భారతీయ పౌరులకు వీసా అవసరం లేని దేశాలు
అంతర్జాతీయ పర్యటనను ప్లాన్ చేసేటప్పుడు మన మదిలో మెదిలే మొదటి ఆలోచన వీసా కోసం అప్లై చేయడం. గంటల తరబడి ఆన్ లైన్ లో గడపడం, మీరు సందర్శించాలనుకుంటున్న దేశం కోసం సంక్లిష్టమైన వీసా దరఖాస్తు ప్రక్రియలను చూడటం.
అయితే చాలా దేశాల్లో భారతీయులకు వీసా అవసరం లేదని, మరి కొన్నింటికి వీసా ఆన్ అరైవల్ లభిస్తుందని మీకు తెలుసా?
అవును అది నిజమే!
హెన్లీ అండ్ పార్ట్నర్స్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, మార్చి 2023 నాటికి, భారతీయ పాస్పోర్ట్ కలిగిన వాళ్లు అనేక దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు లేదా వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. భారతీయులు ఈ-వీసా/ఎంట్రీ పర్మిట్ తో కింద పేర్కొన్న దేశాల జాబితాలో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం భారత పాస్పోర్టు ప్రయాణ స్వేచ్ఛలో 84వ స్థానంలో ఉంది.
కానీ భారతీయ పాస్పోర్ట్ కలిగిన వాళ్లు ఏయే దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు? ఆ జాబితాని కింద ఇచ్చాం ఓ సారి చూడండి!
1. అల్బేనియా | 15. మైక్రోనేషియా |
2. బార్బడోస్ | 16. మాంట్సెరాట్ |
3. భూటాన్ | 17. నేపాల్ |
4. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ | 18. నియూ |
5. కుక్ ఐలాండ్స్ | 19. ఒమన్ |
6. డొమినికా | 20. ఖతార్ |
7. ఎల్ సాల్వడార్ | 21. సెనెగల్ |
8. ఫిజీ | 22. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ |
9. గ్రెనడా | 23. సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్ |
10. హైతీ | 24. శ్రీలంక |
11. జమైకా | 25. ట్రినిడాడ్ అండ్ టొబాగో |
12. కజకిస్తాన్ | 26. ట్యునీషియా |
13. మకావు (ఎస్ఏఆర్ చైనా) | 27. థాయ్ లాండ్ |
14. మారిషస్ | 28. వనాటు |
సాధారణంగా వీసా ఆన్ అరైవల్ పొందడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు సందర్శకుల పాస్ పోర్టు, వారి బయోమెట్రిక్స్ ను పరిశీలించి నిర్ణీత చెల్లింపులను సేకరించి ఆ తర్వాత వీసా పర్మిట్ జారీ చేస్తారు. దేశంలోకి ప్రవేశించే ప్రధాన పాయింట్లలో ఆన్-అరైవల్ వీసా జారీ చేయబడుతుంది. కాబట్టి మీరు అక్కడికి వచ్చినప్పుడు వీసా ఎక్కడ జారీ చేయబడుతుందో గుర్తుంచుకోండి.
ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) సదుపాయం 2014లో భారతీయులకు 2015లో అర్హత కలిగిన దేశాల సవరించిన జాబితాతో అందుబాటులోకి వచ్చింది. 2023లో భారతీయ పౌరులకు వీసా ఆన్ అరైవల్ మరియు ఈ-వీసా అందించే దేశాలను మేము క్రింది జాబితాలో ప్రస్తావించాము:
29. బొలీవియా | 45. మౌరిటానియా |
30. బోట్స్వానా | 46. మొజాంబిక్ |
31. బురుండి | 47. మయన్మార్ |
32. కంబోడియా | 48. పలావు ఐలాండ్స్ |
33. కేప్ వెర్డే దీవులు | 49. రువాండా |
34. కొమోరో ఐలాండ్స్ | 50. సమోవా |
35. ఇథియోపియా | 51. సీషెల్స్ |
36. గాబన్ | 52. సియెర్రా లియోన్ |
37. గినియా-బిస్సౌ | 53. సొమాలియా |
38. ఇండోనేషియా | 54. సెయింట్ లూసియా |
39. ఇరాన్ | 55. టాంజానియా |
40. జోర్డాన్ | 56. తైమూర్-లెస్తె |
41. లావోస్ | 57. టోగో |
42. మడగాస్కర్ | 58. తువాలు |
43. మాల్దీవులు | 59. ఉగాండా |
44. మార్షల్ ఐలాండ్స్ | 60. జింబాబ్వే |
61. అంగోలా | 74. మలేషియా |
62. ఆంటిగ్వా అండ్ బార్బుడా | 75. మోల్డోవా |
63. ఆస్ట్రేలియా | 76. మొరాకో |
64. అజర్ బైజాన్ | 77. రష్యా |
65. బహ్రెయిన్ | 78. సావో టోమే మరియు ప్రిన్సిప్ |
66. బెనిన్ | 79. సింగపూర్ |
67. కొలంబియా | 80. సురినామ్ |
68. జిబౌటి | 81. తైవాన్ |
69. జార్జియా | 82. తజికిస్థాన్ |
70. కెన్యా | 83. తుర్కియే |
71. కువైట్ | 84. ఉజ్బెకిస్థాన్ |
72. కిర్గిజిస్తాన్ | 85. వియత్నాం |
73. లెసోతో | 86. జాంబియా |
వీసా అనేది ఆయా దేశాన్ని సందర్శించాలనుకునే విదేశీయులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన పత్రం. మీ దేశానికి రుజువుగా పనిచేసే పాస్ పోర్టుల మాదిరిగా కాకుండా, వీసాలు మీరు విదేశాలలో ఉండటానికి అనుమతించబడే కాలాన్ని తెలిపే గుర్తులు.
ఇప్పుడు వివిధ దేశాలు తమ వీసా ప్రక్రియకు సంబంధించి వివిధ రకాల నిబంధనలు పెట్టాయి. ఒక పట్టిక ఈ క్రింది వాటిని వివరిస్తుంది:
వీసా రకం |
ఇది దేనిని సూచిస్తుంది? |
వీసా ఫ్రీ |
వీసా లేకుండా ఒక దేశాన్ని సందర్శించే ప్రయోజనాన్ని వీసా ఫ్రీ ప్రయాణం అంటారు. ఇరు దేశాలు ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నా లేదా తాము సందర్శించే దేశం ఏకపక్షంగా విదేశీయులకు సరిహద్దులను తెరిచినా ఇది వర్తిస్తుంది. |
వీసా-ఆన్-అరైవల్ |
ఆన్ అరైవల్ వీసా అని కూడా పిలువబడే వీటిని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద సందర్శకుడికి మంజూరు చేస్తారు. వీసా జారీ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వ అధికారులు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ప్రారంభించి పూర్తి చేస్తారు. |
ఈ-వీసా |
ఈ-వీసాలు అంటే, ఒక దేశ ఇమ్మిగ్రేషన్ అధికారి ఆన్లైన్లో జారీ చేసే అధికారిక పత్రాలు. ఇవి సందర్శకులు తమ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తాయి. ఒక దేశ రాయబార కార్యాలయం జారీ చేసే సాధారణ పేపర్ ఆధారిత వీసాలకు ఇవి ప్రత్యామ్నాయం. |
ఎంట్రీ పర్మిట్ |
దేశాలు తమ సందర్శకులకు వీసాలకు బదులుగా ఎంట్రీ పర్మిట్లను జారీ చేస్తాయి. ఈ ఎంట్రీ పర్మిట్లు విదేశీయులు ఒక నిర్దిష్ట కాలానికి చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించడానికి మరియు ఉండటానికి అనుమతించే పత్రాలు. |
అవును! ప్రపంచవ్యాప్తంగా ఈ 34 దేశాల్లో పర్యాటకులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. విదేశాల్లో వైద్యానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అలా కాకుండా, మీ ప్రయాణాలలో తలెత్తే అనుకోని పరిస్థితుల నుండి మిమ్మల్ని ఆర్థికంగా రక్షించుకోవాలనుకుంటారు, కాదా?
ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల వల్ల ఎన్నో లాభాలు పొందొచ్చు. వాటిలో కొన్ని:
కాబట్టి, మీరు మీ ప్రయాణాన్ని సురక్షితంగా మార్చుకోవాలనుకుంటే మరియు ఆర్థిక రక్షణను నిర్ధారించాలనుకుంటే, ప్రారంభంలోనే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది! మార్కెట్లో చాలా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ చెల్లింపు చేయడానికి ముందు, సరసమైన ధరలో ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పోల్చాలి.