హెల్త్ ఇన్సూరెన్స్ లో నామినీ అంటే ఏమిటి?
ఆరోగ్యానికి సంబంధించిన సంక్షోభం విషయంలో మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు మీరు ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంత ముఖ్యమైనదనే దాని గురించి తెలుసుకుని ఉండాలి. మీ కుటుంబ సభ్యులు లేదా మీ మీద ఆధారపడిన వ్యక్తులు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రయోజనాలు కోల్పోకుండా ఉండేందుకు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి నామినీని ఎంచుకోవాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ లో నామినీ పాత్ర
నామినీ అనేది పాలసీదారు ఎంచుకునే వ్యక్తి (లేదా వ్యక్తులు). సాధారణ పరిస్థితుల్లో మీరు ఆసుపత్రిలో చేరడం లేదా మెడికల్ బిల్స్ కొరకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లయిమ్ చేస్తే ఆ మొత్తం మీకు చెల్లించబడుతుంది (మీరు పొందుతారు).
కానీ దురదృష్టవశాత్తు మీరు ఆసుపత్రిలో చేరిన సమయంలో లేదా యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లయిమ్ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది.
జీవిత ఇన్సూరెన్స్ లో ఇది తప్పనిసరి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో నామినీని ఇవ్వడం కూడా సాధ్యమే.
గమనిక: నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్ క్లయిమ్ విషయంలో ఇది వర్తించదు. మొత్తం అమౌంట్ ను నేరుగా నెట్వర్క్ ఆసుపత్రిలో సెట్ చేస్తారు.
హెల్త్ ఇన్సూరెన్స్ లో నామినీలకు ఉండే ప్రయోజనాలు
మీరు మీ పాలసీకి ఎవరిని నామినీగా ఎన్నుకున్నారో ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం విషయంలో ఏదైనా తప్పు జరిగితే మీరు మీ ప్రియమైన వారిని ఆర్థికంగా సంరక్షించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- మీ కుటుంబానికి ఆర్థిక సహాయం – మరణం సంభవించినప్పుడు మరణించిన వారి మొత్తం కుటుంబం తీవ్రంగా బాధపడుతుంది. పెద్ద ఆసుపత్రుల ఫీజులు వారికి మరింత భారంగా ఉంటాయి. ఒక వ్యక్తిని నామినీగా ఎంచుకోవడం ద్వారా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని మీరు నిర్ధారించుకోవచ్చు.
- మీ మీద ఆధారపడిన వారిని కాపాడుకోండి - మీ మీద ఆధారపడిన వారిని ఆర్థికంగా రక్షించుకోవడం చాలా అవసరం. మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మీరు వారిని నామినీగా సెలెక్ట్ చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. వారికి భవిష్యత్ లో ఎదురయ్యే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు సహాయపడుతుంది.
- సమానంగా పంచిన ప్రయోజనాలు - మీరు కనుక ఒక వేళ ఒక్కరి కంటే ఎక్కువ మంది నామినీలను ఎంచుకుంటే క్లయిమ్ మొత్తం వారికి సమానంగా పంచబడుతుంది.
- చట్టపరమైన చిక్కులను నివారించండి - మీరు కనుక నామినీని పేర్కొనకుండానే మరణిస్తే మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లయిమ్ మొత్తం అందించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీ మీ చట్టపరమైన వారసుడిని గుర్తించవలసి ఉంటుంది. ఇది బహుళ (ఒక్కరి కంటే ఎక్కువ) వ్యక్తులను కలిగి ఉండవచ్చు. ఇది మీ కుటుంబానికి కోర్టులు మరియు ఇతర సమస్యలను కలిగించవచ్చు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి నామినీని నియమించడం వలన అనుకోని కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు వారికి తక్కువ అవాంతరాలు ఉండేలా చేస్తుంది. క్లిష్టమైన పరిస్థితి ఉన్నపుడు ఇది మీ ప్రియమైన వారికి కొంత సులభతరం చేస్తుంది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఎవరిని నామినీగా ఎంచుకోవాలి?
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఎవర్ని నామినీగా ఎంచుకోవాలనే విషయంపై ఎటువంటి పరిమితులు లేవు. కింద పేర్కొన్నటువంటి సంబంధం ఉన్న కుటుంబ సభ్యులను వెంటనే నామినేట్ చేసే అవకాశం ఉంది
- తల్లిదండ్రులు
- జీవితభాగస్వామి
- పిల్లలు
- లేదా దూరపు బంధువులు
- లేదా మీ స్నేహితులు
మైనర్ ను నామినేట్ చేయడం కూడా సాధ్యపడుతుంది (18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు). ఇటువంటి సందర్భంలో మీరు ఒక గార్డియన్ లేదా అపాయింటీని కూడా పేర్కొనవలసి ఉంటుంది. ఎందుకంటే మైనర్లు పెద్ద వారయ్యే వరకు క్లయిమ్ అమౌంట్ ను చట్టబద్ధంగా నిర్వహించలేరు.
పాలసీదారు కంటే ముందే నామినీ మరణిస్తే మీ క్లయిమ్ మొత్తం చట్టపరమైన వారసులకు వెళ్తుందని గుర్తుంచుకోండి. ఇది మీ ఇష్టానుసారంగా లేదా కోర్టుల ద్వారా నిర్ణయించబడుతుంది.
సాధారణంగా ప్రస్తుతం వయోజనులుగా ఉన్న కుటుంబసభ్యులను మీ నామినీలుగా సెట్ చేసుకోవడం మంచిది. విపత్కర పరిస్థితుల్లో క్లయిమ్ అమౌంట్ అనేది మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మర్చిపోకండి.
హెల్త్ ఇన్సూరెన్స్ లో నామినీని ఎలా యాడ్ చేయాలి లేదా ఎలా మార్చాలి?
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో కొనుగోలు చేసినా కానీ మీ నామినీ వివరాలు సమర్పించవచ్చు. మీ ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయడం ద్వారా ఏ సమయంలోనైనా కొత్త నామినీని ఎన్నుకునేందుకు వీలుపడుతుంది.
రెన్యూవల్ సమయంలో లేదా పాలసీ పీరియడ్ మధ్యలో అయినా కానీ మీరు నామినీలను మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. మీరు మీ ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించడం ద్వారా మరోసారి కూడా చేయొచ్చు.
నామినీలవి ఎటువంటి వివరాలు అవసరం?
క్లయిమ్ చేసేటప్పుడు నామినీకి సంబంధించిన సరైన వివరాలను అందించండి. ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోండి. ఇందులో ఉండేవి ఇవే:
- వ్యక్తిగత వివరాలు: పూర్తి పేరు, జన్మదినం, వయసు, చిరునామా
- ఐడీ ప్రూఫ్: చెల్లుబాటయ్యే ఐడీ ప్రూఫ్, డ్రైవర్ లెసెన్స్ కాపీ వంటివి
- రిలేషన్‌షిప్ ప్రూఫ్: మీరు నామినీగా సమర్పించిన వ్యక్తికి మీతో ఉన్న బంధుత్వం. దూరపు బంధువును మీరు నామినీగా సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా సంబంధానికి రుజువును సమర్పించాలి.
నామినీ క్లయిమ్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏమిటి?
విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు (పాలసీ తీసుకున్న వ్యక్తి) ఆసుపత్రిలో చేరిన తర్వాత చనిపోతే రీయింబర్స్‌మెంట్‌ను క్లయిమ్ చేయడం నామినీ ఇష్టం. రీయింబర్స్‌మెంట్ క్లయిమ్ విషయంలో వారు కింది విధానం ఫాలో కావాల్సి ఉంటుంది:
- స్టెప్ 1: నామినీ తప్పకుండా పాలసీహోల్డర్ మరణం గురించి ఇన్సూరెన్స్ సంస్థకు సమాచారం అందించాలి. సరైన ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. మరణ ధృవీకరణ పత్రం కూడా సమర్పించాలి. ఒక వేళ ప్రమాదంలో మరణిస్తే FIR కాపీ మరియు పోస్ట్‌మార్టం రిపోర్ట్ ను తప్పకుండా సమర్పించాలి.
- స్టెప్ 2: తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను నామినీ 30 రోజుల్లోపు ఇన్సూరెన్స్ సంస్థకు పంపాలి. ఇందులో మెడికల్ బిల్స్, హెల్త్ రికార్డ్స్, మరియు వైద్యుల రిపోర్టులు, పాలసీ హోల్డర్ మరణ ధృవీకరణ పత్రం, నామినీ గుర్తింపు కార్డ్, రిలేషన్‌షిప్ ప్రూఫ్, మరియు బ్యాంక్ ఖాతా వివరాలు.
- స్టెప్ 3: అదనంగా ఏవైనా అవసరం ఉంటే ఇన్సూరెన్స్ సంస్థ వారికి తెలియజేస్తుంది.
- స్టెప్ 4: ఇన్సూరెన్స్ కంపెనీ నామినీ వివరాలను ధృవీకరించిన తర్వాత నామినీ ఖాతాకు క్లయిమ్ మొత్తం బదిలీ అవుతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో నామినీలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. ఒక వేళ మరణం సంభవిస్తే పాలసీ హోల్డర్ మీద ఆధారపడిన వారికి ఇది ఆర్థిక భద్రతను అందిస్తుంది. అంతే కాకుండా వివాదాలు తలెత్తకుండా కూడా నిరోధించవచ్చు. ఎవర్నైనా మీ నామినీగా ఎంచుకోవచ్చు. మైనర్లయినా సరే అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎంచుకున్నపుడు సరైన ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడం మరియు నామినీని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
తరచూ అడిగే ప్రశ్నలు
మీ హెల్త్ ఇన్సూరెన్స్ లో నామినీని జొడించకపోతే ఏం జరుగుతుంది?
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో నామినీ పేరు పేర్కొనకపోతే రీయింబర్స్‌మెంట్ క్లయిమ్ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీ అందించే మొత్తం చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీ చట్టబద్ధమైన వారసుడిని గుర్తించాల్సి ఉంటుంది. వీలునామాలో లేదా పత్రాలలో పేర్కొనని వారసుల విషయంలో క్లయిమ్ మొత్తం కోసం అటువంటి వారు కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
చట్టపరమైన వారసుడు మరియు నామినీ మధ్య తేడా ఏమిటి?
ఒక వ్యక్తికి చట్టపరమైన వారసుడు అంటే ఆ వ్యక్తి ఆస్తులను పొందేందుకు అన్ని అర్హతలను కలిగి ఉంటాడు. అత్యంత సన్నిహితమైన బంధువు కావొచ్చు లేదా వారి వీలునామాలో రాసిన బయటి వ్యక్తి అయినా కావొచ్చు. పాలసీ హోల్డర్ నామినీగా ఎవరి పేరైతే పెడతాడో వారు పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత అతని క్లయిమ్ అమౌంట్ ను తీసుకుంటారు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం నామినీని కలిగి ఉండడం తప్పనిసరా?
అదేం లేదు ఇది తప్పనిసరి కాదు. పాలసీదారు చనిపోయిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మీరు అలా చేయాలని సిఫారసు చేయబడింది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను కలిగి ఉండడం సాధ్యమేనా?
కుటుంబ సభ్యులనే కాదు ఫ్రెండ్స్ లో కూడా ఒకరి కంటే ఎక్కువ మందిని మీ హెల్త్ ఇన్సూరెన్స్ నామినీలుగా ఎంచుకోవచ్చు.
ఒక మైనర్ ను మీరు మీ నామినీగా నియమించుకోవచ్చా?
అవును. మీరు మీ నామినీగా మైనర్ పేరు కూడా రాయొచ్చు. అటువంటి సమయంలో మీరు మైనర్ నామినీతో పాటుగా అతడి గార్డియన్ లేదా అపాయింటీ పేరు పేర్కొనాల్సి ఉంటుంది. మైనర్ వ్యక్తి పెద్దవాడు అయ్యే వరకు క్లయిమ్ మొత్తాన్ని చట్టపరంగా నిర్వహించలేడు. ఆ విధంగా పిల్లల పేరు మీద నియమించబడిన గార్డియన్ లేదా అపాయింటీకి డబ్బులు చెల్లించబడతాయి. వారికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మొత్తం అందించబడుతుంది.
మీరు నామినీగా కుటుంబానికి సంబంధం లేని వ్యక్తిని నియమించుకోవచ్చా?
మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ నామినీగా ఫ్యామిలీ మెంబర్ కానీ క్లోజ్ ఫ్రెండ్ పేరును పెట్టొచ్చు.
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉంటే నామినీ గురించిన వివరాలేంటి?
ఒక వేళ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని, షేర్ చేసుకుంటే మరియు మీరు నామినీని పెట్టకపోయి ఉంటే ఇన్సూర్ చేసిన ఎవరైనా వ్యక్తి చనిపోతే క్లయిమ్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ వేరే వ్యక్తికి బదిలీ చేస్తుంది. చట్టపరమైన వారసుడు ఆ మొత్తం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.