హ్యుండాయ్ వెన్యూ ఇన్సూరెన్స్‌ను
Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

హ్యుండాయ్ వెన్యూ కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు లేదా రెన్యూవల్ చేయండి

హ్యుండాయ్ వెన్యూ అనేది 2019లో లాంచ్ అయింది. ఈ ఇంజిన్ డీజిల్ మరియు పెట్రోల్ రెండు వెర్షన్లను ఆఫర్ చేస్తోంది. ఇందులో డ్రైవర్ తో పాటు 5గురు కూర్చునేలా ఉండే సబ్-4 SUV. మహీంద్రా XUV300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి సుజుకీ విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి ఎన్నో రకాల కాంపాక్ట్ SUVలకు ఈ కారు పోటీనిస్తుంది.

వెన్యూ అనేది మూడు సిలిండర్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. 118.35bhp@6000rpm గరిష్ట శక్తిని మరియు 171.6Nm@1500-4000rpm గరిష్ట టార్క్ ను అందిస్తుంది.

హ్యుండాయ్ వెన్యూ అనేది ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇంధన రకం మరియు వేరియంట్ ఆధారంగా ఇది లీటరుకు సగటున 17.52 కిలోమీటర్ల నుంచి 23.7 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

ఈ కారు కు బయటి భాగంలో టాప్ డే టైమ్ రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ అండ్ కార్నరింగ్ హెడ్ లైట్స్, ప్రొజెక్టర్ ఫాగ్ లైట్స్, LED టెయిల్ లైట్స్ మొదలయినవి ఉంటాయి. హ్యుండాయ్ వెన్యూ లోపలి భాగంలో మెటల్ ఫినిషింగ్, లెదర్ ప్యాక్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, స్పోర్టీ మెటల్ పెడల్స్ వంటివి ఉన్నాయి.

ఇవి మాత్రమే కాకుండా వెన్యూలో రేర్ కెమెరా విత్ డైనమిక్ గైడ్ లైన్స్, హెడ్ ల్యాంప్, ఎస్కార్ట్ ఫంక్షన్, మరియు బర్గ్‌లర్ అలారం (దొంగతనం జరిగితే) వంటి అదనపు భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇలా ఎన్నో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నప్పటికీ హ్యుండాయ్ వెన్యూ అనేక రోడ్ యాక్సిడెంట్‌లకు గురయ్యే చాన్స్ ఉంది. అందువల్ల ప్రొఫెషనల్ మరియు నమ్మకంగా ఉండే కార్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవడం చాలా అవసరం. హ్యుండాయ్ వెన్యూ కోసం డిజిట్ కార్ ఇన్సూరెన్స్ సరైన ఎంపిక.

హ్యుండాయ్ వెన్యూ కార్ ఇన్సూరెన్స్‌లో ఏం కవర్ అవుతాయి

మీరు ఎందుకోసం డిజిట్ అందించే హ్యుండాయ్ వెన్యూ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి?

హ్యుండాయ్ వెన్యూ కోసం కారు ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

యాక్సిడెంట్ వల్ల సొంత కారుకు కలిగిన డ్యామేజ్లు/లాసెస్

×

అగ్ని వలన సొంత కారుకు కలిగిన డ్యామేజ్లు/లాసెస్

×

ప్రకృతి విపత్తుల వలన సొంత కారుకు కలిగిన డ్యామేజ్లు/లాసెస్

×

థర్డ్ పార్టీ వాహనానికి కలిగిన డ్యామేజ్లు

×

థర్డ్ పార్టీ ఆస్తికి కలిగిన డ్యామేజ్లు

×

వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ పర్సన్ గాయాలు లేదా మరణం

×

మీ కారు దొంగిలించబడితే

×

డోర్స్టెప్ పికప్ మరియు డ్రాప్

×

మీ వాహన IDVని అనుకూలీకరించుకోండి

×

కస్టమైజ్డ్ యాడ్ ఆన్స్ ద్వారా అదనపు రక్షణ

×
Get Quote Get Quote

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి

క్లయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూవల్ చేసిన తర్వాత మేము పూర్తిగా 3 స్టెప్ డిజిటల్ క్లయిమ్ ప్రాసెస్ కలిగి ఉంటాం. దాని వల్ల మీరు నిశ్చింతగా ఉండొచ్చు!

స్టెప్ 1

1800-258-5956 నెంబర్ కు జస్ట్ కాల్ చేయండి. ఎటువంటి ఫామ్స్ నింపాల్సిన అవసరం లేదు

స్టెప్ 2

స్వీయ తనిఖీ లింక్ ను మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ వాహన డ్యామేజ్లను మొత్తం షూట్ చేయండి.

స్టెప్ 3

మీరు మా గ్యారేజ్ నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్ లెస్ మీకు నచ్చినది ఎంచుకోండి.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లయిమ్లు ఎంత తొందరగా సెటిల్ అవుతాయి? మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటపుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మంచిది మీరు సరైనదే చేస్తున్నారు! డిజిట్ క్లయిమ్ రిపోర్ట్ కార్డును చదవండి

హ్యుండాయ్ వెన్యూ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు ఎంచుకోవాలి?

1. అనేక రకాల పాలసీ ఆప్షన్స్

  • డిజిట్ ద్వారా మీరు ఈ కింది పాలసీ ఆప్షన్స్ నుంచి ఎంచుకోవచ్చు -
  • థర్డ్ పార్టీ పాలసీ - మీ కారు థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా అతడి వాహనానికి లేదా ఆస్తికి నష్టం కలిగించే సందర్భాలు ఉండొచ్చు. డిజిట్ అందించే హ్యుండాయ్ వెన్యూ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తులకు అటువంటి డ్యామేజ్లు జరిగితే డిజిట్ కవర్ చేస్తుంది. వ్యాజ్యం సమస్యలు ఏవైనా ఉంటే అది కూడా చూసుకుంటుంది. అంతే కాకుండా మోటారు వాహనాల చట్టం 1989 ప్రకారం ప్రతి వాహన యజమాని తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి.
  • కాంప్రహెన్సివ్ పాలసీ - డిజిట్ కాంప్రహెన్సివ్ వెన్యూ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్స్ థర్డ్ పార్టీ మరియు ఓన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కవరేజ్ ప్రయోజనాలు రెండింటిని పొందుతారు. అదనంగా పాలసీ హోల్డర్స్ అనేక అదనపు సౌకర్యాలను పొందుతారు.

2. అదనపు ప్రయోజనాలు

డిజిట్ కాంప్రహెన్సివ్ పాలసీతో మీరు వివిధ రకాల యాడ్ ఆన్స్ ను పొందుతారు-

  • జీరో డెప్రిసియేషన్ కవర్
  • కన్జూమబుల్ కవర్
  • ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్
  • రోడ్ సైడ్ అసిస్టెన్స్
  • రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్

3. 24x7 కస్టమర్ సపోర్ట్

హ్యుండాయ్ వెన్యూ కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ కాస్ట్ కు సంబంధించి మీకు ఏవైనా సందేహాలుంటే మీ కస్టమర్ సర్వీస్ టీమ్ ని సంప్రదించండి. వారు జాతీయ సెలవు దినాల్లో కూడా 24x7 వర్క్ చేస్తారు. ఇన్సూరెన్స్ సంబంధిత సమస్యలను సాల్వ్ చేసేందుకు కృషి చేస్తారు.

4. పేపర్ లెస్ సేవలు

హ్యుండాయ్ వెన్యూ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రాసెస్ గురించి మీరు ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లో ఇప్పటికే ఉన్న పత్రాలని అప్ లోడ్ చేయండి. ఏ సమయంలోనైనా మీ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయండి.

5. నో క్లయిమ్ బోనస్

డిజిట్ అందించే హ్యుండాయ్ వెన్యూ కార్ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్స్ కార్ పాలసీ ప్రీమియంల మీద 20-50 శాతం వరకు డిస్కౌంట్ పొందుతారు. అయితే ఈ డిస్కౌంట్ అనేది మీ క్లయిల్ రహిత సంవత్సరాల మీద ఆధారపడి ఉంటుంది.

6. IDV కస్టమైజేషన్

డిజిట్ ద్వారా మీరు మీ హ్యుండాయ్ వెన్యూ యొక్క ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అధిక IDV అంటే అర్థం మీ కారు దొంగిలించబడినా లేదా డ్యామేజ్ అయినా కానీ అధిక పరిహారం వస్తుంది.

7. పెద్ద సంఖ్యలో నెట్‌వర్క్ గ్యారేజీలు

ఇండియా వ్యాప్తంగా అనేక గ్యారేజీలతో డిజిట్ భాగస్వామ్యం కలిగి ఉంది. కావున మీరు కారులో రోడ్ పై వెళ్తున్నపుడు ఏదైనా సమస్యను ఫేస్ చేస్తే వెంటనే నెట్‌వర్క్ గ్యారేజీని సందర్శించి క్యాష్ లెస్ సేవలను క్లయిమ్ చేయొచ్చు.

చాలా మంది తమ ఫోర్ వీలర్ ను అపురూపంగా చూసుకుంటారు. కావున అత్యంత నమ్మకంగా ఉండే హ్యుండాయ్ వెన్యూ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడర్ ను ఎంచుకోవడం అతి ముఖ్యం. అంతే కాకుండా వెహికల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం వలన ఇంకో ప్రయోజనం కూడా ఉంది. ఆన్ రోడ్ వ్యత్యాసాల విషయంలో చెల్లింపు చేయాల్సిన ఫైన్స్ నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.

హ్యుండాయ్ వెన్యూ కోసం కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?

ఆర్థికపరమైన భద్రత గురించి చూసుకుంటే ఇండియాలో ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం అనేది చాలా ముఖ్యం. కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఎలా సహాయపడిందో మాకు తెలియజేయండి

ఆర్థిక భద్రతను అందిస్తుంది : ఏవైనా అనుకోని మీ కారుకు నష్టం వాటిల్లినపుడు లేదా వేరొకరి కారు మీ కారు వల్ల డ్యామేజ్ అయినపుడు మీ జేబు నుంచి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా కార్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది!

ఓన్ డ్యామేజ్ కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలసుకోండి.

కంపల్సరీ థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ : ఇండియాలో థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీని కొనుగోలు చేయడం మ్యాండేటరీ. దీనిని స్టాండ్ అలోన్ కవర్ గా తీసుకోవచ్చు. లేదా కాంప్రహెన్సివ్ ప్యాకేజీలో భాగంగా తీసుకోవచ్చు. ఏదైనా సందర్భంలో థర్డ్ పార్టీ వ్యక్తికి శారీరక గాయం లేదా ఆస్తి డ్యామేజ్ సంభవించినపుడు ఇన్సూరర్ చెల్లించాలి. మరణాలు సంభవించినపుడు ఈ లయబిలిటీలు ప్రత్యేకించి భరించలేని విధంగా ఉండొచ్చు. అందువల్ల మీకు కార్ పాలసీ ఎంతో సహాయం చేస్తుంది.

డ్రైవింగ్ కోసం లీగల్ పర్మిట్ :  మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం, కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ఎసెన్షియల్. ఎందుకంటే ఇది మీకు రోడ్డు మీద డ్రైవ్ చేసేలా చట్టపరమైన అనుమతిని ఇస్తుంది. మీకు కనుక ఇన్సూరెన్స్ లేకపోతే మీ డ్రైవింగ్ లెసెన్స్ రద్దు చేయబడవచ్చు.

యాడ్ ఆన్ లతో కవరేజీని పొడిగించండి : మీకు కనుక కాంప్రహెన్సివ్ ప్యాకేజీ పాలసీ కలిగి ఉన్నట్లయితే కార్ ఇన్సూరెన్స్ పాలసీని దాని కవరేజ్ కోసం పొడిగించవచ్చు. మీరు కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్స్ కొనుగోలు చేయడం ద్వారా ప్యాకేజ్ పాలసీని బెటర్ కవర్ గా మార్చుకోవచ్చు. వీటిలో కొన్ని బ్రేక్డౌన్ అసిస్టెన్స్, ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్, టైర్ ప్రొటెక్టివ్ కవర్, మరియు జీరో డెప్ కవర్ వంటివి మరిన్ని ఉంటాయి.

హ్యుండాయ్ వెన్యూ గురించి మరింత తెలుసుకోండి

మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకునేందుకు వాటికి పోటీగా హ్యుండాయ్ కంపెనీ కాంపాక్ట్ SUV అయిన వెర్నా (వెన్యూ) ని ప్రవేశపెట్టింది. పొడవాటి బానెట్ తో ఉండే ఈ వెహికిల్ బ్యాలెన్స్‌డ్ లుక్స్ తో మార్కెట్లో అందరి దృష్టిని అట్రాక్ట్ చేసింది. అదే సెగ్మెంట్ లో ఉన్న ఇతర కార్లతో పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ హ్యుండాయ్ వెన్యూ అనేది మంచి పని తీరును కనబరుస్తుందని అంతా నమ్ముతున్నారు.

ఈ కారు ఐదుగురికి సరిపోయే సీటింగ్ తో వస్తుంది. ఇది మంచి ఫ్యామిలీ కార్. దీని ధర రూ. 6.5 లక్షల నుంచి రూ. 11.11 లక్షల వరకు ఉంటుంది. హ్యుండాయ్ వెన్యూ అనేది లీటరుకు 17.52 కిలోమీటర్ల నుంచి 23.70 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది.

మీరు హ్యుండాయ్ వెన్యూని ఎందుకు కొనుగోలు చేయాలి?

హ్యుండాయ్ వెన్యూ కార్ అనేది డైనమిక్ ఫీచర్లు మరియు కంఫర్టబుల్ ఇంటీరియర్స్ తో ఇండియన్ రోడ్లను హిట్ చేసింది. ఈ కారు సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లో పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ లలో అందుబాటు లో ఉంటుంది. ఇందులో ఉన్న శక్తివంతమైన ఇంజిన్ మరియు టార్క్ ట్రాఫిక్ లో కూడా స్మూత్ రైడ్ ను అందిస్తుంది. దీని డిజైన్ ఫ్లాట్ డ్యాష్ బోర్డ్ మరియు ఫ్రంట్ లో టచ్ స్క్రీన్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. సీటు మరియు స్టీరింగ్ కొరకు అప్హోల్స్టరీ హై క్వాలిటీ లెదర్.

ముందు మరియు వెనుక సీట్లు గుడ్ సపోర్ట్ ను అందజేస్తాయి. ఇది స్టోరేజ్ ఆప్షన్స్ తో పాటు కంఫర్టబుల్ హెడ్ మరియు లెగ్ రూమ్ ను కూడా పొందుతారు. స్మార్ట్ ఫోన్ మిర్రరింగ్ తో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ABS, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్, మరియు GPS లొకేషన్ ఆధారిత సర్వీసులు.

హ్యుండాయ్ వెన్యూ అనేది 10 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మీరు మందిలో వెళ్తున్నపుడు ఇది అనేక మందిని అట్రాక్ట్ చేస్తుంది.

 

చెక్ : హ్యుండాయ్ కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి

హ్యుండాయ్ వెన్యూలోని వేరియంట్లు

వేరియంట్ పేరు వేరియంట్ ధర (న్యూ ఢిల్లీ, నగరాలను బట్టి ధరల్లో మార్పు ఉంటుంది)
వెన్యూ E రూ. 6.99 లక్షలు
వెన్యూ S రూ. 7.77 లక్షలు
వెన్యూ S ప్లస్ రూ. 8.64 లక్షలు
వెన్యూ S టర్బో iMT రూ. 9.10 లక్షలు
వెన్యూ S డీజిల్ రూ. 9.52 లక్షలు
వెన్యూ SX డీజిల్ రూ. 9.99 లక్షలు
వెన్యూ S టర్బో DCT రూ. 10.01 లక్షలు
వెన్యూ SX iMT రూ. 10.07 లక్షలు
వెన్యూ SX టర్బో రూ. 10.07 లక్షలు
వెన్యూ SX స్పోర్ట్ iMT రూ. 10.37 లక్షలు
వెన్యూ SX డీజిల్ స్పోర్ట్ రూ. 10.40 లక్షలు
వెన్యూ SX టర్బో ఎగ్జిక్యూటివ్ రూ. 11.04 లక్షలు
వెన్యూ SX ఆప్ట్ iMT రూ. 11.35 లక్షలు
వెన్యూ SX ఆప్ట్ స్పోర్ట్ iMT రూ. 11.48 లక్షలు
వెన్యూ SX ఆప్ట్ డీజిల్ రూ. 11.67 లక్షలు
వెన్యూ SX ప్లస్ టర్బోDCT రూ. 11.68 లక్షలు
వెన్యూ SX ఆప్ట్ డీజిల్ స్పోర్ట్ రూ. 11.79
వెన్యూ SX ప్లస్ స్పోర్ట్ DCT రూ. 11.85 లక్షలు

[1]

తరచుగా అడిగే ప్రశ్నలు

నా కారు దొంగతనానికి గురై నేను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉంటే డిజిట్ పరిహారం చెల్లిస్తుందా?

చెల్లించదు. ఏదైనా సొంత డ్యామేజ్ అనేది డిజిట్ అందించే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ కాదు. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో పాలసీహోల్డర్స్ ఓన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ మరియు థర్డ్ పార్టీ కవరేజ్ ప్రయోజనాలు పొందొచ్చు.

నేను డిజిట్ మోటార్ ఇన్సూరెన్స్ కోసం క్లయిమ్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఎవర్ని సంప్రదించాలి?

మోటార్ ఇన్సూరెన్స్ క్లయిమ్ లను ఫైల్ చేయాలని అనుకుంటున్న వ్యక్తులు దాని కోసం 1800-258-5956 కి కాల్ చేసి సహాయం పొందొచ్చు.