Third-party premium has changed from 1st June. Renew now
మారుతి S-క్రాస్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు లేదా రెన్యూవల్ చేసుకోండి
జపనీస్ ఆటో మేకర్ అయిన సుజుకి 2006వ సంవత్సరంలో సబ్ కాంపాక్ట్ కార్ మరియు క్రాస్ ఓవర్ అయిన S-క్రాస్ ను ప్రారంభించింది. ఈ మోడల్ కు చెందిన రెండో తరం కారు సెప్టెంబర్ 2015లో ఇండియాలో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుంచి మారుతి సుజుకి నెక్సా అవుట్‌లెట్ల ద్వారా కంపెనీ కార్ల విక్రయాలు చేపడుతోంది.
ఈ కారులో నమ్మశక్యం కాని అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 18.43 కిలోమీటర్/లీటర్ మైలేజ్, 1462 cc ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఫీచర్ల వల్ల ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాదాపు 1.47 లక్షల మోడళ్లను ఇండియాలో విక్రయించారు.
అయితే ఇతర మారుతి కార్లలాగానే ఈ మోడల్ కారు కూడా ప్రమాదాల్లో చిక్కుకున్నపుడు నష్టాలను కలిగిస్తుంది. మరమ్మతు ఖర్చులు తడిసిమోపెడయ్యే ప్రమాదం ఉంది. ఇండియాలో ఉన్న అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు మారుతి S-క్రాస్ ఇన్సూరెన్స్ ను అందిస్తున్నాయి. దీనిని తీసుకోవడం ద్వారా ఖర్చుల బాధ్యతలను తగ్గించుకోవచ్చు.
ఇటువంటి సందర్భాల్లో డిజిట్ వంటి విశ్వసనీయమైన కంపెనీని వ్యక్తులు పరిగణలోకి తీసుకోవచ్చు. దీని ద్వారా వారి ఆర్థిక భద్రతను కాపాడుకోవచ్చు. ఈ పాలసీని తీసుకుంటే కలిగే లాభాలేంటో కింద వివరించబడింది. మరింత తెలుసుకునేందుకు పూర్తిగా చదవండి.
మారుతి S-క్రాస్ కార్ ఇన్సూరెన్స్ లో ఏం ఏం కవర్ అవుతాయి
డిజిట్ అందించే మారుతి S-క్రాస్ కార్ ఇన్సూరెన్స్ ను మీరు ఎందుకు కొనుగోలు చేయాలి?
మారుతి సుజుకి S-క్రాస్‌కి కార్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
యాక్సిడెంట్ వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
అగ్ని వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
ప్రకృతి విపత్తుల వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
థర్డ్ పార్టీ వెహికిల్ కు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
థర్డ్ పార్టీ ప్రాపర్టీ (ఆస్తి) కి జరిగే డ్యామేజెస్ |
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
|
థర్డ్ పర్సన్ ఇంజూరీ/మరణం |
|
మీ కారు దొంగతనానికి గురయితే |
|
డోర్ స్టెప్ పికప్ & డ్రాప్ |
|
మీ IDVని మార్చుకునే సదుపాయం |
|
మీకు నచ్చిన యాడ్ ఆన్స్ తో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ల మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.
క్లయిమ్‌ను ఫైల్ చేయడం ఎలా?
మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, మేము 3-స్టెప్ ల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!
స్టెప్ 1
కేవలం 1800-258-5956 నెంబర్ కు కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు
స్టెప్ 2
సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ (స్వీయ తనిఖీ) కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపించబడుతుంది. మీ వెహికిల్ డ్యామేజెస్ ఎలా షూట్ చేయాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తాం. మీరు ఆ లింక్ ద్వారా డ్యామేజెస్ షూట్ చేస్తే సరిపోతుంది.
స్టెప్ 3
మా నెట్వర్క్ గ్యారేజెస్ ద్వారా క్యాష్ లెస్ లేదా రీయింబర్స్ మెంట్ రిపేర్ మోడ్స్ ని ఎంచుకుని మరమ్మతు చేయించుకోండి.
మారుతి S-క్రాస్ కోసం డిజిట్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీ మారుతి కారుకి ఉత్తమమైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేందుకు వివిధ రకాల ఇన్సూరెన్స్ సంస్థలు అందిస్తున్న పాలసీలను ఆన్‌లైన్ లో కంపేర్ చేయాలి. అటువంటి ఆఫర్స్ ను మీరు చూస్తున్నపుడు డిజిట్ అందించే సేవలను గుర్తించి మీరు మీ మారుతి S-క్రాస్ కు పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది.
1. వేర్వేరు రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు
మీరు డిజిట్ ద్వారా ఈ కింది రకాలైన ఇన్సూరెన్స్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు.
- థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ
అనుకోని ప్రమాదాల వల్ల సంభవించే నష్టాలను కవర్ చేస్తుంది కాబట్టి మీ మారుతి కారుకు ఈ పాలసీని తీసుకోవడం చాలా అవసరం. మీ కారు వల్ల థర్డ్ పార్టీ వ్యక్తులు కానీ ఆస్తులకు కానీ ఏదైనా నష్టం వాటిల్లినపుడు మీరు ఆ నష్టాన్ని కవర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పాలసీ ఆ బాధ్యతలను, చట్టపరమైన సమస్యలను కూడా చూసుకుంటుంది. అంతే కాకుండా మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఈ ప్రాథమిక ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే మీకు జరిమానా విధించబడుతుంది. ఈ పాలసీ ఉండడం వలన మీరు జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు.
- కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ
మీ మారుతి కారుకు యాక్సిడెంట్స్ వలన గణనీయమైన నష్టం కలిగవచ్చు. దానిని రిపేర్ చేయించేందుకు చాలా ఖర్చు అవుతుంది. మీరు దానిని నివారించేందుకు డిజిట్ అందించే మారుతి S-క్రాస్ కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ కేవలం థర్డ్ పార్టీ నష్టాలకు మాత్రమే కాకుండా సొంత నష్టాలకు కూడా కవరేజ్ అందజేస్తుంది. ఈ ప్లాన్స్ మొత్తం రక్షణను అందిస్తాయి. అందుకోసమే వీటికి అధిక ధర ఉంటుంది.
2. క్యాష్‌లెస్ క్లెయిమ్స్
మీ మారుతి S-క్రాస్ ఇన్సూరెన్స్ పై క్లెయిమ్ చేస్తున్నపుడు క్యాష్ లెస్ రిపేర్ మోడ్ ను ఎంచుకునే సౌలభ్యాన్ని డిజిట్ మీకు అందిస్తుంది. ఇందులో భాగంగా ఎటువంటి నగదు చెల్లించకుండా అధీకృత డీలర్స్ నుంచి మీరు ప్రొఫెషనల్ సర్వీస్ ను పొందుతారు. ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా రిపేర్ సెంటర్ కే రిపేర్ డబ్బులు చెల్లిస్తుంది. మీరు ఈ సదుపాయాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు మీ డబ్బులను భవిష్యత్ అవసరాల కోసం ఆదా చేసుకోవచ్చు.
3. అధిక సంఖ్యలో నెట్వర్క్ గ్యారేజీలు
మీరు ఇండియాలో ఉన్న ఏ డిజిట్ నెట్వర్క్ గ్యారేజీకి పోయినా కానీ మీ మారుతి కారుకు క్యాష్‌లెస్ రిపేర్ పొందొచ్చు. డిజిట్ కు అనేక నెట్వర్క్ గ్యారేజెస్ ఉన్నాయి. కావున మీ కారుకు ప్రమాదం జరిగినపుడు రిపేర్ సెంటర్ ను గుర్తించడం చాలా ఈజీగా ఉంటుంది.
4. సులభమైన ఆన్‌లైన్ ప్రాసెస్
స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిట్ అందించే మారుతి S-క్రాస్ ఇన్సూరెన్స్ ను పొందడం చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి పేపర్ వర్క్ చిక్కులు లేకుండా మీరు మొబైల్ నుంచే ఈ పాలసీని కొనుగోలు చేయొచ్చు. ఇందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు.
5. డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ సదుపాయం
మీరు మారుతి S-క్రాస్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకోవడం ద్వారా డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ సేవలను పొందొచ్చు. మీ కారు డ్యామేజ్ అయిన విడిభాగాలను ఇంటి దగ్గర ఉండే రిపేర్ చేయించుకోవచ్చు.
6. యాడ్ ఆన్ల వల్ల ప్రయోజనాలు
అదనపు చార్జీలకు భయపడకుండా కాంప్రహెన్సివ్ ప్లాన్ ను కొనుగోలు చేసిన వారికి డిజిట్ యాడ్ ఆన్ ప్రయోజనాలను అందిస్తుంది. మీ బేస్ ప్లాన్ కు అదనపు చార్జీలు చెల్లించి మీరు యాడ్ ఆన్స్ ను ఎంచుకోవచ్చు. వీటివల్ల మీకు అదనపు రక్షణ ఉంటుంది. మీకు ప్రయోజనం కలిగించే కొన్ని రకాల యాడ్ ఆన్ పాలసీలు..
- రోడ్ సైడ్ అసిస్టెన్స్
- ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్
- కన్జూమబుల్ కవర్
- రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్
- జీరో డెప్రిసియేషన్ కవర్
మీరు ఈ కవర్స్ తీసుకోవడం వల్ల మీ S-క్రాస్ ఇన్సూరెన్స్ ధర పెరుగుతుంది. అంతే కాకుండా మీకు అదనపు రక్షణ లభిస్తుంది.
7. మీకు నచ్చిన విధంగా IDVని మార్చుకునే సదుపాయం
దొంగతనం లేదా రిపేర్ చేయరాకుండా డ్యామేజ్ అయినపుడు ఇన్సూరెన్స్ సంస్థలు మీ మారుతి కార్ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (IDV) ని బట్టి మీకు నష్టపరిహారం చెల్లిస్తాయి. చెప్పాలంటే మారుతి S-క్రాస్ ఇన్సూరెన్స్ ధర మీ కారు IDVని బట్టి మారుతూ ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణంగా మీరు IDV విలువను పెంచుకునేలా లేదా తగ్గించుకునేలా డిజిట్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
8. బోనస్‌లు మరియు డిస్కౌంట్లు
మీ మారుతి S-క్రాస్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో డిజిట్ వంటి విశ్వసనీయమైన సంస్థలు నో క్లెయిమ్ బోనస్ ను ఆఫర్ చేస్తాయి. నో క్లెయిమ్ బోనస్ అనేది 50 శాతం వరకు ఉంటుంది. మీ పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉంటే మీకు నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. ఈ బోనస్ వలన మీ మారుతి S-క్రాస్‌కు తక్కువ ధరకే కార్ ఇన్సూరెన్స్ తీసుకోండి.
అది మాత్రమే కాకుండా మీ మారుతి S-క్రాస్ ఇన్సూరెన్స్ కు సంబంధించి ఏవైనా సందేహాలుంటే ఏ సందర్భంలోనైనా మా కస్టమర్ సర్వీస్ కు కాల్ చేసి తక్షణ సమాధానం పొందొచ్చు. పైన పేర్కొన్న అన్ని రకాల ప్రయోజనాలను మీకు కావాలని అనుకుంటే మీరు డిజిట్ వంటి ఇన్సూరెన్స్ సంస్థను పరిగణించండి.
మీ మారుతి S-క్రాస్ కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?
మారుతి సుజుకి వ్యాగన్ R వంటి ఏదైనా కారు రోడ్డు మీద ప్రయాణించాలంటే కార్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి. కార్ ఇన్సూరెన్స్ అనేది కింది విషయాల్లో ఓనర్ కు రక్షణగా ఉంటుంది.
- అనుకోకుండా వచ్చే ఆర్థిక బాధ్యతల నుంచి రక్షిస్తుంది: అనుకోకుండా మీ వాహనం డ్యామేజ్ కావడం వలన కలిగే ఆర్థిక నష్టాల నుంచి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌లోని ఓన్ డ్యామేజ్ కవర్ మిమ్మల్ని రక్షిస్తుంది. ఊహించకుండా వచ్చే ఖర్చుల నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, దొంగతనం, విధ్వంసం, సమ్మెలు, అల్లర్ల నుంచి మీ కారుకు నష్టం వాటిల్లకుండా ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.
- ఇండియన్ రోడ్ల మీద చట్టబద్ధంగా డ్రైవ్ చేసే హక్కును కల్పిస్తుంది: మీరు రోడ్డుపై చట్టబద్ధంగా వాహనం నడిపేలా మిమ్మల్ని అనుమతించే పత్రాల్లో ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాల్సిన పత్రం. ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మీద తిరిగితే మీకు భారీ జరిమానా పడే అవకాశం ఉంటుంది. అంత కాకుండా మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు కావచ్చు.
- థర్డ్ పార్టీ లయబులిటీస్‌ను కవర్ చేస్తుంది: మీ కారు ప్రమాదం వల్ల థర్డ్ పార్టీ వ్యక్తికి ఏవైనా గాయాలు కావొచ్చు. అటువంటి సందర్భంలో ఈ కవర్ థర్డ్ పార్టీ వ్యక్తికి సంభవించే నష్టాలను భర్తీ చేస్తుంది. కార్ ఇన్సూరెన్స్ కింద థర్డ్ పార్టీ లయబులిటీ కవర్ తీసుకోవడం తప్పనిసరి.
- యాడ్ ఆన్స్ ద్వారా అదనపు రక్షణ: థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. కానీ మీరు మెరుగైన కవరేజ్ కోసం చూస్తుంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం మంచిది. ఇందులో కొన్ని రకాల యాడ్ ఆన్స్ ద్వారా కవరేజ్ ను పొడిగించుకోవచ్చు. బ్రేక్ డౌన్ అసిస్టెన్స్, ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ప్రొటెక్షన్, టైర్ ప్రొటెక్టివ్ కవర్, జీరో డెప్ కవర్ వంటివి కొన్ని రకాల కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్స్.
మారుతి సుజుకి S-క్రాస్ గురించి మరింత తెలుసుకోండి
మారుతి సుజుకి S క్రాస్ ఒక SUVలా తయారుచేయబడింది. కానీ పొడవైన హ్యాచ్ బ్యాక్ లుక్‌తో ఇది మార్కెట్లో కస్టమర్స్ ను అంతలా అట్రాక్ట్ చేయలేకపోయింది. కానీ ఇటీవల ఈ కారును రీడిఫైన్ చేశారు. కానీ తర్వాత 2014లో ఆపేసిన స్మాల్ సిటీ రైడర్ కార్ మారుతి సుజుకి 800లా తయారు చేసిన తర్వాత ఇతర అనేక మారుతి కార్లలాగానే ఈ కారు కూడా ప్రజాదరణను చూరగొంది.
ఇతర కార్ల మాదిరిగానే మారుతి సుజుకి S క్రాస్ కూడా దాని ప్రాథమిక డిజైన్ తో ఒక ప్రయోజనాన్ని అందించింది. సమాజంలో ఉన్న అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ పీపుల్ దీనిని ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే రూ. 8.86 లక్షల నుంచి రూ. 11.49 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు అధునాతన డిజైన్ తో వస్తుంది. ఇందులో ఉండే ఇంటీరియర్ డిజైన్ వల్ల మార్కెట్లో ఎక్కువ మందిని ఈ కారు అట్రాక్ట్ చేసింది.
మీరు మారుతి సుజుకి S-క్రాస్ ఎందుకు కొనుగోలు చేయాలి?
మారుతి సుజుకి S క్రాస్ అనేది ఐదు సీట్ల కారు. ఇది చాలా విశాలంగా ఉంటుంది. మరియు ఇందులో డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో రైడర్స్ చాలా కంఫర్ట్ రైడ్స్ పొందుతారు. ఈ కారులో ఉన్న ఫీచర్లను మెరుగుపరచాలని మారుతి సుజుకి ఇటీవలే నిర్ణయించింది.
ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ను కలిగి ఉంది. అంతే కాకుండా లీటరుకు 25.1 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది. లెదర్ అపోల్‌స్టరీ, క్రూయిజ్ కంట్రోల్, 60:40 నిష్పత్తిలో స్ప్లిట్ అయ్యే వెనకాల సీటు, 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఇంటీరియర్ బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఆండ్రాయిడ్ సిస్టమ్స్‌తో ఇది బాగా కనెక్ట్ అవుతుంది. కొత్త మారుతి సుజుకి S-క్రాస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ 4 వేరియంట్లలో లభ్యం అవుతుంది. అవి సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా.
మారుతి సుజుకి S-క్రాస్ లో మరో అప్డేట్ ఏంటంటే లెదర్ తో చుట్టబడిన డోర్ ఆర్మ్ రెస్ట్ తో కూడిన వెల్ ఫినిష్‌డ్ క్యాబిన్.
వెనకాల చాలా విశాలంగా ఉంటుంది. వెనకాల సీటు మీకు మంచి కంఫర్ట్ ను అందిస్తుంది. కావాల్సినంత లెగ్ రూం ఉంటుంది.
ఇది చాలా పెద్ద టూతీ క్రోమ్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. దీని వలన కారు చాలా అగ్రెసివ్‌గా కనిపించేలా చేస్తుంది. ఇందులో బెటర్ విజిబులిటీ కోసం LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉంటాయి. ఈ కారు బానెట్ చాలా ధృడంగా ఉంటుంది. అది బోల్డ్ లుక్ ను అందిస్తుంది.
చెక్: మారుతి కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
మారుతి సుజుకి S-క్రాస్ వేరియంట్స్ మరియు ఎక్స్ షోరూం ధరలు
మారుతి S-క్రాస్ వేరియంట్స్ | ధర (న్యూఢిల్లీలో నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది) |
---|---|
సిగ్మా | రూ. 9.65 లక్షలు |
డెల్టా | రూ.10.98 లక్షలు |
జెటా | రూ.11.19 లక్షలు |
డెల్టా AT | రూ.12.73 లక్షలు |
జెటా AT | రూ.12.93 లక్షలు |
ఆల్ఫా | రూ.13.14 లక్షలు |
ఆల్ఫా AT | రూ.14.51 లక్షలు |
[1]
తరచూ అడిగే ప్రశ్నలు
అగ్ని ప్రమాదం కారణంగా నష్టం వాటిల్లితే మారుతి S-క్రాస్ ఇన్సూరెన్స్‌లో కవరేజ్ పొందొచ్చా?
అవును.. మీరు మీ మారుతి కారు కోసం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల అగ్నిప్రమాదం వల్ల సంభవించే నష్టాలను కవర్ చేసుకోవచ్చు.
నేను నా మారుతి కారుకు ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించవచ్చా?
మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్ లో అనుకూలంగా ఉండే కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలుక్యులేటర్ ను పొందుతారు. అక్కడ మీరు మారుతి కార్ ఇన్సూరెన్స్ కు చెల్లించాల్సిన ప్రీమియం అమౌంట్ ను లెక్కించుకోవచ్చు.