హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసే విషయంలో చాలా రకాల ఎంపికలు ఉన్నాయి. ఇండెమ్నిటి ఆధారిత ఆరోగ్య ప్లాన్, ఫిక్స్‌డ్ బెనిఫిట్ ఆరోగ్య ప్లాన్ నుంచి మీరు ఎంపిక చేసుకోవాలి. కావున ఇండెమ్నిటి ప్లాన్లను అలాగే ఫిక్స్‌డ్ బెనిఫిట్ ప్లాన్లు రెండింటినీ పరిశీలిద్దాం. మీ అవసరాలకు ఏ ప్లాన్ సరిగ్గా సరిపోతుందో విశ్లేషిద్దాం.
ఇండెమ్నిటి ఆధారిత ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఒక రకమైన ఇన్సూరెన్స్ ప్లాన్. మీరు ఆసుపత్రిలో చేరినా లేక వైద్య ఖర్చులకు అయిన డబ్బులను ఇన్సూరెన్స్ చేసిన మొత్తము పూర్తయ్యేవరకు, మీ ఇన్సూరెన్స్ సంస్థ మీకు చెల్లిస్తుంది..
ఈ ఇన్సూరెన్స్ చేసిన మొత్తము అనేది ఇన్సూరెన్స్ దారు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య నిర్ణయించబడుతుంది. మీరు క్లయిమ్ చేసినప్పుడు పొందే గరిష్ట మొత్తం ఇదే. చాలా రకాలైన రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇండెమ్నిటి ఆధారిత ప్లాన్స్ వ్యక్తిగత ఆరోగ్య ప్లాన్స్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్, వంటి అనేక రకాల ప్లాన్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి.
పైన పేర్కొన్న విధంగా ఈ రకమైన ప్లాన్ల కింద మీరు ఎంత మొత్తం అయితే ఇన్సూరెన్స్ చేస్తారో అంతవరకు మీరు ఆసుపత్రి ఖర్చులు లేదా వైద్య ఖర్చుల కింద రీయింబర్స్‌మెంట్‌గా పొందుతారు.
ఒక ఉదాహరణ చూద్దాం మీరు రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ మొత్తంతో ఇండెమ్నిటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కలిగి ఉన్నారని మరియు మీకు ప్రస్తుతం జరుగుతున్న చికిత్స ఖర్చు రూ. 2 లక్షలు అవుతుందని అనుకుందాం. ఇటువంటి సందర్భంలో మీ ఇన్సూరెన్స్ సంస్థ మీకు అయిన ఖర్చులకు పరిహారం చెల్లిస్తుంది. మీరు కేవలం సంబంధిత బిల్లులు, మెడికల్ పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. మిగిలిన రూ. 3 లక్షలను పాలసీ వ్యవధిలో తదుపరి వైద్య ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.
అయితే ఈ రీయింబర్స్‌మెంట్ పాలసీలో చేర్చబడిన ఎటువంటి డిడక్టబుల్స్ లేదా కో-పేమెంట్స్ కవర్ చేయదని గుర్తుంచుకోండి. ఉదాహరణకు మీరు 15 శాతం కోపేమెంట్ను కలిగి ఉన్నట్లయితే మీ ఇన్సూరెన్స్ దారు మీకు క్లయిమ్ అమౌంట్లో 85 శాతం మాత్రమే చెల్లిస్తాడు. మిగతాది ఇక మీరు భరించాల్సి ఉంటుంది. మీకు కనుక రూ. 20,000 డిడక్టబుల్ ఉంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ రూ. 1.8 లక్షలను మాత్రమే అందిస్తుంది. మిగతాది మీరు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి:
ఆసుపత్రులను ఎంచుకునే సౌలభ్యం - మీరు వివిధ ఆసుపత్రులు మరియు మెడికల్ సెంటర్లను ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. కాబట్టి మీకు అవసరం అయిన చికిత్స రకం ఆధారంగా మీరు ఉత్తమ ఎంపికను ఎంచుకోవచ్చు.
ఒకటి కంటే ఎక్కువ క్లయిమ్స్ చేయగల సామర్థ్యం - మీరు ఇన్సూరెన్స్ చేసిన మొత్తము అయిపోయే వరకు ఒకే పాలసీ కింద ఒకటి కంటే ఎక్కువ క్లయిమ్స్ చేయొచ్చు.
సరసమైన ప్రీమియంలు - సాధారణంగా చూసుకుంటే ఇండెమ్నిటి ప్లాన్స్ తక్కువ ప్రీమియంలను కలిగి ఉంటాయి. ఇందులో డిడక్టబుల్స్, కో-పేమెంట్స్ వంటివి ఉంటాయి కాబట్టి ఇలా ఉంటాయి.
పైన పేర్కొన్న విధంగా ఈ ప్లాన్ ల కింద మీరు ఆసుపత్రి ఖర్చులు లేదా వైద్య ఖర్చుల మొత్తాన్ని ఇన్సూరెన్స్ చేసిన మొత్తము వరకు, రీయింబర్స్‌మెంట్‌గా పొందుతారు. కాబట్టి దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం. మీరు రూ. 5 లక్షల సమ్ ఇన్సూర్డ్‌తో (ఇన్సూరెన్స్ చేసిన మొత్తము) ఇండెమ్నిటి ఆధారిత హెల్త్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండి మీ ప్రస్తుత ఆసుపత్రి ఖర్చులు రూ. 2 లక్షలు అయ్యాయని అనుకుందాం. ఇటువంటి సందర్భంలో మీకు అయిన ఖర్చులను మీ ఇన్సూరెన్స్ సంస్థ పరిహారంగా చెల్లిస్తుంది. మీరు సంబంధిత బిల్లులు మరియు వైద్య పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 3 లక్షలను పాలసీ వ్యవధిలో తదుపరి వైద్య ఖర్చుల కోసం ఉపయోగించొచ్చు.
ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ రీయింబర్స్‌మెంట్ మీ పాలసీలో చేర్చబడిన ఎటువంటి డిడక్టబుల్స్ లేదా కో-పేమెంట్స్ కవర్ చేయదు. ఉదాహరణకు మీరు 15 శాతం కోపేమెంట్ను కలిగి ఉన్నట్లయితే మీ ఇన్సూరెన్స్ దారు మీకు క్లయిమ్ అమౌంట్లో 85 శాతం మాత్రమే చెల్లిస్తాడు. మిగతాది మీరు భరించాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు రూ. 20,000 డిడక్టబుల్ ఉంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు కేవలం రూ. 1.8 లక్షలు మాత్రమే చెల్లిస్తుంది. మిగతాది మీరు భరించాల్సి ఉంటుంది.
ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ (దీనినే డిఫైన్డ్ బెనిఫిట్ అని కూడా పిలుస్తారు) అనేది ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ . ఇక్కడ క్లయిమ్ సమయంలో ఇన్సూరెన్స్ మొత్తం నుంచి ఫిక్స్‌డ్ మొత్తం చెల్లించబడుతుంది.
మీరు పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరించే వాటిలో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్స్ మరియు పర్సనల్ యాక్సిడెంట్ పాలసీస్ వంటి ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఇన్సూరెన్స్ చేసిన మొత్తము రూ. 5 లక్షలు అయితే ముందుగా నిర్దారణ అయిన క్రిటికల్ ఇల్ నెస్ లేదా యాక్సిడెంట్ అయితే మీరు రూ. 5 లక్షల మొత్తాన్ని ఒకేసారి అందుకుంటారు. ఇది మీ వైద్య ఖర్చులకు ఉపయోగపడుతుంది.
దీని ప్రయోజనాలు ఏమిటంటే ఇందులో ఎటువంటి కో-పేమెంట్స్ లేదా సబ్-లిమిట్స్ లేవు. ఒకే సారి మొత్తం డబ్బులు చెల్లించడం వలన ప్రీ లేదా పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు ఉపయోగపడతాయి. అయితే ఇది కొన్ని రకాల అనారోగ్యాలను మాత్రమే కవర్ చేస్తుంది.
పారామీటర్స్ |
ఇండెమ్నిటి ప్లాన్ |
ఫిక్స్‌డ్ బెనిఫిట్ ప్లాన్ |
ఇది ఏమిటి? |
ఆసుపత్రిలో చేరడం లేదా ఇతర వైద్య ఖర్చుల కొరకు ఇన్సూరెన్స్ సంస్థ మీకు రీయింబర్స్‌మెంట్ అందజేస్తుంది. (ఇన్సూరెన్స్ చేసిన మొత్తము ఉన్నంత వరకు). |
క్రిటికల్ ఇల్ నెస్ లేదా కొన్ని క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని నిర్దారణ అయినప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ మీకు ఏక మొత్తంలో పేమెంట్ చేస్తుంది. (ఇన్సూరెన్స్ చేసిన మొత్తము). |
ఏం కవర్ అవుతాయి? |
ఇది అనేక రకాలైన వ్యాధులు, వైద్య పరిస్థితులు, చికిత్సలకు కవరేజ్ అందిస్తుంది |
ఈ ప్లాన్స్ కొన్ని రకాల తీవ్ర అనారోగ్యాలకు పరిమితం చేయబడ్డాయి. |
దీన్ని దేనికి ఉపయోగించొచ్చు? |
పరిహారం అనేది మీ ఆసుపత్రి బిల్లులను మాత్రమే కవర్ చేస్తుంది. కొన్ని ఖర్చులు కవర్ చేయబడవు. ఉదాహరణకు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు మొదలయినవి. |
మీరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మందులు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు మొదలైన ఏదేని ఖర్చుకు పరిహార మొత్తాన్ని ఉపయోగించొచ్చు. |
క్లయిమ్ స్ చేయాలంటే ఏమి అవసరం? |
క్లయిమ్ చేసినప్పుడు మీరు అన్ని రకాల ఆసుపత్రి బిల్లులు, మెడికల్ పత్రాలు మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. |
తక్కువ పత్రాలు అవసరం అవుతాయి. రిజిస్టర్డ్ మెడికల్ నిపుణుడి నుంచి నిర్దారణ పత్రం మాత్రమే అవసరం. |
మీరు ఎన్ని సార్లు క్లయిమ్ చేయొచ్చు? |
పాలసీ సంవత్సరంలో మీరు చేసిన ఇన్సూరెన్స్ మొత్తము అయిపోయే వరకు ఎన్నిసార్లైనా క్లయిమ్ చేయొచ్చు. |
మీరు ఒక క్లయిమ్ చేసినప్పుడు అది సాధారణంగా ఇన్సూరెన్స్ చేసిన మొత్తము ఉపయోగించుకుంటుంది. |
మీరు ఏమైనా చెల్లించాలా? |
క్లయిమ్ మొత్తం అనేది కో-పేమెంట్ నిబంధనలు, సబ్ లిమిట్స్‌కు లోబడి ఉండవచ్చు. కావున మీరు ఖర్చులో కొంత భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది. |
క్లయిమ్ అమౌంట్ లో ఎటువంటి డిడక్టబుల్స్ లేదా సబ్ లిమిట్స్ ఉండవు. |
ప్రీమియం ఎంత ఉంటుంది? |
ప్రీమియం అనేది ఎంతో తక్కువగా ఉంటుంది. |
ప్రీమియం సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. |
ఇంకా ఏవైనా అదనపు ప్రయోజనాలు ఉన్నాయా? |
ఇన్సూరెన్స్ కంపెనీలు నెట్‌వర్క్ ఆసుపత్రులతో భాగస్వామ్యం ఏర్పరచుకుని క్యాష్ లెస్ క్లయిమ్స్ అందించొచ్చు. |
రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా కవర్ చేయబడని ఏవైనా ఖర్చులను కవర్ చేసేందుకు బెనిఫిట్ మొత్తాన్ని ఉపయోగించొచ్చు. |
కావున మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేస్తున్నప్పుడు మీకు తగినంత సంరక్షణ అందించే ప్లాన్ పొందారని నిర్దారించుకోండి. చాలా సందర్భాలలో ఇండెమ్నిటి ఆధారిత ప్లాన్ ఎక్కువ కవరేజ్ ను అందజేస్తుంది. ఎందుకంటే ఇది చాలా అనారోగ్యాలను కవర్ చేస్తుంది. దానితో పాటు తక్కువ ప్రీమియంతో వస్తుంది. అయితే మీరు ఇప్పటికే ఒక ఆరోగ్య కవర్ ను కలిగి ఉన్నట్లయితే ఫిక్స్‌డ్ బెనిఫిట్ ప్లాన్ మీకు అదనపు ఆర్థిక సంరక్షణను అందిస్తుంది.
మీకు ఏది ఉత్తమమో మీరు నిర్ణయం తీసుకునే ముందు మీ ఆరోగ్య అవసరాలు అలాగే మీ కుటుంబ ఆరోగ్య చరిత్ర మొదలైన వాటి గురించి ఆలోచించండి.