ఆయ సోఫియా ఎక్కడుందో తెలుసా?
మెడిటరేనియన్ ప్రాంతంలో అత్యంత సంపూర్ణమైన, ఇప్పటికీ నిలిచి ఉన్న రోమన్ నగరాల్లో ఒకటి ఎక్కడ ఉందో మీకు తెలుసా?
కప్పడోసియాలోని అధివాస్తవికమైన, దూసుకెళ్లే రాక్ లోయలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా?
పాముక్కలే ఎక్కడుందో తెలుసా?
అవును, మీకు తెలుసు! ఎందుకంటే మీరు టర్కీకి మీ ట్రిప్‌ని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, ఇక్కడ ఇవన్నీ మరియు మరిన్ని అందమైన ఆకర్షణలు మీ కోసం వేచి ఉన్నాయి. ఇప్పుడు, దీర్ఘమైన శ్వాస తీసుకోండి, మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకొని టర్కీకి మీ పర్యటనను ఖచ్చితంగా ప్లాన్ చేయండి. టర్కీని అన్వేషించడంలో ఒక ముఖ్యమైన భాగం ముందుగా మీ వీసా మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ ను పొందడం, మరియు మేము మీకు మార్గనిర్దేశం చేయడానికి ఇక్కడ ఉన్నాము!
అవును, టర్కీలో ప్రవేశించడానికి భారతీయులకు వీసా అవసరం.
అవును, స్కెంజెన్, యుఎస్, యుకె మరియు ఐర్లాండ్ నుండి చెల్లుబాటు అయ్యే వీసా లేదా నివాస అనుమతిని కలిగి ఉన్న భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు టర్కిష్ ఇ-వీసాకు అర్హులు, దీన్ని కొన్ని నిమిషాల్లో ఆన్లైన్లో పొందవచ్చు. దీనికి చెల్లించాల్సిన రుసుము 43 USD (EUR 39.82).
చెల్లుబాటు అయ్యే వీసాలు లేదా ఈ దేశాల నివాస అనుమతులు లేని భారతీయ పౌరులు దాదాపు రూ. 4,280 సింగిల్ ఎంట్రీ వీసా రుసుముతో టర్కిష్ స్టిక్కర్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి (వీసా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా రూ. 4,201 అదనపు సర్వీస్ ఫీజు ఉంటుంది).
టర్కీకి వీసా రుసుము మీరు దరఖాస్తు చేస్తున్న వీసా రకం పై ఆధారపడి ఉంటుంది. ఒక భారతీయ పౌరునికి సింగిల్-ఎంట్రీ టర్కీ వీసా రుసుము USD 51.70 (EUR 47.90) మరియు ఒక భారతీయ పౌరుడికి బహుళ-ప్రవేశ పర్యాటక వీసాల ధర USD 174.77 (EUR 161.92)
వీసా సర్వీస్ ప్రొవైడర్ విధించిన అదనపు సేవా రుసుము USD 52.48 (EUR 48.62 ) ఉంటుంది.
టర్కీకి టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి మీకు ఈ క్రింది పత్రాలు అవసరం:
మీ అవసరాల ఆధారంగా, మీరు టర్కీ ఈవీసాను ఎంచుకోవచ్చు లేదా టర్కిష్ కాన్సులేట్ ద్వారా అధికారం పొందిన కంపెనీ ద్వారా నేరుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు అధికారిక వెబ్సైట్ ద్వారా టర్కిష్ ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది సరళమైన విధానం. మీరు ఈ వీసాను కేవలం 3 నిమిషాల్లో పొందవచ్చు!
వీసా కోసం దరఖాస్తు చేసుకోండి, వీసా రుసుము చెల్లించండి మరియు మీ టర్కీ ఈవీసాను డౌన్లోడ్ చేసుకోండి. అవును, మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ ఈ-వీసా నుండి ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
మీరు గేట్‌వే గ్లోబ్ ద్వారా నేరుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, స్టిక్కర్ వీసా దరఖాస్తులను స్వీకరించడానికి టర్కిష్ ఎంబసీ ద్వారా వారికి అధికారం ఉంది. ఈ దిగువ ప్రక్రియను తనిఖీ చేయండి:
అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి
ఫోటోతో పాటు అవసరమైన పత్రాలను సేకరించండి
అపాయింట్‌మెంట్‌ని షెడ్యూల్ చేయండి
వీసా రుసుము చెల్లించండి
మీ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి
మీ వీసాను సేకరించండి
టర్కీ ఈవీసా కోసం కేవలం 3 నిమిషాలు మరియు స్టిక్కర్ వీసా కోసం పత్రాలను సమర్పించిన తేదీ నుండి కనీసం 15 పని దినాలు.
ఇప్పుడు మీరు టర్కీ వీసా పొందడం గురించి మరియు టర్కీ ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతిదీ తెలుసుకున్నారు, వెళ్లి టర్కీకి ఒక సుందరమైన యాత్ర చేయండి!
అవును, టర్కీ వీసా ఆవశ్యకత ప్రకారం, టర్కీకి ప్రయాణించే ఎవరైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి, అది కనీసం €30,000 కవరేజీని అందించాలి, అంటే సుమారు $33,000. తప్పనిసరి అనే కాకుండా, ట్రావెల్ ఇన్సూరెన్స్ తో మీ ట్రిప్‌ను సురక్షితం చేయడం వలన మీ పర్యటనలో సంభవించే చిన్న చిన్న ప్రమాదాల నుండి పెద్ద ప్రమాదాల వరకు మిమ్మల్ని రక్షిస్తుంది.
ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా తప్పు జరగవచ్చు, ఊహించని అనారోగ్యం, సామాను మిస్ కావడం లేదా కనెక్షన్ మిస్ కావడం లేదా విమానం ఆలస్యం కావడం! మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు లేదా మీరు ఇతర తీవ్రమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు ఆర్థిక సౌకర్యాన్ని అందిస్తుంది,మొత్తం అనుభవాన్ని చాలా తక్కువ బాధాకరంగా చేస్తుంది.
మీరు ఇంటికి దూరంగా, విదేశంలో ఉన్నపుడు అనుకోని పరిస్థితుల నుండి వచ్చే ఊహించని వైద్య ఖర్చులు మరియు ఇతర ప్రయాణ సంబంధిత అత్యవసర పరిస్థితుల నుండి ట్రావెల్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.
టర్కీ ట్రావెల్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని ఈ క్రింది పరిస్థితుల్లో కవర్ చేస్తుంది:
వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు (అనారోగ్యం, ప్రమాదాలు మొదలైనవి)
ట్రిప్ రద్దులు
ఫ్లైట్ ఆలస్యం, మిస్డ్ కనెక్షన్లు మరియు రద్దు చేయబడిన విమానాలు
పాస్ పోర్ట్ లేదా లగేజీ పోగొట్టుకోవడం
చెక్-ఇన్ లగేజీ ఆలస్యం
దొంగతనం/డబ్బు నష్టం
వీటి గురించి మరింత తెలుసుకోండి: