డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి

సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్

సెక్షన్ 80C కింద డిడక్షన్ గురించిన పూర్తి సమాచారం

భారత రాజ్యాంగం ప్రకారం ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ 1961 నిబంధనలను అనుసరించి ఇండియాలో వ్యక్తులు లేదా సంస్థలకు వచ్చే ఆదాయం మీది ట్యాక్స్ విధించవచ్చు. (వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం కాకుండా) పన్ను చట్టాలు కూడా దీనిని సమర్ధిస్తున్నాయి.

వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు, LLPలు, స్వయం సహాయక సంఘాలు, వ్యక్తుల సమూహాలు, సంపాదించే ఆదాయం మీద ఈ ట్యాక్స్ విధించబడుతుంది.

ఈ ట్యాక్సేషన్ లయబిలిటీలను తగ్గించేందుకు ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ కొన్ని పన్ను మినహాయింపు క్లాజెస్ కల్పించింది. వీటి ద్వారా వారు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ ను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ 1961 సెక్షన్ 80C

సెక్షన్ 80C, కింద మీరు వివిధ రకాల సాధనాలను కనుగొంటారు. వీటి ద్వారా మీరు క్యుములేటివ్ ట్యాక్స్ సేవింగ్ ను పొందొచ్చు. సెక్షన్ 80C, డిడక్షన్ ల ద్వారా మీరు వివిధ స్కీమ్ ల కింద (రూ.1,50,000 + రూ. 50,000) వరకు సేవ్ చేసుకోవచ్చు.

సెక్షన్ 80C కింద ట్యాక్స్ డిడక్షన్ లను హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన వ్యక్తులు మాత్రమే పొందొచ్చు. అవి కంపెనీలు భాగస్వామ్యాలు లేదా మరే ఇతర కార్పొరేట్ సంస్థలకు అందుబాటులో ఉండవు.

సెక్షన్ 80C కింద వివిధ రకాల ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ లు మరియు ITA లోని 80CCC మరియు 80CCD వంటివి ఉంటాయి. ఇవి మీ పన్ను లయబిలిటీలను సమర్ధవంతంగా తగ్గించేందుకు మీకు ఉపయోగపడతాయి.

[మూలం]

సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్

పెట్టుబడులు లాక్ ఇన్ పీరియడ్ రిటర్న్ లు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) 15 సంవత్సరాలు 7%-8%
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లు 3 సంవత్సరాలు 12% - 15%
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ వరకు 8.5%
నేషనల్ పెన్షన్ స్కీమ్ 5 సంవత్సరాలు 12% - 14%
ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు 5 సంవత్సరాలు 6.50%- 7.25%
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 5 సంవత్సరాలు 7% - 8%
సుకన్య సమృద్ధి యోజన బాలికకు 21 సంవత్సరాలు వచ్చే వరకు 7.60%
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 5 సంవత్సరాలు 7.40%
IT ఆక్ట్ అందుబాటులో ఉన్న డిడక్షన్ ల గురించి పూర్తిగా ఇక్కడ వివరించబడింది.

80C కింద ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్

1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా PPF అనేది గవర్నమెంట్ సేవింగ్స్ స్కీమ్ లలో ఒకటి. ఇది హామీతో కూడిన రిటర్న్ లను అందిస్తుంది. PPF అనేది 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది.

PPF నుంచి వచ్చే రిటర్న్ లకు సెక్షన్ 80C కింద ట్యాక్సేషన్ మినహాయింపు ఉంటుంది. అయితే మీరు ప్రతి సంవత్సరం మీ ఆదాయపు పన్ను రిటర్న్ లను ఫైల్ చేసేటపుడు మీ PPF నుంచి వచ్చే రిటర్న్ లను ఫైల్ చేయాలి.

2. ట్యాక్స్ సేవింగ్ మ్యూచ్యువల్ ఫండ్ లలో పెట్టుబడి (ELSS)

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అని పిలువబడే ఈ ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్ లు 3 సంవత్సరాల లాక్ ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి. మన మొత్తం కార్పస్ లో అవి 80 శాతం వరకు ఈక్విటీలలో పెట్టుబడులు పెడతాయి. అందుకే ఆ పేరు పెట్టారు.

ELSS నుంచి వచ్చే రిటర్న్ లు రూ. 1 లక్ష వరకు ట్యాక్స్ ఫ్రీగా ఉంటాయి. మీ రిటర్న్ లు లిమిట్ ను దాటితే మీరు 10 శాతం ట్యాక్స్ కు లోబడి ఉంటారు.

3. ఉద్యోగుల భవిష్యనిధి ఫండ్ (EPF)

ఉద్యోగుల సహకారంతో ఏర్పడిన ఉద్యోగుల భవిష్య నిధి ఫండ్ కి సెక్షన్ 80C కింద డిడక్షన్ లు లభిస్తాయి. సెక్షన్ 80C కింద ఇంక్లూడ్ కానప్పటికీ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఫండ్ అనేది ట్యాక్స్ రహితంగా ఉంటుంది.

ఈపీఎఫ్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కూడా ట్యాక్స్ ఫ్రీ. కానీ కింది పరిస్థితులలో దీనికి ట్యాక్స్ విధించబడుతుంది.

  • మీరు కనుక ఈపీఎఫ్ రిజిస్టర్డ్ కంపెనీలో సేవలు మానేస్తే.
  • ఏదైనా ఈపీఎఫ్ రిజిస్టర్డ్ కంపెనీలో 5 సంవత్సరాలు పూర్తి చేయడానికి ముందు మీరు ఈపీఎఫ్ నుంచి విత్ డ్రాయల్ చేసుకుంటే.

4. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)

సెక్షన్ 80C, కింద ఉద్యోగి మరియు యజమాని విరాళాలు రెండూ ట్యాక్సేషన్ నుంచి మినహాయింపును అందుకున్నాయి. ఈ సందర్భంలో యజమానులు ఇచ్చే విరాళాలు ఉద్యోగుల బేసిక్ సాలరీ+డియర్‌నెస్ అలవెన్స్ తో పోల్చుకుంటే 10 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు.

అంతే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తి సెక్షన్ 80C కింద తన ఇన్కమ్ లో 20 శాతం వరకు ఉన్న విరాళాల అమౌంట్ కోసం ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు.

నేషనల్ పెన్షన్ స్కీమ్ కి స్వచ్ఛందంగా అందించిన విరాళాలు కూడా అందుబాటులో ఉన్న మినహాయింపు లిమిట్ రూ. 1,50,000+ రూ. 50,000 వరకు మినహాయింపు పొందొచ్చు. కావున ఎన్పీఎస్ కు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చే వ్యక్తులు ఈ సెక్షన్ కింద రూ. 2 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.

అయితే ఎన్పీఎస్ నుంచి వచ్చే రిటర్న్ లకు మెచ్యూరిటీ వరకు మాత్రమే ట్యాక్సేషన్ నుంచి మినహాయింపు లభిస్తుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. స్కీమ్ మెచ్యూరిటీ అయిన తర్వాత సేకరించిన అమౌంట్ లో 60 శాతం పన్ను విధించబడుతుంది.

5. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్

మీరు పోస్టాఫీసులు మరియు బ్యాంక్ ల ద్వారా తెరవగలిగే 5 సంవత్సరాల కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ లు సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపుకు అర్హమైనవి. ఈ FDలలో సేకరించబడిన ఇంట్రెస్ట్ పూర్తి పన్ను పరిధిలోకి వస్తుంది.

6. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)

ఇవి 5 సంవత్సరాల కాల వ్యవధితో ప్రభుత్వ మద్దతు గల సేవింగ్స్ స్కీమ్ లు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద సేకరించిన ఇంట్రెస్ట్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ మినహాయింపుకు అర్హమైనది.

7. సుకన్య సమృద్ధి యోజన

ఆడపిల్లల విద్యకు తర్వాత వారి వివాహానికి మద్దతు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ లలో ఇదీ ఒకటి.

ఈ అకౌంట్ ను 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు తెరవచ్చు. ఖాతా అనేది 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద వచ్చే రిటర్న్ లకు ట్యాక్స్ మినహాయింపు అందుబాటులో ఉంటుంది.

 

8. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

ఇవి 5 సంవత్సరాల కాల వ్యవధితో ప్రభుత్వ మద్దతు గల సేవింగ్స్ స్కీమ్ లు. మీరు 3 సంవత్సరాల టెన్యూర్ ను (కాలం) పెంచుకోవచ్చు.

ఈ స్కీమ్ కోసం పెట్టే పెట్టుబడులకు సెక్షన్ 80C కింద ట్యాక్సేషన్ ఉంటుంది. అయితే ఈ స్కీమ్ నుంచి వచ్చిన రిటర్న్ లకు మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధించబడుతుంది.

మరింత చదవండి: సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్

కేవలం ఈ ఇన్వెస్టింగ్ ఎంపికలు మాత్రమే కాకుండా సెక్షన్ 80C కింద డిడక్షన్ లు కూడా అందుబాటు లో ఉన్నాయి:

9. హోమ్ లోన్లు

ఈ మినహాయింపు అనేది మనం కొనుగోలు చేసేందుకు తీసుకున్న లేదా రెంట్ కోసం తీసుకున్న హోమ్ లోన్ల ప్రిన్సిపల్ అమౌంట్ మీద వర్తిస్తుంది. అయితే ఈ డిడక్షన్ ను క్లయిమ్ చేసుకునేందుకు మీరు హౌస్ ను సొంతం చేసుకున్న 5 సంవత్సరాల వరకు దానిని విక్రయించలేరు.

అంతే కాకుండా సెక్షన్ 80C అనేది మీ ఆస్తికి చెల్లించిన స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజును క్లయిమ్ చేసుకునేందుకు కూడా వాడుకోవచ్చు.

10. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ప్రీమియం చెల్లింపు

సొంత బీమా అయినా లేదా కుటుంబ సభ్యుల లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు అయినా కానీ మీకు ఈ మినహాయింపు లభ్యత అందుబాటు లో ఉంటుంది. సింగిల్ ప్రీమియం పాలసీ విషయంలో మీరు ప్రారంభించిన 2 సంవత్సరాలలోపు పాలసీని రద్దు చేయలేరు. ఒకటి కంటే ఎక్కువ ప్రీమియం పాలసీలకు ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు మీరు కనీసం 2 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు చేయాలి.

పైన పేర్కొన్న నియమాలను మీరు పాటించకుంటే ఈ సెక్షన్ కింద మీ ట్యాక్స్ డిడక్షన్ లు రద్దు చేయబడతాయి.

యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలలో (ULIPs) చెల్లించిన ప్రీమియం కూడా సెక్షన్ 80C కింద ట్యాక్స్ మినహాయింపుకు అర్హమైనది.

ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మరింత చదవండి

11. మీ పిల్లల చదువు కోసం చెల్లించిన పాఠశాల లేదా ట్యూషన్ ఫీజు

ఈ సెక్షన్ అనేది ఇద్దరు పిల్లల విద్య కోసం ఏదైనా పాఠశాల, యూనివర్సిటీ, కాలేజ్ మొదలైన వాటిలో చెల్లించిన ఫీజుకు మినహాయింపును అందిస్తుంది.

ట్యాక్స్ డిడక్షన్ లు అనేవి పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయాన్ని తగ్గించుకునే మార్గాలు. మీరు క్లయిమ్ చేసే ట్యాక్స్ డిడక్షన్ రకాన్ని బట్టి మీ డిడక్షన్ అమౌంట్ మారుతుందని మీరు గుర్తుంచుకోవాలి.

సెక్షన్ 80C మాత్రమే కాకుండా ఇతర ట్యాక్స్ మినహాయింపులు

సెక్షన్ 80C మాత్రమే కాకుండా మీరు సెక్షన్ 80లోని అనేక వివిధ ఇతర సబ్ సెక్షన్ల ద్వారా కూడా ట్యాక్స్ మినహాయింపు పొందొచ్చు. ఉదాహరణకు:

  • సెక్షన్ 80D – మీరు దీని ద్వారా మీ వ్యక్తిగత లేదా జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు మొదలైన వారి కోసం కడుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంల మీద ట్యాక్స్ మినహాయంపులు పొందొచ్చు. ఈ సెక్షన్ కింద మీరు మీ జీవిత భాగస్వామి కొరకు రూ. 25,000 మరియు మీ తల్లిదండ్రుల కొరకు మరో రూ. 25,000 డిడక్షన్ ను మీరు క్లయిమ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద మినహాయింపు రూ. 1 లక్ష వరకు ఉంటుంది.
  • సెక్షన్ 80G –ఈ సెక్షన్ లో వివిధ స్వచ్ఛంద సంస్థలు, సోషల్ అవసరాల కోసం విరాళాలు ఉంటాయి. మీరు ఎందుకోసం విరాళం ఇస్తున్నారనే కారణంతో సంబంధం లేకుండా గరిష్టంగా 50 శాతం నుంచి 100 శాతం వరకు మినహాయింపులు ఉంటాయి.
  • సెక్షన్ 80GGC – ఈ సెక్షన్ లో రాజకీయ పార్టీకి ఇచ్చిన విరాళాలు ఉంటాయి. నగదుతో కాకుండా ఇతర మోడ్ ల ద్వారా చెల్లింపులు చేస్తే మాత్రమే ఈ మినహాయింపులు అందుబాటులో ఉంటాయి.

అటువంటి డిడక్షన్ లు మరియు మరిన్నింటి వల్ల టాక్స్ పేయర్ల మీద ట్యాక్స్ లయబిలిటీ విపరీతంగా తగ్గించబడుతుంది. కావున మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లను ఫైల్ చేసే ముందు మీరు అన్ని రకాల పన్ను మినహాయింపులు పొందుతున్నారని నిర్దారించుకునేందుకు సెక్షన్ 80C మరియు సెక్షన్ 80 కింది అందుబాటులో ఉన్న సబ్ సెక్షన్లను తనిఖీ చేయడం మర్చిపోకండి.

[మూలం 1]

[మూలం 2]

[మూలం 3]

సెక్షన్ 80C కింద ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్టింగ్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

యజమానికి రుజువు సమర్పించనప్పటికీ సెక్షన్ 80C కింద ఇన్కమ్ టాక్స్ రిటర్న్ లు ఫైల్ చేసేటపుడు పన్ను మినహాయింపు క్లయిమ్ పొందొచ్చా?

మీ ఇన్వెస్ట్ మెంట్ ప్రూఫ్ లను ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు సమర్పించాలి. ట్యాక్స్ డిడక్షన్ లు మరియు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయాలను లెక్కించేటపుడు వాటిని పరిగణలోకి తీసుకునేందుకు యజమానిని అనుమతిస్తుంది.

కానీ మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయడం మర్చిపోయినప్పటికీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లను ఫైల్ చేసే ముందుగానే మీరు ఈ రిటర్న్ లను క్లయిమ్ చేసుకోవచ్చు.

నేను 15 ఏప్రిల్ 2019న సెక్షన్ 80C ట్యాక్స్ ప్రయోజనాలు పొందేందుకు అర్హత ఉన్న పెట్టుబడి పెట్టినట్లయితే నేను ట్యాక్స్ డిడక్షన్ లు ఎప్పుడు క్లయిమ్ చేసుకోవాలి?

ఇటువంటి సందర్భంలో మీరు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ ఇన్వెస్ట్‌మెంట్ కింద డిడక్షన్ లు క్లయిమ్ చేసుకోవచ్చు.

హిందూ అవిభక్త కుటుంబానికి సెక్షన్ 80C వర్తిస్తుందా?

అవును వ్యక్తులు లేదా HUFలు ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లోని సెక్షన్ 80C కింద ఉన్న ట్యాక్స్ ప్రయోజనాలు ఆస్వాదించొచ్చు.