తారు.
- పికప్ మరియు డ్రాప్ ఫెసిలిటీలు- ఏదైనా సందర్భంలో డ్రైవర్లు రోడ్డు పక్కన ప్రమాదాలకు గురయితే డిజిట్ నెట్వర్క్ గ్యారేజీలు పికప్ మరియు డ్రాప్ సేవలను అందిస్తాయి. కావున వారే తీసుకొచ్చి రిపేర్ చేసి మీ ఇంటి వద్ద డెలివరీ చేస్తారు.
పైన పేర్కొన్న ప్రయోజనాలను బట్టి డిజిట్ మారుతి కంపెనీ కార్లయిన S-ప్రెస్సో మరియు మరిన్నింటికి కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ అందజేస్తోంది.
అంతే కాకుండా మీ మారుతి సుజుకి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకునేందుకు డ్రైవర్లు హయ్యర్ డిడక్టబుల్స్ ఎంచుకోవడం, చిన్న నష్టాలను క్లెయిమ్ చేయకపోవడం, ప్రీమియం వివరాలను ఇతర కంపెనీలతో పోల్చడం వంటివి చేయొచ్చు.
తక్కువ ప్రీమియం ఉందని చెప్పి ప్రయోజనాలు లేకున్నా ఆ పాలసీని తీసుకోకూడదు. కావున ఈ అంశానికి సంబంధించి స్పష్టత పొందేందుకు డిజిట్ వంటి నమ్మకమైన ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించడం చాలా ఉత్తమం.
మారుతి S-ప్రెస్సోకి ఇన్సూరెన్స్ చేయించడం ఎందుకు ముఖ్యం?
మారుతి సుజుకి S-ప్రెస్సో ఇన్సూరెన్స్ ఖర్చులను భరించడం జరిమానాలను చెల్లించడం కంటే బెటర్. పాలసీ వల్ల కింది ప్రయోజనాలు ఉంటాయి.
- థర్డ్ పార్టీ నష్టాల నుంచి కాపాడుతుంది- S-ప్రెస్సో కోసం థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ మీ వాహనం వల్ల థర్డ్ పార్టీ వాహనాలు, వ్యక్తులు లేదా ఆస్తులకు జరిగిన నష్టాలను కవర్ చేస్తుంది. ప్రమాదాల సమయంలో కలిగే ఆర్థిక నష్టాలను ఇది కవర్ చేస్తుంది. మారుతి సుజుకి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ ను రెన్యూవల్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ వాహనం వల్ల మీకు తలెత్తే న్యాయ సమస్యలను ఇది పరిష్కరిస్తుంది.
- సొంత కారుకు అయిన నష్టాల నుంచి కాపాడుతుంది- అనుకోని సందర్భాల్లో మీ కారు ప్రమాదానికి గురయినపుడు భారీ నష్టాలు సంభవించే అవకాశం ఉండవచ్చు. అటువంటి సిట్యుయేషన్ లో కాంప్రహెన్సివ్ పాలసీ మీ ఆర్థిక నష్టాలను కవర్ చేస్తుంది. అందువల్ల కొత్త కారు కొనుగోలు చేసినపుడు కాంప్రహెన్సివ్ S-ప్రెస్సో ఇన్సూరెన్స్ పొందడం, దానిని సమయానికి రెన్యూవల్ చేయించుకోవడం చాలా అవసరం. ఇది మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. (ఓన్ డ్యామేజెస్ మరియు థర్డ్ పార్టీ లయబులిటీస్)
- పర్సనల్ యాక్సిడెంట్ కవర్- IRDAI (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) 2019 నుంచి ప్రతి కారు యజమానికి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ను తప్పనిసరి చేసింది. ఒక వేళ ప్రమాదంలో కారు యజమాని మృతి చెందినా లేక అతడికి వైకల్యం ఏర్పడినా కానీ ఈ కవర్ ఆర్థిక కష్టాల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది.
- కారు దొంగిలించబడినా లేదా పూర్తి డ్యామేజ్ జరిగినా నష్టపరిహారం- ఒకవేళ మీ కారు దొంగిలించబడినా, అగ్ని, వరదలు, భూకంపాల వలన డ్యామేజ్ అయినా మారుతి సుజుకి S-ప్రెస్సో ఇన్సూరెన్స్ పాలసీ మీకు నష్టపరిహారం చెల్లిస్తుంది.
- నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలు- కార్ ఓనర్లు తమ మారుతి సుజుకి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసిన తర్వాత నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలు పొందుతారు. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రతి నాన్ క్లెయిమ్ ఇయర్‌కి ఓన్ డ్యామేజ్ కంపోనెంట్ కి చెల్లించిన ప్రీమియం మీద డిస్కౌంట్ పొందుతాడు.
మీరు కూడా అటువంటి ప్రయోజనాలను పొందేందుకు ఇప్పుడు మారుతి సుజుకి S-ప్రెస్సో ఇన్సూరెన్స్ పాలసీ ధరను చెల్లించి పాలసీని సొంతం చేసుకోండి. భవిష్యత్ లో పెరిగే ధరల భారాన్ని తగ్గించుకోండి.
మీరు కారు ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేసేందుకు అయినా దానిని రెన్యూవల్ చేసేందుకు అయినా డిజిట్ అనేది నమ్మదగిన ఎంపిక. ఎందుకో ఇక్కడ వివరంగా ఉంది.
మారుతి సుజుకి S-ప్రెస్సో గురించి మరింత సమాచారం
మారుతి S-ప్రెస్సో కారు 4 వేరియంట్లలో లభిస్తుంది. Std, LXi, VXi VXi+ వేరియంట్స్ లలో ఇది అందుబాటులో ఉంది. ఈ కారు మోడల్ ప్రజల్లో పాపులారిటీని సంపాదించే అనేక ఫీచర్స్ కలిగి ఉంది. వాటిని ఓ సారి పరిశీలిస్తే..
ఇది ఒక లీటర్ K10 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 68 HP వరకు శక్తినివ్వడమే కాకుండా 90 Nm టార్క్ ను డెలివరీ చేస్తుంది.
కొనుగోలుదారులు ఈ మోడల్ లో లభించే CNG వేరియంట్ కు వెళ్లడం ద్వారా ఇంధనం ఆదా చేసుకోవచ్చు.
ఇందులో ట్విన్ చాంబర్ హెడ్ ల్యాంప్‌లు మరియు C-ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంపులు ఉన్నాయి.
5వ తరం హియరాక్ట్ ప్లాట్‌ఫామ్స్ ప్రకారం ఇందులో అన్ని భద్రతా ఫీచర్స్ ఉన్నాయి.
ఇది డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ప్రీ టెన్షనర్‌లతో కూడిన సీట్ బెల్ట్ లు ఫోర్స్ లిమిటర్ ల వంటి ఇతర భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుంది.
మారుతి కార్లు మన్నికకు పేరుగాంచాయి. కానీ అనుకోని సందర్భాల్లో సంభవించే ప్రమాదాలు నష్టాలకు దారితీస్తాయి. అటువంటి సిట్యుయేషన్స్ లో ఇన్సూరెన్స్ పాలసీ మీ నష్టాలను కవర్ చేస్తుంది.
అందువల్ల మారుతి సుజుకి S-ప్రెస్సో ఇన్సూరెన్స్ ను నమ్మకమైన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకోవడం చాలా అవసరం.
మారుతి సుజుకి S-ప్రెస్సో వేరియంట్స్ మరియు ఎక్స్ షోరూం ధర
రకాలు | ఎక్స్ షోరూం ధర (నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది) |
---|---|
S-ప్రెస్సో STD | రూ.3.78 లక్షలు |
S- ప్రెస్సో STD Opt | రూ.3.84 లక్షలు |
S- ప్రెస్సో LXI | రూ.4.21 లక్షలు |
S- ప్రెస్సో LXI Opt | రూ.4.27 లక్షలు |
S- ప్రెస్సో VXI | రూ.4.47 లక్షలు |
S- ప్రెస్సో VXI Opt | రూ.4.53 లక్షలు |
S- ప్రెస్సో VXI ప్లస్ | రూ.4.63 లక్షలు |
S- ప్రెస్సో VXI ప్లస్ AT | రూ.4.63 లక్షలు |
S- ప్రెస్సో VXI AT | రూ.4.97 లక్షలు |
S- ప్రెస్సో VXI Opt AT | రూ.5.03 లక్షలు |
S- ప్రెస్సో LXI CNG | రూ.5.11 లక్షలు |
S- ప్రెస్సో LXI Opt CNG | రూ.5.17 లక్షలు |
S- ప్రెస్సో VXI CNG | రూ.5.37 లక్షలు |
S- ప్రెస్సో VXI Opt CNG | రూ. 5.43 లక్షలు |
ఇండియాలో మారుతి S-ప్రెస్సో కార్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
డిజిట్ అందించే మారుతి సుజుకి S-ప్రెస్సో పాలసీలో NCB (నో క్లెయిమ్ బోనస్) అంటే ఏమిటి?
డిజిట్ ద్వారా మీరు మీ మారుతి సుజుకి S-ప్రెస్సో మీద 50 శాతం వరకు తగ్గింపును పొందొచ్చు. గడిచిన ఐదు సంవత్సరాలలో మీరు ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉంటే 50 శాతం తగ్గింపు పొందుతారు. ఈ తగ్గింపు ప్రతి సంవత్సరం పెరిగి 50 శాతం అవుతుంది.
మారుతి సుజుకి S-ప్రెస్సో ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయించుకునేందుకు ఏం పత్రాలు అవసరం?
ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం మీకు అవసరం అయ్యే కొన్ని కీలక పత్రాలు
- వాహన రిజిస్ట్రేషన్ నెంబర్
- పోయిన సంవత్సరం పాలసీ నెంబర్
- గతేడాది పాలసీ గడువు ముగిసిన తేదీ మొదలైనవి