మీరు ఒక స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేశారనుకుందాం. ఈ ప్లాన్ వలన మీరు అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షించబడతారని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, కొన్ని అవసరాలను స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేయలేదు.
అవేంటి? మరెలా?
అటువంటి సమయంలోనే రైడర్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
మీరు ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే మీరు తప్పకుండా రైడర్స్ లేదా యాడ్–ఆన్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇవి మీకు ఏ విధంగా సాయపడతాయో తెలుసుకోండి.
ఈ రైడర్స్ వలన మీకు అదనపు ప్రయోజనాలు సమకూరుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోని ప్రస్తుత ఫీచర్లలాగే ఉంటాయి. ఇవి వేరుగా యాడ్ అవుతాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యాడ్-ఆన్స్ లేదా రైడర్లు మీ ప్రస్తుత హెల్త్ పాలసీకి అదనపు ప్రయోజనాలను సమకూర్చడానికి ఉపయోగపడతాయి.
Insurance Regulatory and Development Authority of India (IRDAI) ప్రకారం, అన్ని రైడర్స్ లేదా యాడ్–ఆన్స్ ప్రీమియంలు అసలు పాలసీ ప్రీమియంలో 30 శాతానికి మించకూడదు. కాబట్టి హెల్త్ పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక family floater health insurance పాలసీని తీసుకోవాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. ఆ పాలసీ సంవత్సరానికి రూ. 5000 ప్రీమియంతో ఉందని అనుకుంటే, మీరు తీసుకునే యాడ్–ఆన్స్ ఆ పాలసీ ప్రీమియంలో 30% మాత్రమే ఉండాలి. అప్పుడు మీ యాడ్–ఆన్స్ ఖరీదు రూ. 1500 లకు మించకూడదు. (5000 x 30%) ఈ విధంగా IRDAI నిబంధన విధించింది.
వివిధ రకాల యాడ్ ఆన్స్ గురించి కింద వివరంగా ఇవ్వబడింది.
హెల్త్ ఇన్సూరెన్స్ యాడ్–ఆన్ |
ఏమేమి కవర్ చేస్తుంది? |
రూమ్ రెంట్ మాఫీ |
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ రైడర్ వలన మీరు ఎప్పుడైనా ఆస్పత్రి పాలైనపుడు రూమ్ రెంట్ చార్జీల లిమిట్‌ను పెంచుకునే అవకాశం ఉంటుంది. మీకు రూమ్ రెంట్ చార్జీలకు ఎటువంటి లిమిట్ ఉండదు. |
మెటర్నటీ కవర్ |
ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టినప్పుడు అయ్యే అన్ని ఖర్చులను ఈ రైడర్ కవర్ చేస్తుంది. |
హాస్పిటల్ క్యాష్ కవర్ |
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ ఆస్పత్రి పాలైనప్పుడు రోజూవారీగా చార్జీలను చెల్లించే పాలసీ ఇది. |
క్రిటికల్ ఇల్నెస్ కవర్ |
ఎవరైనా పాలసీహోల్డర్ క్యాన్సర్, గుండె జబ్బుల సమస్యలతో అధిక ఖర్చులకు గురైనపుడు ఈ యాడ్-ఆన్ మిమ్మల్ని ఖర్చుల నుంచి కవర్ చేస్తుంది. |
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
ఈ యాడ్-ఆన్ మీకు అన్ని రకాల ప్రమాద గాయాలు, అనుకోకుండా సంభవించే అంగవైకల్యం వంటి వాటి నుంచి కాపాడుతుంది. పక్షవాతం లేదా మరణం సంభవించినా కూడా కవర్ చేస్తుంది. |
జోన్ అప్‌గ్రేడ్ |
ఈ యాడ్-ఆన్ పాలసీ హోల్డర్‌కు అదనపు ఆర్థిక భరోసాను అందజేస్తుంది. అతడు/ఆమె ఏ జబ్బుకు చికిత్స తీసుకున్నారనే విషయం మీద మనకు అందే ఆర్థిక సాయం ఆధారపడి ఉంటుంది. |
ఆయుష్ ట్రీట్మెంట్ కవర్ |
ఈ యాడ్-ఆన్ కవర్ వలన పాలసీ హోల్డర్ కేవలం ఆస్పత్రిలోనే కాకుండా వేరే విధానాల్లో కూడా చికిత్స తీసుకునే సౌలభ్యం ఉంటుంది. (ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి మొదలగునవి). |
స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఆసుపత్రి రూమ్ రెంట్ చార్జీలనేవి ముందే ఒక లిమిట్ వరకు నిర్ణయించబడతాయి. కానీ రూమ్ రెంట్ వేవర్ యాడ్–ఆన్‌తో రూమ్ రెంట్ చార్జీల లిమిట్ పెంచబడుతుంది. అలాగే, తర్వాత ఎలాంటి లిమిట్స్ ఉండవు.
ఒకవేళ మీరు మెట్రోపాలిటన్ నగరాల్లోని ఆస్పత్రులలో చేరితే, ఈ రైడర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెట్రోపాలిటన్ నగరాల్లోని ఆస్పత్రులలో గదుల అద్దెలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి, ఈ రైడర్ తీసుకోవడం చాలా అవసరం.
మీరు ప్రస్తుతం తీసుకున్న పాలసీలో రూమ్ రెంట్ చార్జీ ఒక రాత్రికి రూ. 1500 గా ఉందని అనుకోండి. కానీ, మీరు చేరాలని భావిస్తున్న ఆస్పత్రిలో రూమ్ రెంట్ చార్జీ అంతకంటే ఎక్కువగా ఉంది. అటువంటి సందర్భంలో మీకు ఈ రైడర్ ఉంటే మీ రూమ్ రెంట్ చార్జీ రాత్రికి 4000 రూపాయల వరకు పెంచుకునేందుకు సహాయపడుతుంది.
మెటర్నిటీ కవర్ (maternity cover) పాలసీని తీసుకోవడం వలన మీరు ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టినప్పుడు అయ్యే ఖర్చుల నుంచి మినహాయింపు పొందొచ్చు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బిడ్డ పుట్టినప్పటి నుంచి 3 నెలల వరకు ఈ కవరేజీని అందిస్తున్నాయి.
ఈ యాడ్–ఆన్ లేదా రైడర్ వలన మీరు ఆస్పత్రిలో చేరిన తర్వాత రోజువారీ క్యాష్ అలవెన్స్‌ను పొందే అవకాశం ఉంటుంది. కానీ, ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక షరతును విధిస్తాయి. ఆస్పత్రిలో చేరి 24 గంటల కంటే ఎక్కువ సేపు అడ్మిట్ అయి ఉంటేనే ఈ కవర్ వర్తిస్తుంది. అప్పుడే మీకు వైద్య ఖర్చుల కోసం డబ్బు ఇస్తాయి.
ఇలా పరిహారంగా వచ్చిన డబ్బులను మీరు ఆహారం లేదా ప్రయాణ ఖర్చులకు వాడుకోవచ్చు.
ఈ యాడ్–ఆన్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ (తీవ్రమైన అనారోగ్యం) వచ్చిందని నిర్ధారణ అయినపుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏక మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ మొత్తాన్ని అందజేస్తాయి.
ఉదాహరణకు, మీరు రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారని అనుకుందాం. అంతేకాకుండా, మీరు క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను కూడా తీసుకుంటే మీకు ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మీ పాలసీని క్లెయిమ్ చేసుకుంటే మీకు ఏకమొత్తంలో క్రిటికల్ ఇల్నెస్ కింద రూ. 15 లక్షలు వస్తాయి. మీ చికిత్స ఖర్చు మీకు వచ్చిన ఇన్సూరెన్స్ మొత్తం కంటే తక్కువే అవుతుంది.
ఒకవేళ మీకు క్యాన్సర్ సోకిందనుకోండి. అప్పుడు మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీతో క్లెయిమ్ చేస్తే అప్పటికే మీ చికిత్సకు రూ. 9.5 లక్షలు అయినప్పటికి కూడా ఆ కంపెనీ మీకు ఏకమొత్తంలో రూ. 15 లక్షలు చెల్లిస్తుంది.
యాక్సిడెంటల్ డ్యామేజ్ల వలన పాలసీ హోల్డర్ ఇబ్బంది పడినపుడు ఈ యాడ్–ఆన్ ఫైనాన్షియల్ కవరేజ్‌ను అందిస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్‌కు పాక్షిక అంగవైకల్యం వచ్చినా, శాశ్వత అంగవైకల్యం వచ్చినా, లేదా పాలసీ హోల్డర్ చనిపోయినా కూడా ఇది వర్తిస్తుంది.
పాలసీ హోల్డర్ ఒక వేళ యాక్సిడెంట్లో చనిపోతే అతని కుటుంబం ఈ యాడ్–ఆన్ ద్వారా ఏకమొత్తంలో అమౌంట్‌ను అందుకుంటుంది.
జోన్ అప్‌గ్రేడ్ వలన కొన్ని పట్టణాల్లో మీరు ఎక్కువ ఫైనాన్షియల్ కవరేజీని పొందుతారు. ఆ పట్టణాల్లో ఉన్న మెడికల్ ఖర్చులను బట్టి ఈ జోన్ల నిర్ణయించబడుతాయి. ఒక ప్రాంతంలో ఎంత ఎక్కువ ఖర్చులు ఉంటే, ఆ ప్రాంతం అంత ఉన్నత జోన్లో ఉంటుంది.
ఈ యాడ్–ఆన్ వలన మీరు ఎక్కువ చికిత్స ఖర్చులను ఈజీగా లెక్కించవచ్చు. అంతేకాకుండా, ఈ యాడ్–ఆన్ వలన మీ మొత్తం ప్రీమియంలో 10 నుంచి 20 శాతం వరకు తగ్గింపును కూడా పొందుతారు.
భారతదేశంలోని వివిధ జోన్లు:
ప్రస్తుతం డిజిట్లో రెండు రకాల జోన్స్ ఉన్నాయి: జోన్ A (గ్రేటర్ హైదరాబాద్, ఢిల్లీ NCR, గ్రేటర్ ముంబై) మరియు జోన్ B (ఇతర అన్ని ప్రదేశాలు). మీరు కనుక జోన్ Bలో ఉంటే మీకు ప్రీమియం మీద అదనపు డిస్కౌంట్ అందుతుంది. కేవలం అది మాత్రమే కాదు. మా వద్ద ఎటువంటి జోన్ బేస్డ్ కో పేమెంట్స్ లేవు.
దీనిలో భాగంగా 60 సంవత్సరాల పైనున్న వ్యక్తులు ఆయుర్వేదం, యునాని, యోగా, సిద్ధ, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు ఆర్థిక కవరేజీని పొందవచ్చు.
ఈ కవర్ కేవలం 60 సంవత్సరాలకు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తుంది.
నిరాకరణ: యాడ్ ఆన్స్ అనేవి వివిధ రకాల బీమా కంపెనీలలో వివిధ రకాలుగా ఉంటాయి. యాడ్ ఆన్స్ గురించి పూర్తి సమాచారం కొరకు.. మీ బీమా సంస్థను సంప్రదించండి.