ఇండియా నుంచి కెనడాకు టూరిస్ట్ వీసా
ఇండియా నుంచి కెనడాకు టూరిస్ట్ వీసా గురించి పూర్తి సమాచారం
కెనడాలో ఎత్తైన పర్వత శ్రేణులు, ఎడారులు, లోయలు, అద్భుతమైన సరస్సులు ఉన్నాయి. మీరు మీ సమయాన్ని రాళ్ళ మీదుగా ట్రెక్కింగ్ చేసేందుకు స్పెండ్ చేయాలనుకున్నా, మారిటైమ్ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్నా, టొరంటో, మాంట్రియెల్, వాంకోవర్ వంటి సిటీల గురించి అన్వేషించాలనుకున్నా మీకు కెనడా టూరిస్ట్ వీసా అనేది తప్పనిసరి. కెనడా అనేది ఒక అద్భుతమైన ప్రదేశం. అందుకే ప్రతి ట్రావెలర్ ఇక్కడకు వచ్చేందుకు ఇష్టపడతాడు! దాని గురించి పూర్తిగా చదవండి. మరియు ప్లాన్ చేయడం స్టార్ట్ చేయండి.
భారతీయలు కెనడా వెళ్లేందుకు వీసా కావాలా?
అవును భారతీయులు కెనడా వెళ్లేందుకు వీసా అనేది తప్పనిసరిగా కావాలి.
భారతీయ పౌరుల కోసం కెనడాలో వీసా ఆన్ అరైవల్ ప్రోగ్రాం ఉందా?
లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం అయితే కెనడాలో భారతీయుల కోసం వీసా ఆన్ అరైవల్ ప్రోగ్రాం లేదు. అందువల్ల కెనడాకు చేరుకునే ముందు భారతీయులు చెల్లుబాటు అయ్యే వీసాను కలిగి ఉండడం తప్పనిసరి.
కెనడా టూరిస్ట్ వీసా కోసం కావాల్సిన పత్రాలు
కెనడా టూరిస్ట్ వీసా కొరకు అవసరం అయిన పత్రాలు కింద ఉన్నాయి:
6 నెలల వ్యాలిడీటీతో ఉన్న ఒరిజినల్ పాస్ పోర్ట్ + పాత పాస్ పోర్ట్ లు ఏవైనా ఉంటే.
వీసా అప్లికేషన్ ఫారాలు
3 కలర్ ఫొటోగ్రాఫ్స్ : 35mm x 45mm, వైట్ బ్యాక్ గ్రౌండ్, మ్యాట్ ఫినిష్, 80% ఫేస్ సైజ్.
దరఖాస్తుదారుడి ట్రావెల్ వివరాలు, అతడి తో పాటు ట్రావెల్ చేసే వారి వివరాలతో కూడిన కవరింగ్ లెటర్.
హోటల్ బుకింగ్స్.
రోజు వారీ పర్యటన వివరాలు.
విమాన టికెట్లు
యజమాని/పాఠశాల/కాలేజ్ నుంచి ఒరిజినల్ లీవ్ లెటర్.
ఒక వేళ ఉద్యోగం చేస్తుంటే చివరి 6 నెలల సాలరీ వివరాలు.
ఒక వేళ స్వయం ఉపాధి పొందుతున్నట్లయితే - షాప్ యాక్ట్/ MOA / డీడ్.
హెల్దీ మరియు సఫిషియంట్ (తగినంత) బ్యాలెన్స్‌తో అప్ డేట్ చేయబడ్డ చివరి 6 నెలల పర్సనల్ బ్యాంక్ స్టేట్‌మెంట్లు.
ఆదాయపు పన్ను వివరాలు / చివరి 3 సంవత్సరాల ఫామ్ 16.
ఒక వేళ స్టూడెంట్ అయితే - స్కూల్/కాలేజ్ ఐడీ కార్డ్ కాపీ.
ఒక వేళ విశ్రాంత ఉద్యోగి అయితే- రిటైర్‌మెంట్ ప్రూఫ్/పెన్షన్ పాస్ బుక్ లేదా స్లిప్స్.
ఎఫ్డీ, ఎన్ఎస్ఈ, పీపీఎఫ్, షేర్స్, ప్రాపర్టీ పేపర్స్ వంటి ఇతర ఆస్తి పత్రాలు.
ఇండియా నుంచి కెనడాకు టూరిస్ట్ వీసా ఫీజులు
వీసా టైపు | ఫి |
---|---|
విజిటర్ వీసా (సూపర్ వీసాతో కలిపి) - ఒక వ్యక్తికి | విజిటర్ వీసా (సూపర్ వీసాతో కలిపి) - ఒక వ్యక్తికి |
విజిటర్ వీసా - ఫ్యామిలీ (5గురు లేదా అంతకంటే ఎక్కువ) | 366.48 USD (అమెరికన్ డాలర్లు) |
సందర్శకుడిగా మీరు ఉండే కాలాన్ని పొడిగించుకునేందుకు - ఒక్కొక్కరికి | 78.18 USD (అమెరికన్ డాలర్లు) |
సందర్శకుడిగా మీ స్థితిని పునరుద్ధరించుకునేందుకు | 146.59 USD (అమెరికన్ డాలర్లు) |
ఇండియా నుంచి కెనడాకు టూరిస్ట్ వీసాను ఎలా అప్లై చేయాలి?
స్టెప్ 1 - కెనడా కోసం ఆన్ లైన్ లో టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. మీరు ఈ కింది ప్రయోజనాలను కూడా పొందుతారు:
ఎటువంటి కొరియర్ ఫీజులు, మెయిల్ డెలివరీ సమయం లేదు - మీరు వెంటనే మీ అప్లికేషన్ ను సబ్మిట్ చేయొచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తులు చాలా తొందరగా ప్రాసెస్ చేయబడతాయి.
ప్రాసెసింగ్ ఆలస్యాలను నివారించవచ్చు.
అసంపూర్ణమైన అప్లికేషన్లు తిరిగి మీకు పంపబడతాయి.
ఆన్ లైన్ లో అప్లికేషన్ ను సబ్మిట్ చేయడం వలన మీరు సబ్మిట్ చేసే ముందు మీ అప్లికేషన్ పూర్తిగా నింపారని మీకు తెలుస్తుంది.
మరిన్ని పత్రాలు అవసరం అయితే మీరు వాటిని ఆన్ లైన్ లో తొందరగా సబ్మిట్ చేయొచ్చు.
మీ పాస్ పోర్ట్ ను అడిగే వరకు మీరు సమర్పించాల్సిన అవసరం లేదు.
మీరు నేరుగా మీ ఆన్ లైన్ ఖాతాలో అప్లికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ ను పొందొచ్చు.
స్టెప్ 2 - మీరు ఆన్ లైన్ లో వీసా కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వేలిముద్రలు, ఫొటో ఇవ్వడం తదుపరి దశ.
చాలా సందర్భాలలో మీరు బయోమెట్రిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు బయోమెట్రిక్ రుసుము చెల్లించి మీ అప్లికేషన్ ను సమర్పించిన తర్వాత మీరు బయోమెట్రిక్స్ అందించాలని ఉండే లేఖను అందుకుంటారు. మీ బయోమెట్రిక్ లను ఎక్కడ ఎలా సమర్పించాలో ఈ లేఖ మీకు తెలియజేస్తుంది. మీ బయోమెట్రిక్స్ (వ్యక్తిగతంగా) ఇచ్చేందుకు 30 రోజుల సమయం ఉంటుంది. మీరు బయోమెట్రిక్ ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే సూచనల లెటర్ పొందుతారు.
స్టెప్ 3 - ఒకసారి బయోమెట్రిక్ పూర్తయిన తర్వాత మాత్రమే మీ వీసా అప్లికేషన్ ప్రాసెస్ చేయబడుతుంది. మీ అప్లికేషన్ తనిఖీ చేయబడుతుంది. మీ పత్రాలు కనుక అసంపూర్తిగా ఉంటే అవి ప్రాసెస్ చేయకుండానే వెనక్కు పంపబడతాయి.
మరింత సమాచారం కోసం లేదా మెడికల్ పరీక్షల కోసం మీ దేశంలోని అధికారులతో ఇంటర్వ్యూకి వెళ్లమని మిమ్మల్ని అడగవచ్చు.
మీ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మీ పాస్ పోర్ట్ మరియు ఇతర పత్రాలు మీకు తిరిగి ఇవ్వబడతాయి. మీ అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత మీ పాస్ పోర్ట్ లోపల వీసా స్టాంప్ చేయబడుతుంది. మీ అప్లికేషన్ తిరస్కరణకు గురైతే అది మీకు తిరిగి పంపబడుతుంది.
స్టెప్ 4 - చెల్లుబాటయ్యే వీసా మరియు ట్రావెల్ డాక్యుమెంట్ మీరు కెనడాలోకి ఎంటర్ అవ్వొచ్చని హమీ ఇవ్వవు. మీరు కెనడా విమానాశ్రయంలో దిగిన తర్వాత మీ ఐడెంటిటీ చెక్ చేయబడుతుంది. వీసా ఆమోదం పొందిన వ్యక్తే కెనడాకు ట్రావెల్ చేశాడా లేదా అనేది చెక్ చేస్తారు.
స్టెప్ 5 - ఐడెంటిటీ చెక్ లో మీరు పాస్ అయి వారి నిబంధనలకు సరిపోతే బార్డర్ సర్వీస్ ఆఫీసర్ మీ పాస్ పోర్ట్ మీద స్టాంప్ వేస్తాడు. లేదా మీరు కెనడాలో ఎన్ని రోజులు ఉండొచ్చో చెబుతాడు. సాధారణంగా మీరు 6 నెలల వరకు కెనడాలో ఉండేందుకు అనుమతించబడతారు.
కెనడా టూరిస్ట్ వీసా ప్రక్రియ సమయం
కెనడా టూరిస్ట్ వీసా కోసం ప్రక్రియ సమయం అనేది గరిష్టంగా 8 వారాలు. అప్లికేషన్ సెంటర్ లొకేషన్, మీరు సమర్పించిన పత్రాల ఆధారంగా ప్రాసెసింగ్ టైమ్ అనేది మారొచ్చు.
వీసా మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేవి మీరు అంతర్జాతీయంగా ప్రయాణించేటప్పుడు కలిగి ఉండాల్సిన రెండు విషయాలు. వీసా అనేది ఆ దేశంలోకి ప్రవేశించేందుకు మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఎటువంటి చింత లేకుండా భద్రంగా ఆ దేశాన్ని చుట్టి వచ్చేందుకు. ఇప్పుడే ప్లాన్ చేయడం స్టార్ట్ చేయండి. కెనడాలో ఉన్న ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపండి
నేను కెనడా ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలా?
మీరు ఎంత ప్లాన్ చేసినప్పటికీ మీరు వేరే దేశంలో ఉన్నప్పుడు తప్పు జరిగే విషయాలు అనేకం ఉన్నాయి. కెనడా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు మెడికల్ ఖర్చులు, అనుకోకుండా వచ్చే ఎమర్జెన్సీల నుంచి ఆర్థిక భద్రతను అందిస్తుంది. మీరు మీ ఇంటికి దూరంగా తెలియని ప్రదేశంలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ హాని కలిగే అవకాశం ఉంది.
మీరు విదేశాలకు ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోని ప్రమాదాలు, తీవ్ర ఎమర్జెన్సీలు సంభవించినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా లేకుండా చూసుకుంటుంది. మీకు ఎక్కువ బాధ కలగకుండా చూస్తుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు అన్ని సందర్భాల్లో భద్రతను అందిస్తుంది:
ఇది మీ సామగ్రిని దొంగతనం మరియు నష్టం నుంచి కాపాడుతుంది.
మీకు ఏదైనా మెడికల్ సహాయం అవసరం అయినా ఇది మీ పాకెట్ కు చిల్లు పడకుండా చూసుకుంటుంది.
మీరు దానిని క్లెయిమ్ చేసి సహాయం కోరితే సరిపోతుంది.
ఒక వేళ వ్యక్తిగత ప్రమాదం జరిగినా కానీ దాన్ని కూడా చూసుకుంటుంది.
ఏ కారణం చేతనైనా విమానాలు ఆలస్యం అయినా లేదా రద్దు చేయబడినా కూడా ఇది మొత్తం చూసుకుంటుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్ తో మేము మీకు అందించే ప్రయోజనాలను ఒకసారి తనిఖీ చేయండి:
- జీరో మినహాయింపు - మీరు మీ జేబు నుంచి అస్సలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మేమే చూసుకుంటాం
- మీరు ఎలా ట్రావెల్ చేస్తున్నారో తెలుసుకునే కవర్ - స్కూబా డైవింగ్, బంగీ జంపింగ్ & స్కై డైవింగ్ వంటి సాహస క్రీడలు ఉంటాయి. (కేవలం ఒక్కరోజుకు మాత్రమే)
- స్మార్ట్ ఫోన్ ద్వారా క్లెయిమ్ ప్రాసెస్ - స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ క్లెయిమ్ ప్రాసెస్ ద్వారా ఇది చాలా స్మార్ట్ గా మారింది. ఎటువంటి పేపర్ వర్క్ లేదు. మీరు గాబరా పడుతూ అక్కడికి ఇక్కడికి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మీరు క్లెయిమ్ చేసే సమయంలో కేవలం మీ పత్రాలు అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
- మిస్డ్ కాల్ ఫెసిలిటీ - +91-7303470000 అనే నెంబర్ మీద మాకు మిస్డ్ కాల్ ఇవ్వండి. 10 నిమిషాల్లోపు మేము మీకు కాల్ చేస్తాం. ఎటువంటి ఇంటర్నేషనల్ కాలింగ్ చార్జెస్ పడవు!
దీని గురించి మరింత తెలుసుకోండి:
భారతీయుల కోసం కెనడా టూరిస్ట్ వీసా గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
అప్లికేషన్ ప్రక్రియలో బయోమెట్రిక్ వివరాల సబ్మిషన్ ఉంటుందా?
అవును. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కొన్ని బేసిక్ బయోమెట్రిక్ వివరాలు సేకరించాలని కెనడియన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మీ వీసాను రెన్యూవల్ చేసేటప్పుడు కూడా అటువంటి వివరాలు సేకరించబడతాయి.
కెనడా వీసా ప్రాసెసింగ్ ఎంత సమయం తీసుకుంటుంది?
అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 8 వారాల్లోపు అధికారులు ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. మీరు వీసా కోసం ఒక నెల రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని గుర్తుంచుకోండి.
కెనడాను సందర్శించేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?
ప్రస్తుత నిబంధనల ప్రకారం కెనడాను సందర్శించేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మీరు సమర్పించిన కవర్ ను యాక్సెస్ చేయడంలో వైఫల్యం మీ వీసా తిరస్కరణకు గురయ్యేందుకు కారణం కావొచ్చు.
నేను ఆన్ లైన్ లో కెనడా వీసా కోసం అప్లై చేసుకోవచ్చా?
అవును. మీరు చేయొచ్చు. అయితే బయోమెట్రిక్ లాంటి కొన్ని వివరాలను వ్యక్తిగతంగా సమర్పించాల్సి ఉంటుంది.
నేను ఇప్పటికే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాను కానీ నా వీసా అప్లికేషన్ తిరస్కరించబడింది. దీని కోసం ఏదైనా రీఫండ్ పాలసీ ఉందా?
లేదు. చట్టప్రకారం ఎటువంటి రీఫండ్ కు అవకాశం లేదు. మీరు ఫీజులు చెల్లించిన తర్వాత అవి తిరిగొచ్చేందుకు అవకాశమే లేదు.