ఆన్‌లైన్‌లో ఐటీఆర్-3 ఫైల్ చేయడం తప్పనిసరి. మీరు ఈ స్టెప్ ల వారీ సూచనలను అనుసరించడం ద్వారా ఆన్‌లైన్‌లో ఐటీఆర్-3ని ఫైల్ చేయవచ్చు:
- స్టెప్ 1: మీరు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ యొక్క అధికారిక ఇ-ఫైలింగ్ వెబ్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా ఐటీఆర్-3 ఆన్‌లైన్ ఫైలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- స్టెప్ 2: మీ యూజర్ ఐడీ (పాన్), పాస్‌వర్డ్ మరియు కాప్చా కోడ్‌ని నమోదు చేయడం ద్వారా ఈ పోర్టల్‌కి లాగిన్ చేయండి. అయితే, మీరు కొత్త యూజర్ అయితే, మీరు ముందుగా పోర్టల్‌లో అకౌంట్ ను రిజిస్టర్ చేసుకోవాలి.
- స్టెప్ 3: మెనులో ‘ఇ-ఫైల్’ఎంపికను ఎంచుకుని, డ్రాప్-డౌన్ మెనూ నుండి ‘ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్’పై క్లిక్ చేయండి.
- స్టెప్ 4: ఈ పేజీ మీ పాన్ వివరాలను స్వయంచాలకంగా నింపుతుంది. ఇప్పుడు, ముందుకు సాగండి మరియు మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్న ‘అసెస్‌మెంట్ ఇయర్’ని ఎంచుకోండి. తర్వాత, ‘ఐటీఆర్ ఫారం నంబర్’ని ఎంచుకుని, ‘ఐటీఆర్-3’ని ఎంచుకోండి.
- స్టెప్ 5: ‘ఫైలింగ్ టైప్’ని ‘ఒరిజినల్’గా ఎంచుకోండి. మీరు గతంలో ఫైల్ చేసిన ఒరిజినల్ రిటర్న్‌కి వ్యతిరేకంగా రివైజ్డ్ రిటర్న్‌ను ఫైల్ చేయాలనుకుంటే, ‘రివైజ్డ్ రిటర్న్’ ఎంచుకోండి.
- స్టెప్ 6: 'సబ్మిట్ మోడ్' ఎంపికను కనుగొని, 'ఆన్‌లైన్‌లో సిద్ధం చేసి సమర్పించండి' ఎంచుకోండి. ఇప్పుడు, 'కొనసాగించు'పై క్లిక్ చేయండి.
- స్టెప్ 7: ఈ సమయంలో, మీరు ఆదాయం, మినహాయింపులు, డిడక్షన్ లు అలాగే పెట్టుబడుల వివరాలను అందించాలి. ఆపై, టీడీఎస్, టీసీఎస్ మరియు/లేదా ముందస్తు ట్యాక్స్ ద్వారా ట్యాక్స్ చెల్లింపుల వివరాలను జోడించండి.
- స్టెప్ 8: మొత్తం డేటాను జాగ్రత్తగా మరియు ఖచ్చితంగా పూరించడాన్ని గుర్తుంచుకోండి. అదనంగా, ఏ డేటాను కోల్పోకుండా ఉండేందుకు కాలానుగుణంగా ‘డ్రాఫ్ట్‌ను సేవ్ చేయి’పై క్లిక్ చేయండి.
- స్టెప్ 9: కింది వాటి నుండి మీ ప్రాధాన్య వెరిఫికేషన్ ఎంపికను ఎంచుకోండి:
- తక్షణ ఇ-వెరిఫికేషన్
- ఇ-వెరిఫికేషన్ తర్వాత తేదీలో కానీ ఐటీఆర్-3 ఫైల్ చేసిన తేదీ నుండి 30 రోజులలోపు
- సక్రమంగా సంతకం చేసిన ఐటీఆర్-V ద్వారా వెరిఫికేషన్ సీపీసీ (సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్)కి పోస్ట్ ద్వారా మరియు రిటర్న్ ఫైల్ చేసిన 30 రోజుల్లోపు పంపబడుతుంది
- స్టెప్ 10: 'ప్రివ్యూ మరియు సబ్మిట్' ఎంచుకోండి, ఆపై 'సమర్పించండి.'
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, u/s 44AB ఆడిటింగ్ అవసరమయ్యే అకౌంట్ ల కోసం డిజిటల్ సంతకం కింద ఎలక్ట్రానిక్‌గా రిటర్న్‌లను వెరిఫై చెయ్యడం మ్యాండేటరీ.
ఇంకా, నిర్దిష్ట సెక్షన్ల కింద ఆడిట్ నివేదికను సమర్పించాల్సిన అవసరం ఉన్నట్లయితే, అతను/ఆమె ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందు ఎలక్ట్రానిక్‌గా అలాంటి నివేదికను ఫైల్ చేయాలి. ఈ సెక్షన్ లు 115JB, 115JC, 80-IA, 80-IB, 80-IC, 80-ID, 50B, 44AB, 44DA లేదా 10AA.
అదనంగా, మీరు 'నేను ఇ-వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నాను' ఎంపికను ఎంచుకున్నప్పుడు, మీరు కింది పద్ధతుల్లో ఏదైనా ఒకదానిలో తక్షణ ఇ-వెరిఫికేషన్ ను ఎంచుకోవచ్చు:
- వెరిఫికేషన్ భాగంలో డిజిటల్ సంతకం చేయండి
- ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) ద్వారా ప్రక్రియను ధృవీకరించండి
- ఓటీపీ ని నమోదు చేయడానికి మీ ఆధార్ వివరాలను ఉపయోగించండి
- ముందుగా చెల్లుబాటు అయ్యే బ్యాంక్ లేదా డీమ్యాట్ అకౌంట్ ద్వారా ధృవీకరించడం
ఐటీఆర్-3ని ఆన్‌లైన్‌లో ఎలా ఫైల్ చేయాలనే దానికి సంబంధించిన వివరణాత్మక విధానం ఇది.
అలాగే, ఈ ట్యాక్స్ పేయర్ లు ఈ ఫారం ను ఆఫ్‌లైన్‌లో ఫైల్ చేయాలనుకుంటే ఎలాంటి ట్యాక్స్ రీఫండ్ అభ్యర్థనలను కలిగి ఉండకూడదు.
[మూలం 1]
[మూలం 2]