బైక్‌కు క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ గురించి సవివరంగా..
మన దేశ జనాభా 133 కోట్లు దాటిపోయింది. ఇక్కడ భారీ అనేది ఒక పదం మాత్రమే అయిపోయింది. ఈ జనాభా వివిధ సామాజిక వర్గాల నుంచి వస్తోంది.
దేశ జనాభా ఏ విధంగా పెరిగిపోయిందో మనం రోడ్ల మీద చూడొచ్చు. విపరీతమైన ట్రాఫిక్‌ను చూసినపుడు మనకు దేశ జనాభా పెరుగుదల గురించి స్పష్టత వస్తుంది. మనకు రోడ్ల మీద ఎక్కువగా ద్విచక్రవాహనాలే కనిపిస్తున్నాయి. ఇవి విపరీతంగా పెరిగిపోవడానికి గల ముఖ్య కారణం వీటి ధర చాలా తక్కువ, వీటిని మెయింటెన్ చేయడం, డ్రైవింగ్ చేయడం చాలా సులభం కావడం.
మోటార్ వాహనాల చట్టం-1988 ప్రకారం టూ వీలర్‌కు కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కొనుగోలు చేయడం తప్పనిసరి. భారతదేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలు రెండు రకాల మోటార్ వెహికిల్ ఇన్సూరెన్స్‌లను అందిస్తున్నాయి. అవి ఒకటి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కాగా, మరొకటి థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్.
మీకు ఏదైనా వాహనం ఉండి మీ అవసరాల కోసం దానిని రోడ్డు మీద ఉపయోగించినట్లయితే ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం మీ కనీస బాధ్యత.
అసలు క్యాష్‌లెస్ బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ప్రమాదం జరిగిన తర్వాత డ్యామేజ్ అయిన బండిని ఏ గ్యారేజీలో రిపేర్ చేయించాలని ఆలోచిస్తారు. మీకు కనుక క్యాష్‌లెస్ బైక్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటే మీ బండి రిపేర్ ఖర్చుల కోసం మీరు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అన్ని ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
క్యాష్‌లెస్ బైక్ ఇన్సూరెన్స్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకునేముందు మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి తెలుసుకుందాం.
కాంప్రహెన్సివ్ పాలసీ: మీరు కాంప్రహెన్సివ్ పాలసీని ఎన్నుకుంటే ఇది మీ సొంత వాహనానికి అయిన నష్టాలను కూడా భర్తీ చేస్తుంది. మీ సొంత వాహనం, థర్డ్ పార్టీ వాహనాన్ని కవర్ చేసే ఈ పాలసీని కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అని పిలుస్తారు. ఇది కేవలం యాక్సిడెంట్ అయినపుడు మాత్రమే కాకుండా అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, దొంగతనాల వంటి వాటి నుంచి కూడా మీ బైక్‌ను సంరక్షిస్తుంది.
థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ: థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది కేవలం థర్డ్ పార్టీ వ్యక్తులను మాత్రమే సంరక్షిస్తుంది. థర్డ్ పార్టీ వ్యక్తులు లేదా ప్రాపర్టీలకు జరిగిన నష్టాన్ని ఇది కవర్ చేస్తుంది. ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి తప్పు చేస్తే లీగల్ ఖర్చులు, మెడికల్ ఖర్చులను చెల్లించాల్సి ఉంటుంది.
చెక్: థర్డ్ పార్టీ లేదా కాంప్రహెన్సివ్ పాలసీ ప్రీమియంను లెక్కించడానికి బైక్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించండి.
క్యాష్‌లెస్ బైక్ ఇన్సూరెన్స్ గురించి స్పష్టమైన వివరణ
క్యాష్‌లెస్ క్లెయిమ్స్ ఎలా సెటిల్ చేయబడతాయని మీకు సందేహం ఉండొచ్చు. క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకుంటే.. అద్భుతంగా సర్వీసును అందజేసే గ్యారేజీలతో ఇన్సూరెన్స్ కంపెనీ పొత్తు పెట్టుకుంటుంది. ఎవరైనా పాలసీదారుడి బండికి డ్యామేజ్ అయినపుడు క్యాష్‌లెస్ క్లెయిమ్ కోసం చూస్తే నెట్వర్క్ గ్యారేజీకి వెళ్తాడు. అక్కడ అతడి వాహనాన్ని పూర్తిగా మరమ్మతు చేస్తారు. అప్పుడు గ్యారేజీ వ్యక్తి వాహన మరమ్మతుకు అయిన బిల్లులను సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి పంపుతుంది. మీరు ముందుగానే డ్యామేజ్‌ను గురించిన వివరాలను ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేస్తారు. గ్యారేజ్ వ్యక్తి కూడా తెలిపిన తర్వాత వెరిఫికేషన్ చేసి మీ పాలసీలో పేర్కొన్న విధంగా పేమెంట్‌ను వారికి సెటిల్ చేస్తారు.
క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలి?
మీరు డిజిట్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లైతే క్యాష్‌లెస్ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేయాలో కింద వివరంగా ఉంది.
స్టెప్1: ఇన్సూరెన్స్ కంపెనీకి ఆన్లైన్ ద్వారా కానీ అప్లికేషన్ ద్వారా కానీ తెలియజేయండి.
స్టెప్ 2: 1800-258-5956 నెంబర్‌కు కాల్ చేయండి. అప్పుడు మీ మొబైల్ నెంబర్‌కు ఒక లింక్ వస్తుంది.
స్టెప్3: ఆ లింక్‌ను ఓపెన్ చేసి మీ బైక్ యొక్క డ్యామేజీకి సంబంధించిన ఫొటోలను, వివరాలను మాకు పంపించండి.
స్టెప్ 4: ఏదైనా నెట్వర్క్ గ్యారేజ్‌కు మీ బండిని తీసుకెళ్లండి. గ్యారేజ్ వ్యక్తి మీ బండి మరమ్మతు కోసం అయిన బిల్లులను ఇన్సూరెన్స్ కంపెనీకి పంపుతాడు.
స్టెప్5: ఇలా కాకుంటే మీరు డిజిట్ కంపెనీకి రీయింబర్స్మెంట్ కోసం కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
క్యాష్‌లెస్ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం అవసరమైన పత్రాలు
డిజిట్ వద్ద ఇన్సూరెన్స్ చేసేటపుడు ఎటువంటి పత్రాలు అవసరం లేదు. అన్ని క్లెయిమ్స్ స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్లోనే పూర్తి చేయబడతాయి. ఈ విధానం చాలా సులభంగా, పేపర్‌లెస్‌గా ఉంటుంది.
క్యాష్‌లెస్ బైక్ ఇన్సూరెన్స్ గురించి కొన్ని విషయాలు..
మీరు క్యాష్‌లెస్ బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ వాహనం డ్యామేజ్ అయినపుడు జరిగిన అన్ని డ్యామేజీలకు ఖర్చులను కంపెనీయే భరిస్తుంది. బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
- క్యాష్‌లెస్ సౌలభ్యాన్ని అందజేసే లిస్టులో ఉన్న గ్యారేజీని కనుక్కోవడం ఒక్కోసారి క్లిష్టం కావొచ్చు. అటువంటి సందర్భంలో మీ బండిని సొంత ఖర్చులతో రిపేర్ చేయించుకుని అందుకు అయిన మొత్తాన్ని బిల్లుల రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేస్తే సరిపోతుంది. వారు మీకు అయిన ఖర్చులను రీయింబర్స్ చేస్తారు.
- ఇన్సూరెన్స్‌లో బైక్ యొక్క అన్ని భాగాలు కవర్ కావు. మీరు రిపేర్ చేయించుకునేటపుడు ఏయే భాగాలు కవర్ కావనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఏ భాగాలు అయితే ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయో వాటికే కంపెనీ క్లెయిమ్‌ను సెటిల్ చేస్తుంది.
క్యాష్‌లెస్ బైక్ ఇన్సూరెన్స్ సౌలభ్యాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మీ సౌలభ్యం కోసం అందజేశాయి. మీరు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునే ముందు వివిధ పాలసీలను సరిపోల్చినట్లయితే ఈ సౌలభ్యం చాలా బాగుంటుంది.
డిజిట్ అందించే క్యాష్‌లెస్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీ బైక్ ఇన్సూరెన్స్ అతి సులభమైన క్లెయిమ్ ప్రక్రియ ద్వారా మాత్రమే కాదు, క్యాష్‌లెస్ సెటిల్మెంట్ ఆప్షన్‌తో కూడా వస్తుంది.