Third-party premium has changed from 1st June. Renew now
జీప్ కంపాస్ ఇన్సూరెన్స్: ఆన్ లైన్ లో జీప్ కంపాస్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు లేదా రెన్యూవల్ చేయండి
US ఆటోమొబైల్ కంపెనీ అయిన జీప్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త SUVని రిలీజ్ చేసింది. జీప్ బ్రాండ్ డీలర్ షిప్ లు 2021 ఫిబ్రవరి 2 నుంచి ఈ వాహన టెస్ట్ డ్రైవ్స్ మరియు డెలివరీలను ప్రారంభించాయి.
ఈ మోడల్ కారు 3 సంవత్సరాల క్రితమే ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఈ కారు ఫస్ట్ (మొదటి) మేజర్ ఫేస్ లిఫ్ట్.
2017వ సంవత్సరంలో ఇండియాలో అత్యధిక అవార్డులు పొందిన SUV మోడల్ ఇదే. 2019 బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ఇండియా స్టడీ ప్రకారం.. కంపాస్ వెహికిల్ ఇండియా యొక్క అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ బ్రాండ్ గా నిలిచింది.
మీరు ఇప్పటికే కంపాస్ కారును కలిగి ఉన్నా లేక కంపాస్ కారు అప్ డేటెడ్ వెర్షన్ ను కొనుగోలు చేయాలని భావిస్తున్నా కానీ మీరు కంపాస్ కారు ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడం ముఖ్యం.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం వ్యక్తులు తప్పనిసరిగా థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఈ పాలసీ మన వాహనం వల్ల థర్డ్ పార్టీ వ్యక్తులు, వాహనాలకు అయిన నష్టాన్ని కవర్ చేస్తుంది.
మీరు కనుక పూర్తి కవరేజ్ ను పొందాలని అనుకున్నట్లయితే కాంప్రహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం ఉత్తమం.
ఇండియాలో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు జీప్ కంపాస్ కోసం పోటీపడుతూ ఇన్సూరెన్స్ ప్రీమియంలు అందిస్తున్నాయి. అటువంటి ఇన్సూరెన్స్ కంపెనీల్లో డిజిట్ ఒకటి.
జీప్ కంపాస్ కు కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, డిజిట్ అందించే ఇన్సూరెన్స్ ఎంచుకోవడానికి గల కారణాలను కింద తెలుసుకుంటారు.
జీప్ కంపాస్ కారు ఇన్సూరెన్స్ లో ఏం కవర్ అవుతాయి
మీరు డిజిట్ అందించే కంపాస్ కారు ఇన్సూరెన్స్ ని ఎందుకు కొనుగోలు చేయాలి?
జీప్ కంపాస్ కోసం కారు ఇన్సూరెన్స్ ప్లాన్స్
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
యాక్సిడెంట్ వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
అగ్ని వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
ప్రకృతి విపత్తుల వలన సొంత కారుకు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
థర్డ్ పార్టీ వెహికిల్ కు జరిగే డ్యామేజెస్/లాసెస్ |
|
థర్డ్ పార్టీ ప్రాపర్టీ (ఆస్తి) కి జరిగే డ్యామేజెస్ |
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
|
థర్డ్ పర్సన్ ఇంజూరీ/మరణం |
|
మీ కారు దొంగతనానికి గురయితే |
|
డోర్ స్టెప్ పికప్ & డ్రాప్ |
|
మీ IDVని మార్చుకునే సదుపాయం |
|
మీకు నచ్చిన యాడ్ ఆన్స్ తో అదనపు రక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ల మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు కొత్త కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినా లేదా ప్లాన్ రెన్యూవల్ చేసినా కానీ క్లెయిమ్స్ ఫైల్ చేసేందుకు మీరు ఏమీ టెన్షన్ పడొద్దు. మా వద్ద క్లెయిమ్ ఫైలింగ్ కోసం 3 స్టెప్ డిజిటల్ ప్రాసెస్ అందుబాటులో ఉంది!
స్టెప్ 1
కేవలం 1800-258-5956 నెంబర్ కు కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు
స్టెప్ 2
సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ (స్వీయ తనిఖీ) కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపించబడుతుంది. మీ వెహికిల్ డ్యామేజెస్ ఎలా షూట్ చేయాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తాం. మీరు ఆ లింక్ ద్వారా డ్యామేజెస్ షూట్ చేస్తే సరిపోతుంది.
స్టెప్ 3
మా నెట్వర్క్ గ్యారేజెస్ ద్వారా క్యాష్ లెస్ లేదా రీయింబర్స్ మెంట్ రిపేర్ మోడ్స్ ని ఎంచుకుని మరమ్మతు చేయించుకోండి.
డిజిట్ అందించే జీప్ కంపాస్ కార్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడానికి గల కారణాలు?
ప్రతి ఓనర్ ఆర్థిక నష్టాలను తగ్గించుకునేందుకు కార్ ఇన్సూరెన్స్ పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు డిజిట్ ద్వారా జీప్ కంపాస్ కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
- ఫాస్ట్ క్లెయిమ్ ప్రాసెస్ - ఎవరైతే (ఏ బీమా ప్రొవైడర్ అయితే) క్లెయిమ్స్ ను ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా సెటిల్ చేస్తారో అటువంటి బీమా ప్రొవైడర్ కోసం కార్ ఓనర్స్ వెతుకుతారు. డిజిట్ అందించే ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రొసీజర్ ద్వారా మీరు తొందరగా క్లెయిమ్స్ పొందుతారు. డిజిట్ కు 96 శాతం క్లెయిమ్స్ సెటిల్ చేసిన రికార్డు ఉంది. ఇందులో స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ ద్వారా క్లెయిమ్స్ చేయొచ్చు.
- విస్తృత రేంజ్‌లో నెట్వర్క్ గ్యారేజెస్ – మాకు ఇండియా వ్యాప్తంగా 5800 కంటే ఎక్కువ డిజిట్ నెట్వర్క్ గ్యారేజెస్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మీకు క్యాష్‌లెస్ సర్వీసులను పొందొచ్చు.
- క్యాష్‌లెస్ కార్ రిపేర్స్ – మీరు కనుక నెట్వర్క్ గ్యారేజెస్ లో రిపేర్స్ చేయించుకుంటే డిజిట్ క్యాష్‌లెస్ రిపేర్లను అందిస్తుంది. అంటే మీ కార్ రిపేర్ల కోసం మీరు మీ జేబు నుంచి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అనుమతి పొందిన క్లెయిమ్ అమౌంట్ ను బీమా సంస్థనే నేరుగా రిపేర్ సెంటర్ కు చెల్లిస్తుంది.
- నచ్చిన విధంగా IDVని మార్చుకునే సదుపాయం – మీరు ఇన్సూరెన్స్ చేయించిన కారు దొంగతనానికి గురైనపుడు లేదా దొంగిలించబడినపుడు మీరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పొందే గరిష్ట మొత్తాన్ని IDV లేదా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ సూచిస్తుంది. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఇదే విలువపై ఆధారపడి ఉంటుంది. మీరు కనుక అధిక IDVని సెట్ చేసుకుంటే మీ కారు బీమా ప్రీమియం కూడా అధికంగానే ఉంటుంది. అటువంటి సమయంలో మీరు కనుక మీ వాహనాన్ని విక్రయించాలని అనుకుంటే మీరు అధిక ధరను పొందే అవకాశం ఉంటుంది. మీరు IDVని మీ ఇష్టం వచ్చినట్లు సెట్ చేసుకునేందుకు డిజిట్ పాలసీదారులను అనుమతిస్తుంది. అంతే కాకుండా వారు కోరుకున్న విధంగా క్లెయిమ్ అమౌంట్ అందుకునేందుకు కూడా అనుమతిస్తుంది. డిజిట్ అందించే జీప్ కంపాస్ కార్ ఇన్సూరెన్స్ ను మీరు ఎంచుకున్నపుడు మీరు పారదర్శకతను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
- యాడ్ ఆన్స్ ఎంచుకునే సౌకర్యం – డిజట్ నుంచి కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే వారు.. వారి బేస్ ప్లాన్ మీద వివిధ రకాల యాడ్ ఆన్స్ పొందొచ్చు. డిజిట్ ఏడు యాడ్ ఆన్ ప్లాన్స్ అందిస్తుంది. అవి.. జీరో డెప్రిసియేషన్ కవర్, బ్రేక్ డౌన్ అసిస్టెన్స్, రిటర్న్ టూ ఇన్‌వాయిస్ కవర్ వంటి మరిన్ని యాడ్ ఆన్స్ ను డిజిట్ అందిస్తుంది. మీరు ఈ యాడ్ ఆన్స్ ను మీ బేస్ ప్లాన్ కు యాడ్ చేసుకోవాలని అనుకుంటే మీ ప్రీమియం అమౌంట్ పెరుగుతుంది.
- డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ సదుపాయం – మీకు నెట్వర్క్ గ్యారేజీని సందర్శించడం వీలుకాకపోతే మీరు డోర్ స్టెప్ పికప్ సర్వీస్ ను ఎంచుకోవచ్చు. డిజిట్ అందించే పాలసీలో ఈ సౌలభ్యం ఉంటుంది.
- 24x7 కస్టమర్ సపోర్ట్ – మీకు డిజిట్ అందించే జీప్ కంపాస్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధర గురించి లేదా దాని గురించి మరేదైనా సందేహం ఉంటే మీరు ఎటువంటి మొహమాటం లేకుండా డిజిట్ కస్టమర్ సపోర్ట్ కు కాల్ చేయొచ్చు. జాతీయ సెలవు దినాల్లో కూడా డిజిట్ 24x7 కస్టమర్ సపోర్ట్ ను అందిస్తుంది.
మీకు ఇప్పుడు జీప్ కంపాస్ కార్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి తెలుసు. మీరు ఇందులోంచి ఒక కారును తీసుకున్నపుడు దాని డ్యామేజెస్ విషయంలో ఆర్థిక భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. డిజిట్ వంటి సంస్థల నుంచి మీరు కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నపుడు పైన పేర్కొన్న ప్రయోజనాలను మీరు పొందొచ్చు.
జీప్ కంపాస్ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?
ప్రతి కారు యజమాని ప్రమాదాలు మరియు ఇతర అనుకోని సంఘటనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు వారు ఖచ్చితంగా కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం కానీ దానిని రెన్యూవల్ చేయించడం కానీ తప్పకుండా చేయాలి.
రిపేర్లు మరియు ఫైన్ల కోసం చెల్లించే బదులు జీప్ కంపాస్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా తెలివైన పని.
జీప్ కార్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే కొన్ని ప్రయోజనాలు కింద పేర్కోబడ్డాయి.
- ఆర్థిక నష్టాలను అరికట్టేందుకు – ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, దొంగతనాల వంటి విషయంలో మీ జీప్ కారుకు కలిగే ఆర్థిక నష్టాలు భారీగా ఉంటాయి. ఈ కారు కోసం మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వలన అటువంటి నష్టాల నుంచి భద్రత పొందొచ్చు. అంతే కాకుండా జీప్ కంపాస్ కార్ ఇన్సూరెన్స్ వల్ల మీరు భారీ ఫైన్స్ నుంచి కూడా రక్షణ పొందొచ్చు.
- కవరేజ్ మరియు యాడ్ ఆన్ బెనిఫిట్స్ పొందేందుకు – మీరు కనుక కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ను ఎంచుకుంటే ప్రమాదాలు, ఇతర అనుకోని సంఘటనలకు అదనపు కవరేజ్ కోసం యాడ్ ఆన్ పాలసీలను చేర్చమని ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ను అడగొచ్చు.
- థర్డ్ పార్టీ డ్యామేజెస్ నుంచి ఆర్థిక రక్షణ – మీ వలన థర్డ్ పార్టీ వాహనం లేదా ఆస్తి, వ్యక్తికి నష్టం వాటిల్లినట్లయితే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఆర్థిక నష్టాలను కవర్ చేస్తుంది.
- చట్టపరమైన చిక్కులను తొలగించుకునేందుకు – మోటారు వాహనాల చట్టం ప్రకారం మీ కారుకు కనీసం థర్డ్ పార్టీ బీమా అయినా ఉండాలి. అలా లేని పక్షంలో మీరు మొదటి సారి దొరికితే రూ. 2000, రెండో సారి దొరికితే రూ. 4000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
- పర్సనల్ యాక్సిడెంట్ కవర్ – మీకు తీవ్రమైన యాక్సిడెంట్ సంభవించినపుడు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ప్రయోజనాలను అందిస్తుంది. దీని ద్వారా శాశ్వత వైకల్యం మరియు ప్రమాదవశాత్తు చనిపోయినపుడు బెనిఫిట్స్ (ప్రయోజనాలు) పొందొచ్చు.
డిజిట్ వంటి ఇన్సూరెన్స్ సంస్థలు మీకు కాంప్రహెన్సివ్ బెనిఫిట్స్ మరియు చట్టపరంగా, ఆర్థికంగా రక్షణను కలిగిస్తాయి. అందువల్ల మీరు జీప్ కంపాస్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ను ఎంచుకోవచ్చు. లేదా డిజిట్ వంటి కంపెనీల నుంచి కొత్త పాలసీని తీసుకోవచ్చు.
జీప్ కంపాస్ గురించి మరింత సమాచారం
జీప్ కంపాస్ 4 ట్రిమ్స్ (వెర్షన్స్), 14 వేరియంట్స్, 2 ఇంజిన్స్ తో వస్తుంది. ఇది ఏడు రకాల రంగుల షేడ్స్ కలిగి ఉంటుంది. ఇందులో 60 రకాల సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
కంఫర్టబుల్ రైడ్స్ కోసం ఐడియల్ SUVగా పరిగణించేందుకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఫీచర్స్
ఈ కారులో 160bhp/250Nm టార్క్ ఉత్పత్తి చేసే1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 168bhp/350Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్స్ ఉన్నాయి.
రెండు ఇంజిన్లలో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటుంది.
జీప్ కంపాస్ లో వెహికిల్ డేటా, స్టోలెన్ వెహికిల్ అసిస్టెన్స్, లొకేషన్ బేస్డ్ సర్వీసెస్, జియో ఫెన్సింగ్ మరియు డ్రైవర్ ఎనలటిక్స్ వంటి సాంకేతిక అంశాలు ఉంటాయి.
ఈ కారు బంపర్ కే LED ఫాగ్ లైట్స్ అమర్చబడి ఉంటాయి.
ఇది LED DRLలతో అనుసంధానించబడిన LED హెడ్ ల్యాంప్స్ కలిగి ఉంటుంది.
ఇక ఈ కారులో మరో అట్రాక్టివ్ ఫీచర్ ఏంటంటే.. లెదర్ తో చుట్టబడిన 10.2 ఇంచుల డిజిటల్ తెర.
కేవలం ఇవి మాత్రమే కాకుండా 6 ఎయిర్ బ్యాగ్స్, బ్రేక్ లాక్ డిఫరెన్షియల్ వంటి మరిన్ని భద్రతా ఫీచర్లను ఇది కలిగి ఉంటుంది.
జీప్ కార్లలో అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నప్పటికీ అనుకోని ప్రమాదాలు, డ్యామేజెస్ నుంచి కారును రక్షించేందుకు మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలి.
జీప్ కంపాస్- వేరియంట్లు మరియు ఎక్స్ షోరూం ధర
వేరియంట్లు | ఎక్స్ షోరూం ధర (నగరాన్ని బట్టి ధర మారొచ్చు) |
---|---|
2.0 స్పోర్ట్ డీజిల్ (డీజిల్) | రూ.23.22 లక్షలు |
2.0 లాంగిట్యూడ్ ఆప్ట్ డీజిల్ (డీజిల్) | రూ.25.59 లక్షలు |
2.0 లిమిటెడ్ ఆప్ట్ డీజిల్ (డీజిల్) | రూ.28.01 లక్షలు |
2.0 యానివర్సరీ ఎడిషన్ (డీజిల్) | రూ.28.58 లక్షలు |
2.0 S డీజిల్ (డీజిల్) | రూ.30.56 లక్షలు |
2.0 లిమిటెడ్ 4X4 ఆప్ట్ డీజిల్ AT (డీజిల్) | రూ.32.61 లక్షలు |
2.0 యానివర్సరీ ఎడిషన్ 4X4 AT(డీజిల్) | రూ.33.18 లక్షలు |
2.0 S 4X4 డీజిల్ AT (డీజిల్) | రూ.35.16 లక్షలు |
1.4 స్పోర్ట్ (పెట్రోల్) | రూ.20.63 లక్షలు |
1.4 స్పోర్ట్ DCT (పెట్రోల్) | రూ.23.57 లక్షలు |
1.4 లాంగిట్యూడ్ ఆప్ట్ DCT (పెట్రోల్) | రూ.25.91 లక్షలు |
1.4 లిమిటెడ్ ఆప్ట్ DCT (పెట్రోల్) | రూ.28.28 లక్షలు |
1.4 యానివర్సరీ ఎడిషన్ DCT (పెట్రోల్) | రూ.28.84 లక్షలు |
1.4 S DCT (పెట్రోల్) | రూ.30.79 లక్షలు |
ఇండియాలో జీప్ కంపాస్ కార్ ఇన్సూరెన్స్ గురించి FAQలు (తరచూ అడిగే ప్రశ్నలు)
జీప్ కంపాస్ కార్ ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
క్లెయిమ్ ఫైల్ చేయడానికి మీరు తప్పనిసరిగా బీమా ప్రొవైడర్ ను సంప్రదించాలి. అతడికి మీ జీప్ కార్ డ్యామేజెస్ గురించి వివరించి.. డ్యామేజ్ లకు సంబంధించి నెట్వర్క్ గ్యారేజెస్ నుంచి రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్ రిపేర్ ఎంచుకోవాలి. డిజిట్ వంటి ఇన్సూరెన్స్ సంస్థలు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే క్లెయిమ్ ఫైల్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
జీప్ కంపాస్ ఇన్సూరెన్స్ ధర ఎంత ఉంటుంది?
జీప్ కంపాస్ లేదా వేరే ఏదైనా మోడల్ అయినా కానీ కార్ ఇన్సూరెన్స్ ధర అనేది వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో వేర్వేరుగా ఉంటుంది. మీరు అటువంటి సమయంలో మీ వాహన IDVని పరిగణలోకి తీసుకోవాలి. నిక్కచ్చిగా ఉండే బీమా సంస్థల కోసం వెతకడం మంచిది. తక్కువ ప్రీమియం ఆఫర్ చేసే బీమా సంస్థలను రిజెక్ట్ చేయడం మంచిది. ఎందుకంటే అవి వాహన IDVని తక్కువగా సెట్ చేస్తాయి. మీరు మీ జీప్ కంపాస్ కార్ IDVని మీకు నచ్చిన విధంగా మార్చుకునే సదుపాయాన్ని డిజిట్ కల్పిస్తోంది.
జీప్ కంపాస్ కార్ ఇన్సూరెన్స్ లో పాసింజర్ కవర్ ఉంటుందా?
మీరు కనుక జీప్ కంపాస్ యొక్క కాంప్రహెన్సివ్ ప్లాన్ ను ఎంచుకుంటే మీరు బేస్ ప్లాన్ కు యాడ్ ఆన్స్ ను ఎంచుకుని అదనపు సౌలభ్యాన్ని పొందొచ్చు. అటువంటి యాడ్ ఆన్ పాలసీల్లో పాసింజర్ కవర్ అందుబాటులో ఉంటుంది. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు కనుక యాడ్ ఆన్స్ ఎంచుకుంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.