సెక్షన్ 80D కింద సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ ప్రయోజనాలు
వైద్య ఖర్చులు తీవ్రంగా పెరుగుతున్న ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అది సేవింగ్స్ (పొదుపు) మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు అదొక్కటే కారణం కాదు. మీ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ మీ డబ్బులను పొదుపు చేస్తుంది. అంతే కాకుండా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D 1961 కింద పలు రకాల పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తుంది.
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఈ ప్రయోజనాలను మరింత ఎక్కువ అందిస్తుంది. సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా పొందే మరిన్నిప్రయోజనాలను గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
అసలు సీనియర్ సిటిజన్ అంటే ఎవరు?
ఎవరైతే 60 సంవత్సరాలకు ఎక్కువ వయసు ఉండి 80 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటారో.. ఆ ఆర్థిక సంవత్సరంలో సీనియర్ సిటిజన్‌గా పరిగణించబడతాడు. అటువంటి వారికి ఆ సంవత్సరానికి పన్ను మినహాయింపులు లభిస్తాయి. అంతే కాకుండా సంవత్సరంలో 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తి సూపర్ సీనియర్‌గా పరిగణించబడతాడు.
సెక్షన్ 80D కింద సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి?
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలు కింది విధంగా ఉంటాయి:
- మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియానికి సెక్షన్ 80D కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపు పరిమితి రూ. 25,000 వరకు ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్ అయితే రూ. 50,000 మినహాయింపు లభిస్తుంది.
- ఈ ప్రయోజనం వలన ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రూ. 75,000 మినహాయింపు లభిస్తుంది.
- అరుదైన సందర్భాల్లో వ్యక్తికి 60 సంవత్సరాలు మించినట్లయితే రూ. 1,00,000 మినహాయింపు లభిస్తుంది. (రూ. 50,000 పాలసీ హోల్డర్+ రూ. 50,000 అతడి సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు)
సీనియర్ సిటిజన్ల కోసం సెక్షన్ 80D కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఇలా
సినారియో | 80D కింద తగ్గింపు |
---|---|
సెల్ఫ్ మరియు ఫ్యామిలీ (60 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నఅందరూ) | ₹25,000 |
ఫర్ సెల్ఫ్ మరియు ఫ్యామిలీ + పేరెంట్స్ (60 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసున్నఅందరూ) | ₹25,000 + ₹25,000) = ₹50,000 |
ఫర్ సెల్ఫ్ మరియు ఫ్యామిలీ (60 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న వ్యక్తులు) + సీనియర్ సిటిజన్ పేరెంట్స్ | ₹25,000 + ₹50,000 = ₹75,000 |
ఫర్ సెల్ఫ్ మరియు ఫ్యామిలీ ( 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి) + సీనియర్ సిటిజన్ పేరెంట్స్ | ₹50,000 + ₹50,000) = ₹1,00,000 |
సీనియర్ సిటిజన్లు 80D కింద పన్ను మినహాయింపుల కోసం క్లెయిమ్ చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు
80D కింద పన్ను మినహాయింపును పొందేందుకు మీరు కింది పత్రాలను కలిగి ఉండాలి.
- ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) కోసం చెల్లించిన ప్రీమియం రశీదు
- హెల్త్ పాలసీ చేసిన వ్యక్తుల వివరాలు, వయసులు, ప్రపోజర్‌తో వారి సంబంధం
- తల్లిదండ్రులకు కూడా పాలసీ తీసుకున్నట్లయితే 80D కింద కవర్ అవుతారో లేదో తెలుసుకునేందుకు బీమా సంస్థ నుంచి సర్టిఫికెట్
సీనియర్ సిటిజన్లు 80D సెక్షన్ కింద మెడికల్ బిల్లులతో పన్ను ఆదా చేయగలరా?
ఒక వ్యక్తి జీవితంలో గోల్డెన్ ఇయర్స్ అనేవి ఎంతో విలువైనవి. ఇటువంటి సమయంలో ఎటువంటి ఆర్థిక చిక్కుల గురించి చింతించకుండా ఖర్చు చేయాలి. మరీ ముఖ్యంగా వైద్య అవసరాలకు సంబంధించిన విషయంలో ఖర్చులకు వెనుకాడకూడదు.
అందువల్ల సీనియర్ సిటిజన్లు ఏవైనా మెడికల్ బిల్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంకు చెల్లింపులు చేస్తే దానికి సెక్షన్ 80D కింద మినహాయింపు లభిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కేవలం పైన పేర్కొన్న పన్ను ప్రయోజనాలే కాకుండా మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వలన పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది.
- ఆన్యువల్ ప్రీవెంటివ్ చెకప్స్ కోసం మీరు ఏడాదికి రూ. 5000 వరకు పన్ను మినహాయింపులను పొందొచ్చు.
- తీవ్రమైన అనారోగ్యాల కోసం అయ్యే ఖర్చులకు రూ. 1,00,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
- మీరు క్రిటికల్ ఇల్‌నెస్ లేదా ఇతర ఆరోగ్య సంబంధ రైడర్‌తో పాలసీని కొనుగోలు చేసినట్లయితే మీరు ధ్వంధ్వ పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం సెక్షన్ 80C కింద మినహాయించబడుతుంది. అలాగే రైడర్ కోసం చెల్లించిన ప్రీమియం సెక్షన్ 80D కింద మినహాయించబడుతుంది.
- మీ పరిస్థితి తీవ్రతను బట్టి వివిధ రకాల దివ్యాంగులు ఏడాదికి రూ. 75,000 వరకు రాయితీని పొందొచ్చు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉంటే ఇది వర్తిస్తుంది. ఒక వేళ 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉంటే రూ. 1,25,000 మినహాయింపు లభిస్తుంది. దివ్యాంగుల మీద ఆధారపడి జీవనం సాగించే వారికి కూడా ఈ మినహాయింపులు లభిస్తాయి.
- సెక్షన్ 80DDB కింద ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు లేదా HUF (హిందూ అవిభక్త కుటుంబం) లకు వారి కుటుంబ మెడికల్ ఖర్చులు, వారి మీద ఆధారపడి జీవిస్తున్న వారి మెడికల్ ఖర్చులకు కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఈ సందర్భంలో క్లెయిమ్ చేయగల మినహాయింపు మొత్తం కింది విధంగా ఉంటుంది:
వైద్య చికిత్స తీసుకుంటున్న వ్యక్తి వయసు | పన్ను మినహాయింపు అమౌంట్ |
60 సంవత్సరాల కంటే తక్కువ | రూ. 40000/ లేదా అసలు ఖర్చులు.. ఏది తక్కువగా ఉంటే అది |
60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ | రూ. 100000/ లేదా అసలు ఖర్చులు.. ఏది తక్కువగా ఉంటే అది |
80 సంవత్సరాలు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్స్ | రూ. 100000/ లేదా అసలు ఖర్చులు.. ఏది తక్కువగా ఉంటే అది |
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది కేవలం పన్ను ప్రయోజనాలను అందించడం మాత్రమే కాకుండా ఇంకా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. హోల్ సమ్ కవరేజ్, డేకేర్ ఖర్చులు, డామిసిలియరీ (ఇంట్లోనే వైద్య చికిత్సలు) ఖర్చులు, ఎన్నో ప్రయోజనాలతో కూడిన యాడ్ ఆన్స్ అందించడం మీరు కష్టంతో సంపాదించిన డబ్బును ఆదా చేయడమే కాకుండా మీకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ విధానాలను సులభంగా అందిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల సీనియర్ సిటిజన్లకు కలిగే పన్ను ప్రయోజనాల గురించి తరచూ అడిగే ప్రశ్నలు
సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే 80 సంవత్సరాలు పైబడిన వారికి ఆరోగ్య బీమా వల్ల ఏదైనా పన్ను ప్రయోజనం అందుబాటులో ఉందా?
80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు మరియు సొంత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేని వ్యక్తులు కూడా వైద్య చికిత్సలు, హెల్త్ చెకప్స్ చేయించుకున్నపుడు రూ. 50,000 వరకు ఆదాయపు పన్ను చట్టం కింద మినహాయింపు కోరవచ్చు.
కొత్త పన్ను చట్టంలో 80D కింద పన్ను మినహాయింపులు అందుబాటులో ఉన్నాయా?
లేదు. కొత్త పన్ను చట్టంలో సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు లేదు.
80D కోసం సీనియర్ సిటిజన్లకు ప్రూఫ్ (రుజువు) కావాలా?
సంవత్సరంలో వైద్యానికి చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు, రశీదులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ రశీదులు, వైద్య ఖర్చుల బిల్లులు, టెస్టు రిజల్ట్స్ మొదలైనవి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అవసరం లేదు. కానీ వీటిని దగ్గర ఉంచుకోవాలని అంతా సూచిస్తారు.
సీనియర్ సిటిజన్లకు 80D వైద్య ఖర్చుల వ్యయ పరిమితి అంటే ఏమిటి?
ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80D కింద రూ. 25,000 వరకు తగ్గింపు అనుమతించబడుతుంది. సీనియర్ వ్యక్తులకు రూ. 50,000 వరకు మినహాయింపు ఉంటుంది.