Third-party premium has changed from 1st June. Renew now
ఆన్‌లైన్‌లో హోండా బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు/ రిన్యు చేయండి
హోండా టూ వీలర్స్ గురించి మీకు ఎంత తెలుసు – దేశంలో దాని చరిత్ర, దాని పాపులారిటీ వెనుక కారణాలు, హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు, మరి మీరు ఏ పాలసీని ఎంచుకుంటారు?
దీని గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం!
భారతదేశంలో టూవీలర్ వాహనాలు అంటే గుర్తుకు వచ్చే పేర్లలో హోండా పేరు ఒకటి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) నివేదిక ప్రకారం.. ఇటీవలి ఆర్థిక మాంద్య పరిస్థితుల్లోనూ 2019 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వరుసగా 6 నెలల పాటు భారతదేశంలోని టూ వీలర్ వాహనాల విక్రయాల్లో హోండా అగ్రగామిగా నిలిచింది. (1)
ఆగస్టు 2019 నాటికి అన్ని భారతీయ టూ వీలర్ వాహన తయారీదారుల మార్కెట్ షేర్లను బీహెచ్ పీ-ఇండియా (BHP-India) విశ్లేషించింది. దాని ప్రకారం.. హోండా 29 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. ఈ విషయంలో హోండా దేశంలోనే రెండో స్థానంలో నిలవడం విశేషం. (2)
భారతీయ వినియోగదారుల్లో హోండా టూవీలర్ వాహనాలకు ఉన్న ఆదరణను ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
అయితే, హోండా టూ వీలర్ వాహనాలు ఎంత మంచి ఫీచర్లను అందిస్తున్నప్పటికీ, రోడ్లపై జరిగే ప్రమాదాల నుంచి మాత్రం రక్షించలేవు కదా.
అందుకే హోండా టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కొనడం చాలా కీలకం. మీ వాహనానికి లేదా మీ వాహనం వల్ల కలిగే డ్యామేజీల వల్ల జరిగే ఆర్థిక భారం నుంచి భద్రత కల్పించుకోవడం ముఖ్యం. ఇతర వాహనాల మాదిరిగానే మీ హోండా టూ వీలర్ వాహనం కూడా ప్రమాదానికి గురైతే భారీగానే నష్టం జరుగుతుంది. ఇది అధిక ఖర్చులకు దారి తీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని రక్షించడంలో ఇన్సూరెన్స్ పాలసీ దోహదపడుతుంది.
ఇంకా, మోటార్ వాహనాల చట్టం-1988 ప్రకారం థర్డ్ పార్టీ లయబిలిటీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ పొందడం తప్పనిసరి. ఇన్సూరెన్స్ లేని హోండా బైక్ నడిపితే రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
హోండా బైక్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి
ఏం కవర్ కావు?
మీ టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్ కావో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే క్లెయిమ్ చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాంటి కొన్ని పరిస్థితులను ఇక్కడ తెలుసుకుందాం:
థర్డ్ పార్టీ లేదా లయబిలిటీ ఓన్లీ బైక్ పాలసీలలో సొంత వాహనానికి డ్యామేజీ జరిగితే కవర్ కావు.
మద్యం తాగి లేదా సరైన టూవీలర్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే మీకు ఇన్సూరెన్స్ పాలసీ వర్తించదు.
మీరు లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారనుకోండి. అప్పుడు వెనుక సీటులో సరైన లైసెన్స్ ఉన్న వ్యక్తి లేకుండా మీరు టూ వీలర్ నడిపితే మీకు పాలసీ వర్తించదు.
ప్రమాదం వల్ల నేరుగా జరగని డ్యామేజీలకు (ఉదాహరణకు ప్రమాదం తర్వాత టూ వీలర్‌ను సరిగ్గా నడపకపోవడం వల్ల ఇంజన్ డ్యామేజీ అవడం లాంటివి) పాలసీ కింద కవర్ కావు.
కావాలనే నిర్లక్ష్యంగా వ్యహరించడం (ఉదాహరణకు ఉత్పత్తిదారుల డ్రైవింగ్ మాన్యువల్‌లో చేయకూడదని సూచించినా కానీ.. వరదల్లో వాహనం నడిపితే) పాలసీ కింద కవర్ కావు.
Some situations are covered in add-ons. If you haven’t bought those add-ons, the corresponding situations will not be covered.
డిజిట్ అందించే హోండా బైక్ ఇన్సూరెన్స్‌ను మీరు ఎందుకు కొనుగోలు చేయాలి?
మీ అవసరాలకు సరిపోయే హోండా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
థర్డ్ పార్టీ | కాంప్రహెన్సివ్ |
ప్రమాదం కారణంగా సొంత టూవీలర్ బైక్ కు జరిగే డ్యామేజీ /నష్టాలు |
|
అగ్నిప్రమాదం జరిగినప్పుడు సొంత టూవీలర్ బైక్ కు జరిగే డ్యామేజీ /నష్టాలు |
|
ప్రక-తి వైపరీత్యాలు జరిగినప్పుడు సొంత టూవీలర్ బైక్ కు జరిగే డ్యామేజీ /నష్టాలు |
|
థర్డ్ పార్టీ వెహికిల్ కు జరిగే డ్యామేజీలు |
|
థర్డ్ పార్టీ ప్రాపర్టీకి జరిగే డ్యామేజీలు |
|
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ |
|
థర్డ్ పార్టీ వ్యక్తికి గాయాలు లేదా మరణం సంభవిస్తే |
|
స్కూటర్ లేదా బైక్ దొంగతనానికి గురైతే |
|
మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోగలగడం |
|
కస్టమైజ్డ్ యాడ్–ఆన్ లతో మరింత సురక్షణ |
|
Get Quote | Get Quote |
కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి.
క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?
మీరు మా టూ వీలర్ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యువల్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే పూర్తి డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియ కేవలం 3 దశల్లోనే ఉంటుంది.
స్టెప్ 1
కేవలం 1800-258-5956 కాల్ చేయండి. ఎటువంటి దరఖాస్తులు నింపాల్సిన పని లేదు.
స్టెప్ 2
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ తనిఖీ కోసం లింక్ పొందండి. దశలవారీ ప్రక్రియ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుంచే మీ వాహన నష్టాలను నివారించుకోండి.
స్టెప్ 3
నెట్‌వర్క్ గ్యారేజీల ద్వారా మీకు నచ్చిన విధానంలో అంటే రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్‌గా రిపేర్ చేసుకునేందుకు ఎంచుకోండి.
హొండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (HMSI) యొక్క సంక్షిప్త చరిత్ర
హెచ్ఎంఎస్ఐ (HMSI) అనేది హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్, జపాన్ యొక్క సొంత సబ్సిడరీ సంస్థ. 1999లో భారత్‌లో ఈ సంస్థ తొలి ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. వీరి ప్రధాన ఉత్పత్తి కేంద్రం హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా మనేసర్‌లో ఉంది. జపనీస్ సంస్కృతిలాగే పనితీరు, మైలేజీపరంగా అద్భుతంగా ఉంటుంది. ఆ వెంటనే ఈ కంపెనీ రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లా టపుకరాలో రెండో ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించింది.
హీరో మోటోకార్ప్ సహకారంతో భారత మార్కెట్లోకి హోండా ప్రవేశించినప్పటికీ అది 2014 తర్వాత పూర్తి స్వతంత్రంగా మారింది. ప్రస్తుతం ఇది భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ వాహన తయారీ సంస్థగా ప్రఖ్యాతి గాంచింది.
హోండా కంపెనీ అందించే కొన్ని మోడల్స్‌ను కింద పేర్కొన్నాం..
- హోండా యాక్టివా ఐ (Honda Activa i)
- హోండా యాక్టివా 5జీ (Honda Activa 5G)
- హోండా ఎక్స్–బ్లేడ్ (Honda X-Blade)
- హోండా హార్నెట్ 160ఆర్ (Honda Hornet 160R)
- హోండా సీబీఆర్ 250ఆర్ (Honda CBR 250R)
హోండా ఇటీవల కొన్ని హై–ఎండ్ మోడళ్లను కూడా పరిచయం చేసింది.
- హోండా సీబీఆర్ 300 ఆర్ (Honda CBR 300R)
- హోండా సీబీఆర్ 650ఆర్ (Honda CBR 650R)
- హోండా సీబీ 1000ఆర్ (Honda CB 1000R)
- హోండా సీబీఆర్ 1000ఆర్ఆర్ (Honda CBR 1000RR)
- హోండా గోల్డ్ వింగ్ (Honda Gold Wing)
గమనించదగిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే జాబితాలో ఉన్న చివరి మోడల్.. హోండా గోల్డ్ వింగ్.. ఒక రకమైన క్రూజర్ వాహనం. ఈ కొత్త వాహనంలో రివర్స్ గేర్‌తో పాటు ఆప్షనల్‌గా ఎయిర్-బ్యాగ్ కూడా ఉంటుంది. ఇది వారి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.
హోండాను ఏది పాపులర్ చేసింది?
అన్ని వర్గాలకు చెందిన కస్టమర్లలో హోండా టూ వీలర్లను ప్రఖ్యాతంగా చేసే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇంకా , హోండా ఇప్పటివరకు సాధించిన విజయాలు కంపెనీ ఏటా విడుదల చేసే అత్యుత్తమ టూవీలర్లకు నిదర్శనం.
వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం:
- గుజరాత్‌లోని విఠలాపురలోని ప్రొడక్షన్ ప్లాంట్ పూర్తిగా స్కూటర్‌ల తయారీకి అంకితం చేయబడింది.
- హోండా సాంకేతికత ఎంత అత్యున్నతమైనది అంటే ప్రపంచంలోని కొన్ని టూ వీలర్ వాహన తయారీదారులు మాత్రమే ఈ కంపెనీతో సరిపోలుతారు. యమహా, డుకాటి తర్వాత వస్తున్న మోటోజీపీ (MotoGP)లో అన్ని విభాగాల్లోనూ మూడో అత్యంత విజయవంతమైన తయారీదారుగా చెప్పుకోవచ్చు.
- 2004 సంవత్సరం నాటికి, హోండా తమ ఫ్యూయల్ సెల్-పవర్డ్ మోటార్‌బైక్‌ల కోసం ఒక ప్రోటోటైప్ అభివృద్ధిపరిచింది.
- సీబీఆర్ 250ఆర్ (CBR 250R), 249 సీసీ (cc) సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో రూపొందించబడింది. ఇది హోండా ప్రారంభించిన చిన్న రేసింగ్ కేటగిరీ మోటార్‌బైక్.
సరిహద్దులను దాటేయడంతో ఒక కంపెనీ జనాదరణ పొందుతుంది. ఇది కంపెనీ విజయం సాధించడానికి ముందడుగు వేయడమే. హోండా స్వచ్ఛమైన ట్రాక్ రికార్డ్, టూవీలర్ వాహనాల తయారీలోనే కాకుండా ఇతర వెంచర్లలో కూడా అత్యంత గుర్తింపు పొందిన తయారీదారుల్లో ఒకటిగా నిలిచింది.
అయితే, టూ వీలర్ వాహనాల తయారీ పరిశ్రమలో ఉన్న అడ్డంకులను ఎదుర్కొని హోండా గొప్ప గొప్ప మోడల్స్‌ను తయారు చేసినప్పటికీ అవి కూడా ఇతర టూ వీలర్ల మాదిరిగానే రోడ్డు ప్రమాదాలకు గురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ సొంత వాహనానికి లేదా ప్రమాదంలో మరో థర్డ్ పార్టీ వాహనానికి జరిగే డ్యామేజీల వల్ల భారీగా ఆర్థిక భారం పడుతుంది.
అలాంటి సందర్భాల్లో మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి, మీరు హోండా టూ వీలర్ ఇన్పూరెన్స్ పాలసీ పొందడం మంచిది.
మీరు హోండా టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు తీసుకోవాలి?
కొన్ని కారణాల వల్ల టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు అవసరం అనిపిస్తాయి. మీరు హోండా టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు తీసుకోవాలో కొన్ని కారణాలు:
- చట్టం ప్రకారం తప్పనిసరి- మోటార్ వాహనాల చట్టం–1988 ప్రకారం ప్రతి మోటార్ బైక్‌కు థర్డ్ పార్టీ లయబిలిటీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. మీ హోండా టూ వీలర్ కనీసం థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ కింద కవర్ చేయకపోతే మీరు భారీగా ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. మోటార్ వాహనాల (సవరణ) చట్టం–2019 ప్రకారం, టూ వీలర్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయనందుకు ట్రాఫిక్ జరిమానా రూ. 2 వేలు, మళ్లీ అదే తప్పు చేస్తే రూ. 4 వేల వరకు జరిమానా ఉంటుంది.
- థర్డ్-పార్టీకి జరిగిన డ్యామేజీల కోసం క్లెయిమ్ రీయింబర్స్‌మెంట్ - థర్డ్ పార్టీ లయబిలిటీలు థర్డ్ పార్టీ, కాంప్రహెన్సివ్ హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండింటిలోనూ కవర్ అవుతాయి. ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా వచ్చిన ప్రయోజనం కింద, మీ హోండా టూ వీలర్ వాహనం ద్వారా థర్డ్ పార్టీ వాహనాలు లేదా ప్రాపర్టీలకు జరిగే డ్యామేజీల ద్వారా కలిగే నష్టాలను నుంచి మీకు భద్రత కల్పిస్తుంది. ప్రమాదవశాత్తు గాయం లేదా థర్డ్ పార్టీ వ్యక్తి మరణం కారణంగా వచ్చే లయబిలిటీలకు కూడా ఇది వర్తిస్తుంది. బాధ్యతలను చేర్చడానికి ఈ ప్రయోజనం మరింత విస్తరించింది. ఇన్సూరెన్స్ సంస్థగా మేము నిర్ణీత సమయంలో తలెత్తే చట్టపరమైన కేసులను కూడా చూసుకుంటాం.
- పర్సనల్ యాక్సిడెంట్ యాడ్–ఆన్ కవర్- హోండా టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని (థర్డ్ పార్టీ లేదా కాంప్రహెన్సివ్) పొంది, దాంతో పాటు తప్పనిసరి పర్సనల్ యాక్సిడెంట్ యాడ్-ఆన్ కవర్‌ను కొనుగోలు చేస్తే ప్రమాదవశాత్తు మీకు శాశ్వత అంగ వైకల్యం కలిగితే పరిహారాన్ని పొందేందుకు అర్హులవుతారు. అంతేకాకుండా ప్రమాదంలో మరణం సంభవించినట్లయితే మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం కూడా అందుతుంది.
- మీ సొంత హోండా టూవీలర్‌కు జరిగే నష్టాలను కవర్ చేస్తుంది - ప్రమాదాలు థర్డ్ పార్టీలకు మాత్రమే కాకుండా మీ హోండా టూవీలర్ వాహనానికి కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఒక కాంప్రహెన్సివ్ టూ వీలర్ వెహికిల్ ఇన్పూరెన్స్ పాలసీతో ప్రమాద సమయంలో మీ సొంత వాహనానికి జరిగిన నష్టానికి ఆర్థిక రక్షణ పొందొచ్చు. మీ టూ వీలర్ వాహనం దొంగతనానికి గురైనా లేదా అగ్నిప్రమాదం, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా లేదా మానవుల వల్ల జరిగిన విపత్తుల కారణంగా డ్యామేజీ అయినా ఈ పాలసీ కవరేజీ అందిస్తుంది.
అయితే, పై ప్రయోజనాల్లో మరికొన్నింటిని ఆస్వాదించడానికి మీరు దేశంలోని ప్రముఖమైన ఇన్సూరెన్స్ సంస్థ నుంచి పాలసీని పొందడం చాలా కీలకం. ఈ విషయంలో డిజిట్ ఇన్సూరెన్స్ సరైన ఎంపిక!
ఎందుకో ఒకసారి చూడండి!
తమ హోండా టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద డిజిట్ ఏం అందిస్తుంది?
మన దేశంలో చాలా మంది ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు ఉన్నప్పటికీ, డిజిట్ అందించే ప్రయోజనాలు చాలా విభిన్నంగా ఉన్నాయి. డిజిట్ యొక్క హోండా ఇన్పూరెన్స్ పాలసీ అందించే కొన్ని ఆకర్షణీయమైన ప్రయోజనాలను పరిశీలించండి -
హోండా ఇన్సూరెన్స్ పాలసీల యొక్క మరిన్ని ఎంపికలు- హోండా టూ వీలర్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీల విషయానికొస్తే డిజిట్ చాలా ఎంపికలను అందిస్తుంది. ఉదాహరణకు-
- a) థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ - ఈ పాలసీ కింద, మీ టూ వీలర్ వాహనం ద్వారా థర్డ్ పార్టీ వ్యక్తికి, ఆస్తికి లేదా వాహనానికి నష్టం జరిగితే కలిగే ఆర్థిక నష్టాలను మీరు కవర్ చేసుకోవచ్చు.
- b) కాంప్రహెన్సివ్ టూ వీలర్ వాహన ఇన్సూరెన్స్ పాలసీ - ఈ పాలసీ సమగ్ర రక్షణను అందిస్తుంది. థర్డ్-పార్టీ నష్టాలే కాకుండా, ప్రమాదం, దొంగతనం మొదలైన వాటి కారణంగా మీ సొంత వాహనానికి జరిగే డ్యామేజీలను కూడా కాంప్రహెన్సివ్ పాలసీ కవర్ చేస్తుంది.
- ఒకవేళ మీరు 2018 సెప్టెంబర్ తర్వాత మీ హోండా టూ వీలర్‌ను కొనుగోలు చేసినట్లయితే, మీరు థర్డ్-పార్టీ ప్రయోజనాలు లేకుండా కాంప్రహెన్సివ్ పాలసీ ప్రయోజనాలను అందించే ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా పొందుతారు.
- పెద్ద సంఖ్యలో నెట్‌వర్క్ గ్యారేజీలు - డిజిట్ దేశవ్యాప్తంగా వేల కొద్ది నెట్‌వర్క్ గ్యారేజీలను కలిగి ఉంది. ఇన్సూరెన్స్ సంస్థ కింద ఉన్న ఈ గ్యారేజీల వద్ద మీ టూ వీలర్ వాహనం కోసం క్యాష్ లెస్ రిపేర్ల సౌకర్యాన్ని పొందవచ్చు. అందువల్ల మీ హోండా బైక్‌కు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు డిజిట్ కింద పెద్ద సంఖ్యలో నెట్‌వర్క్ గ్యారేజీలు ఉన్నాయనే విషయం గుర్తించండి.
- అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోతో వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ - సాధారణంగా క్షేత్రస్థాయిలో డ్యామేజీలను కంపెనీ ప్రతినిధులు సందర్శించి అంచనా వేసిన తర్వాతే క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే డిజిట్ ఈ ప్రక్రియను సులభతరం చేసింది. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా స్వీయ తనిఖీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మీ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిట్ అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కలిగి ఉంది. దీంతో మీ క్లెయిమ్ తిరస్కారానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
- మీ హోండా టూ-వీలర్ ఇన్సూరెన్స్ కోసం అధిక ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ)- ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అనేది మీ హోండా టూ వీలర్‌కు మొత్తం నష్టం లేదా తీరని నష్టం జరిగినప్పుడు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి మీరు పొందగలిగే మొత్తాన్ని సూచిస్తుంది. ఇది కొన్న ధర నుంచి మీ హోండా బైక్ తరుగుదల తీసివేయడం ద్వారా తెలుస్తుంది. మీరు అధిక, కస్టమైజ్డ్ ఐడీవీ (IDV)ని అందించే డిజిట్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు.
- సులభమైన కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియ - హోండా బైక్ ఇన్పూరెన్స్ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి డిజిట్ చాలా సులభమైన విధానాన్ని అందిస్తుంది. దీనిలో మీరు మీకోసం సరైన పాలసీని ఎంచుకున్న తర్వాత యాడ్–ఆన్ ఆఫర్లను చూడొచ్చు. మీ ప్రీమియం మొత్తాన్ని చూసుకోవచ్చు. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న పాలసీని ఖరారు చేసిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని నింపడం, ప్రీమియం చెల్లింపు ప్రక్రియను నిమిషాల వ్యవధిలో ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.
- వివిధ రకాల యాడ్-ఆన్ ఎంపికలు - డిజిట్ వినియోగదారులకు వివిధ రకాల యాడ్-ఆన్ ఎంపికలను అందిస్తుంది. దిగువ ఇచ్చిన యాడ్–ఆన్ కవర్లను పొందడం వల్ల మీ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి మీ ప్రయోజనాలను గరిష్టంగా పొందడంలో మీకు సహాయపడుతుంది:
- a) జీరో డిప్రిషియేషన్ కవర్
- b) రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
- c) బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్
- d) ఇంజన్, గేర్ ప్రొటెక్షన్ కవర్
- e) కంజూమబుల్ కవర్
- ఎల్లప్పుడూ యాక్సెస్- డిజిట్ వారి సేవలను 24X7 అందిస్తుంది. దీంతో మీకు అవసరమైనప్పుడు క్లెయిమ్‌లు లేదా ఫిర్యాదులను స్వీకరించేందుకు మీకు అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ప్రమాదాలు, గాయాలు అయిన సందర్భాల్లో ఇది ఎంతగానో దోహదపడుతుంది. జాతీయ సెలవు దినాల్లో కూడా మా సేవలు అందుబాటులో ఉంటాయి.
- నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలు- నో క్లెయిమ్ బోనస్ అంటే క్లెయిమ్ చేసుకోని ప్రతీ ఏడాదికి మీకు ప్రయోజనాలను అందిస్తూ వచ్చేది. ఈ ప్రయోజనంతో మీరు పాలసీని పొందే తదుపరి సంవత్సరానికి చెల్లించాల్సిన ప్రీమియంపై 20% నుంచి 50% వరకు తగ్గింపు పొందుతారు. డిజిట్ ఇన్సూరెన్స్ అందించే ఈ ప్రయోజనం ప్రతి పాలసీ రెన్యువల్ లేదా వేరే ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డిజిట్ సేవలు పొందేందుకు మారితే పొందుతారు.
డిజిట్ అందించే ప్రయోజనాలు చాలా లాభదాయకంగా ఉన్నప్పటికీ కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి కాంప్రహెన్సివ్ హోండా టూ వీలర్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీకి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని మేం అర్థం చేసుకుంటాం.
కానీ బాధపడకండి. మేము కొన్ని రహస్యాలను వెల్లడించబోతున్నాం.
మీ హోండా టూ-వీలర్ ఇన్సూరెన్స్‌పై ప్రీమియం తగ్గించవచ్చా? ఎలాగో తెలుసుకోండి!
అవును, మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం మొత్తాన్ని తగ్గించుకోవడానికి మీరు కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు. ఆన్‌లైన్‌లో హోండా బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ లేదా కొనుగోలు అయినా, మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీకి అవసరమైన దానికంటే ఎక్కువ చెల్లించకుండా ఉండేందుకు కింది చిట్కాలను పాటించండి:
- నేరుగా ఇన్సూరర్ నుంచే కొనండి - మీరు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఏజెంట్ లేదా బ్రోకర్‌తో సంబంధం లేకుండా చూసుకోండి. చాలా మంది ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు సాధారణ ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్‌లో తమ పాలసీలను కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంటారు. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీని నేరుగా కొనుగోలు చేసే అవకాశంతో పాటు మధ్యవర్తుల నుంచి చార్జీలు పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది.
- కచ్చితంగా అవసరమైన యాడ్–ఆన్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి- పాలసీని ఖరారు చేస్తున్నప్పుడు, మీకు నిజంగా అవసరమైన యాడ్–ఆన్ కవర్లు ఏంటో ఓసారి చూసుకోండి. ప్రతి యాడ్–ఆన్ కవరేజీకి ప్రీమియం మొత్తంలో కలుస్తుంది. అందుకే కచ్చితంగా అవసరమైతే తప్ప యాడ్-ఆన్‌లను ఎంచుకోవద్దు.
- నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాల కోసం చూడండి- పాలసీదారులు ఒక సంవత్సరంలో తమ పాలసీపై ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే పాలసీదారులకు నో క్లెయిమ్ బోనస్ ఇస్తారు. ఈ ప్రయోజనం తదుపరి సంవత్సరంలో పాలసీ యొక్క ప్రీమియంపై తగ్గుతుంది.
- వాలంటరీ తగ్గింపులను ఎంచుకోండి - మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీపై వాలంటరీ తగ్గింపును ఎంచుకోవచ్చు. మీ దీనిలో మీ ఇన్సూరెన్స్ కవర్ కావడానికి ముందే మీ క్లెయిమ్‌లో కొంత భాగాన్ని సెటిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ మినహాయింపును ఎంచుకుంటే మీ ప్రీమియం చెల్లింపులో కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
ఇప్పుడు పాలసీలు, ప్రీమియం తగ్గింపుపై పూర్తి అవగాహనతో మీ హోండా టూ వీలర్ బైక్ కోసం సరైన పాలసీ ఎంచుకునేందుకు త్వరపడండి. మీకు వచ్చే మరికొన్ని సందేహాలను తీర్చేందుకు కొన్ని అంశాలను కింద చర్చించాము.
ఆన్‌లైన్‌లో హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
నేను నా ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను మారిస్తే.. ఇప్పటికీ నో క్లెయిమ్ బోనస్ పొందేందుకు అర్హుడినేనా?
అవును, మీరు ఇప్పటికీ మీ నో క్లెయిమ్ బోనస్‌ను పొందవచ్చు. మీరు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను మార్చుకుంటే మీ ప్రీమియం ఛార్జీని తగ్గించుకోవచ్చు.
టూ వీలర్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ కోసం కావాల్సినవి ఏమిటి?
టూ వీలర్ వాహన ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ కోసం కొన్ని పత్రాలు, వివరాలు అందించాలి.
- • టూ వీలర్ రిజిస్ట్రేషన్ నంబర్
- • టూవీలర్ ఛాసిస్ నంబర్
- • వాహనం కొనుగోలు తేదీ, స్థలం
- • పేరు, ఐడీ ప్రూఫ్ సహా మీ కేవైసీ (KYC) వివరాలు
- • టూ వీలర్ వాహన మోడల్, దాని తయారీ తేదీ
నా దగ్గర థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ లేకపోతే ఏమవుతుంది?
మీరు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ లేకుండా మీ టూ వీలర్ బైక్ నడుపుతూ అధికారులకు పట్టుబడితే మీరు భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. రూ. 2000 (మళ్లీ తప్పు చేస్తే రూ. 4000) లేదా 3 నెలల జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో రెండూ వర్తించవచ్చు.