కెనడాలో ఎత్తైన పర్వత శ్రేణులు, ఎడారులు, లోయలు, అద్భుతమైన సరస్సులు ఉన్నాయి. మీరు మీ సమయాన్ని రాళ్ళ మీదుగా ట్రెక్కింగ్ చేసేందుకు స్పెండ్ చేయాలనుకున్నా, మారిటైమ్ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్నా, టొరంటో, మాంట్రియెల్, వాంకోవర్ వంటి సిటీల గురించి అన్వేషించాలనుకున్నా మీకు కెనడా టూరిస్ట్ వీసా అనేది తప్పనిసరి. కెనడా అనేది ఒక అద్భుతమైన ప్రదేశం. అందుకే ప్రతి ట్రావెలర్ ఇక్కడకు వచ్చేందుకు ఇష్టపడతాడు! దాని గురించి పూర్తిగా చదవండి. మరియు ప్లాన్ చేయడం స్టార్ట్ చేయండి.
అవును భారతీయులు కెనడా వెళ్లేందుకు వీసా అనేది తప్పనిసరిగా కావాలి.
లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం అయితే కెనడాలో భారతీయుల కోసం వీసా ఆన్ అరైవల్ ప్రోగ్రాం లేదు. అందువల్ల కెనడాకు చేరుకునే ముందు భారతీయులు చెల్లుబాటు అయ్యే వీసాను కలిగి ఉండడం తప్పనిసరి.
కెనడా టూరిస్ట్ వీసా కొరకు అవసరం అయిన పత్రాలు కింద ఉన్నాయి:
6 నెలల వ్యాలిడీటీతో ఉన్న ఒరిజినల్ పాస్ పోర్ట్ + పాత పాస్ పోర్ట్ లు ఏవైనా ఉంటే.
వీసా అప్లికేషన్ ఫారాలు
3 కలర్ ఫొటోగ్రాఫ్స్ : 35mm x 45mm, వైట్ బ్యాక్ గ్రౌండ్, మ్యాట్ ఫినిష్, 80% ఫేస్ సైజ్.
దరఖాస్తుదారుడి ట్రావెల్ వివరాలు, అతడి తో పాటు ట్రావెల్ చేసే వారి వివరాలతో కూడిన కవరింగ్ లెటర్.
హోటల్ బుకింగ్స్.
రోజు వారీ పర్యటన వివరాలు.
విమాన టికెట్లు
యజమాని/పాఠశాల/కాలేజ్ నుంచి ఒరిజినల్ లీవ్ లెటర్.
ఒక వేళ ఉద్యోగం చేస్తుంటే చివరి 6 నెలల సాలరీ వివరాలు.
ఒక వేళ స్వయం ఉపాధి పొందుతున్నట్లయితే - షాప్ యాక్ట్/ MOA / డీడ్.
హెల్దీ మరియు సఫిషియంట్ (తగినంత) బ్యాలెన్స్తో అప్ డేట్ చేయబడ్డ చివరి 6 నెలల పర్సనల్ బ్యాంక్ స్టేట్మెంట్లు.
ఆదాయపు పన్ను వివరాలు / చివరి 3 సంవత్సరాల ఫామ్ 16.
ఒక వేళ స్టూడెంట్ అయితే - స్కూల్/కాలేజ్ ఐడీ కార్డ్ కాపీ.
ఒక వేళ విశ్రాంత ఉద్యోగి అయితే- రిటైర్మెంట్ ప్రూఫ్/పెన్షన్ పాస్ బుక్ లేదా స్లిప్స్.
ఎఫ్డీ, ఎన్ఎస్ఈ, పీపీఎఫ్, షేర్స్, ప్రాపర్టీ పేపర్స్ వంటి ఇతర ఆస్తి పత్రాలు.
వీసా టైపు |
ఫి |
విజిటర్ వీసా (సూపర్ వీసాతో కలిపి) - ఒక వ్యక్తికి |
విజిటర్ వీసా (సూపర్ వీసాతో కలిపి) - ఒక వ్యక్తికి |
విజిటర్ వీసా - ఫ్యామిలీ (5గురు లేదా అంతకంటే ఎక్కువ) |
366.48 USD (అమెరికన్ డాలర్లు) |
సందర్శకుడిగా మీరు ఉండే కాలాన్ని పొడిగించుకునేందుకు - ఒక్కొక్కరికి |
78.18 USD (అమెరికన్ డాలర్లు) |
సందర్శకుడిగా మీ స్థితిని పునరుద్ధరించుకునేందుకు |
146.59 USD (అమెరికన్ డాలర్లు) |
స్టెప్ 1 - కెనడా కోసం ఆన్ లైన్ లో టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. మీరు ఈ కింది ప్రయోజనాలను కూడా పొందుతారు:
ఎటువంటి కొరియర్ ఫీజులు, మెయిల్ డెలివరీ సమయం లేదు - మీరు వెంటనే మీ అప్లికేషన్ ను సబ్మిట్ చేయొచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తులు చాలా తొందరగా ప్రాసెస్ చేయబడతాయి.
ప్రాసెసింగ్ ఆలస్యాలను నివారించవచ్చు.
అసంపూర్ణమైన అప్లికేషన్లు తిరిగి మీకు పంపబడతాయి.
ఆన్ లైన్ లో అప్లికేషన్ ను సబ్మిట్ చేయడం వలన మీరు సబ్మిట్ చేసే ముందు మీ అప్లికేషన్ పూర్తిగా నింపారని మీకు తెలుస్తుంది.
మరిన్ని పత్రాలు అవసరం అయితే మీరు వాటిని ఆన్ లైన్ లో తొందరగా సబ్మిట్ చేయొచ్చు.
మీ పాస్ పోర్ట్ ను అడిగే వరకు మీరు సమర్పించాల్సిన అవసరం లేదు.
మీరు నేరుగా మీ ఆన్ లైన్ ఖాతాలో అప్లికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ ను పొందొచ్చు.
స్టెప్ 2 - మీరు ఆన్ లైన్ లో వీసా కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వేలిముద్రలు, ఫొటో ఇవ్వడం తదుపరి దశ.
చాలా సందర్భాలలో మీరు బయోమెట్రిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు బయోమెట్రిక్ రుసుము చెల్లించి మీ అప్లికేషన్ ను సమర్పించిన తర్వాత మీరు బయోమెట్రిక్స్ అందించాలని ఉండే లేఖను అందుకుంటారు. మీ బయోమెట్రిక్ లను ఎక్కడ ఎలా సమర్పించాలో ఈ లేఖ మీకు తెలియజేస్తుంది. మీ బయోమెట్రిక్స్ (వ్యక్తిగతంగా) ఇచ్చేందుకు 30 రోజుల సమయం ఉంటుంది. మీరు బయోమెట్రిక్ ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే సూచనల లెటర్ పొందుతారు.
స్టెప్ 3 - ఒకసారి బయోమెట్రిక్ పూర్తయిన తర్వాత మాత్రమే మీ వీసా అప్లికేషన్ ప్రాసెస్ చేయబడుతుంది. మీ అప్లికేషన్ తనిఖీ చేయబడుతుంది. మీ పత్రాలు కనుక అసంపూర్తిగా ఉంటే అవి ప్రాసెస్ చేయకుండానే వెనక్కు పంపబడతాయి.
మరింత సమాచారం కోసం లేదా మెడికల్ పరీక్షల కోసం మీ దేశంలోని అధికారులతో ఇంటర్వ్యూకి వెళ్లమని మిమ్మల్ని అడగవచ్చు.
మీ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మీ పాస్ పోర్ట్ మరియు ఇతర పత్రాలు మీకు తిరిగి ఇవ్వబడతాయి. మీ అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత మీ పాస్ పోర్ట్ లోపల వీసా స్టాంప్ చేయబడుతుంది. మీ అప్లికేషన్ తిరస్కరణకు గురైతే అది మీకు తిరిగి పంపబడుతుంది.
స్టెప్ 4 - చెల్లుబాటయ్యే వీసా మరియు ట్రావెల్ డాక్యుమెంట్ మీరు కెనడాలోకి ఎంటర్ అవ్వొచ్చని హమీ ఇవ్వవు. మీరు కెనడా విమానాశ్రయంలో దిగిన తర్వాత మీ ఐడెంటిటీ చెక్ చేయబడుతుంది. వీసా ఆమోదం పొందిన వ్యక్తే కెనడాకు ట్రావెల్ చేశాడా లేదా అనేది చెక్ చేస్తారు.
స్టెప్ 5 - ఐడెంటిటీ చెక్ లో మీరు పాస్ అయి వారి నిబంధనలకు సరిపోతే బార్డర్ సర్వీస్ ఆఫీసర్ మీ పాస్ పోర్ట్ మీద స్టాంప్ వేస్తాడు. లేదా మీరు కెనడాలో ఎన్ని రోజులు ఉండొచ్చో చెబుతాడు. సాధారణంగా మీరు 6 నెలల వరకు కెనడాలో ఉండేందుకు అనుమతించబడతారు.
కెనడా టూరిస్ట్ వీసా కోసం ప్రక్రియ సమయం అనేది గరిష్టంగా 8 వారాలు. అప్లికేషన్ సెంటర్ లొకేషన్, మీరు సమర్పించిన పత్రాల ఆధారంగా ప్రాసెసింగ్ టైమ్ అనేది మారొచ్చు.
వీసా మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేవి మీరు అంతర్జాతీయంగా ప్రయాణించేటప్పుడు కలిగి ఉండాల్సిన రెండు విషయాలు. వీసా అనేది ఆ దేశంలోకి ప్రవేశించేందుకు మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఎటువంటి చింత లేకుండా భద్రంగా ఆ దేశాన్ని చుట్టి వచ్చేందుకు. ఇప్పుడే ప్లాన్ చేయడం స్టార్ట్ చేయండి. కెనడాలో ఉన్న ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపండి
మీరు ఎంత ప్లాన్ చేసినప్పటికీ మీరు వేరే దేశంలో ఉన్నప్పుడు తప్పు జరిగే విషయాలు అనేకం ఉన్నాయి. కెనడా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు మెడికల్ ఖర్చులు, అనుకోకుండా వచ్చే ఎమర్జెన్సీల నుంచి ఆర్థిక భద్రతను అందిస్తుంది. మీరు మీ ఇంటికి దూరంగా తెలియని ప్రదేశంలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ హాని కలిగే అవకాశం ఉంది.
మీరు విదేశాలకు ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోని ప్రమాదాలు, తీవ్ర ఎమర్జెన్సీలు సంభవించినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా లేకుండా చూసుకుంటుంది. మీకు ఎక్కువ బాధ కలగకుండా చూస్తుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు అన్ని సందర్భాల్లో భద్రతను అందిస్తుంది:
ఇది మీ సామగ్రిని దొంగతనం మరియు నష్టం నుంచి కాపాడుతుంది.
మీకు ఏదైనా మెడికల్ సహాయం అవసరం అయినా ఇది మీ పాకెట్ కు చిల్లు పడకుండా చూసుకుంటుంది.
మీరు దానిని క్లెయిమ్ చేసి సహాయం కోరితే సరిపోతుంది.
ఒక వేళ వ్యక్తిగత ప్రమాదం జరిగినా కానీ దాన్ని కూడా చూసుకుంటుంది.
ఏ కారణం చేతనైనా విమానాలు ఆలస్యం అయినా లేదా రద్దు చేయబడినా కూడా ఇది మొత్తం చూసుకుంటుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్ తో మేము మీకు అందించే ప్రయోజనాలను ఒకసారి తనిఖీ చేయండి:
దీని గురించి మరింత తెలుసుకోండి: