హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు, మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య సరైనది ఎంచుకోవాలి.
రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో, కుటుంబ సభ్యులందరూ ఒకే ప్లాన్ కింద రక్షించబడతారు; దీనర్థం ప్రీమియం మరియు మొత్తం సం ఇన్స్యూర్డ్ రెండూ కుటుంబ సభ్యులందరికీ కలిపి ఇవ్వబడుతుంది; అయితే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ఒక వ్యక్తి కోసం మాత్రమే తయారు చెయ్యబడింది, ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు సం ఇన్స్యూర్డ్ ఒక వ్యక్తికి మాత్రమే ఇవ్వబడుతుంది.
"ఆరోగ్యమే మహాభాగ్యం" అనే సాధారణ పదబంధాన్ని మనం తరచుగా వింటూ ఉంటాము. బహుశా మనం చిన్నపిల్లలుగా దీనిని సీరియస్‌గా తీసుకోలేదు, కానీ సమయం గడిచేకొద్దీ, ఆ పదాలలోని నిజం మనం పెద్దయ్యాక మాత్రమే తెలుస్తుంది మరియు సంవత్సరాలు గడిచేకొద్దీ ప్రపంచం మన ముందుకు వస్తుంది.
అంతేకాకుండా, హెల్త్ కేర్ కు సంబంధించిన ఖర్చులు కూడా ఎక్కువగా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. బహుశా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మన ఆరోగ్యాన్ని భద్రపరచుకోవడానికి ఈరోజు చాలా ఎక్కువ ఎంపికలు అందుకే ఉన్నాయి; ఇవి మన ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడుకోవడంలో సహాయపడటమే కాకుండా, ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి మనకు వెసులుబాటును కూడా అందిస్తాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ రోజు చాలా ఎంపికలు ఉన్నాయి కాబట్టి, సరైన నిర్ణయం తీసుకోవడం కష్టం కావచ్చు. సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడంలో ప్రజలు కలిగి ఉన్న అత్యంత సాధారణ సందేహాలలో ఒకటి సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం.
స్థూలంగా, హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, మీరు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థను ఎంచుకున్నా, రెండు రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి, అవి, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ విషయంలో మేము పారదర్శకతను విశ్వసిస్తాము.
అన్నింటికంటే ముఖ్యంగా, ఇది చాలా కీలకమైన ఆర్థిక నిర్ణయం, మరియు సరైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. అందువల్ల, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకునే విషయానికి వస్తే, మీరు తెలుసుకోవలసిన ప్రతిదాన్ని మేము ఇక్కడ ఉంచాము.
పోలిక |
వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ |
కుటుంబ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ |
నిర్వచనం |
వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక వ్యక్తి కి మాత్రమే కవర్ అవ్వగల ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పథకం. దీనర్థం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు సం ఇన్స్యూర్డ్ రెండూ ఒక వ్యక్తి కోసం మాత్రమే తయారు చెయ్యబడ్డాయి మరియు దాన్ని ఎవరితోనూ పంచుకోలేడు. |
ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఒక ప్లాన్‌ను పంచుకునే ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు సం ఇన్స్యూర్డ్ రెండూ సభ్యులందరికీ పంచబడతాయి. |
కవరేజ్ |
ఈ ప్లాన్‌లో ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తికి మాత్రమే ఈ ప్లాన్ కవరేజీని అందిస్తుంది. ఉదాహరణకి; మీరు SI రూ. 10 లక్షల ప్లాన్‌ని తీసుకున్నట్లయితే, మీరు మాత్రమే మొత్తం పాలసీ వ్యవధిలో 10 లక్షల వరకు ప్రయోజనం పొందుతారు. |
ప్లాన్‌లో ఇన్సూరెన్స్ చేయబడిన కుటుంబ సభ్యులందరికీ ఈ ప్లాన్ కవరేజీని అందిస్తుంది. ఉదాహరణకి; మీ ప్లాన్ SI రూ. 10 లక్షలు అయితే, పాలసీ వ్యవధి కోసం మొత్తం కుటుంబం ఈ మొత్తాన్ని పంచుకోవాలి. |
ప్రయోజనాలు |
వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పథకం యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, సం ఇన్స్యూర్డ్ ప్లాన్‌లో ఇన్సూరెన్స్ చేయబడిన వారందరికీ పంచబడే ఫామిలీ ఫ్లోటర్ లో లా కాకుండా, ప్రతి వ్యక్తికి వారి స్వంత ఇన్సూరెన్స్ మొత్తాన్ని కలిగి ఉండటం వలన కవరేజీ మరింత విస్తృతంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా సీనియర్ తల్లిదండ్రులకు బాగా పని చేస్తుంది. |
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఎందుకంటే కుటుంబ సభ్యులందరికీ ఒకేసారి ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. |
ప్రతికూలతలు |
వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఏకైక ప్రతికూలత ఏమిటంటే, ఒక పాలసీ సంవత్సరంలో భీమా మొత్తం వారిని కవర్ చేయడానికి తగినంతగా ఉంటుంది. అంతే కాకుండా, వారు సంవత్సరంలో క్లెయిమ్ చేయకపోతే, వారు నో క్లెయిమ్ బోనస్ నుండి ప్రయోజనం పొందవచ్చు 😊 |
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ యొక్క ప్రధాన ప్రతికూలతలలో ఒకటి, సం ఇన్స్యూర్డ్ కుటుంబ సభ్యులందరికీ సరిపోకపోవచ్చు. |
ఉదాహరణ |
ఒక 30 ఏళ్ళ పని చేసే మహిళ తనకు మరియు తన సీనియర్ తండ్రి కోసం వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవాలని ఎంచుకుంటుంది. ఆమె SI 5 లక్షల వరకు వ్యక్తిగత ప్లాన్‌ను ఎంచుకుంటుంది. అంటే, ఆమెకు మరియు ఆమె తండ్రి ఇద్దరికీ ఏడాది పొడవునా వారి ఆరోగ్య అవసరాల కోసం ఒక్కొక్కరికి 5 లక్షలు ఉంటుంది. |
ఇద్దరు పిల్లలతో ఉన్న జంట ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకుంటారు; దీని కింద నలుగురు సభ్యులు మొత్తం ఇన్సూరెన్స్ మొత్తాన్ని తమలో తాము పంచుకోవాలి. ఉదాహరణకి; వారు SI 5 లక్షల ప్లాన్‌ని తీసుకున్నట్లయితే, వారు సంవత్సరంలో వారందరి ఆరోగ్య క్లెయిమ్‌ల కోసం 5 లక్షల వరకు మాత్రమే ఉపయోగించగలరు. |
ఐచ్చిక ఎంపిక |
పెద్ద కుటుంబాలకు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ బాగా సిఫార్సు చేయబడింది. అలాగే సీనియర్ తల్లిదండ్రులు ఉన్నవారికి ఫ్యామిలీ ఫ్లోటర్ సరిపోకపోవచ్చు. |
ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక యువ జంట లేదా చిన్న మరియు న్యూక్లియర్ కుటుంబాలకు బాగా పని చేస్తుంది. |
చిట్కాలు & సిఫార్సులు |
మీరు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం వెళుతున్నట్లయితే, ప్రతి సభ్యునికి కూడా సంబంధిత యాడ్-ఆన్‌లను ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఉదాహరణకి; మీరు మీ తల్లిదండ్రుల కోసం వ్యక్తిగత ప్లాన్‌ని తీసుకుంటే, మీ ప్లాన్‌లో చేర్చడానికి ఆయుష్ యాడ్-ఆన్ సిఫార్సు చేయబడిన యాడ్-ఆన్ అవుతుంది. |
మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ని ఎంచుకోబోతున్నట్లయితే, ఎక్కువ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంపిక చేసుకోండి, ఎందుకంటే ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం కుటుంబ సభ్యులందరికీ సరిపోతుందని మీరు నిర్ధారించుకోవాలి. |
రెండింటిలో ఒకదానిని ఎంచుకున్నప్పుడు, ప్రీమియం ఒక్కదాన్ని మాత్రమే పరిగణించకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే, ఫ్యామిలీ ఫ్లోటర్ సం ఇన్స్యూర్డ్ కుటుంబాన్ని ఒకే పాలసీలో కవర్ చేస్తుంది మరియు వ్యక్తిగత ఇన్సూరెన్స్ ఆయా వ్యక్తులకు మాత్రమే కవరేజీని అందిస్తుంది. కుటుంబ సభ్యులందరినీ కవర్ చేయడం మరియు రెండు పాలసీల గరిష్ట ప్రయోజనాలను పొందడం సరైన విధానం. రెండింటిపై మీ పరిశోధన చేయండి మరియు మీకు మరియు మీ కుటుంబానికి ఏది ఉత్తమమైనదో దాని ఎంపిక చేయండి.