హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్

హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్​ను కేవలం రూ. 714 ప్రారంభ ధర నుంచి పొందండి. మీ డిజిట్ పాలసీని రెన్యూవల్ చేయండి

Third-party premium has changed from 1st June. Renew now

ఆన్​లైన్​లో హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్​ను కొనుగోలు/రెన్యూవల్ చేయండి

హీరో మ్యాస్ట్రో టూ వీలర్స్ గురించి, అసలు అవి ఎందుకు అంత ప్రజాదరణ పొందాయనే విషయాలను గురించి పూర్తిగా తెలుసుకోండి. మీ టూ వీలర్ కొనుగోలు చేసే ముందు టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఆలోచించండి.

భారతదేశంలో అత్యుత్తమ టూ వీలర్ల​ను హీరో అందిస్తోంది. హీరో కంపెనీ నుంచి వచ్చిన సరసమైన ధర, అధునాతన ఫీచర్లు ఉన్న బైక్ మ్యాస్ట్రో. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రజల కోసం రూపొందించబడింది. మ్యాస్ట్రో స్కూటర్లు ఆకర్షణీయమైన ధరలు, అత్యుత్తమ నాణ్యతతో వస్తాయి.

మీ హీరో మ్యాస్ట్రోను ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా?

మ్యాస్ట్రో బైక్​ను సొంతం చేసుకోవడం మీకు చాలా సంతోషాన్నిస్తుంది. కానీ మీ బైక్​కు జరిగే అనుకోని ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు ఆర్థికంగా రక్షించుకోవడం చాలా ముఖ్యం. హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్ పాలసీ మీ ఆర్థికపరమైన ఖర్చులను తగ్గించడంలో సహాయం చేస్తుంది.

మీ మ్యాస్ట్రో బైక్​కు బీమా పొందడం ఏం ఆప్షనల్ కాదు. మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం వాహనానికి బీమా కలిగి ఉండటం తప్పనిసరి. కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ అయినా ఉండాలి. మీరు ఏ విధమైన బీమా లేకుండా వాహనంతో రోడ్ల మీద తిరిగితే మీకు భారీ ట్రాఫిక్ ఫైన్ పడే ప్రమాదం ఉంటుంది. బీమా లేకుండా మొదటి సారి పట్టుబడితే రూ. 2,000, రెండో సారి పట్టుబడితే రూ. 4,000 జరిమానా చెల్లించాల్సి రావచ్చు. 

హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి..

మీరు డిజిట్ అందించే హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్​ను ఎందుకు కొనుగోలు చేయాలి?

హీరో మ్యాస్ట్రోకు వివిధ రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదం వలన సొంత టూ వీలర్​కు అయిన డ్యామేజీలు, నష్టాలు

×

అగ్నిప్రమాదం వలన సొంత టూ వీలర్​కు అయిన డ్యామేజీలు/నష్టాలు

×

ప్రకృతి విపత్తుల వలన సొంత వాహనానికి జరిగిన డ్యామేజీలు/నష్టాలు

×

థర్డ్ పార్టీ వాహన డ్యామేజీలు

×

థర్డ్ పార్టీ ఆస్తి డ్యామేజీలు

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ వ్యక్తికి అయిన గాయాలు/మరణం

×

మీ స్కూటర్ లేదా బైక్ దొంగిలించబడితే

×

మీ ఐడీవీ ని నచ్చిన విధంగా మార్చుకోగలగడం

×

కస్టమైజ్​ చేయబడిన యాడ్-ఆన్లతో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్​ల మధ్య తేడాలను గురించి మరింత తెలుసుకోండి.

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా బీమా ప్లాన్​ను కొనుగోలు చేసిన లేదా రిన్యూ చేసినా మీరు క్లెయిమ్స్ గురించి నిశ్చింతగా ఉండండి. మా వద్ద 3 సులభమైన స్టెప్పుల ప్రక్రియ ఉంది. డిజిటల్ క్లెయిమ్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది.

స్టెప్1

కేవలం 1800-258-5956 నెంబర్​పై కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదు.

స్టెప్2

మీ రిజిస్టర్డ్ మొబైల్​ నెంబర్​కు స్వీయ తనిఖీ లింక్ పంపబడతుంది. దాని ద్వారా మీ వాహన డ్యామేజీని ఫొటో తీసి మాకు పంపించండి. తర్వాత ఏం చేయాలో మేము దశలవారీగా మీకు వివరిస్తాం.

స్టెప్3

మీకు నచ్చిన పద్ధతిలో రిపేర్ చేయించుకోండి. రీయింబ్స్​మెంట్ అయినా లేదా మా నెట్​వర్క్​ గ్యారేజీల్లో క్యాష్​లెస్ పద్ధతిలో అయినా..

డిజిట్ క్లెయిమ్స్ ఎంత త్వరగా సెటిల్ అవుతాయి? మనలో ఎవరైనా సరే బీమా కంపెనీని మారేటపుడు తలెత్తే మొదటి ప్రశ్నఇది. ఇలా సందేహం రావడం మంచిదే. మీరు సరిగ్గానే ఆలోచిస్తున్నారు. డిజిట్ క్లెయిమ్ రిపోర్ట్ కార్డ్ చదవండి

హీరో మ్యాస్ట్రో: భారతదేశంలో అత్యుత్తమ స్కూటర్

కేవలం 8 సంవత్సరాల కింద ప్రారంభించబడిన హీరో మ్యాస్ట్రో దేశంలో ఇది వరకు ఉన్న పాత స్కూటర్లకు గట్టి పోటీనిచ్చింది. హీరో హోండా కంపెనీలు విడిపోయిన తర్వాత మ్యాస్ట్రో లండన్​లోని O2 ఎరేనాలో విడుదలయింది.

  • హీరో కంపెనీ ప్రధానంగా మోటార్ సైకిళ్ల తయారీ మీద దృష్టి సారించిన తర్వాత మ్యాస్ట్రో అనేది హీరో నుంచి విడుదలయిన రెండో స్కూటర్. దీనికి ఉన్న ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు, సరసమైన ధర ప్రజల్లో దీనిని పాపులర్ చేశాయి.
  • 110cc ఇంజిన్​తో ఉన్న ఈ స్కూటర్ లీటర్​కు 65 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు.
  • 2016లో CNBC-TV18 ఓవర్ రైడ్ అవార్డ్స్​లో మ్యాస్ట్రో స్కూటర్ బెస్ట్ స్కూటర్ ఆఫ్ ది ఇయర్​ అవార్డును గెలుచుకుంది. (1)
  • ఇందులో ఉన్న USB 3.0 చార్జింగ్ పోర్ట్, కటింగ్ ఎడ్జ్ ఫీచర్లకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి.
  • ప్రభుత్వ నియమాల ప్రకారం కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125ను హీరో కంపెనీ BS-VI వెర్షన్​లో విడుదల చేసింది.
  • 2017వ సంవత్సరంలో భారతదేశంలో జనాదరణ పొందిన స్కూటర్ల విషయానికి వస్తే హీరో మ్యాస్ట్రో మూడో స్థానం​లో నిలిచింది. అదే సంవత్సరం జూలైలో హీరో మ్యాస్ట్రో దాదాపు 40,000 యూనిట్లను విక్రయించింది. మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని చాటుకుంది. (2)

ధర, పర్ఫామెన్స్ పరంగా హీరో మ్యాస్ట్రో ఒక అత్యుత్తమ స్కూటర్. కావున మ్యాస్ట్రోకు ప్రశంసలు రావడమనేది సాధారణమే.

కానీ భారతీయ రోడ్ల మీద తిరిగే ఇతర టూ వీలర్స్ వలె మ్యాస్ట్రో కూడా దొంగతనాలు, ప్రమాదాలు, డ్యామేజీల​కు గురయ్యే ప్రమాదం ఉంది.

మీరు కనుక హీరో మ్యాస్ట్రో బైక్​ను కొనుగోలు చేస్తే హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్​ను తీసుకోవడం తప్పనిసరి. ఇది మీ మ్యాస్ట్రో స్కూటర్​కు కలిగే అన్ని రకాల డ్యామేజీల నుంచి సంరక్షణను ఇస్తుంది.

కానీ.. మీరు పాలసీని కొనుగోలు చేసే ముందు మన దేశంలోని బీమా సంస్థల గురించి పరిశోధన చేయాలి.

డిజిట్ అనేది వివిధ రకాల టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించే ఒక కంపెనీ.

మీ హీరో మ్యాస్ట్రో టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం డిజిట్​ను ఎందుకు ఎంచుకోవాలి?

మీ స్కూటర్​ ఇన్సూరెన్స్ కోసం డిజిట్​ ఇన్సూరెన్స్ కంపెనీని అనేక కారణాలు ఉత్తమ చాయిస్​గా మారుస్తాయి. వాటిల్లో కొన్నింటి గురించి కింద ఇవ్వబడింది.

  • ఆన్​లైన్ కొనుగోలు, క్లెయిమ్స్ – మ్యాస్ట్రో టూ వీలర్ యజమానిగా మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండాలని చూస్తారు. డిజిట్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంది. అందుకనే పాలసీ కొనుగోలు, క్లెయిమ్స్ విషయంలో పూర్తి ఆన్​లైన్ ప్రక్రియను అందిస్తోంది. అంతేకాకుండా డిజిట్ అందిస్తున్న స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభమవుతుంది. ఈ పేపర్​లెస్ ప్రక్రియ మీకు త్వరితమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఎటుంటి చింత లేకుండా ఉంటుంది.
  • 24x7 అందుబాటులో కస్టమర్ సపోర్ట్- అనుకోని సందర్భంలో ప్రమాదం వలన మీరు అర్ధరాత్రి మీ హీరో మ్యాస్ట్రో బైక్​కు క్లెయిమ్ చేయాల్సి వస్తే.. మీరు సింపుల్​గా మా 24x7 కస్టమర్ సపోర్ట్​కు కాల్ చేస్తే సరిపోతుంది. మీరు ఏ సమయంలో ఫోన్ చేసినా కానీ మా కస్టమర్ ప్రతినిధులు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. డిజిట్ 24x7 కస్టమర్ కేర్ సర్వీసుకు కాల్ చేసి మీ క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించండి.
  • కంటే ఎక్కువ నెట్​వర్క్ గ్యారేజీలు – మీ స్కూటర్​కు ప్రమాదం జరిగినపుడు రిపేర్ ఖర్చులను మీ జేబు నుంచి భరించడం చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఇప్పటికే ఇన్సూరెన్స్ ప్లాన్​ను కలిగి ఉంటే డిజిట్ అందిస్తున్న 1,000 కంటే ఎక్కువ క్యాష్​లెస్ గ్యారేజీల ద్వారా మీరు క్యాష్​లెస్ రిపేర్లు చేయించుకోవచ్చు.
  • సులభమైన రెన్యూవల్ ప్రాసెస్ – హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం చూస్తున్న పాలసీ దారులు సులభమైన ప్రక్రియతో రెన్యూవల్ చేసుకోవచ్చు. కొత్త పాలసీ కొనుగోలుకు కూడా సులభమైన ప్రక్రియే ఉంటుంది. కంపెనీ అందిస్తున్న డిజిటల్ పద్ధతి ద్వారా కస్టమర్లు ఆన్​లైన్​లోనే పాలసీని రెన్యూవల్ చేసుకోవచ్చు. మీరు ఇందుకోసం ఎటువంటి పేపర్ వర్క్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి తనిఖీలు కూడా ఉండవు.
  • మీకు నచ్చిన విధంగా ఐడీవీ (IDV)ని మార్చుకునే సదుపాయం – ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ అనేది మీ స్కూటర్ ఎప్పుడైనా అనుకోని సందర్భాల్లో దొంగిలించబడినా లేదా మరమ్మతు చేయలేకుండా పాడైపోయినా బీమా కంపెనీ మీకు అందించే విలువను సూచిస్తుంది. వాహనం అమ్మకపు ధర నుంచి తరుగుదలను తీసేస్తే ఈ విలువ వస్తుంది. అధిక ఐడీవీ (IDV) అనేది అనుకోని సందర్భాల్లో మీ ద్విచక్రవాహనాలకు నష్టాలు జరిగినపుడు ఎక్కువ పెట్టుడిని తిరిగి పొందేందుకు సహాయపడుతుంది. మీ అవసరాలకు తగ్గట్లు ఐడీవీ (IDV) విలువను మార్చుకునేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ఎక్కువ ఐడీవీ (IDV)ని ఎంచుకోవడం వలన మీ హీరో మ్యాస్ట్రో బైక్ రిపేర్ చేయలేకుండా డ్యామేజ్ అయినపుడు మీకు అధిక మొత్తంలో క్లెయిమ్ వస్తుంది.
  • ఆకర్షణీయమైన ఎన్​సీబీ (NCB)లు – మీరు డిజిట్​ పాలసీ తీసుకుని సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయకుండా ఉంటే.. మీకు రెన్యూవల్ సమయం​లో ఆకర్షణీయమైన బోనస్ అందుతుంది. దీనినే నో క్లెయిమ్ బోనస్ (NCB) అని పిలుస్తారు. మీరు ఇలాగే క్లెయిమ్ చేయకుండా కొనసాగితే మీకు పాలసీ ప్రీమియంలలో 50 శాతం వరకు బోనస్ అందుతుంది.
  • ఎక్కువ సంఖ్యలో పాలసీ ఆప్షన్లు – అనేక టూ వీలర్ పాలసీల నుంచి ఎంచుకునేందుకు డిజిట్ మీకు అవకాశం కల్పిస్తుంది.

a) థర్డ్ పార్టీ లయబులిటీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ థర్డ్ పార్టీ వ్యక్తులు లేదా ఆస్తులకు జరిగిన నష్టాలను మాత్రమే ఈ పాలసీలు కవర్ చేస్తాయి. కానీ ప్రమాదం వలన మీ సొంత వాహనానికి డ్యామేజ్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోలేరు.

b) కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక వేళ మీ మ్యాస్ట్రో స్కూటర్​కు ప్రమాదం జరిగితే ఈపాలసీ ద్వారా థర్డ్ పార్టీ లయబులిటీ, సొంత డ్యామేజీలు కూడా కవర్ అవుతాయి. అంతేకాకుండా అగ్నిప్రమాదాలు, మానవనిర్మిత ప్రకృతి విపత్తుల వలన సంభవించే నష్టాలను కూడా ఇది కవర్ చేస్తుంది.

ఒకవేళ మీరు 2018 సెప్టెంబర్ తర్వాత వాహనాన్ని కొనుగోలు చేస్తే అదనంగా మీకు ఓన్ డ్యామేజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. ఇది స్పెషల్ ఫామ్ ఇన్సూరెన్స్ కవర్. ఎటువంటి థర్డ్ పార్టీ లయబులిటీలు లేకుండా కాంప్రహెన్సివ్ ప్రయోజనాలను పొందొచ్చు. థర్డ్ పార్టీ లయబులిటీ ప్లాన్ ఉన్న వారికి సమగ్ర ఆర్థిక సంరక్షణ కోరుకునే వారికి ఈ పాలసీ బాగా పని చేస్తుంది.

యాడ్-ఆన్​లతో మీకు అదనపు రక్షణ – మీరు మ్యాస్ట్రో ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నపుడు మీరు సమగ్ర కవరేజ్ కోసం వెతకాలి. డిజిట్ మీకు అటువంటి సమగ్ర సంరక్షణను అందించే యాడ్–ఆన్లను ఆఫర్ చేస్తోంది.

ఈ యాడ్–​ఆన్స్​తో మీరు అదనపు ఆర్థిక రక్షణ పొందొచ్చు.

పాపులర్ మోడళ్లకు హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్ పాలసీలు

హీరో కంపెనీ మ్యాస్ట్రో బైక్​ రెండు మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఒకటి మ్యాస్ట్రో ఎడ్జ్, మ్యాస్ట్రో ఎడ్జ్ 125 డిజిట్ ఈ రెండు మోడళ్లకు కూడా నిర్దిష్ట పాలసీలను అందిస్తుంది.

  • హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ – హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ డ్యూయల్ వాల్వ్ 110cc సింగిల్ ఇంజిన్​తో వస్తుంది. ఆటోమేటిక్ క్లచ్​ ఉంటుంది. గరిష్టంగా 8.7 Nm టార్క్​ ఉంటుంది. మ్యాస్ట్రో పంచ్ మామూలుగా ఉండదు. మ్యాస్ట్రో ఎడ్జ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు కలిగే ఆర్థిక నష్టాలను కవర్ చేస్తుంది. మరింత చెప్పుకోవాలంటే మీ వాహనం వలన ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తులు గాయపడితే వచ్చే చట్టపరమైన సమస్యలను ఇది సెటిల్ చేస్తుంది. కావున మీకు ఎటువంటి చింత ఉండదు.
  • హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 – మ్యస్ట్రో ఎడ్జ్ 125 భారతదేశపు మొదటి ఫ్యూయల్ ఇంజెక్షన్ ఆధారిత స్కూటర్. స్మార్ట్​గా ఫ్యూయల్ సరఫరా చేసేందుకు వాహనం​లో అనేక సెన్సార్స్ ఉంటాయి. దీని పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్ చాలా ఇంప్రెసివ్​గా ఉంటుంది. ఈ స్కూటర్ 125cc ఇంజిన్​ను కలిగి ఉంటుంది. పవర్ ఫుల్ స్పీడ్స్​ను డెలివర్ చేస్తుంది. ఇలా బడ్జెట్​ ఫ్రెండ్లీ స్కూటర్లలో 10.2 Nm టార్క్​ ఉండటం మరో విశేషం.

మీరు కలిగి ఉన్న మ్యాస్ట్రో మోడల్​తో ఎటువంటి సంబంధం లేకుండా మీరు నాణ్యమైన ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయాలని గుర్తుంచుకోవాలి.

మీ అవసరాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత డిజిట్ అందిస్తున్నటూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుండి.

హీరో మ్యాస్ట్రో వేరియంట్స్, ఎక్స్​ షోరూం ధరలు

వేరియంట్స్ ఎక్స్​షోరూం ధర
మ్యాస్ట్రో ఎడ్జ్ VX, 53 Kmpl, 110.9 cc ₹ 51,530
మ్యాస్ట్రో ఎడ్జ్ ZX, 53 Kmpl, 110.9 cc ₹ 52,930

భారతదేశంలో హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

నేను పాలసీ రెన్యూవల్ చేసే సమయంలో బీమా కంపెనీ నా మ్యాస్ట్రో స్కూటర్​ను తనిఖీ చేస్తుందా?

లేదు. మీరు డిజిట్ పాలసీ తీసుకుంటే పాలసీ రెన్యూవల్ సమయంలో ఎటువంటి తనిఖీ అవసరం ఉండదు.

వరదల వలన సంభవించిన ఆర్థిక నష్టాలను మ్యాస్ట్రో ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

మీరు ఒక వేళ కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకున్నట్లయితే భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల వలన మీ స్కూటర్​కు జరిగిన డ్యామేజీల​కు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందొచ్చు.

ఎలక్ట్రిక్ ఇంజిన్ డ్యామేజీని రిపేర్ చేయడంలో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్ సాయం చేస్తుందా?

బేస్ పాలసీలు మీ ఇంజిన్​కు జరిగిన ఎలక్ట్రికల్ డ్యామేజీలు, లిక్విడ్ డ్యామేజీలను కవర్ చేయవు. కానీ మీరు ఇంజిన్, గేర్ ప్రొటెక్షన్ యాడ్–ఆన్​ తీసుకుంటే అటువంటి డ్యామేజీల​కు కూడా క్లెయిమ్ చేయొచ్చు.