రిటైర్మెంట్ ప్లానింగ్ కాలిక్యులేటర్
వయసు
రిటైర్మెంట్ సమయంలో వయసు
వార్షిక ఆదాయం
ఆదాయ వృద్ధి రేటు
ప్రస్తుత పెట్టుబడి
ప్రస్తుత పెట్టుబడి (ఏడాదికి)
అంచనా వేసిన పెన్షన్ (ఏడాదికి)
అసలు రిటైర్మెంట్ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?
మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న జీవనశైలి (లైఫ్ స్టైల్) ను కొనసాగించేందుకు రిటైర్మెంట్ తర్వాత ఎంత మొత్తం డబ్బు అవసరం అవుతుందో ఆన్ లైన్ రిటైర్మెంట్ కాలిక్యులేటర్ లెక్కిస్తుంది. గణనలు అనేవి రిటైర్మెంట్ కాలం మరియు ఆశించిన ద్రవ్యోల్బణం అనే అంశాలపై ఆధారపడి ఉంటాయి.
ఈ కాలిక్యులేటర్ పనితీరును వివరంగా పరిశీలిద్దాం.
రిటైర్మెంట్ కాలిక్యులేటర్ ఫార్ములా ఏమిటి?
రిటైర్మెంట్ ప్లానింగ్ కాలిక్యులేటర్ అనేది ఈ కింది ఫార్ములా ఆధారంగా పని చేస్తుంది:
FV = PV (1+r) ^n.
ఇండియాలో రిటైర్మెంట్ కాలిక్యులేటర్ ను ఉపయోగించే ముందు కింది పట్టికలో ఉన్న అన్ని పారామీటర్స్ ను అర్థం చేసుకోండి.
ఫార్ములా |
పారామీటర్స్ |
FV = PV (1+r)^n |
భవిష్యత్ విలువ (FV), ప్రస్తుత విలువ (PV), ఆశించిన ద్రవ్యోల్బణం (r), రిటైర్మెంట్ వయసు (n) |
రిటైర్మెంట్ ప్లానింగ్ కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది?
రిటైర్మెంట్ ప్లానింగ్ కాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే ఉదాహరణ ఇక్కడ ఉంది.
ఈ పట్టిక మీ పరిస్థితిను వివరిస్తుంది-
పారామితులు (పారామీటర్స్) |
డేటా |
ప్రస్తుత వయసు |
35 సంవత్సరాలు |
రిటైర్మెంట్ వయసు |
60 సంవత్సరాలు |
రిటైర్మెంట్ తర్వాత అవసరమైన నెలవారీ ఆదాయం |
₹35,000 |
ఆయుర్ధాయం (లైఫ్ స్పాన్) |
80 |
ద్రవ్యోల్బణం |
6 శాతం |
మీరు మీ రిటైర్మెంట్ కార్పస్ ను 8 శాతం వడ్డీ వచ్చే బ్యాంక్ FDలో పెట్టుబడి పెట్టలని అనుకుంటున్నారని అనుకుందాం.
ఇప్పటికే ఉన్న ఫార్ములా ప్రకారం FV = PV (1+r) ^n,
FV |
కావాల్సిన సంవత్సర ఆదాయం |
₹35,000 (1+0.06)^25 = ₹1,50,215.5 |
₹150215.5 x 12 = ₹18,02,586 |
FD దిగుబడి |
ద్రవ్యోల్బణం |
ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన రాబడి రేటు |
8 శాతం |
6 శాతం |
(1+0.08)/(1+0.06) - 1 = 0.001575 |
ఇక్కడ ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన రాబడి రేటు 0.001575 అవుతుంది.
రిటైర్మెంట్ కాలం నెలల్లో |
PMT |
12x20 = 240 |
₹18,02,586/12 = ₹1,50,215 |
ఇప్పుడు మీరు PV ఫంక్షన్ ను ఉపయోగించి ఎక్సెల్ కాలిక్యులేటర్ లో మీ రిటైర్మెంట్ కార్పస్ ను లెక్కించవచ్చు.
దిగువ పట్టికలో చూపిన విధంగా రిటైర్మెంట్ కాలిక్యులేటర్ లో ఈ కింది వాటిని ఎంచుకోండి.
PMT |
1,50,215 |
ఎన్పీఈఆర్ |
240 నెలలు |
రకం |
1 |
రిటైర్మెంట్ కార్పస్ (నిధి) |
₹3,00,48,832 |
కావున మీరు రూ. 3,00,48,832 రిటైర్మెంట్ కార్పస్ పొందేందుకు కావాల్సిన వార్షిక ఆదాయం రూ. 18,02,586.
సింపుల్ గా చెప్పాలంటే 20 సంవత్సరాలకు మీరు రూ. 18,02,586 సంవత్సర ఆదాయం పొందాలంటే మీరు 60వ సంవత్సరంలో 8 శాతం రాబడి రేటు (రిటర్న్ రేట్) తో రూ. 3,00,48,832 పెట్టుబడి పెట్టాలి.
రిటైర్మెంట్ ప్లానింగ్ కాలిక్యులేటర్ ను ఎలా ఉపయోగించాలి?
ఫార్ములా ఉపయోగించి లెక్కించడం కంటే కాలిక్యులేటర్ ను ఉపయోగించి లెక్కింపు చేయడం చాలా సులభం. అందుకు మీరు కింద పేర్కొన్న స్టెప్స్ ను ఫాలో అయితే సరిపోతుంది.
- స్టెప్ 1: స్లైడింగ్ బటన్ ను ఉపయోగించి 18-50 మధ్య ఉన్న మీ సరైన వయసుని నమోదు చేయండి. అంతే కాకుండా ఇచ్చిన బాక్స్ లో డైరెక్ట్ గా మీ వయసును కూడా టైప్ చేయొచ్చు.
- స్టెప్ 2: మీరు ఎన్ని సంవత్సరాలకు రిటైర్మెంట్ కావాలని అనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. ఇందుకు కూడా ఫస్ట్ స్టెప్ లాగానే స్లైడర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 40-70 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. మీకు కావాలనుంటే రిటైర్మెంట్ వయసుని డైరెక్ట్ గా కూడా ఎంటర్ చేయొచ్చు.
- స్టెప్ 3: మీరు మీ వార్షిక ఆదాయాన్ని అందించాలి. స్క్రోల్ బటన్ లో ₹ 10,000 నుంచి ₹ 1 కోటి వరకు వార్షిక ఆదాయం ఉంటుంది. మీరు అందులోంచి ఎన్నుకోవచ్చు.
- స్టెప్ 4: రాబోయే సంవత్సరాలలో మీ ఆదాయ వృద్ధి ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో ఎంచుకోవడమే ఈ స్టెప్.
- స్టెప్ 5: మీ ప్రస్తుత పెట్టుబడులు పునరావృతం అవుతున్నాయా, లేక స్తబ్దుగా ఉన్నాయా అని తెలుసుకుని మీరు సంవత్సరంలో ఎంత పెట్టుబడి పెడతారో అందించాలి.
- స్టెప్ 6: రిటైర్మెంట్ తర్వాత మీకు సంవత్సరానికి ఎంత పెన్షన్ కావాలని అనుకుంటున్నారో ఎంచుకోవాలి.
- స్టెప్ 7: మీరు చివరగా మీరు ఇచ్చిన కాలానికి ద్రవ్యోల్బణాన్ని ఎంచుకోవాలి. ఇది డీఫాల్ట్‌గా 6 శాతం వద్ద ఉంటుంది.
- స్టెప్ 8: మీరు మీ లైఫ్ స్టైల్ ను మెయింటేన్ చేసేందుకు కావాల్సిన ఫండ్స్ గురించి తనిఖీ చేసుకోండి. మరియు దాని ప్రకారంగా మీ రిటైర్మెంట్ ను ప్లాన్ చేసుకోండి.
రిటైర్మెంట్ ప్లానింగ్ కాలిక్యులేటర్ వల్ల లాభాలు ఏమిటి?
ఆన్ లైన్ రిటైర్మెంట్ కాలిక్యులేటర్ తో అనేక లాభాలు ఉన్నాయి. ఇది మీకు కింది వాటికి సహాయం చేస్తుంది -
- మీ వృత్తి జీవితానికి రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు పెద్ద కార్పస్ మీకు అందేందుకు మీరు నెలవారీగా ఎంత పొదుపు చేయాలో లెక్కించండి.
- మీరు లెక్కలోకి తీసుకోవాల్సిన పెట్టుబడి అవకాశాలేంటో నిర్ణయించండి.
- వివిధ రకాల రిటైర్మెంట్ ఆప్షన్స్ మరియు ప్లాన్స్ ను కంపేర్ చేయండి.
- కొన్ని సాధారణ క్లిక్స్తో మీ సమయాన్ని ఆదా చేసుకోండి.
మీరు మీ రిటైర్మెంట్ కాలిక్యులేటర్ యొక్క పని విధానం, వాడకం మరియు ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. మీ భవిష్యత్ ఆర్థికంగా సురక్షితంగా ఉండేందుకు మీరు దీనిలో ఒకదానిని ఉపయోగించే సమయం ఆసన్నమైంది!