Third-party premium has changed from 1st June. Renew now
హోండా యాక్టివా ఇన్సూరెన్స్‌ను ఆన్లైన్లో కొనుగోలు/రెన్యూ చేసుకోండి
మీరు హోండా యాక్టివా బండిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లైతే ఇక్కడ మీకు అన్ని రకాల మోడల్ వేరియంట్లు మొదలైన అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. హోండా యాక్టివా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటపుడు ఈ విషయాలను గమనించాలి.
స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా ఎక్కువగా అమ్ముడుపోతోంది. హోండా మోటార్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో జరుగుతున్న ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో దాదాపు 14 శాతం బైక్‌లు హోండా యాక్టివాలే ఉంటున్నాయి. ఒక సగటు కస్టమర్ కోరుకునే అన్ని అంశాలు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. అందుకే భారతీయులు దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. (1)
మీరు యాక్టివాలోని ఒక మోడల్‌ను కొనేందుకు నిర్ణయించుకున్నాక తదుపరి దశలో యాక్టివా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. యాక్టివాలో ఉన్న అన్ని రకాల బైక్‌లు బీఎస్-VI (BS-VI) వేరియంట్లు కావు. కావున మీరు బండిని కొనే ముందు ఈ విషయం గమనించాలి. ఎక్కువగా బీఎస్-VI (BS-VI) రకం వాహనాలనే తీసుకొచ్చేందుకు హోండా కంపెనీ కూడా ప్రణాళికలు రచిస్తోంది.
హోండా యాక్టివాలో ఎన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ అది కూడా ప్రమాదాలకు గురవుతుంది. కావున ఈ బైక్‌కు కూడా టూ వీలర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం.
ఇన్సూరెన్స్ తీసుకోవడం చట్టపరంగా కూడా చాలా అవసరం. భారతీయ రోడ్ల మీద బండ్లు నడిపేందుకు కనీసం థర్డ్ పార్టీ పాలసీ అయినా ఉండాలి. లేకపోతే మీరు ట్రాఫిక్ చట్టాల ప్రకారం జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఇన్సూరెన్స్ లేకుండా మొదటి సారి దొరికితే రూ. 2,000, రెండో సారి కూడా పట్టుబడితే రూ. 4,000 వరకు ఫైన్ పడుతుంది.
ద్విచక్ర వాహన పాలసీలను గురించి మరింత తెలుసుకునే ముందు ఒక్క నిమిషం ఆగండి.
యాక్టివా టూ వీలర్ ఇన్సూరెన్స్ ద్వారా ఎలా గరిష్ట ప్రయోజనాలు పొందొచ్చో, హోండా యాక్టివా పాలసీ గురించి మరింత తెలుసుకోండి.
హోండా యాక్టివా ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
డిజిట్ అందించే హోండా యాక్టివా బైక్ ఇన్సూరెన్స్నే ఎందుకు కొనుగోలు చేయాలి?
హోండా యాక్టివా కోసం అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ ప్లాన్‌ల రకాలు
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
ప్రమాదం వలన సొంత టూ వీలర్‌కు డ్యామేజీలు/నష్టాలు జరిగితే |
|
అగ్ని ప్రమాదాల వలన సొంత టూ వీలర్‌కు డ్యామేజీలు/నష్టాలు జరిగితే |
|
ప్రకృతి విపత్తుల వలన సొంత టూ వీలర్‌కు డ్యామేజీలు/నష్టాలు జరిగితే |
|
థర్డ్ పార్టీ వాహనానికి డ్యామేజ్ జరిగితే |
|
థర్డ్ పార్టీ ప్రాపర్టీకి డ్యామేజ్ జరిగితే |
|
వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్ |
|
థర్డ్ పార్టీ వ్యక్తికి గాయాలు/మరణం సంభవించినపుడు |
|
మీ బైక్ దొంగతనానికి గురయినపుడు |
|
మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోగలగడం |
|
యాడ్-ఆన్స్‌తో అదనపు రక్షణ పొందడం |
|
Get Quote | Get Quote |
థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మధ్య గల తేడాల గురించి మరింత తెలుసుకోండి.
హోండా యాక్టివా - వేరియంట్లు & ఎక్స్- షోరూమ్ ధరలు
వేరియంట్లు | ఎక్స్- షోరూమ్ ధర (నగరాన్ని బట్టి తేడాలుండొచ్చు) |
---|---|
యాక్టివా (Activa) i STD, 66 Kmpl, 109.19 cc | ₹ 51,254 |
యాక్టివా (Activa) 3G STD, 60 Kmpl, 109.19 cc నిలిపివేయబడింది | ₹ 48,503 |
యాక్టివా (Activa) 4G STD, 60 Kmpl, 109.19 cc నిలిపివేయబడింది | ₹ 51,460 |
యాక్టివా (Activa) 5G STD, 60 Kmpl, 109.19 cc | ₹ 54,911 |
యాక్టివా (Activa) 5G లిమిటెడ్ ఎడిషన్ STD, 60 Kmpl, 109.19 cc | ₹ 55,311 |
యాక్టివా (Activa) 5G DLX, 60 Kmpl, 109.19 cc | ₹ 56,776 |
యాక్టివా (Activa) 5G లిమిటెడ్ ఎడిషన్ DLX, 60 Kmpl, 109.19 cc | ₹ 57,176 |
యాక్టివా (Activa) 125 స్టాండర్డ్, 60 Kmpl, 124.9 cc | ₹ 60,628 |
యాక్టివా (Activa) 125 డ్రమ్ బ్రేక్ అల్లాయ్, 60 Kmpl, 124.9 cc | ₹ 62,563 |
యాక్టివా (Activa) 125 డీలక్స్ , 60 Kmpl, 124.9 cc | ₹ 65,012 |
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు మాతో కలిసి టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినపుడు క్లెయిమ్ సెటిల్మెంట్ గురించి మీరు ఏ విధమైన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా దగ్గర కేవలం మూడు సింపుల్ స్టెప్పుల్లోనే డిజిటల్ పద్ధతిలో క్లెయిమ్స్ సెటిల్ అవుతాయి.
స్టెప్ 1
కేవలం1800-258-5956 నెంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు.
స్టెప్ 2
మేము మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు స్వీయ తనిఖీ లింక్ పంపిస్తాం. మీ వాహనం డ్యామేజీ అయిన ఫొటోలను ఆ లింక్ ద్వారా మాకు పంపిస్తే సరిపోతుంది. ఫొటోలను ఎలా పంపాలో దశలవారీ ప్రక్రియ ఉంటుంది.
స్టెప్ 3
మీకు ఏ విధమైన రిపేర్ కావాలో ఎంచుకుంటే సరిపోతుంది. రీయింబర్స్మెంట్ లేదా నగదు రహిత రిపేర్ల వంటివి.
హోండా యాక్టివా: మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
2001 సంవత్సరంలో హోండా కంపెనీ యాక్టివా స్కూటర్లను ప్రవేశపెట్టింది. వెంటనే ఈ బైక్ వినియోగదారుల నుంచి అభిమానాన్ని చూరగొంది. ప్రస్తుతం హోండా కంపెనీ నాలుగు ప్రధాన వేరియంట్లను విడుదల చేస్తోంది. ఈ వేరియంట్లు అన్ని శ్రేణుల కస్టమర్లకు సరిగ్గా సరిపోతున్నాయి.
మీరు యాక్టివా టూ-వీలర్‌ను కొనుగోలు చేయాలని భావించినపుడు ఈ స్కూటర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.
- 2009వ సంవత్సరంలో హోండా కంపెనీ యాక్టివా స్కూటర్‌ను 109cc కి అప్‌గ్రేడ్ చేసింది. ఎటువంటి ధర తేడా లేకుండా హోండా ఈ బైక్‌ను వినియోగదారులకు అందించింది. ఇంజన్ సామర్థ్యాన్ని పెంచడం వలన ఈ స్కూటర్ మరింత శక్తివంతంగా మారినట్లు హోండా కంపెనీ తెలిపింది.
- యాక్టివా 125 మోడల్‌ను విడుదల చేయడం ద్వారా హోండా మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 125cc కెపాసిటీ ఉన్న ఇంజన్ ఉంది.
- 2019లో హోండా కంపెనీ యాక్టివా 5G మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ మోడల్లో 10 కొత్త ఫీచర్లను కంపెనీ ప్రవేశపెట్టింది. రాయల్ సీట్, బ్లాక్డ్ అవుట్ ఇంజన్, బ్లాక్ రిమ్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
- యాక్టివా బైక్‌లు సామాన్యుని బడ్జెట్లో అందుబాటులో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కంపెనీ యాక్టివా బైక్‌లను ఎప్పుడూ అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటుంది. అప్‌గ్రేడ్ చేసినా కూడా ధరలను పెంచదు.
ఇలా అనేక ఫీచర్ల సాయంతో హోండా యాక్టివా మోడల్ భారతదేశంలోనే టాప్ మోడల్‌గా నిలిచింది.
ఇలా ఎన్నో ఫీచర్లతో ఉన్న యాక్టివా బైక్ మీ ప్రయాణాన్ని చాలా సులభతరం చేస్తుంది. కానీ, మీ బైక్‌కు ఏదైనా డ్యామేజ్ అయినపుడు ఏం జరుగుతుందో ఆలోచించారా? మరి మీ బండిని ఎవరైనా దొంగతనం చేసినప్పుడో?
మీ బైక్‌కు డ్యామేజీలు జరిగినపుడు మీరు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇలా ఈ ఆర్థిక నష్టాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు మీరు ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా తీసుకోవాలి.
మీ అన్ని అవసరాలను తీర్చేందుకు డిజిట్ పాలసీ మీకు చాలా సాయపడుతుంది.
హోండా యాక్టివా ఇన్సూరెన్స్ పాలసీ కోసం డిజిట్నే ఎందుకు ఎంచుకోవాలి?
మీరు హోండా యాక్టివా బైక్‌ను కొనుగోలు చేసినపుడు మొదట చేయాల్సింది దానికి ఇన్సూరెన్స్ చేయించడం. డిజిట్ కంపెనీ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ.
మిగతా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డిజిట్ ఏ విషయంలో ప్రత్యేకంగా ఉంటుందో కింద పేర్కొనబడింది. డిజిట్ ప్రత్యేకతలు ఏంటంటే.
- పెద్ద సంఖ్యలో నెట్వర్క్ గ్యారేజీలు– క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది చాలా సులభం. మీ ఇన్సూరెన్స్ కంపెనీ క్యాష్‌లెస్ క్లెయిమ్స్ సౌలభ్యాన్ని అందిస్తే దాన్ని ఎంచుకోవడం మంచిది. డిజిట్ కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ క్యాష్‌లెస్ గ్యారేజీలు ఉన్నాయి. కావున మీరు మీ చుట్టు పక్కలే క్యాష్‌లెస్ నెట్వర్క్ గ్యారేజీని పొందొచ్చు.
- ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదు– మీరు సాధారణ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీని తీసుకుని పాలసీ కోసం క్లెయిమ్ చేస్తే ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. మీరు క్లెయిమ్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ ముందుగా మీ ఇంటికి వచ్చి మీ డ్యామేజ్ అయిన వాహనాన్ని తనిఖీ చేస్తాడు. డ్యామేజ్ గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఇన్సూరెన్స్ కంపెనీలు మీ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేసేందుకు కొంత సమయం తీసుకుంటాయి. అటు తర్వాత మీ క్లెయిమ్ అభ్యర్థన ఆమోదం పొందొచ్చు లేదా తిరస్కరణకు గురికావచ్చు. కానీ డిజిట్ కంపెనీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను చాలా సులభతరం చేసింది. స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ విధానాన్ని డిజిట్ ప్రవేశపెట్టింది. మీరు హోండా యాక్టివా ఇన్సూరెన్స్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేస్తే మీ పాలసీని ఇంటర్నెట్లోనే క్లెయిమ్ చేసుకునేందుకు డిజిట్ అనుమతిస్తుంది. పాత రోజుల్లో ఉన్న క్లెయిమ్ ప్రక్రియ కంటే డిజిట్ తీసుకొచ్చిన పేపర్‌లెస్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.
- వివిధ రకాల ఇన్సూరెన్స్ ఆప్షన్లు– హోండా యాక్టివా ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినపుడు మీరు సరైన పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. డిజిట్ ఇన్సూరెన్స్ పాలసీ ఎటువంటి ప్రొడక్టులను అందిస్తుందో ఇప్పుడు చూద్దాం.
- థర్డ్ పార్టీ లయబులిటీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ– మీరు చేసిన ప్రమాదాల వలన థర్డ్ పార్టీ వ్యక్తులు కానీ, ప్రాపర్టీస్ కానీ డ్యామేజ్ అయినపుడు ఈ పాలసీ మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేస్తుంది. మీరు చేసిన ప్రమాదంలో థర్డ్ పార్టీ వ్యక్తులు మరణించినా కూడా ఈ పాలసీ మిమ్మల్ని కవర్ చేస్తుంది. అంతేకాకుండా థర్డ్ పార్టీ వలన ఏ విధమైన న్యాయపరమైన చిక్కులు వచ్చినా కానీ ఈ పాలసీ మిమ్మల్ని సంరక్షిస్తుంది.
- కాంప్రహెన్సివ్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ– ఏవైనా ప్రమాదాలు జరిగినపుడు ఈ పాలసీలు థర్డ్ పార్టీ వ్యక్తులతో పాటుగా మిమ్మల్ని కూడా కవర్ చేస్తాయి. మీ వాహనం చోరీకి గురయినా, లేదా అగ్ని ప్రమాదంలో డ్యామేజ్ అయినా లేదా ప్రకృతి విపత్తులు వచ్చి మీకు నష్టం సంభవించినా కానీ ఈ పాలసీ మిమ్మల్ని సంరక్షిస్తుంది. ఈ పాలసీలో థర్డ్ పార్టీ వ్యక్తులతో పాటు మీరు కూడా నష్టపరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరైనా వ్యక్తుల వలన జరిగిన డ్యామేజీల నుంచి కూడా ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.
సెప్టెంబర్ 2018 తర్వాత హోండా టూ-వీలర్‌ను కొనుగోలు చేసిన వ్యక్తులు ఎక్కువ సంరక్షణను పొందుతారు. వీరు కొనుగోలు చేసిన థర్డ్ పార్టీ లయబులిటీ ప్లాన్‌కు ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్‌ను కూడా జోడించుకునే సౌకర్యం ఉంటుంది. కావున మీ బైక్ ఎక్కువ సురక్షితంగా ఉంటుంది.
- అబ్బురపరిచే 24x7 కస్టమర్ సర్వీస్– మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ కొనుగోలు చేసిన తర్వాత వారు మీకు అందించే సర్వీసును బట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎటువంటిదనే విషయం చెప్పొచ్చు. ఈ విషయంలో డిజిట్ కంపెనీ చాలా అద్భుతంగా తన కస్టమర్లకు సేవలు అందిస్తోంది. మీకు ఎటువంటి సమయంలోనైనా పాలసీ గురించి ఏ విధమైన అనుమానాలున్నా సరే మీరు మాకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. మీకోసం మేము 24 గంటల పాటు అందుబాటులో ఉంటాం. మా కస్టమర్ కేర్ ప్రతినిధులు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. డిజిట్ కంపెనీ కస్టమర్‌కు సర్వీస్ ప్రొవైడర్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉండేలా చూస్తుంది.
- ఉపయోగకరమైన, అనుకూలమైన యాడ్-ఆన్స్– డిజిట్ అందించే ప్రాథమిక ప్లాన్లతో కొంతమంది సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. అందుకే డిజిట్ కంపెనీ మీ కోసం అనేక యాడ్-ఆన్‌లను అందిస్తోంది. ఈ యాడ్-ఆన్‌లతో మీరు మీ స్కూటర్‌ను మరింత ఎక్కువగా సంరక్షించుకోవచ్చు. డిజిట్ కంపెనీ అందించే కొన్ని రకాల యాడ్-ఆన్స్.
- జీరో డిప్రిషియేషన్ కవర్
- బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్
- ఇంజన్, గేర్ ప్రొటెక్షన్ కవర్
- బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్
- రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
- సులభమైన రెన్యువల్, కొనుగోలు ప్రక్రియ– కష్టతరమైన పాలసీలను రూపొందించడం కంటే సులభమైన పాలసీలను రూపొందించడం డిజిట్ కంపెనీ ప్రధాన లక్ష్యం. కొత్త పాలసీ తీసుకోవాలన్నా, పాత పాలసీని రెన్యూ చేసుకోవాలన్న డిజిట్ ఇన్సూరెన్స్‌లో చాలా సులభం. మీరు డిజిట్ వెబ్‌సైట్‌ను ఉపయోగించి పాలసీలను కొనుగోలు చేయొచ్చు. లేదా రెన్యూ చేసుకోవచ్చు. ఇప్పటికే డిజిట్‌తో పాలసీలు చేసిన కస్టమర్లు ఈ విధంగానే సులభమైన పద్ధతిని ఉపయోగించి మీ బండికి ఉన్న ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవచ్చు.
- మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోండి– వాహనం ఐడీవీ (IDV) అనేది మీ బండికి ఉన్న మార్కెట్ విలువను సూచిస్తుంది. దీనినే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ అని అంటారు. డిజిట్ కంపెనీ అందించే పాలసీలో మీరు మీ ఐడీవీ (IDV)ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్లెయిమ్ చేసిన సందర్భంలో మీకు అధిక మొత్తం వచ్చేందుకు ఈ ఆప్షన్ మీకు సహాయం చేస్తుంది. అనుకోని సందర్భాల్లో మీ యాక్టివా టూ-వీలర్ దొంగతనానికి గురయితే మీరు ఎక్కువ క్లెయిమ్ అమౌంట్‌ను పొందేందుకు వీలుంటుంది. ఇది మీరు ఎంచుకున్న ఐడీవీ (IDV)తో ముడిపడి ఉంటుంది.
- నో క్లెయిమ్ బెనిఫిట్లు– ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోకుంటే మీకు అనేక రకాల ప్రయోజనాలు అందుతాయి. అందులో అతి ప్రధానమైనది నో క్లెయిమ్ బోనస్. మీకు నో క్లెయిమ్ బోనస్ ఉంటే పాలసీ ప్రీమియం రెన్యువల్స్ మీద డిజిట్ కంపెనీ ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది.
ప్రముఖ హోండా యాక్టివా స్కూటర్లకు టూ వీలర్ ఇన్సూరెన్స్
డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ వివిధ రకాల హోండా బైక్‌ల కోసం స్పెషల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తోంది. హోండా స్కూటర్లకు అందిస్తున్న కొన్ని ప్లాన్లు కింద ఇవ్వబడ్డాయి.
- యాక్టివా 3G– యాక్టివా 3G స్పోర్ట్స్ బైక్ స్టైలిష్ బాడీతో వస్తుంది. ఈ బండి లీటరు పెట్రోల్‌కు 52 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అన్ని రకాల స్కూటర్ మోడళ్లలాగే ఇందులో కూడా 109 CC ఇంజన్ ఉంటుంది. ఈ బండిలో 5.3 లీటర్ల పరిమాణం కలిగిన పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది.
- యాక్టివా 4G– యాక్టివా 4G కూడా 109 CC ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మైలేజీ విషయంలో చూసుకున్నట్లయితే 4G అనేది అంతకుముందటి వెర్షన్ కంటే ఉత్తమమైనది. యాక్టివా 4G బండి 8 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతోంది.
- యాక్టివా 5G– ఇది హోండా యాక్టివాలో కొత్త మోడల్ స్కూటర్. హోండా యాక్టివా 5G అనేది సాంకేతికంగా ఓ కళాఖండం లాంటిది. దీనిలో కూడా 109cc ఇంజన్ ఉంటుంది. కంపెనీ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఈ మోడల్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. వేగం కోరుకునేవారు ఈ స్కూటర్‌ను ఇష్టపడతారు. ఇది దాదాపు 83 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇలా ఎక్కువ వేగంతో వెళ్లడం వలన కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే డిజిట్ కంపెనీ అందిస్తున్న యాక్టివా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం చాలా ప్రయోజనకరం.
- యాక్టివా 125– యాక్టివా 125 బైక్ 124.9cc ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ ఎలాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మొబైల్ చార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. ఎల్‌ఈడీ (LED) పిలట్ ల్యాంప్స్ ఉంటాయి. టూ-వీలర్ బైక్ కొనాలని చూస్తున్నవారికి ఈ స్కూటర్ ఒక అత్యుత్తమ ఎంపిక అవుతుంది. సాధారణ హోండా యాక్టివా వేరియంట్ల కంటే ఎక్కువ ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉంటాయి. ఈ స్కూటర్ బీఎస్-VI (BS-VI) ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఇది అసలైన పర్యావరణ హితమైన స్కూటర్.
- యాక్టివా i– యాక్టివా i మోడల్ లీటరు పెట్రోల్‌కు 66 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కానీ ఈ బండికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ చాలా ముఖ్యం. డిజిట్ కంపెనీ ఈ బైక్‌కు అనువైన అనేక పాలసీలను అందిస్తుంది. ఎటువంటి సందర్బంలోలైనా కవర్ అయ్యేలా చూస్తుంది.
డిజిట్ ఇన్సూరెన్స్ విశ్వసనీయమైన పాలసీలను అందిస్తుంది. ఇది మీ బైక్‌కు పూర్తి రక్షణను అందజేస్తుంది. మీరు ఎంతగానో ఇష్టపడే మీ టూ-వీలర్‌కు ప్రమాదం జరిగినా కూడా కవర్ చేస్తుంది.
భారతదేశంలో హోండా యాక్టివా టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు )
గడువు తేదీ లోపల నేను నా బైక్ పాలసీని రెన్యూ చేసుకోకపోతే ఏం జరుగుతుంది?
మీరు పాలసీ గడువు తేదీ కంటే ముందు ఇన్సూరెన్స్ రెన్యూ చేయించుకోకపోతే మీ ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ అయిపోతుంది. మీరు నో క్లెయిమ్ బోనస్ వంటి ప్రయోజనాలను కోల్పోతారు. మీ టూ-వీలర్‌ను రక్షించుకోవడం కోసం మీరు కొత్త పాలసీని కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు పాలసీ లేకుండా బయట బండి నడిపితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మీకు ఫైన్ వేస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ. 2,000, మరోసారి పట్టుబడితే రూ. 4,000 ఫైన్ వేస్తారు.
నా హోండా యాక్టివా స్కూటర్‌కు ఐడీవీ (IDV)ని ఎలా లెక్కించాలి?
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ అనేది తయారీదారు నుంచి కొనుగోలు చేసిన తర్వాత ప్రస్తుతం మీ బైక్‌కు ఉన్న మార్కెట్ విలువ. మీరు ఈ విలువను మ్యాన్యువల్‌గా లెక్కిస్తే చాలా సమస్యలు వస్తాయి. కావున ఇందుకోసం ఆన్లైన్లో ఉన్న ఐడీవీ (IDV) క్యాలుకులేటర్లను ఉపయోగించుకోవాలి.
మినహాయింపుల సాయంతో నేను నా హోండా యాక్టివా ప్రీమియం తగ్గించుకోవచ్చా?
తగ్గించుకోవచ్చు. మినహాయింపులు అనేవి మీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. మీరు స్వీయ మినహాయింపులను ఎంచుకుని మీ యాక్టివా స్కూటర్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గించుకోవచ్చు.