ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసి ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
Instant Policy, No Medical Check-ups

భారతీయులకు వియత్నాం వీసా

భారతీయ పాస్‌ పోర్ట్ హోల్డర్‌ల కోసం వియత్నాం వీసా గురించి వివరణాత్మక గైడ్

వియత్నాం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రయాణికులను ఆకర్షిస్తోంది. 2018లో, ఆ దేశానికి 15.5 మిలియన్లకు పైగా అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. (1)

గొప్ప సాంస్కృతిక వారసత్వం, చరిత్ర మరియు సహజ సౌందర్యంతో, వియత్నాం యొక్క విభిన్న ప్రకృతి దృశ్యాలు పర్యాటకులకు ఉత్తేజకరమైన సెలవులను అందిస్తాయి. మీరు వియత్నాంకు ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్న భారతీయ పౌరులైతే, మీరు తప్పకుండా చదవండి.

వియత్నాం కోసం భారతీయులకు వీసా అవసరమా?

అవును, భారతీయ ప్రయాణికులు దేశంలోకి ప్రవేశించడానికి వియత్నాం వీసా అవసరం. అయితే, ఆ దేశం భారతీయ పౌరులకు వీసా ఆన్ అరైవల్ నిబంధనలను అందిస్తుంది.

వియత్నాం సందర్శించే భారతీయులకు వీసా ఆన్ అరైవల్/ఈ-వీసా ఉందా?

అవును, భారతీయ పాస్‌ పోర్ట్ హోల్డర్‌లు వియత్నాం సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ వియత్నాం వీసా ఆన్ అరైవల్ దేశంలోకి వచ్చిన తేదీ నుండి 30 రోజుల వ్యవధి వరకు చెల్లుబాటు అవుతుంది.

ఈ వీసా కోసం, భారతీయ పాస్‌ పోర్ట్ హోల్డర్లు ముందుగా ఈ-వీసా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి, అప్రూవల్ లెటర్‌ను పొందాలి మరియు వియత్నాంకు వచ్చినప్పుడు వీసాను తీసుకోవాలి.

భారతీయ పౌరులకు వియత్నాం వీసా ఫీజు

వియత్నాంకు ప్రయాణించే ఈ-వీసా మరియు వీసా ఆన్ అరైవల్ దరఖాస్తుదారులకు ఫీజు వర్తిస్తుంది. అయితే, మీరు అప్లికేషన్ కోసం ఎంచుకున్న ప్రక్రియపై ఆధారపడి ఫీజు మారుతుంది. దిగువ పట్టికను పరిశీలించండి:

అప్లికేషన్ మోడ్ ఫీజు
ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకొని మరియు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు వీసాను తీసుకోవడం (30 రోజులు చెల్లుబాటు అవుతుంది) - ఆన్‌లైన్ ప్రాసెస్ ఇ-వీసా ప్రాసెసింగ్ ఫీజు కోసం ₹2066 ($25) చెల్లించండి
ఎంబసీ వద్ద వీసా కోసం అప్లై చేసుకోవడం (30 రోజులు చెల్లుబాటు అవుతుంది) (VFS గ్లోబల్ ద్వారా) - ఆఫ్‌లైన్ ప్రాసెస్ సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా కోసం ₹4500

డిస్ క్లైమర్: ఇక్కడ పేర్కొన్న గణాంకాలు విదేశీ మారకపు రేటు ప్రకారం USD నుండి INRకి మార్చబడ్డాయి మరియు మార్పుకు లోబడి ఉంటాయి. అలాగే, ప్రభుత్వం ఆమోదించిన అనేక ఏజెంట్లు ఉన్నారు, కాబట్టి వీసా లెటర్‌ని పొందడానికి ఈ-వీసా ఫీజు ఎంచుకున్న ఏజెంట్‌ను బట్టి మారుతుంది.

భారతీయ పౌరులు ఇతర వీసా వేరియంట్‌ల కోసం అప్లై చేసుకోవచ్చని కూడా గమనించండి (దీర్ఘకాలిక వ్యవధి కోసం). దయచేసి అప్లై చేయడానికి ముందు వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ మరియు వాటి ప్రక్కనే ఉన్న ఫీజులను తనిఖీ చేయండి.

భారతీయుల కోసం వియత్నాం టూరిస్ట్ వీసా అప్లై చేసుకోవడం కోసం అవసరమైన పత్రాలు

వియత్నాం వీసా కోసం అప్లై చేయడానికి, మీరు ఈ క్రింది పత్రాలను అందించాలి. 

  • భారతీయ పాస్‌ పోర్ట్, వియత్నాంకు ప్రయాణించిన తేదీ నుండి కనీసం ఆరు నెలల చెల్లుబాటుతో. వీసా స్టాంప్ కోసం మీ పాస్‌పోర్ట్‌లో మీకు కనీసం రెండు ఖాళీ పేజీలు అవసరం.

  • రెండు పాస్‌ పోర్ట్-సైజు ఫొటోగ్రాఫ్ లు.

మీరు వీసా ఆన్ అరైవల్‌ని పొందాలని చూస్తున్నట్లయితే, మీరు ఈ క్రింది అదనపు పత్రాలను కూడా అందించాలి.

  • వీసా ఆన్ అరైవల్ కోసం సరిగ్గా పూరించిన అప్లికేషన్ ఫారం. దీనిని M3 ఫారం అని కూడా అంటారు.

  • వియత్నాం విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వీసాను పొందేందుకు మిమ్మల్ని అనుమతించే సరైన ఆమోద లేఖ.

  • వీసా ఆన్ అరైవల్ కోసం, మీరు తప్పనిసరిగా స్టాంపింగ్ ఫీజు ను కూడా నగదు రూపంలో చెల్లించాలి. ఈ చెల్లింపు అధికారిక వియత్నామీస్ కరెన్సీ అయిన వియత్నామీస్ డాంగ్‌లో చేయబడాలని గుర్తుంచుకోండి.

ఇప్పుడు భారతీయ పౌరులకు వియత్నాం వీసా రిక్వైర్మెంట్స్ మీకు తెలుసు కాబట్టి అప్లికేషన్ కోసం వివరణాత్మక విధానాన్ని పరిశీలించండి.

భారతదేశం నుండి వియత్నాం వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

వియత్నాం ఈ-వీసా కోసం అప్లై చేయడానికి స్టెప్ లు

ఆన్లైన్లో ఈ-వీసా అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి దశల వారీ విధానం ఇక్కడ ఇవ్వబడి ఉంది.

  • స్టెప్ 1: వియత్నాం కోసం అధికారిక ఈ-వీసా అప్లికేషన్ వెబ్సైట్ ను తెరిచి, అప్లికేషన్ ను ఎంచుకోండి.

  • స్టెప్ 2: మీ పాస్‌ పోర్ట్ ఫోటో మరియు సమాచార పేజీని స్కాన్ చేయండి. వీటిని jpg ఫార్మాట్‌లో వెబ్సైట్ లో అప్‌లోడ్ చేయండి.

  • స్టెప్ 3: అప్లికేషన్ ఫారంలో మీ పర్యటనకు సంబంధించి అవసరమైన వ్యక్తిగత డేటా మరియు సమాచారాన్ని పూరించండి.

  • స్టెప్ 4: సపోర్ట్ చేస్తున్న డిజిటల్ పేమెంట్ పద్ధతుల్లో ఏదైనా ఒకదాని ద్వారా ఆన్‌లైన్‌లో ఈ-వీసా ఫీజు ను క్లియర్ చేయండి.

  • స్టెప్ 5: ఫారం ను విజయవంతంగా సమర్పించిన తర్వాత, మీరు ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ కోడ్‌ను అందుకుంటారు. 

ఆన్‌లైన్ వియత్నాం వీసా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మూడు పని దినాలు వేచి ఉండండి మరియు మీ వీసా కోసం ఆమోద పత్రం మీకు జారీ చేయబడుతుంది. తరువాత, 

  • స్టెప్ 6: మీ ఆమోద లేఖ కోసం తనిఖీ చేయడానికి వియత్నాం యొక్క ఈ-వీసా కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. దీన్ని యాక్సెస్ చేయడానికి మీ రిజిస్ట్రేషన్ కోడ్, పుట్టిన తేదీ మరియు ఇమెయిల్ IDని నమోదు చేయండి. 

లేఖను PDF ఫైల్‌గా సేవ్ చేయండి మరియు మీ ప్రయాణాల సమయంలో దాని ప్రింట్‌అవుట్‌లను తీసుకోండి. మీరు వియత్నాం చేరుకున్నప్పుడు, మీరు ఈ ఆమోద లేఖను సమర్పించి, మీ వీసాను అధీకృత స్థలం నుండి సేకరించాలి.

ముఖ్య గమనిక : మా వినియోగదారుల నుండి మేము స్వీకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, వీసా ఫీజు తో పాటు అదనపు సర్వీస్ ఫీజు లను వసూలు చేసే వీసా ప్రదాతలు ఉన్నారు. దయచేసి మీరు దానిని ఉపయోగించే ముందు వివరాలను సరిగ్గా తనిఖీ చేయండి. అదే వెబ్సైట్ తమ కస్టమర్‌లకు సర్వీస్ ఫీజు లను వసూలు చేయడం ప్రారంభించినందున మేము దశల నుండి లింక్‌ను తీసివేసాము. (30-10-2022న నవీకరించబడింది).

వియత్నాం ఎంబసీలో వియత్నాం వీసా కోసం అప్లై చేయడానికి స్టెప్ లు

ఆఫ్‌లైన్ మోడ్‌ లో వీసాను పొందేందుకు ఇష్టపడే వ్యక్తులు VFS గ్లోబల్ (భారత ప్రభుత్వం తో పాటు మిగిలిన వారికి సేవలందించే అవుట్‌సోర్సింగ్ సేవల సంస్థలో ఒకటి) ద్వారా చెయ్యవచ్చు. 

భారతీయ పౌరులు VFS గ్లోబల్ ద్వారా వారి వియత్నాం వీసా కోసం అప్లై చేయడానికి దిగువ పేర్కొన్న స్టెప్ లను అనుసరించవచ్చు:

  • స్టెప్ 1: వీసా అప్లికేషన్ ఫారం మరియు మీ పాస్‌ పోర్ట్‌తో సమీపంలోని VFS గ్లోబల్ వియత్నాం వీసా దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించండి. 

  • స్టెప్ 2: అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుని సంప్రదించి, అతని నుండి మీ టోకెన్‌ని సేకరించి, వీసా అప్లికేషన్ కేంద్రంలో మీ వంతు కోసం వేచి ఉండండి.

  • స్టెప్ 3: మీ టోకెన్ నంబర్ ప్రకటించిన తర్వాత డాక్యుమెంట్ సమర్పణ కోసం నియమించబడిన కౌంటర్‌కి వెళ్లండి. 

  • స్టెప్ 4: మీ వీసా అప్లికేషన్ ను VFS అధికారికి అవసరమైన డాక్యుమెంట్‌లతో, అంటే, పాస్‌ పోర్ట్-సైజు ఫోటోగ్రాఫ్‌లు, మీ సందర్శనకు కారణాన్ని వివరించే కవర్ లెటర్; ధృవీకరించబడిన రిటర్న్ టిక్కెట్లు మరియు హోటల్ రిజర్వేషన్ల ఫోటోకాపీలు. అదనంగా, మీరు గత మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను అందించారని నిర్ధారించుకోండి. మీరు నియమించబడిన VFS అధికారికి అప్లికేషన్ ను సమర్పించే ముందు మీరు మీ వీసా ఫారం ను సరిగ్గా పూరించారని నిర్ధారించుకోండి.

  • స్టెప్ 5: వీసా ఫీజు మరియు సర్వీస్ ఫీజు ని తర్వాత చెల్లించండి. సర్వీస్ ఫీజు ని నగదు రూపంలో చెల్లించాలని గుర్తుంచుకోండి. 

  • స్టెప్ 6: వీసా ఆమోదించబడిన తర్వాత, మీరు ₹215 చెల్లింపుతో కొరియర్ ద్వారా దాన్ని స్వీకరించడాన్ని ఎంచుకోవచ్చు. 

మీరు వీసా కోసం చెన్నై, హైదరాబాద్ లేదా బెంగళూరులో ఉన్న VFS గ్లోబల్ బ్రాంచ్‌లలో దేనినైనా అప్లై చేసుకోవచ్చు. 

భారతదేశంలోని వియత్నాం ఎంబసీ

భారతదేశంలోని వియత్నాం ఎంబసీ న్యూఢిల్లీలో ఉంది. దాని సంప్రదింపు వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి - 

  • చిరునామా - 20, కౌటిల్య మార్గ్, చాణక్యపురి, న్యూఢిల్లీ - 110021

  • సంప్రదింపు సంఖ్య - 2687.9852 (+ Ext); 2687.9852 (+20) (కాన్సులేట్)

 

మీ వీసా వచ్చిందా? ఇప్పుడు, మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు! అవును కదూ?

మీ వియత్నాం సెలవులను కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ పాలసీ సంగతి ఏమిటి

నేను వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?

వియత్నాంకు అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాదు. అయితే, మీ గమ్యస్థానం ఏమైనప్పటికీ, ట్రావెల్ ఇన్సూరెన్స్ ను పొందడం చాలా అవసరం. వియత్నాంకు మీ ట్రిప్‌ను ఇన్సూరెన్స్ చేయడం ఎందుకు అవసరమో తెలుసుకోండి:

  • వియత్నాంలోని ప్రధాన నగరాల్లో జేబు దొంగతనాలు మరియు దొంగతనాలు సర్వసాధారణం. మీరు మీ పాస్‌ పోర్ట్‌ను కోల్పోయినట్లయితే, డిజిట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ దానిని భర్తీ చేయడానికి మీ ఖర్చులను కవర్ చేస్తుంది. 

  • డిజిట్ యొక్క ట్రావెల్ ఇన్సూరెన్స్ తో, మీరు చేసే అత్యవసర ప్రమాదవశాత్తు ఆసుపత్రి ఖర్చులు పూర్తిగా కవర్ చేయబడతాయి. ఇంకా, వియత్నాంలో ఉన్నప్పుడు ఏదైనా అడ్వెంచర్ స్పోర్ట్‌లో (ఒక రోజు కార్యకలాపాలకు మాత్రమే) పాల్గొనే సమయంలో ఏదైనా ప్రమాదం కారణంగా అయ్యే హాస్పిటలైజేషన్ ఛార్జీలను కూడా ఇది కవర్ చేస్తుంది. 

  • అంతే కాకుండా,మీరు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో ఫ్లైట్ డిలే కవర్, బ్యాగేజీ ఆలస్యం కవర్, ట్రిప్ క్యాన్సిలేషన్ కవర్, ఎమర్జెన్సీ క్యాష్ బెనిఫిట్స్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మొదలైన ప్రయోజనాలను పొందవచ్చు.

కానీ, డిజిట్ ను ఎందుకు ఎంచుకోవాలి?

  • రూ. 225 నుండి ప్రారంభమయ్యే సమగ్ర కవరేజీని పొందండి - వియత్నాం కోసం నామమాత్రపు ధర రూ. 225 - ఒక వయోజన వ్యక్తి తమ డిజిట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద 7 రోజుల పర్యటన కోసం $50,000 బీమా మొత్తంను రూ. 225 (18% మినహాయించి) కే పొందవచ్చు!

  • క్లెయిమ్‌లు పేపర్‌లెస్ మరియు ఈజీ! - డిజిట్ పేపర్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది, ఇది మీరు మిస్డ్ కాల్ చేయడం ద్వారా పొందవచ్చు. 

  • ఫ్లైట్ ఆలస్యం కోసం సమర్థవంతమైన క్లెయిమ్ ప్రాసెస్ - ఫ్లైట్ ఆలస్యమైందా? చింతించకండి, డిజిట్ మిమ్మల్ని కవర్ చేస్తుంది! మీ ఫ్లైట్ 6 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, మీరు పరిహారం మొత్తాన్ని పొందుతారు.

  • డిడక్టబుల్-రహిత ఇన్సూరెన్స్ - మేము, డిజిట్‌లో, మా ఇన్సూరెన్స్ పాలసీ కింద ఎలాంటి డిడక్టబుల్స్ ను విధించము. కాబట్టి మీకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడితే, మీరు మీ జేబుల నుండి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకుండా వాటిని పొందవచ్చు! 

భారతీయ పౌరుల కోసం వియత్నాం టూరిస్ట్ వీసా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

నేను నా వియత్నాం పర్యటన కోసం ఆన్‌లైన్‌లో లేదా వ్యక్తిగతంగా వీసా కోసం అప్లై చేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు నా ఎంపికలు ఏమిటి?

ముందుగా వీసా పొందలేని ప్రయాణికులు ప్రయాణానికి కనీసం 3-5 రోజుల ముందు వీసా ఆన్ అరైవల్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ను పూర్తి చేసిన తర్వాత, వారు వియత్నాం పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్లి వారి వీసా పత్రాలను తీసుకోవచ్చు.

వియత్నాంకు నా ట్రావెల్ వీసా ఎంతకాలం ఉంటుంది?

వియత్నాంకు ట్రావెల్ వీసా 30 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే, మీరు మీ వీసాను పునరుద్ధరించుకోవడానికి మరియు ఎక్కువ కాలం వియత్నాంలో ఉండడానికి కూడా ఎంచుకోవచ్చు.

నా పాస్‌ పోర్ట్ గడువు 3 నెలల్లో ముగుస్తుంది. నేను వియత్నాం వీసాకు అర్హుడినా?

లేదు. వీసాను పొందాలంటే, మీ పాస్‌ పోర్ట్ తప్పనిసరిగా వియత్నాం సందర్శించిన తేదీ నుండి కనీసం తదుపరి ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉండాలి. వియత్నాంకు వీసా కోసం అప్లై చేయడానికి ముందు మీరు పాస్‌ పోర్ట్‌ను పునరుద్ధరించాలి.