ఆన్లైన్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350/500 ఇన్సూరెన్స్ ధర & పాలసీ రెన్యువల్
ఎన్ఫీల్డ్ క్లాసిక్‌పై షికారు చేయాలనుకుంటున్నారా? అయితే, మీ మోటార్ సైకిల్‌ను బయటకు తీసుకెళ్ళే ముందు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం గురించి ఆలోచించారా? మీకు అత్యధికంగా ప్రయోజనాలను అందించే టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ఫీచర్లను పరిశీలించండి.
రాయల్ ఎన్ఫీల్డ్ అనేది బ్రిటీష్ మోటార్ సైకిల్ కంపెనీ. ఇది 20వ శతాబ్దంలో ముఖ్యంగా రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఇంగ్లీష్ సాయుధ దళాలకు ఈ మోటార్ సైకిళ్లను అందించారు.
2వ ప్రపంచ యుద్ధం సమయంలో అందించిన సేవలకు గుర్తుగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్‌ని కంపెనీ తయారు చేసింది. ఇది నాటి యుద్ధానికి గుర్తుగా మాత్రమే కాకుండా; రైడింగ్‌కి అనువుగా, ఆ కాలపు సాంప్రదాయ ఆలోచనలకు తగ్గట్టుగా రూపొందించారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, బుల్లెట్ ప్రస్తుత మెయిన్ ఫ్రేమ్‌ను రూపొందించారు.
అన్ని ఇతర రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్‌ల మాదిరిగానే, క్లాసిక్ కూడా భారతదేశంలో తయారు చేయబడిన మోటార్ సైకిళ్లలా ఎక్కవ ధర కలిగిన స్పెక్ట్రమ్‌కు చెందినది. అందుకే ప్రమాదంలో లేదా మరేదైనా కారణంగా ఏదైనా నష్టం జరిగితే రిపేర్‌కు అయే ఖర్చు చాలా ఎక్కువ.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఇన్సూరెన్స్ పాలసీ అటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడే ఒక కీలక సాధనం. ఇంకా మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం ప్రతీ వాహన యజమానులు తమ వాహనానికి కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని అయినా తప్పనిసరిగా కొనుగోలు చేయాలి.
బీమా లేకుండా పట్టుబడితే తొలిసారి రూ. 2000 ట్రాఫిక్ జరిమానా, మళ్లీ మళ్లీ పట్టుబడితే రూ. 4000 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ చేయబడతాయి?
మీరు డిజిట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి?
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కోసం ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు
థర్డ్ పార్టీ
కాంప్రహెన్సివ్
ప్రమాదం కారణంగా స్వంత టూ వీలర్‌కు జరిగే డ్యామేజ్లు /నష్టాలు |
×
|
✔
|
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు స్వంత టూ వీలర్‌కు జరిగే డ్యామేజ్ లు/నష్టాలు |
×
|
✔
|
ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు స్వంత టూ వీలర్‌కు జరిగే డ్యామేజ్ లు/నష్టాలు |
×
|
✔
|
థర్డ్-పార్టీ వాహనానికి కలిగే డ్యామేజులు |
✔
|
✔
|
థర్డ్-పార్టీ ఆస్తికి కలిగే డ్యామేజులు |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
✔
|
✔
|
థర్డ్-పార్టీ వ్యక్తికి కలిగే గాయాలు/మరణం |
✔
|
✔
|
మీ స్కూటర్ లేదా బైక్ దొంగతనం |
×
|
✔
|
మీ వాహన ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేయడం |
×
|
✔
|
కస్టమైజ్డ్ యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ |
×
|
✔
|
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ల మధ్య వ్యత్యాసం
గురించి మరింత తెలుసుకోండి
క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?
మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రిన్యూ చేసిన తర్వాత మా 3-దశల, పూర్తిగా డిజిటల్ క్లెయిమ్‌ల విధానము ఉన్నందున మీరు ఎలాంటి చింత లేకుండా ఉంటారు!
స్టెప్ 1
1800-258-5956కు కాల్ చేయండి. ఎలాంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదు.
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌పై స్వీయ తనిఖీ కోసం లింక్‌ను పొందండి. దశలవారీగా ప్రక్రియలో తెలియజేసిన విధంగా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ వాహనం యొక్క డ్యామేజులను ఫొటోలు తీయండి.
స్టెప్ 3
మీరు మా గ్యారేజీ నెట్వర్క్ ద్వారా రీయింబర్స్మెంట్ లేదా నగదు రహిత విధానాన్ని ఎంచుకోవాలనుకుంటున్నప్పుడు రిపేర్ విధానాన్ని ఎంచుకోండి.
డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత త్వరగా పరిష్కరించబడతాయి?
మీ బీమా సంస్థణు మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం కూడా మంచిదే!
డిజిట్ క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డ్‌ను చదవండిరాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్: ఒక నివాళి కథ
2009 సంవత్సరం నుండి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అనేది రెట్రో-బైకర్ సెన్సిబిలిటీలను కలిగిన మోటార్ బైక్. వివరంగా చెప్పాలంటే స్వదేశీ బుల్లెట్ లాగా క్లాసిక్ 350 కూడా సాహసయాత్రలకు వెళ్లే భారతీయ బైకర్ల ఫ్యాంటసీకి తగ్గట్టుగా ఉంటుంది.
భారతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న మోటార్ సైకిళ్లలో ఒకటిగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్‌ని తయారు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి:
- ఫ్రంట్ ఫోర్క్‌తో స్థిరంగా ఉండే సాంప్రదాయ రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉన్నప్పటికీ, క్లాసిక్ ప్రత్యేకమైన సీటు అమరికను కలిగి ఉంది. ఇది బుల్లెట్‌కు భిన్నంగా ఉంటుంది.
- కావాలంటే రైడర్లు వెనుక మడ్‌గార్డ్‌పై విడిగా జతచేయబడిన పిలియన్ సీటును కూడా తీసివేయవచ్చు, తద్వారా రైడ్‌లో మెరుగైన రెట్రో లుక్‌ను పొందవచ్చు.
- అదే పేరుతో పిలువబడే రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి మోడల్‌కు గుర్తుగా ప్రత్యేకమైన రంగుతో కూడిన పెగాసస్ వంటి మోడల్‌లు కూడా తక్కువ వ్యవధిలో తయారుచేయబడ్డాయి.
క్యాలిబర్ బైక్ యొక్క యాజమానులు తమ మోటారు వాహనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదం ఊహించనిది. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కోసం కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం మంచిది..
అయితే, ఏ రకమైన టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాలి?
గందరగోళంగా ఉన్నారా? అయితే ఒక్కసారి డిజిట్ ఇన్సూరెన్స్‌ను చెక్ చేయండి!
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఇన్సూరెన్స్ కోసం డిజిట్నే ఎందుకు ఎంచుకోవాలి?
మీకు నచ్చిన ఎన్ఫీల్డ్ ఇన్సూరెన్స్‌లలో డిజిట్‌ని బెస్ట్ ఛాయిస్‌గా మార్చే విషయాన్ని మేము ఇక్కడ చర్చిస్తాము:
భారతదేశం అంతటా పెద్ద సంఖ్యలో నెట్వర్క్ గ్యారేజీలు
ఏదైనా వాహనం, అది టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ అయినా మెకానికల్ బ్రేక్‌డౌన్‌కు గురి కావచ్చు. అటువంటి పరిస్థితులలో మీ క్లాసిక్ కోసం నగదు రహిత రిపేర్లను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా మీ ఇబ్బందులను కొంతవరకు తగ్గించవచ్చు. డిజిట్ భారతదేశం అంతటా 1,000కి పైగా నెట్వర్క్ గ్యారేజీలను కలిగి ఉంది. బీమా చేయబడిన యజమానులు వారి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350/500 అత్యవసర పరిస్థితుల్లో రిపేర్లు చేయడం సులభం చేస్తుంది.
ఆఫర్ చేయబడే పాలసీల రకాలు
డిజిట్ మీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, క్లాసిక్ 350 కోసం అనేక రకాల టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. మీరు ఈ పాలసీలను అర్థం చేసుకోవడం, అందులో మీకు సరైనదాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇన్సూరెన్స్ ధర పాలసీని బట్టి మారుతుంది.
- థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ - ఈ పాలసీలు మీ మోటార్ సైకిల్ వల్ల ప్రమాదానికి గురైన థర్డ్ పార్టీకి జరిగే నష్టాన్ని ఆర్థికంగా కవర్ చేస్తాయి. ప్రమాదంలో వ్యక్తికి కలిగే భౌతిక గాయం అయినా లేదా అతని/ఆమె వాహనానికి కలిగే డ్యామేజ్ అయినా, ఆస్తికి కలిగే నష్టం అయినా ఈ బీమా పాలసీ లయబిలిటీలకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.
- కాంప్రహెన్సివ్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ - మీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి సంబంధించిన ఈ ఎంపిక థర్డ్-పార్టీ లయబిలిటీలతో పాటు మీ బైకును, మిమ్మల్ని కూడా కవర్ చేస్తుంది. ఈ పాలసీలు అగ్నిప్రమాదం, సహజ, మానవ తప్పిదాల వల్ల కలిగే విపత్తుల కారణంగా ప్రమాదంలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్‌కు జరిగిన ఏదైనా నష్టాన్ని కవర్ చేస్తాయి. మీ మోటార్ సైకిల్ దొంగిలించబడినా లేదా రిపేర్ చేయలేని విధంగా పాడైపోయినా మీరు దాని ధరను కూడా తిరిగి పొందవచ్చు.
2018 సెప్టెంబర్ తర్వాత వాహనాన్ని కొనుగోలు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350/500 యజమానులు కూడా 'ఓన్ డ్యామేజ్' కవర్ చేసే ప్రత్యేక పాలసీని పొందవచ్చు. ఈ పాలసీలు థర్డ్-పార్టీ లయబిలిటీలను కవర్ చేయనప్పటికీ, మోటార్ బైక్ యజమాని అలాగే బైక్ కూడా ఈ పాలసీ పరిధిలోకి వస్తాయి.
ఆన్లైన్లో కొనుగోలు, రెన్యువల్
మోటార్ బైక్ యజమానులకు డిజిట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి, రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. తద్వారా మొత్తం అప్లికేషన్ ప్రక్రియను వేగంగా, సులభంగా చేస్తుంది. మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ఇన్సూరెన్స్ ధరతో పాటు దాని 350 వేరియంట్‌ను వాటి విభిన్న ఎంపికలతో పాటు తనిఖీ చేయవచ్చు, మీకోసం సరైన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ప్లాన్‌ను ఎంచుకున్న తర్వాత, దరఖాస్తు విధానాన్ని పూర్తి చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది.
వేగవంతమైన ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ
డిజిట్ సులువైన, సత్వరమైన క్లెయిమ్ ఫైల్ చేసే ప్రక్రియతో పాటు వేగవంతమైన సెటిల్మెంట్కు అవకాశం కల్పిస్తుంది. క్లెయిమ్‌ను ఫైల్ చేసే విషయంలో డిజిట్ తన కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయతనిఖీ ప్రక్రియను అందిస్తుంది. ఇది నిమిషాల వ్యవధిలో ప్రక్రియను పూర్తి చేస్తుంది. అదనంగా, డిజిట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అత్యధికంగా ఉంది. ఇది మీ క్లెయిమ్ తిరస్కరించబడే అవకాశాలను తగ్గిస్తుంది.
నో క్లెయిమ్ బోనస్ (NCB) ప్రయోజనాలు
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇన్సూరెన్స్ రెన్యువల్‌ను ఎంచుకున్నప్పుడు, మీరు నో క్లెయిమ్ బోనస్ (NCB) ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ముఖ్యంగా మీరు నిర్దిష్ట పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయకుంటే మీరు రెన్యువల్ ప్రీమియంపై తగ్గింపును పొందవచ్చు. తగ్గింపు 50% వరకు ఉంటుంది. తమ ఇన్సూరెన్స్ పాలసీని డిజిట్‌కి బదిలీ చేస్తున్న క్లాసిక్ యజమానులు కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రీమియం కస్టమర్ సర్వీస్
జాతీయ సెలవు దినం ఉన్నప్పటికీ, డిజిట్ యొక్క కస్టమర్ సర్వీస్ 24X7 అందుబాటులో ఉంటుంది. అదనంగా డిజిట్ వారి కస్టమర్ సర్వీసును ఆన్లైన్లో లేదా కాల్ ద్వారా చేరుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఆన్లైన్లో క్లెయిమ్‌లను ఫైల్ చేయడంతో పాటు యజమానులు ఫోన్ కాల్ ద్వారా కస్టమర్ సర్వీస్ నుంచి సహాయం కోరే ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటారు.
పర్సనలైజ్ చేయబడిన ఐడీవీ (IDV)
ఐడీవీ (IDV) లేదా ఇన్సూర్డ్ డిక్లేర్ వాల్యూ అనేది మీ మోటార్ సైకిల్‌పై బీమా చేయబడిన మొత్తం డబ్బు. ఈ విలువ మీ మోటార్ సైకిల్ యొక్క తరుగుదల విలువను అది కొనుగోలు చేయబడిన ధర నుంచి తీసివేయడం ద్వారా లెక్కించబడుతుంది. డిజిట్ ఐడీవీ (IDV)ని సూచిస్తున్నప్పుడు, మీ అవసరాలకు అనుగుణంగా మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంది.
బహుళ యాడ్-ఆన్ ఆప్షన్లు
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ యజమానులు, తమ బైక్‌లకు కాంప్రహెన్సివ్ కవర్‌ను ఎంచుకుంటారు. వారి పాలసీపై యాడ్-ఆన్ల రూపంలో అదనపు రక్షణను కూడా కొనుగోలు చేయవచ్చు. డిజిట్ అందించే విభిన్న యాడ్-ఆన్లు కింద ఇవ్వబడ్డాయి.
- రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
- జీరో డిప్రిషియేషన్ కవర్
- బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్
- ఇంజిన్, గేర్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్
- కంజూమబుల్ ఇన్సూరెన్స్
మీరు ఎంచుకున్న యాడ్-ఆన్‌లతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇన్సూరెన్స్ ధరను తనిఖీ చేయడం, సరిపోల్చడం చాలా అవసరం.
అందువల్ల అటువంటి ప్రయోజనాలు, మరిన్నింటితో, మీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కోసం టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని పొందేందుకు డిజిట్ యొక్క బీమా పాలసీ ఉత్తమ ఎంపికలలో ఒకటిగా ఉంటుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ - వేరియంట్లు & ఎక్స్-షోరూం ధర
వేరియంట్లు |
ఎక్స్-షోరూం ధర (నగరాన్ని బట్టి మారవచ్చు) |
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ |
|
క్లాసిక్ 350 ABS, 40.8 kmpl, 346 cc |
₹ 153,444 |
క్లాసిక్ 350 రెడ్డిచ్ ABS, 40.8 kmpl, 346 cc |
₹ 153,444 |
క్లాసిక్ 350 గన్మెటల్ గ్రే, 40.8 kmpl, 346 cc |
₹ 155,281 |
క్లాసిక్ 350 సిగ్నల్స్ ఎడిషన్, 40.8 kmpl, 346 cc |
₹ 163,635 |
క్లాసిక్ 500 ABS, 32 Kmpl, 499 cc |
₹ 201,384 |
క్లాసిక్ 500 స్క్వాడ్రన్ బ్లూ, 32 Kmpl, 499 cc |
₹ 204,519 |
క్లాసిక్ 500 స్టెల్త్ బ్లాక్, 32 Kmpl, 499 cc |
₹ 204,519 |
క్లాసిక్ 500 డెసర్ట్ స్టార్మ్, 32 Kmpl, 499 cc |
₹ 204,519 |
క్లాసిక్ 500 క్రోమ్, 32 Kmpl, 499 cc |
₹ 211,818 |
క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్, 499 cc |
₹ 216,819 |