కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అంటే ఏమిటి?
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న వైద్య ఖర్చులను చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యమైన (పనికొచ్చే) పెట్టుబడి. మీరు మరియు మీ ప్రియమైన వారు వైద్య ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని నిర్దారించుకునేందుకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమ మార్గం.
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సింగిల్ పాలసీ కింద అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అంటే మీరు వివిధ రకాల వైద్య ఖర్చులను కవర్ చేసేందుకు వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ వలే కాకుండా కాంప్రహెన్సివ్ పాలసీలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న అవయవ మార్పిడి చికిత్సలు మరియు ప్రత్యామ్నాయ చికిత్స పద్ధతులను కూడా కవర్ చేస్తాయి.
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ దేనిని కవర్ చేస్తుంది?
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు విస్తృతమైన కవరేజీని కలిగి ఉంటాయి. అంతే కాకుండా కింది వాటిని కూడా కలిగి ఉంటాయి:
- ఇన్ పేషంట్ హాస్పిటలైజేషన్ - 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉన్నపుడు అయ్యే ఖర్చులైన గది అద్దె, నర్సింగ్ చార్జెస్, ఆక్సిజన్, ఐసీయూ ఛార్జీలు మొదలయిన వాటిని ఇతర ఇన్సూరెన్స్ ప్లాన్ల వలే ఇవి కూడా కవర్ చేస్తాయి.
- ఆసుపత్రిలో చేరకముందు & డిశ్చార్జి తర్వాత - ఇవి మీరు ఆసుపత్రిలో చేరకముందు లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అయ్యే వైద్య ఖర్చులు. రోగనిర్దారణ పరీక్షలు, పరిశోధనాత్మక పద్ధతులు, ఫాలో అప్ టెస్ట్స్, వంటివి ఎన్నో రకాలు ఉంటాయి.
- డే కేర్ విధానాలు - 24 గంటల అడ్మిట్ కంటే తక్కువ సమయం అవసరం అయిన డే కేర్ మెడికల్ ట్రీట్మెంట్లుఇందులో కవర్ అవుతాయి. డయాలసిస్, కీమోథెరపీ, యాంజియోగ్రఫీ, రేడియోథెరపీ మొదలయినవి.
- ముందుగా ఉన్న వ్యాధులు - ఇది ముందుగా ఉన్న వ్యాధులకు కూడా కవర్ అందజేస్తుంది. మధుమేహం, హై బ్లడ్ ప్రెషర్, లేదా ఆస్తమా వంటి వ్యాధులకు 1-4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ అందిస్తుంది.
- దోమిసిలైరీ హాస్పిటలైజేషన్ - ఇది ఇంట్లో చికిత్స లేదా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ను కవర్ చేస్తుంది.
- అవయవదాత ఖర్చులు - అవయవ మార్పిడి సమయంలో అవయవ మార్పిడి కొరకు అయ్యే ఖర్చులను ఇది కవర్ చేస్తుంది.
- క్రిటికల్ ఇల్‌నెస్ ట్రీట్మెంట్ - క్లిష్టమైన అనారోగ్యాలైన క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, గుండె పోటు, స్ట్రోక్ మరియు పక్షవాతం వంటి వ్యాధులకు ఇది కవర్ అందజేస్తుంది.
- అంబులెన్స్ ఛార్జీలు - ఈ కవర్ ఎమర్జెన్సీ అంబులెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది.
- వార్షిక ఆరోగ్య తనిఖీలు - మీ శరీరంలో బయటపడకుండా ఉన్న వ్యాధులను గుర్తించేందుకు కాంప్లిమెంటరీ వార్షిక ఆరోగ్య తనిఖీలు సహాయపడతాయి.
- యాడ్ ఆన్ కవర్స్ - మీరు అధిక కవరేజీని ఎంచుకునే సౌలభ్యం యాడ్ ఆన్ కవర్స్‌తో లభిస్తుంది. అవేంటంటే:
- మెటర్నటీ & న్యూ బార్న్ బేబీ కవర్ - ప్రెగ్నెన్సీ మరియు చైల్డ్ బర్త్ కొరకు అయ్యే ఖర్చులు, అంతే కాకుండా నవజాత శిశువుకు అయ్యే ఖర్చులు కూడా వర్తిస్తాయి.
- ఆయుష్ ట్రీట్మెంట్ - ఆయర్వేద, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సలకు అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది.
- హాస్పిటల్ క్యాష్ కవర్ - ఆసుపత్రిలో చేరిన సమయంలో రోజూవారి నగదు ప్రయోజనం మీరు ఆసుపత్రి బిల్లుకు మించిన బిల్లును కవర్ చేసేందుకు ఉపయోగించొచ్చు.*
- జోన్ అప్‌గ్రేడ్ - ఈ యాడ్ కవర్ ద్వారా మీరు ఇండియాలోని వేర్వేరు సిటీ జోన్స్లో వైద్య ఖర్చులను లెక్కించవచ్చు.
గమనిక: డిజిట్ వద్ద కేవలం కన్య్సూమబుల్ కవర్ యాడ్ ఆన్ మాత్రమే అందుబాటులో ఉంది.
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎంచుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు వస్తాయి:
1. విస్తృతమైన కవరేజ్
కాంప్రహెన్సివ్ ప్లాన్లు అనేవి అన్ని రకాల ఆరోగ్య సమస్యలయిన అనుకోని ప్రమాదాలు, ఆసుపత్రి ఖర్చులు, డే కేర్ ప్రొసీజర్స్, ప్రాణాంతక జబ్బులకు చికిత్స, ఇంకా అనేక రకాల వ్యాధులకు చికిత్స అందించేలా ఎక్కువ రేంజ్ కవరేజ్ తో వస్తాయి.
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా ఎక్కువ సమ్ ఇన్సూర్డ్ (ఇన్సూరెన్స్ చేసిన మొత్తము) తో వస్తాయి. దీని వల్ల మీరు మీ వైద్య ఖర్చుల కొరకు మరింత కవరేజీని పొందొచ్చు.
2. వైద్య ఖర్చుల నుంచి భద్రత
విస్తృతమైన కవరేజ్ అంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వైద్య ఖర్చులలో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తాయి. బేసిక్ ప్లాన్ల కింద కవర్ కాని ఖర్చులైన ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్, ఇంట్లో చికిత్స, మందులు మొదలయినవి కవర్ అవుతాయి.
అంతే కాకుండా కాంప్రహెన్సివ్ ప్లాన్స్ రూం రెంట్ క్యాప్, ఎక్కువ ఐసీయూ రూం రెంట్ పరిమితి, మరియు విస్తృత అంబులెన్స్ కవరేజీని కలిగి ఉంటాయి.
3. అడిషనల్ కవరేజెస్
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో లేని అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇది రీఫిల్ (మళ్లీ తిరిగి భర్తీ చేసే విధంగా) సమ్ ఇన్సూర్డ్ (ఇన్సూరెన్స్ చేసిన మొత్తము) మీ SI (ఇన్సూరెన్స్ చేసిన మొత్తము) కనుక పాలసీ పీరియడ్ లో పూర్తిగా అయిపోతే అది తిరిగి భర్తీ చేయబడుతుంది. లేదా మీ పాలసీలో ఎటువంటి రూం రెంట్ క్యాపింగ్ ఉండదు. (అంటే గరిష్ట గది అద్దె పరిమితి లేదు).
4. క్యాష్ లెస్ క్లెయిమ్స్
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణంగా క్యాష్‌లెస్ క్లెయిమ్స్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. అంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మీ ఆసుపత్రి బిల్లుల గురించి నేరుగా నెట్‌వర్క్ ఆసుపత్రులతో చూసుకుంటాడు. మీరు మీ జేబు నుంచి ఎటువంటి డబ్బును చెల్లించాల్సిన అవసరం లేదని దీనర్థం. (ఏవైనా కోపేమెంట్స్ లేదా డిడక్టబుల్స్ మినహా).
5. క్యుములేటివ్ బోనస్
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు క్యుములేటివ్ బోనస్ ప్రయోజనంతో వస్తాయి. పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ చేయని వారు వారి ఇన్సూరెన్స్ చేసిన మొత్తములో పెరుగుదలను పొందుతారు. అందుకు మీ వద్ద నుంచి అదనపు ప్రీమియం వసూలు చేయబడదు.
6. లైఫ్ టైమ్ రెన్యూవబులిటీ (ఎప్పుడైనా పునరుద్ధరించుకునే అవకాశం)
కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది లైఫ్ టైమ్ రెన్యూవబులిటీని అందిస్తుంది. కావున మీరు మీ ప్రీమియం చెల్లించినంత కాలం మీ వయసుతో సంబంధం లేకుండా ప్లాన్ ప్రయోజనాలు పొందొచ్చు.
7. పన్ను ప్రయోజనాలు
మీరు మీ కోసం లేదా మీ కుటుంబ సభ్యుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద మీరు పన్ను ప్రయోజనాలను పొందుతారు.
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసేముందు పరిగణించాల్సిన విషయాలు
- అన్ని కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇలా పిలవబడవు. కొన్నింటికి డిజిట్ కంఫర్ట్ ఆప్షన్ వంటి ఇతర పేర్లు ఉండొచ్చు.
- ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను వాటి కవరేజ్ మరియు బెనిఫిట్స్ ఆధారంగా మీకు సరిగ్గా సరిపోయే ప్లాన్ ను ఎంచుకోండి.
- మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏం కవర్ అవుతాయో మరియు ఏం కవర్ కావో అని తెలుసుకునేందుకు నియమ నిబంధనలను చదవాలని గుర్తుంచుకోండి.
- మీ ఆరోగ్య సంరక్షణ అవసరాలు మరియు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎంతమందిని కవర్ చేస్తున్నారనే దానిని బట్టి సమ్ ఇన్సూర్డ్ (ఇన్సూరెన్స్ చేసిన మొత్తము) ఎంచుకోండి.
- మీ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద ఎటువంటి క్లిష్టమైన సమాచారం లేదా వైద్య చరిత్రను దాచొద్దు.
- మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను మెరుగైన యాడ్ ఆన్స్ తో మీరు కస్టమైజ్ (అనుకూలీకరించడం) చేసుకోవచ్చు.
- జీవితంలో ప్రారంభంలోనే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం ద్వారా మీరు తక్కువ మొత్తానికి వచ్చే ప్రీమియంలను పొందడమే కాక మీ వెయిటింగ్ పీరియడ్స్ కూడా తొందరగా పూర్తవుతాయి.
- అందించే సేవల గురించి మరింత తెలుసుకునేందుకు కంపెనీకి కస్టమర్స్ ఇచ్చే రివ్యూలు చదవండి.
- ఇన్సూరెన్స్ కంపెనీలు అదనపు ప్రయోజనాలైన యాడ్ ఆన్స్, 24x7 సపోర్ట్ వంటి మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయో లేదో చూడాలి.
చివరగా
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం అనేది మీ అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటి. ఇది మీకు ఆల్‌రౌండ్ ప్రొటెక్షన్ ను అందిస్తుంది. కావున మీరు ప్రతి కవర్ విడిగా కొనకుండా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇది మీ పొదుపులను రక్షించడంలో సహాయపడుతుంది. మరియు ఆసుపత్రి బిల్స్ గురించి చింతించకుండా బెస్ట్ చికిత్సను పొందేలా చేస్తుంది.
వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ , ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రపోజల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ఎన్నో రకాల ఆరోగ్య పాలసీలు నేడు అందుబాటులో ఉన్నాయి. కావున మీకు మరియు మీ కుటుంబ అవసరాలకు సూటయ్యే సరైన ప్లాన్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
అసలు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది హాస్పిటలైజేషన్ ఖర్చులు, అంబులెన్స్ ఖర్చులు, డే కేర్ ప్రొసీజర్స్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్, క్లిష్ట అనారోగ్యం, నెట్‌వర్క్ ఆసుపత్రులలో క్యాష్‌లెస్ చికిత్స, ప్రత్యామ్నాయ చికిత్స పద్ధతులు, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్, నిర్దిష్ట నిరీక్షణ కాలం తర్వాత ముందుగా ఉన్న వ్యాధులకు కూడా కవరేజీ వంటి విస్తృతమైన హెల్త్ కేర్ కవరేజ్ కలిగి ఉంటుంది.
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య తేడా ఏమిటి?
ఈ రెండు రకాల ప్లాన్స్ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక ఆసుపత్రి ఖర్చులకు కవరేజీని అందిస్తాయి. అయితే సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కొన్ని రకాల చికిత్సలను కవర్ చేయకపోవచ్చు. లేదా వాటికి పరిమితులు ఉండవచ్చు. ఇది వరకే మీరు తెలుసుకున్న విధంగా కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది విస్తృతమైన కవరేజీని కలిగి ఉంటుంది.