{{UI_help.isMobileView ? ' To visit our TPAs network hospitals ' : 'For the list of network hospitals associated with our TPAs, '}} Click here
Search By
{{hospitalInputs.searchMode}}
{{hospitalInputs.searchMode.toLowerCase() === 'city' ? hospitalInputs.city : hospitalInputs.searchMode.toLowerCase() === 'state' ? hospitalInputs.state : hospitalInputs.searchMode.toLowerCase() === 'pincode' ? hospitalInputs.pincode : ''}}
Hospital
{{hospitalInputs.hospitalName ? hospitalInputs.hospitalName : '---' }}
- {{filter.name}}
To visit our TPAs network hospitals Click here
{{data.hospitalName}}
{{data.primaryAddress}}
To visit our TPAs network hospitals Click here
డిజిట్'స్ క్యాషులెస్ నెట్వర్క్ హాస్పిటల్స్
క్యాష్‌లెస్ లేదా నెట్వర్క్ హాస్పిటల్ అంటే ఏమిటి?
నగదు రహిత లేదా నెట్వర్క్ ఆసుపత్రి అనేది మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ యొక్క నెట్‌వర్క్‌లో భాగమైన ఆసుపత్రి. దీని అర్థం మీరు మీ చికిత్స కోసం ఈ ఆసుపత్రులలో క్లయిమ్ చేస్తే, మీరు నగదు రహిత క్లయిమ్ ని ఎంచుకోవచ్చు, అంటే ముందుగా ఎటువంటి నగదు చెల్లించకుండానే మీ చికిత్సను తీసుకోవచ్చు.
మీరు నెట్వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు మరియు నగదు రహిత క్లయిమ్ లను ఎంచుకున్నప్పుడు, బిల్లుల చెల్లింపులు నేరుగా నెట్వర్క్ ఆసుపత్రి మరియు మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ మధ్య జరుగుతాయి.
డిజిట్ వద్ద, మేము 16400+ నెట్వర్క్ ఆసుపత్రుల నెట్వర్క్ని కలిగి ఉన్నాము, వీటిలో మీరు నగదు రహిత చికిత్సలను ఎంచుకోవచ్చు.
ప్రాధాన్యత లేని ఆసుపత్రుల జాబితాను యాక్సెస్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డిజిట్ నెట్వర్క్ హాస్పిటల్స్‌తో క్యాష్‌లెస్ క్లయిమ్ చేయడం ఎలా?
స్టెప్ 1: మీరు చికిత్స చేయించుకోవాలనుకుంటున్న నెట్వర్క్ ఆసుపత్రిని ఎంచుకోండి. మీరు పైన పేర్కొన్న పూర్తి డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ హాస్పిటల్ జాబితాను కనుగొనవచ్చు.
స్టెప్ 2: మీరు ఆసుపత్రిలో చేరడం/చికిత్స కోసం ప్లాన్ చేసినట్లయితే కనీసం 72 గంటల ముందుగానే మరియు అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలలోపు మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు (మాకు!) తెలియజేయండి.
స్టెప్ 3: నెట్వర్క్ హాస్పిటల్ హెల్ప్‌డెస్క్‌లో మీ ఇ-హెల్త్ కార్డ్‌ని చూపించండి మరియు నగదు రహిత రిక్వెస్ట్ ఫారమ్‌ను అడగండి. మీరు ఫారమ్‌ను పూరించిన తర్వాత మరియు అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత, మీ నగదు రహిత క్లయిమ్ ఆసుపత్రిలోనే ప్రాసెస్ చేయబడుతుంది.
చిట్కా: మీరు ఎంచుకునే చికిత్స మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడిందా లేదా మరియు ఎంత మేరకు కవర్ చేయబడిందా అనేది ఎల్లప్పుడూ తనిఖీ చేయండి ఇందువల్ల నగదు రహిత క్లయిమ్ ప్రక్రియలో చివరి నిమిషంలో ఆశ్చర్యాలు మరియు జాప్యాలు ఉండవు!
డిజిట్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా క్లయిమ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
నెట్వర్క్ హాస్పిటల్ ఎలా పని చేస్తుంది?
నెట్వర్క్ ఆసుపత్రులు సాధారణంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థతో టై-అప్ని కలిగి ఉంటాయి, దాని వల్ల నగదు రహిత క్లయిమ్ లను ఎంచుకునే ప్రయోజనం మీకు లభిస్తుంది.
దీనివల్ల అవసరమైన సమయాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఎందుకంటే మీరు కష్టతరమైన సమయంలో చెల్లింపుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
నగదు రహిత క్లయిమ్ ల విషయానికి వస్తే ప్రధానంగా నెట్వర్క్ ఆసుపత్రులు రెండు రకాలుగా పని చేస్తాయి; ప్రణాళికాబద్ధంగా ఆసుపత్రిలో చేరిన సందర్భంలో మరియు వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో.
ఎ) ప్రణాళికాబద్ధంగా ఆసుపత్రిలో చేరడం
మీరు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరవలసి ఉందని లేదా డేకేర్ ప్రక్రియ చేయించుకోవాల్సిన అవసరం ఉందనుకోండి మరియు దాని కోసం నిర్దిష్ట తేదీని మీరు మీ ఆసుపత్రిలో చేరేందుకు షెడ్యూల్ చేసారు.
ఈ సందర్భంలో, మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు కనీసం 72-గంటల ముందుగా తెలియజేయాలి, తద్వారా క్లయిమ్ ప్రాసెసింగ్ సకాలంలో ప్రారంభమవుతుంది మరియు మీరు సమయానికి అవసరమైన ఏవైనా ఆమోదాలను పొందవచ్చు.
దీని తరవాత, మీరు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చినప్పుడు, మీరు నెట్వర్క్ హాస్పిటల్ డెస్క్ వద్ద మీ ఇ-హెల్త్ కార్డ్‌ను చూపించి, మీ నగదు రహిత క్లయిమ్ ఫారమ్‌ను నింపాలి. అంతే మీరు చెయ్యాల్సింది.
ప్రణాళికాబద్ధమైన హాస్పిటలైజేషన్ విషయంలో, మీ చికిత్సలో జరిగే ఎలాంటి జాప్యాన్నైనా నివారించడానికి ముందుగానే ఫార్మాలిటీలు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడం మంచిది.
బి) మెడికల్ ఎమర్జెన్సీలు
కొన్నిసార్లు, మరియు దురదృష్టవశాత్తూ మనం అనుకోకుండా - వైద్య అత్యవసర పరిస్థితులు తలెత్తుతాయి! అలాంటి పరిస్థితిలో, ప్రణాళికాబద్ధంగా ఆసుపత్రిలో చేరడం అసాధ్యం, అయితే మీరు నెట్వర్క్ ఆసుపత్రిలో నగదు రహిత క్లయిమ్ ఎంచుకోవాలనుకుంటే 24-గంటలలోపు మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయాలి.
ఇది తప్ప మిగతా ప్రక్రియ అంతా మామూలుగానే ఉంటుంది మీరు మీ ఇ-హెల్త్ కార్డ్‌ని ప్రదర్శించాలి మరియు ఆసుపత్రిలో చేరిన సమయంలో అవసరమైన నగదు రహిత ఫారమ్‌ను పూరించాలి.
నేనుండే ప్రదేశం సమీపంలో నెట్వర్క్ హాస్పిటల్స్ లేకుంటే ఎలా క్లయిమ్ చేయాలి?
ఇది ఎప్పటికీ జరగదని మేము ఆశిస్తున్నాము, కానీ అలా జరిగితే - మీరు మీకు నచ్చిన ఏదైనా ఇతర ఆసుపత్రిలో చేరి రీయింబర్స్మెంట్ క్లయిమ్ ని ఎంచుకోవచ్చు. రీయింబర్స్మెంట్ క్లయిమ్ ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ ఇవ్వబడింది:
- స్టెప్ 1: ప్రణాళికాబద్ధంగా ఆసుపత్రిలో చేరినట్లయితే, మాకు 48 గంటల ముందుగా తెలియజేయండి లేదా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో - ఆసుపత్రిలో చేరిన తేదీ నుండి 48 గంటల వరకు మాకు తెలియజేయండి.
- స్టెప్ 2: ఆసుపత్రిలో చేరిన తర్వాత, మీరు డిశ్చార్జ్ అయిన తేదీ నుండి 30 రోజులలోపు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించండి లేదా అప్లోడ్ చేయండి. ప్రక్రియను త్వరగా మరియు సున్నితంగా చేయడానికి ఆలస్యం చేయకుండా, వీలైనంత త్వరగా పత్రాలను సమర్పించాలని ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడింది.
- స్టెప్ 3: మాకు అన్ని డాక్యుమెంట్లు అందిన తర్వాత, మేము క్లయిమ్ ను ప్రాసెస్ చేస్తాము మరియు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం - 30 రోజులలోపు అవసరమైన మరియు ఆమోదించబడిన క్లయిమ్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాము.
నగదు రహిత సౌకర్యం కోసం నెట్వర్క్ హాస్పిటల్స్
డిజిట్ వెబ్సైట్లో చూపబడిన ఎంప్యానెల్డ్ హాస్పిటల్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడవు, అప్డేట్ చేయబడిన సమాచారం కోసం దయచేసి దిగువ ఇవ్వబడిన TPA జాబితాలు మరియు సంబంధిత TPAలను తనిఖీ చేయండి. .
TPA పేరు |
రకం పాలసీ |
లింక్ |
మెడి అసిస్ట్ ఇన్సూరెన్స్ TPA ప్రైవేట్ లిమిటెడ్. |
రిటైల్ & గ్రూప్ |
|
పారామౌంట్ హెల్త్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ TPA ప్రైవేట్ లిమిటెడ్. |
గ్రూప్ |
|
హెల్త్ ఇండియా ఇన్సూరెన్స్ TPA సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
గ్రూప్ |
|
గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ TPA లిమిటెడ్ |
గ్రూప్ |
|
ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ TPD Ltd (FHPL) |
గ్రూప్ |
మేము కొన్ని ఆసుపత్రులతో నేరుగా టై-అప్ కూడా ఏర్పాటు చేసాము. మా TPAలతో మేము నిర్వహించే హాస్పిటల్ నెట్‌వర్క్‌కు ఇవి అదనం
మా కస్టమర్ ఎక్సపీరియెన్స్ ను మెరుగుపరచడంలో భాగంగా మరియు మా క్లయిమ్ ల ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడంలో భాగంగా, ప్రాధాన్యరహితమైనవిగా గుర్తించబడిన ఆసుపత్రుల జాబితా ఇక్కడ ఉంది. ఈ ఆసుపత్రుల నుండి చికిత్స/క్లయిమ్ ల అనుభవం ఆధారంగా ఇది తయారు చేయబడింది. ఈ ఆసుపత్రులలో పొందిన ఏదైనా ప్రణాళికాబద్ధమైన/ముందస్తు-ప్రణాళికతో చికిత్స కోసం కంపెనీ ఎలాంటి నగదు రహిత లేదా రీయింబర్స్మెంట్ క్లయిమ్ ను అందించే స్థితిలో ఉండమని దయచేసి గమనించండి. ఇది మోసం మరియు తప్పుగా సూచించే అంశాలను తగ్గించడానికి మరియు మేము నిజమైన క్లయిమ్ లను అందించగలమని నిర్ధారించడానికి ఉద్దేశించబడింది. అయితే, ఈ ఆసుపత్రులలో స్వీకరించబడిన అత్యవసర చికిత్సకు సంబంధించిన ఏదైనా క్లయిమ్ మెరిట్‌లపై పరిగణించబడుతుంది. అత్యవసర చికిత్స కోసం అటువంటి దావా విషయంలో క్లయిమ్ ను నిర్ణయించే ముందు పూర్తి పత్రాలను ధృవీకరించే హక్కు డిజిట్ కు ఉంది.
డిస్ క్లైమర్:
- నెట్వర్క్ హాస్పిటల్ జాబితా తాత్కాలికమైనది & ప్రొవైడర్ల సమీక్ష ఆధారంగా మార్పుకు లోబడి ఉంటుందని దయచేసి గమనించండి. తుది జాబితా కోసం, దయచేసి మా కాల్ సెంటర్‌ని 1800-258-4242లో సంప్రదించండి
- ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా ఆసుపత్రిని జోడించడానికి / తీసివేయడానికి డిజిట్ కు హక్కు ఉంది.
- డిజిట్ తన వినియోగదారులకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి కట్టుబడి ఉంది. అవసరమైన సమయంలో కస్టమర్ల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఆసుపత్రుల ఎంప్యానెల్మెంట్ జరిగిందని మేము తెలియజేయాలనుకుంటున్నాము.
- ఈ వెబ్సైట్లో ఉన్న సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. సమాచారం GoDigit General Insurance Co Ltd ద్వారా అందించబడింది మరియు మేము సమాచారాన్ని తాజాగా మరియు సరిగ్గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మేము సంపూర్ణత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, అనుకూలత లేదా లభ్యత గురించి స్పష్టంగా లేదా సూచన రూపంలో గాని, వెబ్సైట్ లేదా ఏదైనా ప్రయోజనం కోసం వెబ్సైట్లో ఉన్న సమాచారం, ఉత్పత్తులు, సేవలు లేదా సంబంధిత గ్రాఫిక్‌లకు సంబంధించి ఏ విధమైన ప్రాతినిధ్యాలు లేదా వారెంటీలు చేయము. అటువంటి సమాచారంపై మీరు ఉంచే ఏదైనా నమ్మకం ఖచ్చితంగా మీ స్వంత పూచీతో ఉంటుంది.
- ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం వల్ల అయ్యే డేటా నష్టం లేదా దాని వల్ల కలిగే లాభాలకు సంబంధించి ఎలాంటి పరిమితి లేకుండా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలిగే నష్టం లేదా హానికి మేము బాధ్యత వహించము.
ఎవరైనా డిజిట్ ఉద్యోగి లేదా ఏజెంట్లు లేదా మూడవ పక్షం ప్రాసెసింగ్ రుసుములను అడుగుతున్నట్లు ఆసుపత్రి గమనిస్తే, మీరు వెంటనే health.network@godigit.comకు ఫిర్యాదు చేయడం ద్వారా మా అవగాహనకు తీసుకురావాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము