ఇండియా టుడే అనే మేగజైన్లో ప్రచురితమైన ఇటీవలి నివేదికల ప్రకారం, 2018-19లో భారతదేశంలో సగటు రిటైల్ హెల్త్‌కేర్ ద్రవ్యోల్బణం 7.14%. ఇది అంతకుముందు ఉన్న 4.39% కన్నా బాగా పెరిగింది, దీన్నిబట్టి హెల్త్‌కేర్ ప్రోడక్టుల ధరలలో పెరుగుదలగా వేగవంతంగా ఉందని అర్థం అవుతోంది. (1)
దీన్నిబట్టి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇకపై కేవలం ముందుజాగ్రత్తగా మిగిలిపోదు. కానీ, సమర్థ మెడికల్ కేర్ విషయంలో భారీ ఆర్థిక నష్టాలు జరగకుండా నివారించడానికి ఇది ఒక ఆవశ్యకమైనదిగా మారింది.
ఇప్పుడు, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందుతున్నారని అనుకోండి, దాని గురించి మీరు తెలుసుకోవలసిన మొదటి విషయం ఏంటి?
కచ్చితంగా ప్రీమియం చెల్లింపు గురించే కదా!
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా లెక్కించవచ్చు, దాన్ని ప్రభావితం చేసే అంశాలు, మీరు దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దానిపై వివరణ!
సాంకేతికత అందుబాటులోకి రావడంతో చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆన్‌లైన్‌లోకి మార్చుకున్నాయి. వారు పాలసీదారులకు విషయాలను సులభం చేసే వివిధ ఉపయోగకరమైన ఆన్లైన్ టూల్స్‌ను ప్రవేశపెట్టాయి!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ మీ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని ఒక్క క్షణంలో లెక్కించడానికి ఉపయోగపడే టూల్!
ప్రీమియం మొత్తాన్ని లెక్కించడం చాలా కష్టమైన పని కాబట్టి, చాలా మంది వ్యక్తులు తమ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు సూచించిన మొత్తంపై మాత్రమే ముందుక వెళ్తారు. కానీ, ఆన్లైన్ క్యాలుక్యులేటర్ సహాయంతో, కొన్ని అవసరమైన వివరాలను అందించడం ద్వారా ప్రీమియం మొత్తాన్ని నిమిషాల వ్యవధిలో లెక్కించవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం క్యాలుక్యులేటర్ని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. మీరు మీ ప్రీమియం మొత్తాన్ని లెక్కించేందుకు ఆన్లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌కు ఉపయోగిస్తే మీరు పొందగల ప్రయోజనాల జాబితా ఇలా ఉంటుంది:
ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ని ఉపయోగించడం ద్వారా చెల్లించాల్సిన ప్రీమియం లెక్కించడం చాలా సులభం!
మీరు కొన్ని స్టెప్స్ మాత్రమే అనుసరించాలి. మీ వివరాలను సరిగ్గా నమోదు చేస్తే చాలు.. హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కోసం మీరు చెల్లించాల్సిన ప్రీమియం మీకు కనబడుతుంది.
ఉదాహరణకు, మీరు డిజిట్ ఇన్సూరెన్స్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం చూస్తున్నట్లయితే, మీ ప్రీమియంను సులభంగా లెక్కించవచ్చు.
ఓ లుక్కేయండి!
అవును, ఇది చాలా సులభం!
ఎలాంటి ఖర్చు లేదు, అడ్డు ఉండదు - మీ కొన్ని నిమిషాల సమయం మాత్రమే చాలు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి మీరు చెల్లించాల్సిన మొత్తం మీకు తెలుస్తుంది!
క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని ఎలా లెక్కించాలో మీరు తెలుసుకున్నారు. ఇక మీ పేమెంట్ బాధ్యతను ప్రభావితం చేసే అంశాలను పరిశీలించండి
తమ ప్రోడక్టుల మేనేజ్మెంట్ మరియు మార్కెటింగ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా ఖర్చు చేస్తాయి. ఈ ఖర్చులు పాలసీదారులపై పడుతాయి. మరియు వారి ప్రీమియం చెల్లింపులపై ప్రభావం చూపుతాయి.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి మీ ప్రీమియం చెల్లింపు అనేది మీరు ఎంచుకున్న ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ల కంటే వ్యక్తిగత ప్లాన్లు చాలా ఖరీదైనవి. వాటికోసం ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
మరింతగా తెలుసుకోండి..
కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తప్పనిసరి లేదా స్వచ్ఛంద కో-పేమెంట్స్, మినహాయించదగిన నిబంధనలతో వస్తుంటాయి. తగ్గింపులతో, పాలసీదారు ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించే ముందు చికిత్స ఖర్చుల్లో కొంత భాగాన్ని భరించాలి.
కో-పేమెంట్ నిబంధనతో, మొత్తం చికిత్స ఖర్చులో కొంత శాతాన్ని కవర్ చేయాల్సి ఉంటుంది, మిగిలినది ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ద్వారా కవర్ అవుతుంది. కానీ, కో-పేమెంట్, తగ్గింపులతో, ఇన్సూరెన్స్ పాలసీకి ప్రీమియం చెల్లింపు కొంత మేర తగ్గుతుంది. కాబట్టి, ఇవీ మీ పాలసీ ప్రీమియంపై ప్రభావం చూపే కొన్ని అంశాలు.
కోపే, కో ఇన్సూరెన్స్ & డిడక్టబుల్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి.
ప్రీమియం మొత్తాన్ని లెక్కించేటప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌లో అందించాల్సిన పారామీటర్లలో యాడ్-ఆన్ కవర్ ఒకటి.
ఎందుకంటే, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ నుంచి ఇప్పటికే ఉన్న ప్రయోజనాలపై యాడ్-ఆన్ కవర్లను ఎంచుకుంటే, పాలసీ ప్రీమియం చెల్లింపు ఆటోమేటిక్ గా పెరుగుతుంది.
చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ మూలధనాన్ని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెడుతాయి. ఈ పెట్టుబడులతో ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి ఐఆర్డీఏ (IRDA) నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తాయి.
ఇన్సూరెన్స్ పాలసీల కోసం మీరు చెల్లించాల్సిన ప్రీమియం కొంతమేర, మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు పొందే లాభాలపై ఆధారపడి ఉంటుంది.
ఇది మీ ప్రీమియం చెల్లింపును పెంచకున్నా.. మీరు పాలసీకి చెల్లించే మొత్తాన్ని మాత్రం పెంచుతుంది. ఎందుకంటే వారు అందించే సేవల కోసం బ్రోకర్ విధించే చార్జీలను మీరు గుర్తించాలి.
మీరు ముందు నుంచే ఉన్న జబ్బులను కవర్ చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందుతున్నట్లయితే, మీకు సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత పాలసీ ప్రయోజనాలను పొందొచ్చు.
కానీ ఈ వెయిటింగ్ పీరియడ్ పని చేయడానికి ఒక మార్గం ఉంది - అదే అదనపు ప్రీమియం మొత్తాన్ని చెల్లించడం. అందువల్ల, మీరు ముందుగా ఉన్న వ్యాధి కవర్ని పొందుతున్నారా లేదా అనే దానిపై కూడా మీ ప్రీమియం చెల్లింపు ఆధారపడి ఉంటుంది.
మరణాల రేటుపై ప్రీమియం చెల్లింపు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కస్టమర్‌కు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఖర్చును ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు భరించాల్సి ఉంటుంది.
ఫలితంగా, ప్రీమియం చెల్లింపు వివిధ వయసుల వారికి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లకు ప్రీమియం అధికంగా ఉంటుంది.
ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ వ్యక్తిగత పాలసీలు, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు వంటి అనేక రకాల ప్రోడక్టులను అందిస్తుంది.
ఈ పాలసీల కోసం పూచీకత్తులు ఈ పాలసీల్లో ప్రతి దాని నుంచి వచ్చే నష్టాలను బ్యాలెన్స్ చేసేలా, ఇన్సూరెన్స్ ప్రొవైడర్ తన బాధ్యతలు నిర్వహించేలా చేస్తుంది.
అందువల్ల, ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం, వారి వైద్య సమాచారం ఆధారంగా, పాలసీదారుడిగా వ్యక్తి ఎంత రిస్కులో ఉన్నాడనే దానిపైనా ఆధారపడి ఉంటుంది.
లింగం, వయసు, కుటుంబ పరిమాణం, నివాస ప్రాంతం, వారి వృత్తి మొదలైన ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులకు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు బేస్ రేటు సెట్ చేసే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు, 40, 50 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులకు బేస్ రేట్ సెట్ చేసినట్లయితే 25-35 సంవత్సరాల వయసున్న వారి కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ప్రీమియం తగ్గించుకునేందుకు కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి! ఉదాహరణకు..
హెల్త్ పాలసీల కోసం మీ ప్రీమియం చెల్లింపుపై పొదుపు చేసే అత్యుత్తమ మార్గాల్లో ఒకటి చిన్న వయసులోనే పాలసీ తీసుకోవడం.
చాలా ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న వ్యక్తికి ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది. అందుకే మీరు యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ పొందడం మేలు.
అలాగే మీరు మీ తల్లిదండ్రుల కోసం పాలసీ కొనుగోలు చేసి ఉంటే, సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం చెల్లింపు ఎక్కువగా ఉన్నందున, వారికి 60 ఏళ్లు నిండకముందే ఆ పాలసీని కొనుగోలు చేస్తే మంచిదని గుర్తించండి.
తగ్గింపులు, కో-పేమెంట్స్ ఎంచుకోవడం వల్ల మీ ఇన్సూరెన్స్ పాలసీపై ప్రీమియం తగ్గించుకోవచ్చు. తగ్గింపులు, కో-పేమెంట్స్ నిబంధనల ప్రకారం మీ చికిత్స ఖర్చులలో కొంత భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీ ఇన్సూరెన్స్ పాలసీకి చెల్లించే ప్రీమియం తగ్గుతుందని గుర్తించాలి.
అధిక కవరేజీ మొత్తాన్ని ఎంచుకోవడం అంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తక్కువ కవరేజీతో పాలసీ పొందొచ్చు.
చికిత్స కోసం మీ నగదు చెల్లింపులు తక్కువగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీ ఇన్సూరెన్స్ ప్లాన్‌పై టాప్-అప్ను పొందొచ్చు, ఇది ఇన్సూరెన్స్ చేయబడిన బేస్ మొత్తం అయిపోయిన తర్వాత అమలులోకి వస్తుంది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ఎక్కువ చెల్లించకుండా ఉండేందుకు, మీ యాడ్-ఆన్ కవర్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
అవసరం లేని వాటిని ఎంచుకోవడం వల్ల మీ ఇన్సూరెన్స్ కవర్ కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.
ఇన్సూరెన్స్ పాలసీని బ్రోకర్ ద్వారా కొనడం వల్ల మీ పాలసీ ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. ఎందుకంటే మీరు వారి సేవలకు సంబంధించి చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది వద్దనుకుంటే, మీరు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి నేరుగా పాలసీని కొనుగోలు చేయవచ్చు.
మీరు జోన్ C నగరంలో నివసిస్తున్నారని అనుకుందాం, ఇక్కడ చికిత్స ఖర్చులు జోన్ A లేదా జోన్ B నగరాల కంటే చాలా తక్కువగా ఉంటాయి. జోన్ C నగరంలో చికిత్స ఖర్చును కవర్ చేయడానికి మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి చెల్లించే ప్రీమియం, మిగిలిన రెండింటి కంటే కూడా తక్కువగా ఉంటుందన్న మాట.
డిజిట్లో రెండు రకాల జోన్లు ఉన్నాయి: జోన్ A (గ్రేటర్ హైదరాబాద్, ఢిల్లీ NCR, గ్రేటర్ ముంబై) మరియు జోన్ B (మిగిలిన ఇండియా). మీరు కనుక జోన్ B లో ఉన్నట్లయితే మీకు ప్రీమియం మీద అదనపు డిస్కౌంట్ అందజేయబడుతుంది. అంతే కాదు మా వద్ద జోన్ ఆధారిత కో పేమెంట్స్ లేవు.
అందుకోసమే మీరు మీ నగరంలోనే చికిత్స పొందాలని భావిస్తున్నట్లయితే… మీరు ప్రీమియం చెల్లింపులో ఆదా చేసేందుకు అనుగుణంగా ప్లాన్‌ను ఎంచుకోండి.
పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్స్ లేకపోతే మీరు బోనస్‌ను పొందుతారు. మీరు సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉండి ఎటువంటి క్లెయిమ్ చేయనందుకు అందించే బోనస్ ఇది. మీ మొత్తం సమ్ ఇన్సూర్డ్‌కు ఇది అదనం. దీనినే క్యుములేటివ్ బోనస్ అని అంటారు. ఎటువంటి క్లెయిమ్ చేయకుండా ఉన్న ప్రతి సంవత్సరానికి మీరు చేసిన బీమా మొత్తం మీద కొంత శాతం అందించబడుతుంది. డిజిట్లో మీ ప్లాన్ మీద ఆధారపడి 10 శాతం లేదా 50 శాతం గరిష్టంగా 100 శాతం వరకు ఉంటుంది. దీని వల్ల మీ మొత్తం బీమా విలువ పెరుగుతుంది. కానీ ఈ బోనస్ పొందేందుకు మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీని గడువు ముగిసే లోపల రెన్యూ (పునరుద్ధరణ) చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఈ బోనస్‌ను కోల్పోతారు.
వ్యక్తిగత ప్లాన్లకు బదులుగా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఎంచుకోవడం, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను ఒకే ప్లాన్‌లో కవర్ చేస్తే, దాని ధరను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీరు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80D కింద ఉన్న నిబంధనల ద్వారా మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై మీరు పొందగల పన్ను ప్రయోజనాలను వివరించే పట్టిక:
అర్హత |
మినహాయింపు పరిమితి |
వ్యక్తిగతంగా, కుటుంబానికి (భాగస్వామి, పిల్లలు) |
రూ. 25వేల వరకు |
వ్యక్తిగతంగా, కుటుంబం + తల్లిదండ్రులు (60 సంవత్సరాల కంటే తక్కువ వయసు) |
(రూ.25 వేలు+ రూ.25వేలు) = రూ.50 వేల వరకు |
వ్యక్తిగతంగా, కుటుంబం (60ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉన్నవారు), తల్లిదండ్రులు (60 ఏళ్ల వయసు పైబడిన వారు) |
(రూ.25 వేలు+ రూ.50వేలు) = రూ.75 వేల వరకు |
వ్యక్తిగతంగా, కుటుంబం (60ఏళ్ల వయసు పైబడిన వారు), తల్లిదండ్రులు (60 ఏళ్ల వయసు పైబడిన వారు) |
(రూ.50 వేలు+ రూ.50వేలు) = రూ.లక్ష వరకు |
ఇంకా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం గురించి ఆలోచిస్తున్నట్లయితే, ఆ ఆలోచనలను ఆపేయండి! ఈరోజే ఒక పాలసీ కొనుగోలు చేయండి!
కాకపోతే కవర్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించి మీ ప్రీమియం మొత్తాన్ని లెక్కించడం మర్చిపోవద్దు!
వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి: